క్వార్టర్‌ ఫైనల్లో భారత రైజింగ్‌ స్టార్‌ ఓటమి  | World Junior Squash Championships: Indias Rising Star Anahat Singh Lost In Quarter Finals | Sakshi
Sakshi News home page

World Junior Squash Championships: క్వార్టర్‌ ఫైనల్లో భారత రైజింగ్‌ స్టార్‌ ఓటమి 

Published Mon, Aug 15 2022 9:07 AM | Last Updated on Mon, Aug 15 2022 9:07 AM

World Junior Squash Championships: Indias Rising Star Anahat Singh Lost In Quarter Finals - Sakshi

ప్రపంచ జూనియర్‌ స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత రైజింగ్‌ స్టార్‌ అనాహత్‌ సింగ్‌ పోరాటం ముగిసింది. ఫ్రాన్స్‌లో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో 14 ఏళ్ల అనాహత్‌ సింగ్‌ 7–11, 11–6, 8–11, 8–11తో ఫెరూజ్‌ అబూల్కెర్‌ (ఈజిప్ట్‌) చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన అనాహత్‌ రెండో రౌండ్‌లో 11–1, 11–3, 11–4తో మేరీ వాన్‌ రీత్‌ (బెల్జియం)పై, మూడో రౌండ్‌లో 11–5, 11–4, 11–8తో ఎమ్మా బార్ట్‌లే (ఇంగ్లండ్‌)పై గెలిచింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement