టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను పెళ్లాడబోతున్నారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్‌కు ఇప్పటికే అంతా సిద్ధమైంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి పెళ్లి వేడుక జరగనుంది. దీంతో ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు టాలీవుడ్ ప్రముఖులు ఎవరెవరు హాజరవుతారన్న విషయంపై ఆసక్తి నెలకొంది.
తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబసమేతంగా హాజరు కానున్నారు. వీరితో పాటు ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కూడా చై వివాహా వేడుకలో సందడి చేయనున్నారు. అంతేకాకుండా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు, సన్నిహితులు కూడా హాజరయ్యే అవకాశముంది. ఈనెల 4న అంటే బుధవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లోని నాగేశ్వరరావు విగ్రహం ఎదుట వీరి పెళ్లి వేడుక జరగనుంది.
కాగా.. ఈ ఏడాది ఆగస్టులో శోభిత- నాగచైతన్య నిశ్చితార్థ చేసుకున్నారు. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఇప్పటికే పెళ్లి వేడుకలు మొదలవ్వగా శోభిత హల్దీ వేడుగ ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో మంగళస్నాన వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను శోభిత ఇన్‌స్టాలో షేర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment