Dipika-Harinder pair wins Asian mixed doubles squash championships - Sakshi
Sakshi News home page

స్వర్ణం నెగ్గిన దినేశ్‌ కార్తీక్‌ భార్య

Published Sat, Jul 1 2023 7:31 AM | Last Updated on Sat, Jul 1 2023 10:49 AM

Dipika Pallikal, Harinder Clinch Gold At Asian Mixed Doubles Squash Championships - Sakshi

హ్వాంగ్‌జౌ (చైనా): ఆసియా స్క్వాష్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన దీపిక పల్లికల్‌ (క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ భార్య) – హరీందర్‌పాల్‌ సింగ్‌ సంధు జోడి విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో దీపిక – హరీందర్‌ 11–10, 11–8 స్కోరుతో ఇవాన్‌ యూయెన్‌ – రాచెల్‌ ఆర్నాల్డ్‌ (మలేసియా)పై విజయం సాధించారు.

అంతకు ముందు క్వార్టర్‌ ఫైనల్లో మలేసియాకు చెందిన టాప్‌ సీడ్‌ ఆయిరా అజ్మాన్‌ – షఫీక్‌ కమాల్‌ను...సెమీ ఫైనల్లో తయ్యద్‌ అస్లామ్‌ – ఫైజా జఫర్‌ (పాకిస్తాన్‌)ను భారత ద్వయం ఓడించింది. ఓవరాల్‌గా ఆసియా చాంపియన్‌షిప్‌ను భారత్‌ రెండు పతకాలతో ముగించింది. భారత్‌కు చెందిన అనాహట్‌ సింగ్‌ – అభయ్‌ సింగ్‌ కాంస్యం గెలుచుకున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement