Dipika Pallikal
-
దినేశ్ కార్తిక్- దీపికా ట్విన్స్ మూడో బర్త్‌డే.. కనిపించని డీకే (ఫొటోలు)
-
ఆర్సీబీ సిక్సర్ల వీరుడు.. అతడి భార్య కూడా స్పోర్ట్స్ పర్సనే! (ఫొటోలు)
-
ఆసియా క్రీడల్లో దీపిక పల్లికల్ జోడికి గోల్డ్ మెడల్
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా స్క్వాష్ ఈవెంట్లో భారత్ గోల్డ్‌మెడల్ సొంతం చేసుకుంది. మిక్స్డ్ డబుల్స్‌లో ఫైనల్లో దీపిక పల్లికల్–హరీందర్‌పాల్ ద్వయం 11-10, 11-10తో మలేషియా జంట మొహమ్మద్ కమల్,ఐఫా అజ్మాన్‌లను ఓడించింది. దీంతో బంగారు పతకాన్ని ఈ భారత జోడీ కైవసం చేసుకుంది. కాగా ఆసియా క్రీడల్లో స్వాష్ మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్ జరగడం ఇదే తొలిసారి. అరంగేట్రంలోనే దీపిక పల్లికల్–హరీందర్‌పాల్ ఛాంపియన్స్‌గా నిలిచారు. స్వాష్ డబుల్స్ గెలుపుతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 20కి చేరింది. మొత్తంగా ఇప్పటి వరకు 84(20 గోల్డ్, 31 సిల్వర్, 32 బ్రాంజ్) మెడల్స్ ఇండియా ఖాతాలో ఉన్నాయి. కాగా ఇది స్క్వాష్‌లో రెండవ స్వర్ణం కావడం విశేషం. చదవండి: ODI WC 2023: ఇంగ్లండ్- కివీస్ తొలి పోరు.. ఎవరి బలాబలాలు ఎంత..? రికార్డులు ఎలా ఉన్నాయంటే? 20th gold for India🥇🇮🇳 The experienced pair of Dipika Pallikal and Harinder Pal Singh Sandhu defeated the Malaysian duo 11-10 11-10 to clinch gold in the mixed doubles category of #Squash 🔥💯#AsianGames2022 #AsianGames pic.twitter.com/xcZKc7aVog — The Bridge (@the_bridge_in) October 5, 2023 -
కాంస్యం నెగ్గిన దినేశ్ కార్తీక్ భార్య.. భారత్ ఖాతాలో 50వ పతకం
కామన్వెల్త్ గేమ్స్ స్క్వాష్ ఈవెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సౌరవ్ ఘోషాల్–దీపిక పల్లికల్ జంట భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో సౌరవ్–దీపిక ద్వయం 11–8, 11–4తో డోనా లోబన్–కామెరాన్ పిలె (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించి కాంస్యం నెగ్గింది. తద్వారా భారత్ ఖాతాలో 50వ పతకం చేరింది. ఇటీవలే ఇద్దరు కవలలకు తల్లైన దీపిక పల్లికల్.. ప్రముఖ క్రికెటర్ దినేశ్ కార్తీక్ భార్య అన్న విషయం తెలిసిందే. -
దినేశ్ కార్తిక్.. ఫెయిల్యూర్ మ్యారేజ్ టూ సక్సెస్ఫుల్ లవ్‌స్టోరీ
టీమిండియా వెటరన్ క్రికెటర్.. ఆర్సీబీ స్టార్ ఆటగాడు దినేశ్ కార్తిక్ ఇవాళ(జూన్ 1న) 37వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. టీమిండియాలోకి(2004) చాలాకాలం క్రితమే ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఎంఎస్ ధోని హయాంలో కార్తిక్ ఆడడం అతని దురదృష్టం అని చెప్పొచ్చు. దాదాపు ధోని, దినేశ్ కార్తిక్‌లు టీమిండియాలోకి ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. అయితే వికెట్ కీపర్‌గా.. బ్యాట్స్‌మన్‌గా.. టీమిండియా కెప్టెన్‌గా అసమాన రీతిలో వెలిగిపోయిన ధోనికి వెనకాల కార్తిక్ చీకటిలో మిగిలిపోయాడు. మధ్య మధ్యలో కొన్ని అవకాశాలు వచ్చినప్పటికి పెద్దగా రాణించలేకపోయాడు. అలా అని కార్తిక్ ఆటతీరును తీసిపారేయల్సినంతగా ఎప్పుడు అనిపించలేదు. ధోని నీడలోనే ఎక్కువకాలం ఆడిన దినేశ్ కార్తిక్ కెరీర్లో హైలైట్‌గా నిలిచింది మాత్రం 2018 నిదహాస్ ట్రోపీ. ట్రై సిరీస్ ఫార్మాట్లో జరిగిన టోర్నీకి రెగ్యులర్ వికెట్ కీపర్ ధోని దూరంగా ఉన్నాడు. దీంతో కార్తిక్‌కు తుది జట్టులో అవకాశం వచ్చింది. కాగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి అంచున నిలిచిన టీమిండియాను తన నాకౌట్ ఇన్నింగ్స్‌తో గెలిపించడమే గాక టైటిల్ అందించాడు. 2 ఓవర్లలో 39 పరుగులు చేయాల్సిన దశలో కార్తిక్ 8 బంతుల్లోనే 29 పరుగులు బాదాడు. చివరి బంతికి ఐదు పరుగులు అవసరమైన దశలో కార్తిక్ భారీ సిక్సర్ కొట్టి బంగ్లాదేశ్ ఆటగాళ్ల కలను నెరవేరకుండా చేశాడు. ఓవరాల్‌గా చూసుకుంటే 2004లో అరంగేట్రం చేసిన దినేశ్ కార్తిక్ టీమిండియా తరపున 26 టెస్టులు, 94 వన్డేలు, 38 టి20లు ఆడాడు. ఇటీవలే ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరపున సూపర్ ఫినిషర్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఐపీఎల్ 2022 సీజన్లో దినేశ్ కార్తిక్ 16 మ్యాచ్‌లాడి 330 పరుగులు సాధించాడు. చాలా మ్యాచ్‌ల్లో ఆఖరున వచ్చిన కార్తిక్ ఎవరు ఊహించని రీతిలో సూపర్ ఫినిషర్‌గా మారాడు. 37 ఏళ్ల వయసులోనూ అదరగొట్టే స్ట్రైక్‌రేట్‌తో మెరిసిన కార్తిక్‌ను సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ అవార్డు వరించింది. ఇక జూన్ 9 నుంచి సౌతాఫ్రికాతో జరగనున్న టి20 సిరీస్‌కు ఎంపికైన కార్తిక్ రాణించాలని కోరుకుంటూ.. ''హ్యాపీ బర్త్‌డే దినేశ్ కార్తిక్'' వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు క్రికెట్ కెరీర్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న దినేశ్ కార్తిక్ వ్యక్తిగత జీవితంలోనూ అదే ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ఒక ఫెయిల్యూర్ మ్యారేజ్ నుంచి సక్సెస్ఫుల్ లవ్‌స్టోరీ వరకు కార్తిక్ జర్నీ ఆసక్తికరంగా ఉంటుంది. 2007లో నికితా వంజరను వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెతో కార్తిక్ బంధం కొన్నాళ్లు మాత్రమే కొనసాగింది. మరో టీమిండియా మాసీ క్రికెటర్ మురళీ విజయ్‌తో నిఖితాకు ఉన్న లవ్ అఫైర్ కార్తిక్‌ను డైవర్స్ తీసుకునేలా చేసింది. 2012లో నికితా నుంచి విడాకులు తీసుకున్న కార్తిక్ జీవితంలోకి భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ ఎంట్రీ ఇచ్చింది. 2013లో వీరిద్దరి మధ్య ఆసక్తికర రీతిలో ప్రేమ చిగురించింది. ఆ సంవత్సరం స్క్వాష్ క్రీడలో మరింత పదును పెంచుకునేందుకు దీపికా పల్లికల్ ఇంగ్లండ్‌లోని లీడ్స్‌కు వచ్చింది. అదే సమయంలో దినేశ్ కార్తిక్ కూడా టీమిండియాతో కలిసి టెస్టు మ్యాచ్ ఆడేందుకు లీడ్స్‌కు వచ్చాడు. అక్కడ తొలిసారి దీపికను చూసిన కార్తిక్ తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు. ఆమెపై ఇష్టంతో ట్రైనింగ్ సెంటర్‌కు వచ్చి స్క్వాష్ గేమ్ ఆడేవాడు. అలా ప్రేమ బంధంలో మునిగిపోయిన ఈ జంట 2015లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా ఇటీవలే దినేశ్ కార్తిక్ దంపతులు కవలలకు జన్మనిచ్చారు. ఇద్దరు కవలలకు తల్లిదండ్రుల పేర్లు కలిసి వచ్చేలా కబీర్ పల్లికల్ కార్తిక్, జియాన్ పల్లికల్ కార్తిక్ అని పేర్లు పెట్టారు. ప్రస్తుతం కార్తిక్, దీపికా పల్లికల్ మోస్ట్ లవబుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. చదవండి: Dinesh Karthik: టీమిండియాలోకి డీకే.. రీ ఎంట్రీపై ఆసక్తికర ట్వీట్ -
భర్త ఐపీఎల్లో ఇరగదీస్తుంటే.. భార్య భారత్‌కు బంగారు పతకం సాధించి పెట్టింది..!
ఐపీఎల్ 2022 సీజన్లో ఆర్సీబీ వెటరన్ ఆటగాడు దినేశ్ కార్తీక్ ( 3 మ్యాచ్‌ల్లో 204.55 స్ట్రయిక్ రేట్‌తో అజేయమైన 90 పరుగులు) ఆకాశమే హద్దుగా చెలరేగుతూ తన జట్టుకు అద్భుత విజయాలు (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) అందిస్తుంటే.. ఇదే సమయంలో అతని భార్య, ప్రముఖ స్క్వాష్ ప్లేయర్ దీపిక పల్లికల్ డబ్ల్యూఎస్‌ఎఫ్ (వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్) వరల్డ్ డబుల్స్ ఛాంపియన్స్‌లో భారత్‌కు బంగారు పతకాన్ని అందించింది. డబ్ల్యూఎస్‌ఎఫ్ మిక్సడ్ డబుల్స్ విభాగంలో సౌరవ్ గోషల్‌తో కలిసి బరిలోకి దిగిన దీపిక పల్లికల్ కార్తీక్.. శనివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌కు చెందిన అడ్రియన్ వాలర్, అలీసన్ వాటర్స్ జోడీపై 11-6, 11-8 తేడాతో విజయం సాధించి, ఈ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. ఈ టోర్నీలో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన పల్లికల్ జోడీ.. నాలుగో సీడ్ ఇంగ్లండ్ ద్వయంపై వరుస సెట్లలో విజయం సాధించి ఔరా అనిపించింది. పెళ్లి, ఆ తర్వాత ప్రసవం కారణంగా నాలుగేళ్ల పాటు స్క్వాష్‌కు దూరంగా ఉన్న పల్లికల్... బ్రేక్ తర్వాత బరిలోకి దిగిన మొదటి టోర్నీలోనే టైటిల్ సాధించి అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చింది. కాగా, పల్లికల్ 2015లో క్రికెటర్ దినేశ్ కార్తీక్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి గతేడాది (2021) అక్టోబర్ 18న మగ కవలలు జన్మించారు. చదవండి: ఆ వెటరన్ ప్లేయర్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయం..! -
మా మధ్య అభిప్రాయ బేధాల్లేవ్: దీపిక
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా వచ్చిన లాక్డౌన్ సమయాన్ని తాము ఎంతగానో ఆస్వాదిస్తున్నామని స్వ్కాష్ క్రీడాకారిణి, దినేశ్ కార్తీక్ భార్య దీపికా పల్లికల్ తెలిపారు. ఎక్కువగా క్రీడలు చుట్టూ తిరుగుతూ వైవాహిక జీవితాన్ని పరిమితంగా గడపాల్సి వస్తూ ఉంటుందని, కానీ లాక్‌డౌన్‌తో తాము మరింత దగ్గరై ఒకరి అవసరాల గురించి మరొకరం మాట్లాడుకునే వీలుదొరికిందన్నారు. ఈ లాక్డౌన్ సమయంలో ఫిట్నెస్ ఫోకస్ చేసినట్లు పేర్కొన్న దీపికా.. ప్రొఫెషనల్ అథ్లెట్లుగా తమకు ఇది పెద్ద బ్రేక్‌గా అని అన్నారు. తాము ఎప్పుడూ తమ ఆటల గురించి ఎక్కువగా చర్చించుకోమని, కేవలం స్పోర్ట్స్ పర్సన్స్‌గా ఏమి కావాలో వాటి గురించి మాత్రమే ఆలోచిస్తామన్నారు. (‘నన్ను 15 పరుగుల బ్యాట్స్‌మన్ అన్నారు’) ‘ఈ లాక్డౌన్ సమయంలో ఇద్దరం కలిసి ఇంటి పనులను పంచుకుంటున్నాం. అథ్లెట్లకు ఎప్పుడైనా కుటుంబంతో కలిసి గడిపే సమయం చాలా తక్కువగా ఉంటుంది. లాక్డౌన్ మమ్మల్ని మేము మరింత తెలుసుకోవడానికి మంచి అవకాశం. ఇప్పటివరకూ మేము బిజీ బిజీ షెడ్యూల్‌తోనే గడుపుతూ వచ్చాం. ఇప్పుడు ఎటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ లేకపోవడంతో ఇంటికే పరిమితమయ్యాం. మా మధ్య ఎప్పుడూ అభిప్రాయ బేధాలు రాలేదు. మేమిద్దరం ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడంతో మా గేమ్స్ల్లో మరింత రాటుదేలే అవకాశం ఏర్పడింది. మా మధ్య ఫిర్యాదులు అనేవి ఉండవు. మేము ఇంటి దగ్గర ఉన్నామంటే మా మధ్య క్రీడల చర్చే రాదు. జీవితంలోని మిగతా విషయాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. ప్రొఫెషనల్ లైఫ్‌ను గౌరవించుకుంటాం తప్పితే వాటి గురించి చర్చలు పెట్టం’ అని దీపికా పల్లికల్ అన్నారు. 2015లో వీరిద్దరూ వివాహ బంధంతోo ఒక్కటైన సంగతి తెలిసిందే. (‘అదే రోహిత్‌ను సక్సెస్ఫుల్ కెప్టెన్ చేసింది’) -
నా కష్టమేంటో డీకేకి అప్పుడే తెలిసొచ్చింది : దీపికా
‘ఆరోజు నాతో పాటు మలేషియా టోర్నమెంట్‌కి కార్తిక్ కూడా వచ్చాడు. క్రికెటర్ కదా అందుకే మమ్మల్ని తీసుకువెళ్లడానికి బస్ వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాడు. కానీ అలా జరగకపోవడంతో ఏంటి ఇంకా బస్సు రాదేం అని అమాయకంగా నన్ను అడిగాడు. అప్పుడు తనకి అర్థమైంది స్వ్కాష్ క్రీడాకారుల కష్టమేంటో. ఇక అప్పటి నుంచి నా పట్ల తనకింకా గౌరవం పెరిగింది అంటూ భర్త దినేశ్ కార్తిక్ గురించి చెప్పుకొచ్చారు స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్. మిస్ ఫీల్డ్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న దీపిక మాట్లాడుతూ..మూడేళ్ల క్రితం వివాహ బంధంతో కార్తిక్ తన జీవితంలో అడుగుపెట్టాడని.. ప్రేమను కురిపించడంతో పాటుగా తననెంతో గౌరవిస్తాడని పేర్కొన్నారు. అయితే మలేషియా టోర్నమెంట్ సమయంలో మాత్రం తన అమాయకత్వాన్ని చూస్తే నవ్వొంచిందని సరదాగా వ్యాఖ్యానించారు. భారత్‌లో చాలా మందికి క్రీడలంటే కేవలం క్రికెట్ మాత్రమే గుర్తొస్తొందనీ, వేరే క్రీడలకు ఇక్కడ అంతగా ఆదరణ ఉండదని అభిప్రాయపడ్డారు. క్రికెటర్లకు ఉన్నన్ని సౌకర్యాలు ఇతర క్రీడాకారులకు ఉండవని, ఈ విషయం తెలిసిన తర్వాత డీకే తనను చూసి మరింతగా గర్వపడటం మొదలుపెట్టాడని వ్యాఖ్యానించారు. కాగా పీఎస్ఏ ర్యాంకింగ్స్‌లో టాప్- 10లో చోటు దక్కించుకున్న మొదటి మహిళా స్క్వాష్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన దీపికా 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో స్క్వాష్ వుమన్స్ డబుల్స్ కేటగిరీలో భారత్‌కు స్వర్ణాన్ని అందించారు. తాజాగా జరిగిన ఆసియా క్రీడల్లో రజత పతకాన్ని అందించిన స్క్వాష్ మహిళల జట్టులో సభ్యురాలిగా కూడా ఉన్నారు. -
స్క్వాష్‌లో రజతంతో సరి
జకార్తా: ఆసియా క్రీడల స్క్వాష్ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టుకు స్వర్ణ పతక పోరులో నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన మహిళల ఫైనల్ పోరులో భారత జట్టు 0-2తేడాతో హాంకాంగ్ చేతిలో ఓటమి పాలైంది. ఫలితంగా రన్నరప్‌గా నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. దీపికా పళ్లికల్, జోష్నా చిన్నప్ప, సునయనా కురువిల్లా, తాన్వి ఖన్నా బృందం ఆఖరి పోరులో పరాజయం చెందారు. దాంతో స్వ్కాష్‌లో తొలిసారి స్వర్ణం అందుకునే అవకాశాన్ని భారత మహిళా జట్టు కోల్పోయింది. ప్రస్తుతం భారత్ పతకాల సంఖ్య 68 కాగా, అందులో 15 స్వర్ణాలు, 24 రజతాలు, 29 కాంస్య పతకాలున్నాయి. ఈ రోజు జరిగిన బాక్సింగ్ పోరులో భారత్ పసిడి సాధించింది. పురుషుల లైట్ ఫ్లై 49 కేజీల విభాగంలో భారత బాక్సర్ అమిత్ పంగాల్ స్వర్ణ పతకం సాధించాడు. ఆద్యంతం ఆసక్తిర రేపిన ఫైనల్లో అమిత్ 3-2 తేడాతో రియో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత దుస్మాతోవ్ హసన్‌బాయ్(ఉజ్బెకిస్తాన్)పై గెలిచి పసిడి గెలుచుకున్నాడు. ఆది నుంచి ప్రత్యర్థిపై తన పదునైన పంచ్‌లతో విరుచుకుపడిన అమిత్.. హసన్‌బాయ్‌పై పైచేయి సాధించి పసిడిని ఒడిసి పట్టుకున్నాడు. ఇక బ్రిడ్జ్ ఈవెంట్లో సైతం భారత్ స్వర్ణం సాధించింది. మెన్స్ పెయిర్ ఫైనల్-2లో భారత్ జోడి ప్రణబ్ బర్దాన్- శివ్‌నాథ్ సర్కార్లు 384.00 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి సాధించారు. -
స్క్వాష్‌లో పసిడి పోరుకు అమ్మాయిలు సై
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో భాగంగా స్క్వాష్ ఈవెంట్లో భారత మహిళల జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 2-0 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ మలేసియాను ఓడించి ఫైనల్‌కు చేరింది. జోష్నా చిన్నప్ప, దీపికా పళ్లికల్, సునయనా కురువిల్లా, తాన్వి ఖన్నాతో కూడిన భారత మహిళల స్క్వాష్ జట్టు.. ఆద్యంతం ఆకట్టకుంది. ఆది నుంచి పూర్తి ఆధిక్యాన్నికనబరిచిన భారత బృందం ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఫలితంగా భారత మహిళల స్క్వాష్ జట్టు కనీసం రజతాన్ని ఖాయం చేసుకుంది. శనివారం జరిగే పసిడి పోరులో హాంకాంగ్-జపాన్ల మధ్య జరుగునున్న రెండో సెమీ ఫైనల్ విజేతతో భారత్ తలపడనుంది. ఈ రోజు జరిగే స్క్వాష్ పురుషుల సెమీ ఫైనల్లో భారత్ జట్టు హాంకాంగ్‌తో ఆడనుంది. -
మూడు ‘కాంస్యాల’ స్క్వాష్
జకార్తా: ఆసియా క్రీడల ‘స్క్వాష్’లో భారత్‌కు మూడు కాంస్య పతకాలు లభించాయి. ముగ్గురు అగ్రశ్రేణి సింగిల్స్ ఆటగాళ్లు సెమీఫైనల్లోనే ఓడిపోవడంతో కంచుతో సరిపెట్టుకోక తప్పలేదు. అయితే ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. 2014లో స్క్వాష్‌లో భారత్ ఒక రజతం, ఒక కాంస్యం సాధించింది. నాడు రజతం గెలిచిన సౌరవ్ ఘోషల్ ఈసారి కాంస్యం సాధించగా, దీపిక పల్లికల్ మళ్లీ కాంస్యానికే పరిమితమైంది. శనివారం జరిగిన పురుషుల సెమీఫైనల్లో సౌరవ్ 12–10, 13–11, 6–11, 6–11, 6–11 స్కోరుతో చున్ మింగ్ యు (హాంకాంగ్) చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి రెండు సెట్లు గెలిచి ముందంజలో నిలిచినా...ఘోషల్ చివరి వరకు దానిని కాపాడుకోలేక చేతులెత్తేశాడు. రెండు సెట్లు గెలుచుకున్న అనంతరం మూడో సెట్లో ఒక దశలో సౌరవ్ 6–5తో ఆధిక్యంలో నిలిచాడు. అయితే చున్ మింగ్ వరుసగా ఆరు పాయింట్లు గెలుచుకొని భారత ఆటగాడికి షాక్ ఇచ్చాడు. అదే ఊపును అతను తర్వాతి రెండు సెట్లలో కొనసాగించగా, సౌరవ్ మాత్రం చతికిల పడ్డాడు. అయితే రెండో సెట్ చివర్లో తన కాలికి గాయమైందని, దాంతో ఓటమి తప్పలేదని ఘోషల్ వివరణ ఇచ్చాడు. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో మలేసియా దిగ్గజ క్రీడాకారిణి, డిఫెండింగ్ చాంపియన్ నికోల్ డేవిడ్ 11–7, 11–9, 11–6 తేడాతో దీపిక పల్లికల్‌ను చిత్తు చేసింది. పదేళ్ల పాటు వరల్డ్ నంబర్‌వన్‌గా స్క్వాష్‌ను శాసించిన నికోల్ ముందు దీపిక నిలవలేకపోయింది. మరో సెమీఫైనల్లో శివశంకరి సుబ్రహ్మణ్యం (మలేసియా) 12–10, 11–6, 9–11, 11–7తో జోష్నా చినప్పను ఓడించింది. గత మూడు ఆసియా క్రీడల్లో రిక్తహస్తాలతో తిరిగొచ్చిన జోష్నాకు ఇదే మొదటి పతకం కావడం విశేషం. -
దీపికా పళ్లికల్ కాంస్యంతో సరి
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018 స్క్వాష్ మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారిణి దీపికా పళ్లికల్ కాంస్యంతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో దీపికా పళ్లికల్ 0-3 తేడాతో డేవిడ్ నికోలాన్(మలేసియా) చేతిలో ఓటమి పాలైంది. దాంతో ఫైనల్‌కు చేరి రజతం సాధించాలన్నా దీపికా ఆశలు నెరవేరలేదు. కాగా, కాంస్యం దక్కడంతో ఏడో రోజు ఆటలో భారత్ పతకాల బోణీ కొట్టింది. మరొక స్క్వాష్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో జ్యోష్నచిన్నప్ప పరాజయం చెందింది. మలేసియా క్రీడాకారిణి శివసాంగారి చేతిలో జ్యోష్న చిన్నప్ప 1-3 తేడాతో ఓటమి చెంది కాంస్యంతో సంతృప్తి చెందింది. ఫలితంగా భారత్ పతకాల సంఖ్య 27కు చేరింది. ఇందులో ఆరు స్వర్ణాలు, ఐదు రజతాలు, పదహారు కాంస్య పతకాలున్నాయి. ఇదిలా ఉంచితే, ఈ రోజు ఆటలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధులు క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 21-6, 21-14 తేడాతో ఫిత్రియాని(ఇండోనేసియా)పై విజయం సాధించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించగా, ఆపై జరిగిన మరో ప్రిక్వార్టర్ పోరులో పీవీ సింధు 21-12, 21-15 తేడాతో టంజంగ్ జార్జియా(ఇండోనేసియా)పై గెలిచి రౌండ్-16లోకి ప్రవేశించింది. -
ఫస్ట్ లవ్ దినేశ్ కార్తీక్‌తోనే: హార్థిక్ పాండ్యా
సాక్షి, న్యూఢిల్లీ: దినేష్ కార్తిక్, అతని భార్య దీపికా పల్లికల్ మధ్యలోకి ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వచ్చాడు. దీంతో దీపికాకు కోపమొచ్చింది. హార్దిక్ చేసిన పనికి వ్యంగ్యంగా ఆమె సమాధానామిచ్చారు. ఇంతకీ విషయమేంటంటే.. డీకే, హర్దిక్లు మంచి స్నేహితులు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల జరిగిన ఓ టీవీ ఇంటర్యూలో కూడా తాను ఎక్కువ సమయం హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌తోనే గడుపుతానని కార్తిక్ చెప్పాడు. అయితే, కార్తిక్‌తో తనకున్న స్నేహబంధాన్ని వెల్లడిస్తూ... ‘నా మొదటి లవ్ డీకేతోనే’ అంటూ హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పోస్టు చేశాడు. హార్ట్ సింబల్‌ను సైతం జత చేశాడు. దీనిపై స్పందించిన కార్తిక్ భార్య ‘సరే.. నా స్థానాన్ని చక్కగా భర్తీ చేశారు. చాలా థాంక్స్’ అంటూ కామెంట్ చేశారు. కాగా, వృద్ధిమాన్ సాహాకు గాయం కారణంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న అయిదు మ్యాచ్‌లో టెస్ట్ సిరీస్‌కి దినేష్ కార్తిక్ ఎంపికయ్యాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో బుధవారం జరుగుతున్న మొదటి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. My no. 1 love ❤️ @dk00019 A post shared by Hardik Pandya (@hardikpandya93) on Jul 30, 2018 at 5:44am PDT -
‘నేను నా డ్రాగన్’: కార్తీక్
కోహ్లి-అనుష్క, ధోని-సాక్షిలాగా సెలబ్రిటీ జంట కాదు ఈ జంట. కానీ వీరిద్దరూ టీమిండియా తరుపున ప్రాతినిథ్యం వహిస్తూ ఎన్నో మరుపురాని విజయాలు అందించారు. ఒకరు నిదహాస్ ట్రోఫీలో చివరి బంతికి సిక్స్ కొట్టి భారత్‌కు కప్ అందించిన వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కాగా మరోకరు స్టార్ స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్. వీరిరువురు తీరిక లేకుండా వారివారి ఆటల్లో బిజీగా ఉండటంతో అందరిలగా బయట ఎక్కువగా కనిపించరు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ అనంతరం కాస్త ఖాళీ సమయం దొరకడంతో తన సతీమణితో కలిసి డెన్మార్క్ వీధుల్లో విహరిస్తున్నాడు ఈ సీనియర్ వికెట్ కీపర్. వీరిరువురు కలిసి దిగిన ఫోటోను దినేశ్ కార్తీక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా ‘నేను నా డ్రాగన్’ అంటూ పోస్ట్ చేశాడు. వీరు మరీ అంతగా సెలబ్రిటీ జంట కాకపోవడంతో అంతగా వైరల్ అవ్వలేదు. కానీ చూపరులను మాత్రం ఈ ఫోటో తెగ ఆకట్టుకోంటోంది. కార్తీక్ ఆకట్టుకుంటాడా.. ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా చివరిసారి 2007లో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో టెస్టు సిరీస్ గెలిచింది. వసీం జాఫర్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన కార్తీక్ ఈ టెస్టు సిరీస్‌లో అకట్టుకున్నాడు. ఈ సిరీస్‌లో టీమిండియా తరుపున అత్యధిక పరుగుల చేసింది కార్తీక్ కావడం విశేషం. ఇంగ్లండ్ సిరీస్ అనంతరం వరుస వైపల్యాలతో జట్టులో చోటు కోల్పోయిన కార్తీక్ దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత తిరిగి టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్నాడు. రెగ్యులర్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా గాయపడటంతో ఈ సీనియర్ ఆటగాడు అఫ్గనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో చోటు దక్కించుకున్నాడు. గాయం నుంచి సాహా కోలుకోకపోవడంతో కీలక ఇంగ్లండ్ పర్యటనకు కూడా కార్తీక్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు. ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో దినేశ్ కార్తీక్ మరోసారి ఆకట్టుకుంటాడా? టీమిండియా చరిత్ర మరోసారి పునరావృతం చేస్తుందా వేచి చూడాలి. -
భార్య మ్యాచ్ చూసి కలత చెందిన కార్తీక్
కోల్‌కతా : కామన్వెల్త్ గేమ్స్‌లో తన భార్య దీపికా పల్లికల్ స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ మ్యాచ్ చూసి కలత చెందినట్లు కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తిక్ తెలిపాడు. ఈ ఫైనల్లో రిఫరీల తీరును కార్తీక్ తప్పుబడుతూ ట్వీట్ చేశాడు. రిఫరీలు సరిగా ప్రవర్తించలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన స్క్వాష్ డబుల్స్ ఫైనల్లో రిఫరీలు తీరుతో అప్సెట్ అయ్యా. ఈ మ్యాచ్‌లో గోల్డ్‌మెడల్ పక్కా అని భావించా. అయినప్పటకి దీపిక పల్లికల్, సౌరవ్ ఘోషల్ మీ విజయంతో దేశం గర్వించేలా చేశారు. మీరే మాకు, దేశానికి నిజమైన విజేతలు.’ అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. కామన్వెల్త్ స్వర్ణ పతకం కోసం దీపిక పల్లికల్, సౌరవ్ ఘోషల్ మిక్స్డ్ డబుల్స్ జంట పోరాడి.. చివరికి రజత పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక దినేశ్ కెప్టెన్సీ వహిస్తున్న కోల్‌కతా సైతం సన్‌రైజర్స్ చేతిలో ఓడింది. .@DipikaPallikal @SauravGhosal @CWGSquash @GC2018 @cwg pic.twitter.com/DvLrXvUSGI — DK (@DineshKarthik) 14 April 2018 -
భారత్ ఖాతాలో మరో స్వర్ణం
గోల్డ్‌కోస్ట్ : ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగిస్తోంది. పదోరోజు ఆటలో భాగంగా భారత క్రీడాకారులు స్వర్ణాల పంట పండిస్తున్నారు. శనివారం ఒక్కరోజే భారత్ 7 స్వర్ణాలు కైవసం చేసుకుంది. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో మానికా బాత్రా సింగపూర్‌కు చెందిన మియింగ్యూ యుపై 11-7, 11-6, 11-2, 11-7 తేడాతో విజయం సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్‌లో దీపికా పల్లికల్, సౌరబ్ ఘోశల్‌లు స్వర్ణ పోరులో ఆస్ట్రేలియాకు చెందిన పిల్లే కామెరూన్, ఉరుక్హఖ్ డోన్నా చేతిలో 0-2 తేడాతో ఓటమి చెందడంతో రజతాలతో సరిపెట్టుకున్నారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 55కు చేరగా.. అందులో 24 స్వర్ణాలు, 14 రజతాలు, 17 కాంస్యాలున్నాయి. భారత్ మూడో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. -
దినేశ్ కార్తీక్.. మై సూపర్ హీరో : దీపికా
సాక్షి, స్పోర్ట్స్ : నిదహాస్ ట్రోఫీలో చివరి బంతిని సిక్స్ బాది భారత్‌కు అనూహ్య విజయాన్నందించిన టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌పై సోషల్ మీడియా వేదికగా అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే కార్తీక్ ప్రదర్శన పట్ల అతని సతీమణి భారత స్టార్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ ఆనందం వ్యక్తం చేశారు. మ్యాచ్ అనంతరం టీవీలో కనిపిస్తున్న దినేశ్ కార్తీక్ ఫొటోపై ‘మై దాదా మై సూపర్‌హీరో’ అనే క్యాఫ్షన్‌తో ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు. ఇక మరో పోస్ట్‌లో కార్తీక్ ఫొటో లవ సింబల్స్‌తో తన ప్రేమను చాటుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇక సూపర్ సిక్సుతో సూపర్ స్టార్ అయిన దినేశ్ కార్తీక్ తొలుత చిన్ననాటి స్నేహితురాలు నిఖితను పెళ్లి చేసుకున్నాడు. అనుకొని కారణాలతో 2012లో ఆమెతో విడిపోవాల్సి వచ్చింది. తర్వాత నిఖితను భారత క్రికెటర్ మురళీ విజయ్ పెళ్లి చేసుకున్నాడు. అనంతరం కార్తీక్... దీపికా పల్లికల్‌ను 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. -
దీపికా ఆ స్విమ్మింగ్ పూల్ ఎక్కడుంది?
ఆంటిగ్వా: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు తీరిక సమయాలలో భార్య, పిల్లలతో గడుపుతున్నారు. టీమిండియా క్రికెటర్లు ఎంఎస్ ధోని, ఓపెనర్ శిఖర్ ధావన్‌లు ఫ్యామిలీతో కరీబియన్ గడ్డపై సరదాగా షికార్లు చేస్తుండగా.. దినేశ్ కార్తీక్ కూడా తన భార్య, ఇండియా స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌తో కలిసి విండీస్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. జట్టుతో పాటు కార్తిక్ కూడా విండీస్ పర్యటనలో ఉన్నాడు. అయితే దినేశ్ కార్తీక్ భార్య దీపిక.. స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోయర్స్‌తో షేర్ చేసుకుంది. 'భర్త దినేశ్ కార్తీక్‌తో ప్రయాణించడం నాకు కష్టమైన పని' అంటూ దిపిక క్యాప్షన్ కూడా పెట్టింది. అయితే ఈ ఫొటో చూసిన మరో ఆటగాడు హార్దిక్ పాండ్యా స్విమ్మింగ్ పూల్‌కు ఫిదా అయ్యాడు. 'ఈ స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉందో చెప్పవా అని' హార్దిక్ అడిగాడు. 'ఇక్కడి మా విల్లాలో నాకు ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఉంది. నువ్వు ఇక్కడికి వస్తే నిమ్మరసం నీకు సర్వ్ చేస్తానని' దీపిక బదులిచ్చింది. చెబితే ఎప్పుడో వచ్చేవాడినని పాండ్యా బదులిచ్చాడు. మరోవైపు ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది. విండీస్, భారత్ జట్ల మధ్య నాలుగో వన్డే ఆదివారం జరగనుంది. -
ఫైనల్లో దీపికా పళ్లికల్ ఓటమి
మెల్ బోర్న్: భారత స్క్వాష్ స్టార్ దీపికా పళ్లికల్‌కు నిరాశే ఎదురైంది. మెల్బోర్నోలో ఆదివారం జరిగిన విక్టోరియా ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్ ఫైనల్లో దీపిక ఓటమి పాలైంది. రెండో సీడ్, ఇంగ్లండ్ క్రీడాకారిణి మిల్లీ టామిల్సన్ చేతిలో 11-6, 4-11, 11-3, 7-11, 9-11 తేడాతో ఓడి రన్నరప్ గా నిలిచింది. తొలి సెట్ కైవసం చేసుకున్న దీపిక రెండో సెట్ కోల్పోయిన త్వరగానే కోలుకుని మూడో సెట్ సొంతం చేసుకుని విజయం దిశగా నడిచింది. కానీ, ఇంగ్లండ్ ప్లేయర్ మిల్లీ అనూహ్యంగా పుంజుకుని రెండు వరుస సెట్లు కైవసం చేసుకోవడంతో దీపిక పోరాటం ముగిసింది. నాలుగు, ఐదు సెట్లలో పోరు హోరాహోరీగా జరిగింది. అయితే చివరికి ప్రత్యర్థినే విజయం వరించడంతో దీపిక రన్నరప్ గా నిలిచింది. -
తొలి రౌండ్లోనే దీపిక పరాజయం
కౌలాలంపూర్: ప్రపంచ మహిళల స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ క్రీడాకారిణి దీపిక పళ్లికల్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. మంగళవారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 19వ ర్యాంకర్ దీపిక 8-11, 9-11, 11-6, 11-6, 7-11తో ప్రపంచ పదో ర్యాంకర్ యాని అవు (హాంకాంగ్) చేతిలో ఓడిపోయింది. -
దీపికా, దినేశ్‌ల పెళ్లి వేడుక
-
ప్రేయసిని పెళ్లాడిన దినేష్ కార్తీక్
-
ప్రేయసిని పెళ్లాడిన దినేష్ కార్తీక్
చెన్నై : భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్, స్క్వాష్ స్టార్ దీపికా పళ్లికల్ వివాహం క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది. చెన్నైలో మంగళవారం జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. దీపికా ...తెలుపు రంగు గౌన్ ధరించి మెరిసిపోయింది. అలాగే ఈ నెల 20న తెలుగు నాయుళ్ల సంప్రదాయంలో వీరు మరోసారి పెళ్లాడబోతున్నారు. కాగా దినేష్ కార్తీక్‌కు ఇది రెండో వివాహం 2007లో తన బాల్య స్నేహితురాలు నిఖిత వంజరను దినేష్ ముంబైలో పెళ్లి చేసుకున్నాడు. అయితే, వీరి మధ్య పొరపొచ్చాలు వచ్చి 2012లో విడిపోయారు. కొన్నాళ్లు ఒంటరిగా ఉన్న దినేష్ కార్తీక్ ...స్క్వాష్ స్టార్ దీపికా పళ్లికల్ ప్రేమలో పడ్డాడు. అది కాస్తా పెళ్లి దాకా వచ్చింది. 2013 నవంబర్ 15న చెన్నై ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్లో వీరి నిశ్చితార్థం సన్నిహితుల సమక్షంలో తొలుత హిందూ సంప్రదాయ పద్ధతిలో, తర్వాత సిరియన్ క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది. -
ఎంగేజ్మెంట్ అయింది,పెళ్లే తరువాయి
-
దీపికా, దినేశ్‌ల పెళ్లి తేదీలు ఖరారు
చెన్నై: భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్, స్క్వాష్ స్టార్ దీపికా పళ్లికల్ల వివాహ తేదీలు నిశ్చయమయ్యాయి. ఆగస్ట్ 18,20 తేదీల్లో క్రిస్టియన్, హిందూ పద్ధతులలో రెండుసార్లు వివాహం చేసుకోనున్నారు. 'చెన్నైలోని ఓ హోటల్లో రెండుసార్లు పెళ్లి చేసుకోబోతున్నాం. ఆగస్ట్ 18న క్రిస్టియన్ పద్ధతిలో, 20న తెలుగు నాయుళ్ల సంప్రదాయంలో వివాహం జరుగుతుంది. తమ ఇద్దరి మతాలు వేరు కావడం వల్ల ఆయా మతాచారాల ప్రకారం రెండు సార్లు వివాహ క్రతువు ఉంటుందని, బంధువులు, సన్నిహితులను మాత్రమే పెళ్లికి ఆహ్వానిస్తున్నామని' దీపిక తెలిపింది. కాగా ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నం అయ్యాయి. క్రిస్టియన్ పద్ధతిలో జరిగే పెళ్లి తంతులో దీపికా ...తెలుపు రంగు గౌన్, హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే వివాహానికి 'ఎల్లో శారీ' కట్టనుంది.