
ప్రతిష్టాత్మక బ్రిటిష్ జూనియర్ ఓపెన్ స్క్వాష్ టోర్నీలో అండర్–15 బాలికల సింగిల్స్ విభాగంలో భారత అమ్మాయి అనాహత్ సింగ్ విజేతగా నిలిచింది. బర్మింగ్‌హామ్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో అనాహత్ 11–8, 8–11, 11–7, 11–5తో సొహైలా హజీమ్ (ఈజిప్ట్)పై గెలిచింది.
14 ఏళ్ల అనాహత్ బ్రిటిష్ ఓపెన్‌లో టైటిల్ నెగ్గడం ఇది రెండోసారి. 2019లో ఆమె అండర్–11 విభాగంలో టైటిల్ సాధించింది. గతంలో భారత్ నుంచి జోష్నా చినప్ప, దీపిక పళ్లికల్ మాత్రమే బ్రిటిష్ ఓపెన్ జూనియర్ టోర్నీలో విజేతలుగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment