Saurav Ghosal
-
ఆసియా స్క్వాష్ చాంప్స్ సౌరవ్, జోష్నా
కౌలాలంపూర్: భారత స్క్వాష్ స్టార్స్ సౌరవ్ ఘోషాల్, జోష్నా చినప్ప ఆదివారం కొత్త చరిత్ర సృష్టించారు. ఆసియా సీనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా సౌరవ్... మహిళల సింగిల్స్ టైటిల్‌ను నిలబెట్టుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా జోష్నా చినప్ప రికార్డు నెలకొల్పారు. ఫైనల్స్‌లో టాప్ సీడ్ సౌరవ్ 11–9, 11–2, 11–8తో లియో చున్ మింగ్ (హాంకాంగ్)పై... రెండో సీడ్ జోష్నా 11–5, 8–11, 11–6, 11–6తో టాప్ సీడ్ ఆనీ అయు (హాంకాంగ్)పై గెలిచారు. -
ఫైనల్లో సౌరవ్ ఘోషాల్, జోష్నా చినప్ప
ఆసియా సీనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు సౌరవ్ ఘోషాల్, జోష్నా చినప్ప ఫైనల్లోకి దూసుకెళ్లారు. కౌలాలంపూర్‌లో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 2017 రన్నరప్ సౌరవ్ 11–2, 11–6, 11–4తో ఎన్జీ ఎయిన్ యో (మలేసియా)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జోష్నా 11–7, 12–10, 11–3తో శివసంగరి సుబ్రమణియం (మలేసియా)పై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్స్‌లో ఆనీ అయు (హాంకాంగ్)తో జోష్నా; లియో చున్ మింగ్ (హాంకాంగ్)తో సౌరవ్ తలపడతారు. -
సెమీస్‌లో జోష్నా చినప్ప, సౌరవ్ ఘోషాల్
ఆసియా స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్లు జోష్నా చినప్ప, సౌరవ్ ఘోషాల్ మహిళల, పురుషుల వ్యక్తిగత విభాగాల్లో సెమీఫైనల్‌కు చేరుకున్నారు. కౌలాలంపూర్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో జోష్నా 12–10, 13–11, 11–7తో భారత్‌కే చెందిన తాన్వీ ఖన్నాను ఓడించగా... సౌరవ్ 11–4, 11–4, 11–3తో మొహమ్మద్ నఫీజ్వాన్ అద్నాన్ (మలేసియా)పై గెలుపొందాడు. -
టాప్–10లోకి సౌరవ్ ఘోషల్
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) ప్రపంచ ర్యాంకింగ్స్ పురుషుల విభాగంలో టాప్–10లోకి అడుగు పెట్టిన తొలి భారత క్రీడాకారుడిగా సౌరవ్ ఘోషల్ రికార్డు సృష్టించాడు. సోమవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో ఘోషల్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 10వ స్థానంలో నిలిచాడు. 2018–19 సీజన్లో పీఎస్ఏ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో, ప్రతిష్టాత్మక గ్రాస్‌హాపర్ కప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన సౌరవ్ ఇటీవల ప్రదర్శన అతనికి అత్యుత్తమ ర్యాంక్‌ను అందించింది. గతంలో మహిళల విభాగంలో భారత క్రీడాకారిణులు జోష్న చిన్నప్ప, దీపిక పల్లికల్ టాప్–10లో ఉన్నారు. -
క్వార్టర్స్‌లో సౌరవ్
షికాగో: మరోసారి అద్భుత ప్రదర్శన చేసిన భారత ఆటగాడు సౌరవ్ ఘోషాల్ ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 11వ సీడ్‌గా బరిలోకి దిగిన సౌరవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 11–13, 11–7, 11–7, 13–11తో జోయెల్ మాకిన్ (వేల్స్)పై చెమటోడ్చి నెగ్గాడు. రెండేళ్ల క్రితం ముంబైలో జరిగిన సీసీఐ ఇంటర్నేషనల్ ఈవెంట్లో ఇదే ప్రత్యర్థిపై అలవోకగా గెలిచిన భారత ఆటగాడికి ఈ మ్యాచ్‌లో మాత్రం గట్టిపోటీ ఎదురైంది. అన్‌సీడెడ్ మాకిన్ ప్రతి పాయింట్ కోసం పోరాడాడు. చివరకు సౌరవ్ ప్రదర్శన ముందు తలవంచాడు. ఈ టోర్నీలో భారత స్టార్ క్వార్టర్స్ చేరడం ఇది రెండోసారి. 2013లో కూడా సౌరవ్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశిం చాడు. నేడు జరిగే మ్యాచ్‌లో భారత ఆటగాడు... మూడో సీడ్ సైమన్ రోస్నెర్తో తలపడతాడు. -
ప్రిక్వార్టర్స్‌లో సౌరవ్ ఘోషాల్
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు సౌరవ్ ఘోషాల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అమెరికాలోని షికాగోలో జరుగుతున్న ఈ టోర్నీలో సౌరవ్ రెండో రౌండ్లో 13–11, 11–6, 11–8తో లుకాస్ సెర్మీ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ క్రీడాకారిణి జోష్నా చినప్ప పోరాటం ముగిసింది. రెండో రౌండ్లో జోష్నా 10–12, 7–11, 7–11తో జాయ్ చాన్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయింది. World Squash Championship: Saurav Ghosal enters pre-quarters, Joshna Chinappa out -
సెమీస్ లో ఓడిన సౌరవ్ ఘోశల్
మకావు: భారత స్టార్ స్క్వాష్ ఆటగాడు సౌరవ్ ఘోశల్ మకావు ఓపెన్ సెమీఫైనల్లో పరాజయం పాలయ్యాడు. రెండో సీడ్‌గా బరిలోకి దిగన తను 11-8, 4-11, 7-11, 0-11 తేడాతో డారిల్ సెల్బీ (ఇంగ్లండ్) చేతిలో ఓడాడు. తొలి గేమ్‌లో మాత్రమే ఆకట్టుకున్న ఈ జాతీయ చాంపియన్ ఆ తర్వాత వరుసగా మూడు గేమ్‌లను కోల్పోయాడు. చివరి గేమ్లోనరుుతే సెల్బీ ధాటికి ఒక్క పారుుంట్‌ను కూడా సాధించలేదు. -
సెమీస్‌లో జ్యోత్స్న, సౌరవ్
హాంకాంగ్ స్క్వాష్ టోర్నీ హాంకాంగ్ : భారత స్క్వాష్ స్టార్స్ జ్యోత్స్న చిన్నప్ప, సౌరవ్ ఘోషల్ హాంకాంగ్ అంతర్జాతీయ స్క్వాష్ టోర్నీలో సెమీస్‌కు చేరారు. గురువారం జరిగిన మహిళల విభాగం క్వార్టర్ ఫైనల్లో నాలుగోసీడ్ జ్యోత్స్న 11-5, 11-7, 11-8తో డెలియా ఆర్నాల్డ్ (మలేసియా)పై నెగ్గింది. పురుషుల విభా గంలో రెండో సీడ్ సౌరవ్ ఘోషల్ 11-4, 11-4, 1-7తో నఫిజ్వాన్ అద్నాన్ (మలేసియా)పై నెగ్గాడు. -
ఆసియా క్రీడల్లో కొత్త చరిత్ర
-
సౌరవ్ ఘోషాల్ కు సిల్వర్ మెడల్
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో కొత్త చరిత్ర సృష్టించిన భారత స్క్వాష్ మేటి ఆటగాడు సౌరవ్ ఘోషాల్ వెండి పతకం గెల్చుకున్నాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో కువైట్ ఆటగాడు అబ్దుల్లా ఆల్మీజయేన్ చేతిలో 3-2 (12-10 11-2, 12-14, 8-1, 9-11) తో ఓడిపోయి వెండి పతకంతో సరిపెట్టుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ప్రపంచ 16వ ర్యాంకర్ సౌరవ్ 11-9, 11-4, 11-5తో ప్రపంచ 35వ ర్యాంకర్ బెంగ్ హీ (మలేసియా)పై గెలిచి రికార్డు సృష్టించాడు. -
దూసుకెళ్తున్న భారత షూటర్లు
ఇంచియాన్: 17వ ఆసియా క్రీడల్లో భారత షూటర్లు బుల్లెట్ మీద బుల్లెట్ దించుతున్నారు. గురి తప్పకుండా పతకాలు సాధిస్తున్నారు. తాజాగా మరో కాంస్య పతకం సాధించి ఈ విభాగంలో గెల్చుకున్న మెడల్స్ సంఖ్య నాలుగు పెంచారు. మహిళల 25 మీటర్ల టీమ్ ఈవెంట్ లో భాతర షూటర్లు హీనా సిద్ధూ, అనీషా సయ్యద్, రహీ సర్నోబాట్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం కైవసం చేసుకున్నారు. ఇండియాకు నాలుగో రోజు రెండు పతకాలు దక్కాయి. స్వ్కాష్ లో దిపికా పల్లికల్ కాంస్యం గెల్చుకుంది. మొత్తం ఆరు పతకాలతో పాయింట్ల పట్టికలో భారత్ 13వ స్థానంలో నిలిచింది. స్వ్కాష్ పురుషుల సింగిల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లి సౌరవ్ గోషల్ మరో పతకం ఖాయం చేశాడు. ఫైనల్లో ఓడిపోయినా అతడికి సిల్వర్ మెడల్ ఖాయం. -
జోత్స్న చినప్ప, ఘోషల్‌లకు టైటిల్స్
ముంబై: మహారాష్ట్ర స్టేట్ ఓపెన్ సీనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో జోత్స్న చినప్ప, సౌరవ్ ఘోషల్ టైటిల్స్ సాధించారు. పురుషుల విభాగం ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ సౌరవ్ వరుస సెట్లలో ప్రత్యర్థిని కంగుతినిపించాడు. శనివారం జరిగిన ఫైనల్లో కోల్‌కతాకు చెందిన ఘోషల్ 11-4, 11-6, 11-5తో ప్రపంచ 80వ ర్యాంకర్ హరిందర్‌పాల్ సింగ్ సంధుపై విజయం సాధించాడు. కేవలం 40 నిమిషాల్లోనే ఆట ముగించాడు. మహిళల ఈవెంట్లో ప్రపంచ 26వ ర్యాంకర్, టాప్ సీడ్ జోత్స్న 11-1, 11-1, 11-3తో ఐశ్వర్య భట్టాచార్యపై గెలుపొందింది. జోత్స్న జోరుకు ప్రత్యర్థి బెంబేలెత్తింది. కేవలం 20 నిమిషాల్లోనే ప్రత్యర్థిపై జయభేరి మోగించింది. ట్రోఫీలతో పాటు ఘోషల్‌కు రూ. 1.3 లక్షలు, జోత్స్నకు రూ. 70 వేలు నగదు బహుమతి అందజేశారు. -
సౌరవ్ ఘోశల్ రికార్డు
మాంచెస్టర్: భారత స్క్వాష్ ఆటగాడు సౌరవ్ ఘోశల్ ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి భారత ఆటగాడిగా ఘోశల్ రికార్డులకెక్కాడు. హోరాహోరీగా జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్ ఘోశల్ 3-2 తేడాతో అన్‌సీడెడ్ హెన్రిక్ ముస్టోనెన్పై నెగ్గాడు. తొలి రెండు గేమ్‌లను 5-11, 8-11తో ఓడినప్పటికీ 27 ఏళ్ల ఘోశల్ పట్టు వీడలేదు. వరుసగా మూడు గేమ్‌ల్లో బంతిపై పూర్తి పట్టు సాధిస్తూ 11-8, 11-4, 11-2 తేడాతో రెచ్చిపోయాడు. ‘నా దృష్టిలో ఇది పెద్ద ఘనత. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలిసారిగా క్వార్టర్స్ చేరుకున్నాను. ప్రపంచ అత్యుత్తమ ఎనిమిది మంది ఆటగాళ్లతో కలిసి బరిలో ఉండడం సంతోషాన్నిస్తోంది. ఒక్కో మ్యాచ్‌పై దృష్టి పెడుతూ ఈ దశకు చేరాను. ఈ టైటిల్ గెలవాలని ప్రతీ స్క్వాష్ ఆటగాడు భావిస్తాడు. నా విజయాలు భారత్‌లో ఈ ఆటకు ఆదరణ తేవాలని కోరుకుంటున్నాను’ అని కోల్‌కతాకు చెందిన ఈ ఆటగాడు అన్నాడు. అయితే సెమీస్‌లో తనకు గట్టి పోటీ ఎదురుకానుంది. డిఫెండింగ్ చాంపియన్ ర్యామీ అషౌర్ (ఈజిప్టు)ను ఢీకొనబోతున్నాడు.