![World Squash Championships: Saurav Ghosal Loses To World No 1 Diego Ellias - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/9/Untitled-6.jpg.webp?itok=S5I6zMTq)
ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ పోరాటం ముగిసింది. షికాగోలో జరుగుతున్న ఈ టోర్నీలో సౌరవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 11–9, 11–4, 6–11, 3–11, 10–12తో ప్రపంచ నంబర్‌వన్ డీగో ఇలియాస్ (పెరూ) చేతిలో ఓడిపోయాడు.
36 ఏళ్ల సౌరవ్ నిర్ణాయక ఐదో గేమ్‌లో స్కోరు 10–10 వద్ద అనవసర తప్పిదాలు చేసి వరుసగా రెండు పాయింట్లు చేజార్చుకొని ఓటమిని ఖరారు చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment