Sourav Ghoshal
-
టైటిల్‌తో పునరాగమనం.. సిడ్నీ క్లాసిక్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన భారత స్క్వాష్ స్టార్ సౌరవ్
న్యూఢిల్లీ: భారత స్క్వాష్ స్టార్ సౌరవ్ ఘోషాల్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. గత ఏడాది ఏప్రిల్‌లో ఆట నుంచి వీడ్కోలు తీసుకున్న 38 ఏళ్ల సౌరవ్ ఈ ఏడాది జనవరిలో మళ్లీ రాకెట్ పట్టాడు. ఆదివారం ఆ్రస్టేలియాలో ముగిసిన ఆక్టేన్ ఓపెన్ సిడ్నీ క్లాసిక్ స్క్వాష్ చాలెంజర్ టోర్నీలో సౌరవ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో ప్రపంచ మాజీ పదో ర్యాంకర్ సౌరవ్ 11–2, 11–6, 11–2తో ఈజిప్ట్ దేశానికి చెందిన అబ్దుల్ రెహమాన్ నాసర్‌పై గెలుపొందాడు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లలో కలిపి మొత్తం 12 పతకాలు సాధించిన సౌరవ్... ఈ టోర్నీలో తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ మాత్రమే కోల్పోవడం విశేషం. సెమీఫైనల్లో సౌరవ్ 11–9, 5–11, 11–1, 11–2తో రైస్ డౌలింగ్ (ఆస్ట్రేలియా)పై, క్వార్టర్ ఫైనల్లో 11–6, 11–6, 11–5తో మిన్వూ లీ (దక్షిణ కొరియా)పై, రెండో రౌండ్లో 11–8, 11–2, 11–8తో కిజాన్ (మాల్టా)పై గెలుపొందాడు. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన సౌరవ్‌కు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. 2003లో ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) టూర్లో అరంగేట్రం చేసిన సౌరవ్ ఇప్పటి వరకు 11 పీఎస్ఏ సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. 18 టోరీ్నలలో రన్నరప్‌గా నిలిచాడు. -
రిటైర్మెంట్ వీడి మళ్లీ బరిలోకి దిగనున్న భారత స్క్వాష్ స్టార్
న్యూఢిల్లీ: దాదాపు ఏడాది క్రితం...భారత స్క్వాష్ (Squash) స్టార్ సౌరవ్ ఘోషాల్ (Sourav Ghoshal) ఆటకు గుడ్‌బై చెప్పాడు. ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) టూర్లో భాగంగా చికాగోలో జరిగిన విండీ సిటీ ఓపెన్‌లో ఆడిన తర్వాత అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే 38 ఏళ్ల ఘోషాల్ ఇప్పుడు మళ్లీ ఆటగాడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. రిటైర్మెంట్ వదిలి మైదానంలో పోటీ పడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గత నెలలో పీఎస్ఏలో సభ్యుడిగా తన పేరు నమోదు చేసుకున్న ఘోషాల్ చాలెంజర్ ఈవెంట్ ఆక్టేన్ సిడ్నీ క్లాసిక్‌లో బరిలోకి దిగుతున్నాడు. ‘టోర్నీల కోసం చేసే ప్రయాణాలు, ఆ పోటీని నేను మళ్లీ ఆస్వాదించాలనుకుంటున్నా. గత 20 ఏళ్లలో ఆటగాడిగా ఉన్నప్పుడు గడిపిన సమయంతో పోలిస్తే ఈ సారి 10 నెలల్లోనే అంతకంటే ఎక్కువ సమయంలో ఇంట్లో ఉన్నాను. ఈ సమయంలో భార్యాపిల్లలతో సంతోషంగా గడిపా. కనీసం మరో మూడేళ్లు ఆడగల సత్తా నాలో ఉందని భావిస్తున్నా. విరామ సమయంలో నా కెరీర్‌ను విశ్లేషించేందుకు ప్రయత్నించా. కాబట్టే ఇంకా ఆడాలనిపించింది. ఈ రెండో భాగం మొదటిదానికంటే బాగుంటుందని ఆశిస్తున్నా’ అని ఘోషాల్ చెప్పాడు. భారత్ తరఫున ఆడాలని... ఈ సారి పీఎస్ఏ టోర్నీలకంటే అంతర్జాతీయ ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే తన మొదటి ప్రాధాన్యతగా అతను పెట్టుకున్నాడు. పురుషుల విభాగంలో భారత అత్యుత్తమ స్క్వాష్ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఘోషాల్... సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో కలిపి కామన్వెల్త్ క్రీడల్లో 1 రజతం, 2 కాంస్యాలు, ఆసియా క్రీడల్లో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 5 కాంస్యాలు గెలుచుకున్నాడు.భారత్ తరఫున దాదాపు అన్ని ఘనతలు అతని పేరిటే ఉన్నాయి. ‘పీఎస్ఏ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా భారత్ తరఫున మాత్రం ఆడుతూ ఉండాలని భావించా. అయితే పీఎస్ఏలో కొనసాగితేనే జాతీయ జట్టు తరఫున ఎంపికయ్యే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అర్థమైంది. భారత్ తరఫున ఇంకా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాననే నమ్మకం ఉంది. కొన్ని నెలల క్రితమే నా శిక్షణను మళ్లీ ప్రారంభించా. ఆరంభంలో ఫిట్‌నెస్‌పై మాత్రమే దృష్టి పెట్టి ఆపై సాధన కొనసాగించా. దాదాపు ఆరు నెలల మైదానానికి దూరమై మళ్లీ ఆడటం అంత సులువు కాదు’ అని ఘోషాల్ పేర్కొన్నాడు.ఒలింపిక్స్ ఆశలు... 2026 కామన్వెల్త్ క్రీడల నుంచి స్క్వాష్‌ను తప్పించినా... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో స్క్వాష్‌ను చేర్చడం కూడా ఘోషాల్ భవిష్యత్తుపై ఆశలు పెంచింది. ‘కామన్వెల్త్ క్రీడల్లో మేం స్వర్ణం సాధించలేదు. ఈ సారి గెలవవచ్చని ఆశించా. అయితే ఇప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టి ఏమీ చేయలేం. ఆసియా క్రీడల్లో మాత్రం రాణించే అవకాశం ఉంది. ఒలింపిక్స్‌లో పతకం అనేది నిజంగానే పెద్ద లక్ష్యం. నేను మన దేశం తరఫున ఆడిన పతకం గెలవగలిగితే అంతకన్నా గొప్ప విషయం ఉండదు. కానీ దానికి దాదాపు మూడేళ్లుకు పైగా సమయం ఉంది. ఇప్పటికిప్పుడైతే అంత దూరం ఆలోచించడం లేదు’ అని ఘోషాల్ అభిప్రాయపడ్డాడు. ఆక్టేన్ సిడ్నీ క్లాసిక్ టోర్నీలో తాను విజయం సాధిస్తానని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. -
Singapore Squash Open 2023: సౌరవ్ పరాజయం
న్యూఢిల్లీ: సింగపూర్ ఓపెన్ అంతర్జాతీయ స్క్వాష్ టోర్నమెంట్ నుంచి భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ నిష్క్రమించాడు. సింగపూర్‌లో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో సౌరవ్ 3–11, 7–11, 10–12తో నాలుగో సీడ్ ముస్తఫా అసల్ (ఈజిప్ట్) చేతిలో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన మరో ప్లేయర్ రమిత్ టాండన్ 3–11, 2–11, 4–11తో రెండో సీడ్ డీగో ఇలియాస్ (పెరూ) చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సౌరవ్ 11–6, 7–11, 11–6, 11–5తో టాడీ హారిటి (అమెరికా)పై, రమిత్ 11–7, 12–10, 12–10తో రోరీ స్టీవర్ట్ (స్కాట్లాండ్)పై గెలుపొందారు. -
World Squash Championships: పోరాడి ఓడిన సౌరవ్ ఘోషాల్
ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ పోరాటం ముగిసింది. షికాగోలో జరుగుతున్న ఈ టోర్నీలో సౌరవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 11–9, 11–4, 6–11, 3–11, 10–12తో ప్రపంచ నంబర్‌వన్ డీగో ఇలియాస్ (పెరూ) చేతిలో ఓడిపోయాడు. 36 ఏళ్ల సౌరవ్ నిర్ణాయక ఐదో గేమ్‌లో స్కోరు 10–10 వద్ద అనవసర తప్పిదాలు చేసి వరుసగా రెండు పాయింట్లు చేజార్చుకొని ఓటమిని ఖరారు చేసుకున్నాడు. -
Squash Championship: పాకిస్తాన్‌పై భారత్ విజయం
ఆసియా స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం భారత జట్టు 2–1తో పాకిస్తాన్ జట్టును ఓడించింది. నిర్ణాయక మూడో మ్యాచ్‌లో భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ 9–11, 7–11, 11–1, 11–7, 11–8తో తయ్యబ్ అస్లమ్‌ను ఓడించి టీమిండియాకు విజయాన్ని అందించాడు. అంతకుముందు మరో లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–0తో జపాన్‌పై గెలిచింది. ప్రస్తుతం భారత్ పూల్ ‘ఎ’లో అగ్రస్థానంలో ఉంది. -
మూడు ‘కాంస్యాల’ స్క్వాష్
జకార్తా: ఆసియా క్రీడల ‘స్క్వాష్’లో భారత్‌కు మూడు కాంస్య పతకాలు లభించాయి. ముగ్గురు అగ్రశ్రేణి సింగిల్స్ ఆటగాళ్లు సెమీఫైనల్లోనే ఓడిపోవడంతో కంచుతో సరిపెట్టుకోక తప్పలేదు. అయితే ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. 2014లో స్క్వాష్‌లో భారత్ ఒక రజతం, ఒక కాంస్యం సాధించింది. నాడు రజతం గెలిచిన సౌరవ్ ఘోషల్ ఈసారి కాంస్యం సాధించగా, దీపిక పల్లికల్ మళ్లీ కాంస్యానికే పరిమితమైంది. శనివారం జరిగిన పురుషుల సెమీఫైనల్లో సౌరవ్ 12–10, 13–11, 6–11, 6–11, 6–11 స్కోరుతో చున్ మింగ్ యు (హాంకాంగ్) చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి రెండు సెట్లు గెలిచి ముందంజలో నిలిచినా...ఘోషల్ చివరి వరకు దానిని కాపాడుకోలేక చేతులెత్తేశాడు. రెండు సెట్లు గెలుచుకున్న అనంతరం మూడో సెట్లో ఒక దశలో సౌరవ్ 6–5తో ఆధిక్యంలో నిలిచాడు. అయితే చున్ మింగ్ వరుసగా ఆరు పాయింట్లు గెలుచుకొని భారత ఆటగాడికి షాక్ ఇచ్చాడు. అదే ఊపును అతను తర్వాతి రెండు సెట్లలో కొనసాగించగా, సౌరవ్ మాత్రం చతికిల పడ్డాడు. అయితే రెండో సెట్ చివర్లో తన కాలికి గాయమైందని, దాంతో ఓటమి తప్పలేదని ఘోషల్ వివరణ ఇచ్చాడు. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో మలేసియా దిగ్గజ క్రీడాకారిణి, డిఫెండింగ్ చాంపియన్ నికోల్ డేవిడ్ 11–7, 11–9, 11–6 తేడాతో దీపిక పల్లికల్‌ను చిత్తు చేసింది. పదేళ్ల పాటు వరల్డ్ నంబర్‌వన్‌గా స్క్వాష్‌ను శాసించిన నికోల్ ముందు దీపిక నిలవలేకపోయింది. మరో సెమీఫైనల్లో శివశంకరి సుబ్రహ్మణ్యం (మలేసియా) 12–10, 11–6, 9–11, 11–7తో జోష్నా చినప్పను ఓడించింది. గత మూడు ఆసియా క్రీడల్లో రిక్తహస్తాలతో తిరిగొచ్చిన జోష్నాకు ఇదే మొదటి పతకం కావడం విశేషం. -
ఇండియా ఓపెన్ విజేత సౌరవ్
ముంబై: భారత నంబర్‌వన్ స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోషల్ ఇండియా ఓపెన్ టోర్నమెంట్లో చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సౌరవ్ 11–9, 5–11, 6–11, 11–7, 12–10తో నికోలస్ ముల్లర్ (స్విట్జర్లాండ్)పై విజయం సాధించాడు. నిర్ణాయక ఐదో గేమ్‌లో సౌరవ్ 3–7తో, 5–8 తో, 8–10తో వెనుకబడి... ఆ తర్వాత పుంజుకొని వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 12–10తో ఐదో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. -
సౌరవ్ ఘోషాల్ పరాజయం
ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన ఏకైక ప్లేయర్ సౌరవ్ ఘోషాల్ మూడో రౌండ్లో ఓటమి చవిచూశాడు. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో సౌరవ్ 14–12, 5–11, 6–11, 7–11తో రెండో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ కరీమ్ అబ్దుల్ గవాద్ (ఈజిప్ట్) చేతిలో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన హరిందర్ పాల్ సంధూ, మహేశ్ మంగావ్కర్... మహిళల సింగిల్స్‌లో జోష్నా చినప్ప, దీపిక పళ్లికల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. -
మూడో రౌండ్లో సౌరవ్ ఘోషాల్
ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో... మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో సౌరవ్ 11–4, 11–3, 11–4తో బెన్ కోల్మన్ (ఇంగ్లండ్)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ ప్లేయర్లు జోష్నా చినప్ప, దీపిక పళ్లికల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. జోష్నా 9–11, 13–11, 5–11, 9–11తో సల్మా హనీ (ఈజిప్ట్) చేతిలో... దీపిక 7–11, 11–5, 9–11, 14–12, 8–11తో ఒలివియా బ్లాచ్‌ఫోర్డ్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. -
సౌరవ్ ఓటమి
న్యూఢిల్లీ: చానెల్ వాస్ చాంపియన్‌షిప్ అంతర్జాతీయ స్క్వాష్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుడు సౌరవ్ ఘోషాల్ పోరాటం ముగిసింది. ఇంగ్లండ్‌లోని సర్రేలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సౌరవ్ 11–13, 8–11, 9–11తో టాప్ సీడ్ మొహమ్మద్ ఎల్‌షోర్‌బగీ (ఈజిప్ట్) చేతిలో ఓటమి చవిచూశాడు. అంతకుముందు సౌరవ్ తొలి రౌండ్లో 11–7, 11–7, 11–2తో మర్వాన్ ఎల్‌షోర్‌బగీ (ఈజిప్ట్)పై, క్వార్టర్ ఫైనల్లో 11–9, 5–11, 8–11, 11–3, 11–8తో ఎనిమిదో సీడ్ మొహమ్మద్ అబుల్గర్ (ఈజిప్ట్)పై గెలిచాడు. జోష్నా, దీపిక నిష్క్రమణ: మరోవైపు న్యూయార్క్‌లో జరుగుతున్న కారోల్ వేముల్లర్ ఓపెన్‌లో భారత స్టార్స్ జోష్నా చినప్ప, దీపిక పళ్లికల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. జోష్నా 11–9, 11–13, 16–14, 5–11, 10–12తో సల్మా హనీ (ఈజిప్ట్) చేతిలో... దీపిక 8–11, 6–11, 7–11తో రానీమ్ ఎల్ వెలిలీ (ఈజిప్ట్) చేతిలో ఓడిపోయారు. ఆంధ్ర రంజీ జట్టుకు -
సౌరవ్ ఓటమి
చెన్నై: భారత అగ్రశ్రేణి స్క్వాష్ ఆటగాడు సౌరవ్ ఘోషల్ మాంట్రియల్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. మూడో సీడ్ ఒమర్ ఆదిల్ (ఈజిప్ట్)తో కెనడాలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ సౌరవ్ 12–10, 10–12, 7–11, 15–17 తేడాతో ఓడిపోయాడు. తొలి గేమ్ గెలిచిన అతడు వరుసగా రెండు గేమ్‌లు కోల్పోయాడు. నాలుగో గేమ్‌లో కొంత ప్రతిఘటించినా చివరకు 15–17తో గేమ్‌ను, మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. -
బ్రిటిష్ ఓపెన్ నుంచి జోష్నా చినప్ప ఔట్
చెన్నై: భారత స్టార్ క్రీడాకారిణి జోష్నా చినప్ప ప్రతిష్టాత్మక బ్రిటీష్ ఓపెన్ స్క్వాష్ చాంపియన్‌షిప్ నుంచి రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. గురువారం జరిగిన పోరులో ఆమె 8–11, 7–11, 7–11తో ప్రపంచ మూడో ర్యాంకర్ రనీమ్ ఎల్ వెలిలీ (ఈజిప్టు) చేతిలో పరాజయం చవిచూసింది. 2015లో జరిగిన ఖతార్ క్లాసిక్ ఈవెంట్లో ఇదే రనీమ్ను భారత అమ్మాయి కంగుతినిపించింది. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం ప్రపంచ మాజీ చాంపియన్ చేతిలో 27 నిమిషాల్లోనే చేతులెత్తేసింది. ఇదివరకే దీపికా పళ్లికల్, పురుషుల ఈవెంట్లో సౌరవ్ ఘోషల్ ఓటమిపాలు కావడంతో భారత పోరాటం ఈ టోర్నీలో ముగిసింది. -
సెమీస్‌లో సౌరవ్ ఘోషల్ ఓటమి
లండన్: వింబుల్డన్ క్లబ్ స్క్వాష్ స్క్వేర్డ్ ఓపెన్‌లో భారత ఆటగాడు సౌరవ్ ఘోషల్ సెమీఫైనల్ నుంచే వెనుదిరిగాడు. టాప్ సీడ్‌గా బరిలో దిగిన సౌరవ్ సెమీస్‌లో 3–11, 10–12, 9–11తో నాలుగో సీడ్ అలెన్ క్లినీ (స్కాట్లాండ్) చేతిలో ఓడిపోయాడు. మహేశ్ మాన్ గోయంకార్, విక్రమ్ మల్హోత్రా క్వార్టర్స్‌లోనే ఓడిపోగా.. సౌరవ్ నిష్క్రమణతో భారత ఆటగాళ్ల కథ ముగిసిపోయింది. -
సౌరవ్‌కు స్క్వాష్ టైటిల్
కోల్‌కతా: భారత స్క్వాష్ స్టార్ ప్లేయర్ సౌరవ్ ఘోషల్ సొంతగడ్డపై సత్తా చాటుకున్నాడు. ఆదివారం ముగిసిన ఇండియన్ స్క్వాష్ సర్క్యూట్ కోల్‌కతా ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నమెంట్లో చాంపియన్‌గా నిలిచాడు. టాప్ సీడ్ మర్వాన్ ఎల్షోర్బాగీ (ఈజిప్టు)తో జరిగిన ఫైనల్లో సౌరవ్ 11-7, 11-2, 11-7తో సంచలన విజయం సాధించాడు. ‘సొంతగడ్డపై సొంత ప్రేక్షకుల మధ్య విజేతగా నిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. టైటిల్ గెలిచే క్రమంలో ఇద్దరు టాప్-15లోని ఆటగాళ్లను ఓడించినందుకు గర్వంగా ఉంది’ అని సౌరవ్ వ్యాఖ్యానించాడు. -
కుదిరితే ‘కనకం
మరో మూడు రోజుల్లో ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. నాలుగేళ్ల క్రితం గ్వాంగ్జూలో జరిగిన క్రీడల్లో మనకు పతకాలు అందించిన క్రీడాంశాల్లో స్క్వాష్, జిమ్నాస్టిక్స్ కూడా ఉన్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే... ఈసారీ ఈ రెండు క్రీడాంశాల్లో మనకు పతకాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చివరి రెండు ఆసియా క్రీడల్లో కాంస్య పతకాలు నెగ్గిన భారత స్టార్ స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోషల్... కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన దీపా కర్మాకర్ ఇంచియోన్లోనూ సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. న్యూఢిల్లీ: భారత స్టార్ స్క్వాష్ ప్లేయుర్ సౌరవ్ ఘోషల్ ఆసియూ క్రీడలపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. గత రెండు ఏషియూడ్లలో సింగిల్స్‌లో కాంస్య పతకాలు సాధించిన ఘోషల్ ఈసారి స్వర్ణం గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయుని అన్నాడు. అరుుతే భారత ఆశలపై పాకిస్థాన్ నీళ్లు చల్లే అవకాశాలు ఉన్నాయుని చెప్పాడు. ‘నిజంగా చెప్పాలంటే నేను స్వర్ణం నెగ్గే అవకాశాలు మెండుగా ఉన్నారుు. ఎందుకంటే నాలుగేళ్ల కిందటితో పోలిస్తే మెరుగైన ప్రదర్శనను ఇస్తున్నాను’ అని ఘోషల్ తెలిపాడు. ఇక ఆసియూ క్రీడల్లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతున్న ఘోషల్‌కు తొలి రౌండ్లో బై లభించింది. బంగారు పతకం సాధించాలంటే తను వురో నాలుగు వ్యూచ్‌ల్లో విజయుం సాధించాలి. ఈ ప్రపంచ నంబర్ 16... పాకిస్థాన్, వులేసియూ, హాంకాంగ్‌లకు చెందిన ఆటగాళ్లతో తలపడాల్సి ఉంటుంది. పాకిస్థాన్‌కు చెందిన 20 ఏళ్ల నాసిర్ ఇక్బాల్‌తో ఘోషల్ ఈ నెల 21న క్వార్టర్ ఫైనల్లో తలపడే అవకాశం ఉంది. తనకన్నా తక్కువ ర్యాంకు ఇక్బాల్‌కు ఉన్నప్పటికీ.. ఇద్దరి వుధ్య జరిగే ఈ పోరు తన సత్తాకు పరీక్ష లాంటిదని ఘోషల్ చెప్పాడు. ‘ఏషియూడ్‌లో నా కన్నా తక్కువ ర్యాంకున్న ఆటగాళ్లతో నేను పోటీపడబోతున్నాను. ఇవి ఆసియూ క్రీడలు కాబట్టి అందరూ పూర్తి స్థారుులో సన్నద్ధవువుతారు. కాబట్టి ప్రతీ ఒక్కరు ప్రవూదకరమైన వాళ్లే’ అని ఘోషల్ అన్నాడు.