దినేష్ కార్తిక్, హార్దిక్ పాండ్యా (ఫైల్ ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ: దినేష్ కార్తిక్, అతని భార్య దీపికా పల్లికల్ మధ్యలోకి ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వచ్చాడు. దీంతో దీపికాకు కోపమొచ్చింది. హార్దిక్ చేసిన పనికి వ్యంగ్యంగా ఆమె సమాధానామిచ్చారు. ఇంతకీ విషయమేంటంటే.. డీకే, హర్దిక్‌లు మంచి స్నేహితులు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల జరిగిన ఓ టీవీ ఇంటర్యూలో కూడా తాను ఎక్కువ సమయం హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌తోనే గడుపుతానని కార్తిక్ చెప్పాడు.
అయితే, కార్తిక్‌తో తనకున్న స్నేహబంధాన్ని వెల్లడిస్తూ... ‘నా మొదటి లవ్ డీకేతోనే’ అంటూ హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పోస్టు చేశాడు. హార్ట్ సింబల్‌ను సైతం జత చేశాడు. దీనిపై స్పందించిన కార్తిక్ భార్య ‘సరే.. నా స్థానాన్ని చక్కగా భర్తీ చేశారు. చాలా థాంక్స్’ అంటూ కామెంట్ చేశారు. కాగా, వృద్ధిమాన్ సాహాకు గాయం కారణంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న అయిదు మ్యాచ్‌లో టెస్ట్ సిరీస్‌కి దినేష్ కార్తిక్ ఎంపికయ్యాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో బుధవారం జరుగుతున్న మొదటి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment