భార్య మ్యాచ్‌ చూసి కలత చెందిన కార్తీక్‌ | Dinesh Kartik Upset his Wife Squash Mixed doubles Match  | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 15 2018 5:20 PM | Last Updated on Sun, Apr 15 2018 5:21 PM

Dinesh Kartik Upset his Wife Squash Mixed doubles Match  - Sakshi

దినేశ్‌ కార్తీక్‌, దీపికా పల్లికల్ (ఫైల్‌ ఫొటో)

కోల్‌కతా : కామన్వెల్త్ గేమ్స్‌లో తన భార్య దీపికా పల్లికల్‌ స్క్వాష్ మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌ చూసి కలత చెందినట్లు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తిక్‌ తెలిపాడు. ఈ ఫైనల్లో రిఫరీల తీరును కార్తీక్‌ తప్పుబడుతూ ట్వీట్‌ చేశాడు. రిఫరీలు సరిగా ప్రవర్తించలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

‘గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన స్క్వాష్‌ డబుల్స్‌ ఫైనల్లో రిఫరీలు తీరుతో అప్‌సెట్‌ అయ్యా. ఈ మ్యాచ్‌లో గోల్డ్‌మెడల్‌ పక్కా అని భావించా. అయినప్పటకి దీపిక పల్లికల్‌, సౌరవ్‌ ఘోషల్‌ మీ విజయంతో దేశం గర్వించేలా చేశారు. మీరే మాకు, దేశానికి నిజమైన విజేతలు.’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. కామన్వెల్త్ స్వర్ణ పతకం కోసం దీపిక పల్లికల్, సౌరవ్ ఘోషల్ మిక్స్‌డ్ డబుల్స్ జంట పోరాడి.. చివరికి రజత పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక దినేశ్‌ కెప్టెన్సీ వహిస్తున్న కోల్‌కతా సైతం సన్‌రైజర్స్‌ చేతిలో ఓడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement