టీ20 వరల్డ్‌కప్-2024లకు అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. జూన్1న అమెరికా, కెనడా మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే ఈ టోర్నీలో భాగమయ్యే ఆయా జట్లు తమ వివరాలను మే1లోపు ఐసీసీకి సమర్పించాలి. ఈ క్రమంలో భారత జట్టును మరో వారం రోజుల్లో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది.
ఐపీఎల్‌లో ప్రదర్శన ఆధారంగా జట్టు ఎంపికను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. ఈ సెలక్షన్ మీటింగ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గోనున్నాడు. అయితే సెలక్టర్లు కంటే ముందు చాలా మంది మాజీ ఆటగాళ్లు టీ20 వరల్డ్‌కప్‌లో భాగమయ్యే భారత జట్టును అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి భారత మాజీ బ్యాటర్ అంబటి రాయుడు చేరాడు.
టీ20 ప్రపంచకప్‌కు తన 15 మంది ప్రాబబుల్స్‌ని రాయుడు ఎంచుకున్నాడు. రాయుడు ఎంచుకున్న జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు చోటు దక్కలేదు. హార్దిక్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్ జట్టులో అతడి స్ధానం ప్రశ్నార్థకంగా మారింది.
అదేవిధంగా ఐపీఎల్‌లో అదరగొడుతున్న పేస్ సంచలనం మయాంక్ యాదవ్.. రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్‌లకు రాయడు తన ఎంపిక చేసిన జట్టులో ఛాన్స్ ఇచ్చాడు. అయితే అనుహ్యంగా రాయుడు వికెట్ కీపర్ కోటాలో రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, సంజూ శాంసన్‌లను కాకుండా దినేష్ కార్తీక్‌కు చోటు ఇవ్వడం గమనార్హం.
దినేష్ కార్తీక్ ఈ ఏడాది సీజన్‌లో దుమ్ములేపుతున్నాడు. ఫినిషర్‌గా వచ్చి డీకే అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే రాయుడు కార్తీక్‌కు అవకాశమిచ్చాడు. అంబటి ఎంచుకున్న జట్టులో టాప్-4లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి,సూర్యకుమార్‌లకు చోటు దక్కింది. ఆల్‌రౌండర్ కోటాలో శివమ్ దూబే, రవీంద్ర జడేజాలకు రాయుడు అవకాశమిచ్చాడు. ఫాస్ట్ బౌలర్లగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు దక్కింది. స్పెషలిస్టు స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్‌ను రాయుడు ఎంపిక చేశాడు.
#IncredibleStarcast expert @RayuduAmbati has picked 15 ambitious players for his #TeamIndia squad ahead of #T20WorldCup2024 & there's only one all-rounder, @imjadeja! 👀
Participate in the biggest opinion poll ever on our social media handles (23rd April-1st May) and see if you… pic.twitter.com/1PB3TwATc8— Star Sports (@StarSportsIndia) April 24, 2024
Comments
Please login to add a commentAdd a comment