దీపికా, దినేశ్ల పెళ్లి తేదీలు ఖరారు
చెన్నై: భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్, స్క్వాష్ స్టార్ దీపికా పళ్లికల్ల వివాహ తేదీలు నిశ్చయమయ్యాయి. ఆగస్ట్ 18,20 తేదీల్లో క్రిస్టియన్, హిందూ పద్ధతులలో రెండుసార్లు వివాహం చేసుకోనున్నారు. 'చెన్నైలోని ఓ హోటల్లో రెండుసార్లు పెళ్లి చేసుకోబోతున్నాం. ఆగస్ట్ 18న క్రిస్టియన్ పద్ధతిలో, 20న తెలుగు నాయుళ్ల సంప్రదాయంలో వివాహం జరుగుతుంది.
తమ ఇద్దరి మతాలు వేరు కావడం వల్ల ఆయా మతాచారాల ప్రకారం రెండు సార్లు వివాహ క్రతువు ఉంటుందని,
బంధువులు, సన్నిహితులను మాత్రమే పెళ్లికి ఆహ్వానిస్తున్నామని' దీపిక తెలిపింది. కాగా ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నం అయ్యాయి. క్రిస్టియన్ పద్ధతిలో జరిగే పెళ్లి తంతులో దీపికా ...తెలుపు రంగు గౌన్, హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే వివాహానికి 'ఎల్లో శారీ' కట్టనుంది.