కార్తీక్ నచ్చాడు కానీ... క్రికెటర్లు కాదు! | Dipika hated cricketers till she met Dinesh Karthik | Sakshi
Sakshi News home page

కార్తీక్ నచ్చాడు కానీ... క్రికెటర్లు కాదు!

Published Tue, Dec 17 2013 3:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 AM

కార్తీక్ నచ్చాడు కానీ... క్రికెటర్లు కాదు!

కార్తీక్ నచ్చాడు కానీ... క్రికెటర్లు కాదు!

 న్యూఢిల్లీ: భారత టాప్-50 అందగత్తెల్లో ఒకరిగా ‘ఫెమినా’ గుర్తించిన స్క్వాష్ స్టార్ దీపికా పల్లికల్ నిశ్చితార్ధం ఇటీవలే క్రికెటర్ దినేశ్ కార్తీక్‌తో జరిగింది. అయితే కార్తీక్ పరిచయమయ్యే వరకు తనకు క్రికెటర్లు అంటే అస్సలు నచ్చేవారు కాదని ఆమె వెల్లడించింది. అయితే ఇప్పుడూ ఆమె ఆలోచన ధోరణిలో మార్పు లేదు కానీ... కార్తీక్‌ను క్రికెటర్‌గా కాకుండా అతని మంచి మనసు వల్లే ప్రేమించానని చెప్పింది. ‘క్రికెటర్లకు లభించే పేరు, ప్రాచుర్యం ఇతర ఆటలను దెబ్బ తీస్తున్నాయనేది నా నమ్మకం. అది ఇప్పుడూ మారలేదు. అయితే కుటుంబ విలువలు తెలిసిన, భేషజాలకు పోని అబ్బాయి కావడంతోనే  కార్తీక్‌ను ప్రేమించాను. అతను క్రికెటర్ అయితే నేనేమీ చేయలేను. ఈ విషయంలో నా ఫ్రెండ్స్ ఆటపట్టిస్తుంటే సరదాగా ఉంది’ అని దీపిక చెప్పింది. ఐదేళ్ల క్రితమే తొలిసారి తాము కలిసినా గత ఫిబ్రవరిలోనే ప్రేమ మొదలైందని పల్లికల్ గుర్తు చేసుకుంది. ప్రస్తుత బిజీ షెడ్యూల్ కారణంగా తాము 2015లో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని వరల్డ్ నం. 12 ప్లేయర్ దీపిక చెప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement