ముంబై ఇండియన్స్ కెప్టెన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా నియామకాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు రోహిత్ శర్మ అభిమానులు. రికార్డు స్థాయిలో ముంబైని ఏకంగా ఐదుసార్లు విజేతగా నిలిపిన హిట్‌మ్యాన్‌పై వేటు వేస్తూ ఫ్రాంఛైజీ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నారు.
స్టేడియంలో లోపలా.. వెలుపలా పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు దిగుతున్నారు. హార్దిక్ పాండ్యాకు ప్రేక్షకుల నుంచి ఎదురవుతున్న చేదు అనుభవాలే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో గురువారం నాటి మీడియా సమావేశంలో రోహిత్ శర్మ తొలిసారిగా ఈ విషయంపై స్పందించాడు.
టీ20 ప్రపంచకప్-2024కు సంబంధించిన జట్టు గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి ముంబైలో రోహిత్ విలేకరులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కోల్పోవడం గురించి ప్రశ్న ఎదురైంది.
నాకు ఇదేమీ కొత్త కాదు
ఇందుకు బదులిస్తూ.. ‘‘జీవితంలో ఇదంతా భాగమే. అన్నీ మనం అనుకున్నట్లుగా జరగవు. ఏదేమైనా వేరొకరి(హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి) కెప్టెన్సీలో ఆడటం గొప్ప అనుభవం.
ఇంతకు ముందు కూడా నేను చాలా మంది కెప్టెన్ల సారథ్యంలో ఆడాను. నాకు ఇదేమీ కొత్త కాదు. ఒక ఆటగాడిగా జట్టు కోసం ఏం చేయగలనో అది చేయడమే నాకు ముఖ్యం. గత నెల రోజులుగా నేను అదే పని చేస్తున్నాను’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
కాగా గతంలో మహేంద్ర సింగ్ ధోని, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లి, ఆడం గిల్‌క్రిస్ట్(దక్కన్ చార్జర్స్), హర్భజన్ సింగ్(ముంబై ఇండియన్స్, రిక్కీ పాంటింగ్(ముంబై ఇండియన్స్) కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఆడిన విషయం తెలిసిందే.
హార్దిక్ పాండ్యా విఫలం
ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు ఆడిన 10 ఇన్నింగ్స్‌లో కలిపి రోహిత్ శర్మ 314 పరుగులు చేశాడు. ఇక ముంబై కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా మాత్రం ఆకట్టులేకపోతున్నాడు. అతడి నాయకత్వంలో ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌లలో కేవలం మూడింట మాత్రమే ముంబై గెలిచింది.
అక్కడ రోల్ రివర్స్
కాగా క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్ తర్వాత వరల్డ్‌కప్ టోర్నీతో రోహిత్ శర్మ బిజీ కానున్నాడు. రోహిత్ సారథ్యంలోని టీమిండియా జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. తదుపరి జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ ఐసీసీ టోర్నీలో రోహిత్‌కు హార్దిక్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.
చదవండి: T20 WC 2024: ఓపెనర్‌గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
Comments
Please login to add a commentAdd a comment