తారక్ మెహతా కా ఊల్టా చష్మా షో నటి జీల్ మెహతా వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన చిరకాల స్నేహితుడు ఆదిత్య దూబేను పెళ్లి చేసుకుంది. తాజాగా తన పెళ్లికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కొత్త జంటకు అభినందనలు చెబుతున్నారు.
అయితే జీల్ మెహతా వివాహ వేడుక డిసెంబర్ 28న జరిగింది. కాస్తా ఆలస్యంగా అభిమానులతో ఈ గుడ్ న్యూస్ పంచుకుంది. కాగా.. జీల్ మెహతా తారక్ మెహతా కా ఊల్టా చష్మా సిట్‌కాట్‌తో పాటు చల్దీ దా నామ్ గడ్డి సీరియల్‌లోనూ నటించింది.
కాగా.. గతేడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న జీల్ మెహతా, ఆదిత్య దూబే ఏడాది చివర్లో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. తారక్ మెహతా కా ఊల్తా చష్మా షో సోను పాత్రలో అభిమానులను మెప్పించింది. జీల్ మెహతా 2008 నుంచి 2012 వరకు ఈ సిట్‌కామ్ షోలో కనిపించింది. మరో సీరియల్ చల్దీ దా నామ్ గడ్డిలో ప్రియాంక పాత్రలో అలరించింది. ఈ సిరీయల్ 2007 నుంచి 2008 వరకు కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment