కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్, టీమిండియా కెప్టెన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగడం సందేహాలకు తావిచ్చింది. ఐపీఎల్-2024 ఆరంభం నుంచి ముంబై తరఫున అన్ని మ్యాచ్‌లలోనూ మైదానంలోకి దిగాడు హిట్‌మ్యాన్.
అయితే, కేకేఆర్‌తో మ్యాచ్‌లో మాత్రం అతడు ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో విశ్రాంతి తీసుకున్న రోహిత్.. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు వచ్చాడు.
కానీ ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 12 బంతులు ఎదుర్కొని ఒక సిక్స్ సాయంతో 11 పరుగులు మాత్రమే చేసి.. సునిల్ నరైన్ బౌలింగ్‌లో మనీశ్ పాండేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
ఆందోళనలో అభిమానులు
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై సందేహాలు తలెత్తాయి. అసలే టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి సమయం దగ్గరపడుతున్న తరుణంలో కెప్టెన్ సాబ్‌కు ఏమైందంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
క్లారిటీ ఇచ్చిన చావ్లా
ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ స్పిన్నర్ పీయూశ్ చావ్లా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘‘రోహిత్ తేలికపాటి వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది’’ అని రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపడానికి గల కారణం వెల్లడించాడు.
అదే విధంగా.. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుస వైఫల్యాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పేరు, ప్రఖ్యాతుల కోసం బరిలోకి దిగినపుడు.. పోరాటం కొనసాగిస్తూనే ఉండాలి.
ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధిస్తామా లేదా అన్నది పక్కనపెడితే.. జట్టు ప్రయోజనాల కోసం ఆడటమే ఆటగాళ్ల ప్రథమ కర్తవ్యం’’ అని పీయూశ్ చావ్లా చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో ముంబై ఎనిమిది ఓడిపోయింది.
ఇదిలా ఉంటే.. జూన్ 1 నుంచి మొదలుకానున్న టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు.. ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.
ఇటు కెప్టెన్‌గా.. అటు ఆల్‌రౌండర్ పాండ్యా విఫలమవుతున్నా బీసీసీఐ అతడిపై నమ్మకం ఉంచింది. గతేడాది అక్టోబరు తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా.. ఐసీసీ టోర్నీలో ఏకంగా వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment