ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్సీబీ వెటరన్ ఆటగాడు దినేశ్ కార్తీక్ ( 3 మ్యాచ్‌ల్లో 204.55 స్ట్రయిక్ రేట్‌తో అజేయమైన 90 పరుగులు) ఆకాశమే హద్దుగా చెలరేగుతూ తన జట్టుకు అద్భుత విజయాలు (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) అందిస్తుంటే.. ఇదే సమయంలో అతని భార్య, ప్రముఖ స్క్వాష్ ప్లేయర్ దీపిక పల్లికల్ డబ్ల్యూఎస్‌ఎఫ్ (వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్) వరల్డ్ డబుల్స్ ఛాంపియన్స్‌లో భారత్‌కు బంగారు పతకాన్ని అందించింది.
డబ్ల్యూఎస్‌ఎఫ్ మిక్సడ్ డబుల్స్ విభాగంలో సౌరవ్ గోషల్‌తో కలిసి బరిలోకి దిగిన దీపిక పల్లికల్ కార్తీక్.. శనివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌కు చెందిన అడ్రియన్ వాలర్, అలీసన్ వాటర్స్ జోడీపై 11-6, 11-8 తేడాతో విజయం సాధించి, ఈ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించింది.
ఈ టోర్నీలో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన పల్లికల్ జోడీ.. నాలుగో సీడ్ ఇంగ్లండ్ ద్వయంపై వరుస సెట్లలో విజయం సాధించి ఔరా అనిపించింది. పెళ్లి, ఆ తర్వాత ప్రసవం కారణంగా నాలుగేళ్ల పాటు స్క్వాష్‌కు దూరంగా ఉన్న పల్లికల్... బ్రేక్ తర్వాత బరిలోకి దిగిన మొదటి టోర్నీలోనే టైటిల్ సాధించి అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చింది. కాగా, పల్లికల్ 2015లో క్రికెటర్ దినేశ్ కార్తీక్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి గతేడాది (2021) అక్టోబర్ 18న మగ కవలలు జన్మించారు.
చదవండి: ఆ వెటరన్ ప్లేయర్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయం..!
Comments
Please login to add a commentAdd a comment