![సౌరవ్ ఘోషాల్ కు సిల్వర్ మెడల్](/styles/webp/s3/article_images/2017/09/2/81383248898_625x300_0.jpg.webp?itok=brQDS41O)
సౌరవ్ ఘోషాల్ కు సిల్వర్ మెడల్
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో కొత్త చరిత్ర సృష్టించిన భారత స్క్వాష్ మేటి ఆటగాడు సౌరవ్ ఘోషాల్ వెండి పతకం గెల్చుకున్నాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో కువైట్ ఆటగాడు అబ్దుల్లా ఆల్మీజయేన్ చేతిలో 3-2 (12-10 11-2, 12-14, 8-1, 9-11) తో ఓడిపోయి వెండి పతకంతో సరిపెట్టుకున్నాడు.
సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ప్రపంచ 16వ ర్యాంకర్ సౌరవ్ 11-9, 11-4, 11-5తో ప్రపంచ 35వ ర్యాంకర్ బెంగ్ హీ (మలేసియా)పై గెలిచి రికార్డు సృష్టించాడు.