ప్రేయసిని పెళ్లాడిన దినేష్ కార్తీక్
చెన్నై : భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్, స్క్వాష్ స్టార్ దీపికా పళ్లికల్ వివాహం క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది. చెన్నైలో మంగళవారం జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. దీపికా ...తెలుపు రంగు గౌన్ ధరించి మెరిసిపోయింది. అలాగే ఈ నెల 20న తెలుగు నాయుళ్ల సంప్రదాయంలో వీరు మరోసారి పెళ్లాడబోతున్నారు.
కాగా దినేష్ కార్తీక్‌కు ఇది రెండో వివాహం 2007లో తన బాల్య స్నేహితురాలు నిఖిత వంజరను దినేష్ ముంబైలో పెళ్లి చేసుకున్నాడు. అయితే, వీరి మధ్య పొరపొచ్చాలు వచ్చి 2012లో విడిపోయారు. కొన్నాళ్లు ఒంటరిగా ఉన్న దినేష్ కార్తీక్ ...స్క్వాష్ స్టార్ దీపికా పళ్లికల్ ప్రేమలో పడ్డాడు. అది కాస్తా పెళ్లి దాకా వచ్చింది. 2013 నవంబర్ 15న చెన్నై ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్‌లో వీరి నిశ్చితార్థం సన్నిహితుల సమక్షంలో తొలుత హిందూ సంప్రదాయ పద్ధతిలో, తర్వాత సిరియన్ క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది.