
న్యూఢిల్లీ: భారత స్క్వాష్ స్టార్ సౌరవ్ ఘోషాల్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. గత ఏడాది ఏప్రిల్‌లో ఆట నుంచి వీడ్కోలు తీసుకున్న 38 ఏళ్ల సౌరవ్ ఈ ఏడాది జనవరిలో మళ్లీ రాకెట్ పట్టాడు. ఆదివారం ఆ్రస్టేలియాలో ముగిసిన ఆక్టేన్ ఓపెన్ సిడ్నీ క్లాసిక్ స్క్వాష్ చాలెంజర్ టోర్నీలో సౌరవ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో ప్రపంచ మాజీ పదో ర్యాంకర్ సౌరవ్ 11–2, 11–6, 11–2తో ఈజిప్ట్ దేశానికి చెందిన అబ్దుల్ రెహమాన్ నాసర్‌పై గెలుపొందాడు.
ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లలో కలిపి మొత్తం 12 పతకాలు సాధించిన సౌరవ్... ఈ టోర్నీలో తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ మాత్రమే కోల్పోవడం విశేషం. సెమీఫైనల్లో సౌరవ్ 11–9, 5–11, 11–1, 11–2తో రైస్ డౌలింగ్ (ఆస్ట్రేలియా)పై, క్వార్టర్ ఫైనల్లో 11–6, 11–6, 11–5తో మిన్‌వూ లీ (దక్షిణ కొరియా)పై, రెండో రౌండ్‌లో 11–8, 11–2, 11–8తో కిజాన్ (మాల్టా)పై గెలుపొందాడు. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన సౌరవ్‌కు తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది. 2003లో ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్‌ఏ) టూర్‌లో అరంగేట్రం చేసిన సౌరవ్ ఇప్పటి వరకు 11 పీఎస్‌ఏ సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. 18 టోరీ్నలలో రన్నరప్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment