పిల్లల ఎదుగుదలకు, అభివృద్ధిలో తల్లి తండ్రుల పాత్ర చాలా కీలకమైంది. అమ్మానాన్న ప్రోద్బలంతోనే బాగా చదువుకుంటే, మంచి జీవితం ఉంటుందని, సాధించాలనే పట్టుదల ఉంటే, ఎలాంటి కలల్ని అయినా సాకారం చేసుకోవచ్చనే గుణం అలవడుతుంది. అలా బాగా చదువుకుని తన కుటుంబానికి పేరు తేవడమే కాదు యూపీఎస్సీ సివిల్స్(UPSC Civils) మంచి ర్యాంకు సాధించాడు. అతని పేరే మర్రిపాటి నాగభరత్(Marripati Naga Bharath). పదండి నాగ భరత్ సక్సెస్‌గురించి తెలుసుకుందాం.
వైఎస్సార్ కడప జిల్లాకు నాగభరత్ చిన్నప్పటినుంచి చదువులో బాగా రాణించాడు. ఉన్నత విద్య పూర్తైన తర్వాత సాఫ్ట్ వేర్ జాబ్ సాధించాడు. చక్కటి జీవితం. సంతృప్తికరమైన జీతం. కానీ కలెక్టర్ అవ్వాలన్న అమ్మ కోరిక నెరవేరలేదనే వెలితి అతడిని వెంటాడింది. అందుకే 15 లక్షల రూపాయల వేతనాన్ని వదులుకొని మరీ యూపీఎస్సీపై దృష్టి పెట్టాడు. 2023 యూపీఎస్సీ సివిల్స్( UPSC Civils ) ఫలితాల్లో విద్యార్థి ఉన్నత ర్యాంక్ సాధించాడు.
నాగ భరత్ ఖరగ్ పూర్ ఐఐటీలో( Kharagpur IIT ) బీటెక్ పూర్తి చేయడంతో పాటు అక్కడే ఎంటెక్ కూడా పూర్తి చేశాడు. అయితే సివిల్స్ కొట్టాలనే ప్రయత్నాల్లో 2022లో ఇంటర్వ్యూ వరకు వెళ్లి వెనక్కు వచ్చాడు. అయినా సరే పట్టువీడలేదు. ఆశించిన ఫలితాలు రాకపోయినా నాగభరత్ మాత్రం వెనుకడుగు వేయలేదు. నిపుణుల శిక్షణలో మరింత రాటు దేలాడు. చివరికి 580వ ర్యాంక్ సాధించాడు.
తల్లి కోరిక (ఈమె 2013లో చనిపోయింది.) మేరకు బాల్యం నుంచి కలెక్టర్ కావాలని నిర్ణయం తీసుకున్న నాగభరత్ భవిష్యత్తుపై చాలా ధీమా వ్యక్తం చేశాడు. ఐఏఎస్‌గా ఎంపికై పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తానని వెల్లడించాడు. రైతుల కష్టాలు తీర్చడానికి తన వంతు ప్రయత్నిస్తానని చెప్పడం విశేషం. అంతేకాదు తన చిన్నతనంలో తండ్రి కలెక్టర్ అంటే ఏంటి? ఈ పదవి ద్వారా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టవచ్చు అనేది చెప్పేవారట. పేదలకు ఎలా సాయం చేయవచ్చో కూడా వివరించేవారట. తన తల్లి కోరిక,కల కూడా అదేనని, అమ్మనాన్నలే తన విజయానికి స్ఫూర్తి అని చెప్పాడు గర్వంగా. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణలో ఉన్నాడు. (ఒకే ఒక్క మాటతో 94 నుంచి 71 కిలోలకు : ఏం చేసిందో తెలిస్తే ఫిదానే!)
Comments
Please login to add a commentAdd a comment