world squash championship
-
World Squash Championships: పోరాడి ఓడిన సౌరవ్ ఘోషాల్
ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ పోరాటం ముగిసింది. షికాగోలో జరుగుతున్న ఈ టోర్నీలో సౌరవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 11–9, 11–4, 6–11, 3–11, 10–12తో ప్రపంచ నంబర్‌వన్ డీగో ఇలియాస్ (పెరూ) చేతిలో ఓడిపోయాడు. 36 ఏళ్ల సౌరవ్ నిర్ణాయక ఐదో గేమ్‌లో స్కోరు 10–10 వద్ద అనవసర తప్పిదాలు చేసి వరుసగా రెండు పాయింట్లు చేజార్చుకొని ఓటమిని ఖరారు చేసుకున్నాడు. -
భర్త ఐపీఎల్లో ఇరగదీస్తుంటే.. భార్య భారత్‌కు బంగారు పతకం సాధించి పెట్టింది..!
ఐపీఎల్ 2022 సీజన్లో ఆర్సీబీ వెటరన్ ఆటగాడు దినేశ్ కార్తీక్ ( 3 మ్యాచ్‌ల్లో 204.55 స్ట్రయిక్ రేట్‌తో అజేయమైన 90 పరుగులు) ఆకాశమే హద్దుగా చెలరేగుతూ తన జట్టుకు అద్భుత విజయాలు (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) అందిస్తుంటే.. ఇదే సమయంలో అతని భార్య, ప్రముఖ స్క్వాష్ ప్లేయర్ దీపిక పల్లికల్ డబ్ల్యూఎస్‌ఎఫ్ (వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్) వరల్డ్ డబుల్స్ ఛాంపియన్స్‌లో భారత్‌కు బంగారు పతకాన్ని అందించింది. డబ్ల్యూఎస్‌ఎఫ్ మిక్సడ్ డబుల్స్ విభాగంలో సౌరవ్ గోషల్‌తో కలిసి బరిలోకి దిగిన దీపిక పల్లికల్ కార్తీక్.. శనివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌కు చెందిన అడ్రియన్ వాలర్, అలీసన్ వాటర్స్ జోడీపై 11-6, 11-8 తేడాతో విజయం సాధించి, ఈ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. ఈ టోర్నీలో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన పల్లికల్ జోడీ.. నాలుగో సీడ్ ఇంగ్లండ్ ద్వయంపై వరుస సెట్లలో విజయం సాధించి ఔరా అనిపించింది. పెళ్లి, ఆ తర్వాత ప్రసవం కారణంగా నాలుగేళ్ల పాటు స్క్వాష్‌కు దూరంగా ఉన్న పల్లికల్... బ్రేక్ తర్వాత బరిలోకి దిగిన మొదటి టోర్నీలోనే టైటిల్ సాధించి అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చింది. కాగా, పల్లికల్ 2015లో క్రికెటర్ దినేశ్ కార్తీక్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి గతేడాది (2021) అక్టోబర్ 18న మగ కవలలు జన్మించారు. చదవండి: ఆ వెటరన్ ప్లేయర్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయం..! -
క్వార్టర్స్‌లో సౌరవ్
షికాగో: మరోసారి అద్భుత ప్రదర్శన చేసిన భారత ఆటగాడు సౌరవ్ ఘోషాల్ ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 11వ సీడ్‌గా బరిలోకి దిగిన సౌరవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 11–13, 11–7, 11–7, 13–11తో జోయెల్ మాకిన్ (వేల్స్)పై చెమటోడ్చి నెగ్గాడు. రెండేళ్ల క్రితం ముంబైలో జరిగిన సీసీఐ ఇంటర్నేషనల్ ఈవెంట్లో ఇదే ప్రత్యర్థిపై అలవోకగా గెలిచిన భారత ఆటగాడికి ఈ మ్యాచ్‌లో మాత్రం గట్టిపోటీ ఎదురైంది. అన్‌సీడెడ్ మాకిన్ ప్రతి పాయింట్ కోసం పోరాడాడు. చివరకు సౌరవ్ ప్రదర్శన ముందు తలవంచాడు. ఈ టోర్నీలో భారత స్టార్ క్వార్టర్స్ చేరడం ఇది రెండోసారి. 2013లో కూడా సౌరవ్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశిం చాడు. నేడు జరిగే మ్యాచ్‌లో భారత ఆటగాడు... మూడో సీడ్ సైమన్ రోస్నెర్తో తలపడతాడు. -
ప్రిక్వార్టర్స్‌లో సౌరవ్ ఘోషాల్
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు సౌరవ్ ఘోషాల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అమెరికాలోని షికాగోలో జరుగుతున్న ఈ టోర్నీలో సౌరవ్ రెండో రౌండ్లో 13–11, 11–6, 11–8తో లుకాస్ సెర్మీ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ క్రీడాకారిణి జోష్నా చినప్ప పోరాటం ముగిసింది. రెండో రౌండ్లో జోష్నా 10–12, 7–11, 7–11తో జాయ్ చాన్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయింది. World Squash Championship: Saurav Ghosal enters pre-quarters, Joshna Chinappa out -
సౌరవ్ ఘోషాల్ పరాజయం
ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన ఏకైక ప్లేయర్ సౌరవ్ ఘోషాల్ మూడో రౌండ్లో ఓటమి చవిచూశాడు. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో సౌరవ్ 14–12, 5–11, 6–11, 7–11తో రెండో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ కరీమ్ అబ్దుల్ గవాద్ (ఈజిప్ట్) చేతిలో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన హరిందర్ పాల్ సంధూ, మహేశ్ మంగావ్కర్... మహిళల సింగిల్స్‌లో జోష్నా చినప్ప, దీపిక పళ్లికల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. -
జోష్నా శుభారంభం
కౌలాలంపూర్(మలేసియా): ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ జోష్నా చిన్నప్ప రెండో రౌండ్లో అడుగుపెట్టింది. తొలి రౌండ్లో ఆమె 11-8, 11-3, 11-5తో విక్టోరియా లస్ట్(ఇంగ్లండ్)ను ఓడించింది. -
తొలి రౌండ్లోనే జోష్నా పరాజయం
పెనాంగ్ (మలేసియా): ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి జోష్నా చినప్ప తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ప్రపంచ 19వ ర్యాంకర్ జోష్నా 7-11, 7-11, 11-9, 2-11తో నాలుగో ర్యాంకర్ అలిసన్ వాటర్స్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయింది గత నెల్లో డబ్ల్యుఎస్‌ఏ టూర్ ఈవెంట్లో విజేతగా నిలిచి జోరుమీదున్నట్లు కనిపించిన జోష్నా తొలి రౌండ్లోనే ఓడిపోవడం అభిమానులను నిరాశపరిచింది. ప్రపంచ 11వ ర్యాంకర్, భారత స్టార్ దీపికా పల్లికల్ బుధవారం తన తొలి మ్యాచ్‌లో క్వాలిఫయర్ లీసా ఐట్కెన్ (ఇంగ్లండ్)తో తలపడనుంది. -
సౌరవ్ ఘోశల్ రికార్డు
మాంచెస్టర్: భారత స్క్వాష్ ఆటగాడు సౌరవ్ ఘోశల్ ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి భారత ఆటగాడిగా ఘోశల్ రికార్డులకెక్కాడు. హోరాహోరీగా జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్ ఘోశల్ 3-2 తేడాతో అన్‌సీడెడ్ హెన్రిక్ ముస్టోనెన్పై నెగ్గాడు. తొలి రెండు గేమ్‌లను 5-11, 8-11తో ఓడినప్పటికీ 27 ఏళ్ల ఘోశల్ పట్టు వీడలేదు. వరుసగా మూడు గేమ్‌ల్లో బంతిపై పూర్తి పట్టు సాధిస్తూ 11-8, 11-4, 11-2 తేడాతో రెచ్చిపోయాడు. ‘నా దృష్టిలో ఇది పెద్ద ఘనత. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలిసారిగా క్వార్టర్స్ చేరుకున్నాను. ప్రపంచ అత్యుత్తమ ఎనిమిది మంది ఆటగాళ్లతో కలిసి బరిలో ఉండడం సంతోషాన్నిస్తోంది. ఒక్కో మ్యాచ్‌పై దృష్టి పెడుతూ ఈ దశకు చేరాను. ఈ టైటిల్ గెలవాలని ప్రతీ స్క్వాష్ ఆటగాడు భావిస్తాడు. నా విజయాలు భారత్‌లో ఈ ఆటకు ఆదరణ తేవాలని కోరుకుంటున్నాను’ అని కోల్‌కతాకు చెందిన ఈ ఆటగాడు అన్నాడు. అయితే సెమీస్‌లో తనకు గట్టి పోటీ ఎదురుకానుంది. డిఫెండింగ్ చాంపియన్ ర్యామీ అషౌర్ (ఈజిప్టు)ను ఢీకొనబోతున్నాడు.