Piyush Chawla
-
మిడిలార్డర్లో కపిల్ దేవ్.. గంభీర్, దాదాకు దక్కని చోటు
భారత క్రికెట్లో పాతతరం నుంచి నేటివరకు తమదైన ముద్ర వేసిన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. కపిల్ దేవ్, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, మహేంద్ర సింగ్ ధోని, జహీర్ ఖాన్, గౌతం గంభీర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా.. చెప్పుకొంటూ పోతే జాబితా పెరుగుతూనే ఉంటుంది.పీయూశ్ చావ్లా ఏమన్నాడంటేఇంతమంది ఆటగాళ్లలో అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవాలంటే కష్టమే మరి! అయితే, భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ పీయూశ్ చావ్లా మాత్రం తనకు ఈ విషయంలో పూర్తి స్పష్టత ఉందంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 2006 నుంచి 2012 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు ఈ ఉత్తరప్రదేశ్ బౌలర్. కెరీర్లో మొత్తంగా 6 టెస్టుల్లో 7, 25 వన్డేల్లో 32, ఏడు టీ20లలో 4 వికెట్లు పడగొట్టాడు.స్వల్ప కాలమే టీమిండియాకు ఆడినా పీయూశ్ చావ్లా ఖాతాలో రెండు ప్రపంచకప్ ట్రోఫీలు ఉండటం విశేషం. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో పీయూశ్ సభ్యుడు. గత పన్నెండేళ్లుగా ఐపీఎల్‌కే పరిమితమైన ఈ వెటరన్ స్పిన్నర్.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ ఆడుతున్నాడు. కెప్టెన్‌గా ధోని.. నాలుగోస్థానంలో కోహ్లిఈ క్రమంలో శుభాంకర్ మిశ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీయూశ్ తన ఆల్‌టైమ్ ఇండియా వన్డే ప్లేయింగ్ ఎలెవన్‌ను వెల్లడించాడు. తన జట్టుకు ధోనిని కెప్టెన్‌గా ఎంచుకున్న పీయూశ్.. సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మలకు ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్లో వీరేంద్ర సెహ్వాగ్‌కు మూడు, విరాట్ కోహ్లికి నాలుగో స్థానం ఇచ్చాడు. మిడిలార్డర్లో ఆల్‌రౌండర్లు యువరాజ్ సింగ్, కపిల్ దేవ్లను ఎంపిక చేసుకున్న పీయూశ్.. ఆ తర్వాత ధోనిని నిలిపాడు. స్పిన్ విభాగంలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్‌లకు చోటిచ్చిన అతడు.. పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్‌లను ఎంపిక చేసుకున్నాడు.దాదా, గంభీర్‌కు చోటు లేదుఅయితే, వరల్డ్‌కప్(2007, 2011) హీరో గౌతం గంభీర్, స్టార్ కెప్టెన్ సౌరవ్ గంగూలీలకు పీయూశ్ తన జట్టులో చోటు ఇవ్వకపోవడం గమనార్హం. అంతేకాదు.. నంబర్ 3లో హిట్టయిన కోహ్లిని నాలుగో స్థానానికి ఎంచుకోవడం విశేషం. ఇదిలా ఉంటే.. 35 ఏళ్ల పీయూశ్ చావ్లా ఐపీఎల్ రికార్డు మాత్రం ఘనంగా ఉంది. ఇప్పటి వరకు 192 మ్యాచ్‌లు ఆడి 192 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ముంబై ఇండియన్స్ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహించాడు.పీయూశ్ చావ్లా ఆల్‌టైమ్ వన్డే ప్లేయింగ్ ఎలెవన్సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్.చదవండి: పాకిస్తాన్‌లోనే చాంపియన్స్ ట్రోఫీ: ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ -
'కోహ్లిలో ఏ మార్పు లేదు.. మేమిద్దరం మంచి స్నేహితులం'
టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఇటీవల స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కెప్టెన్ అయ్యాక కోహ్లి ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి అని ఓ ఇంటర్వ్యూలో మిశ్రా సంచలన కామెంట్స్ చేశాడు.తాజాగా ఇదే విషయంపై అమిత్ మిశ్రాకు మరో వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా పరోక్షంగా కౌంటరిచ్చాడు. కోహ్లితో తనకు మంచి అనుబంధం ఉందని, అతడిలో ఎటువంటి మార్పు రాలేదు అని చావ్లా చెప్పుకొచ్చాడు."విరాట్ నాకు మంచి స్నేహితుడు. మేమిద్దరం కలిసి జానియర్ స్ధాయిలో క్రికెట్ ఆడాము. ఆ తర్వాత ఐపీఎల్, భారత జట్టుకు కూడా మేము కలిసి ఆడాము. అతడి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా కోహ్లి అలానే ఉన్నాడు. ఎక్కడ కలిసినా కూడా అంతే ప్రేమ, అభిమానాన్ని చూపిస్తాడు. మేమిద్దరం భోజన ప్రియులం. గతేడాది ఆసియాకప్‌లో కామెంటేటర్‌గా వ్యవహరించినప్పుడు నేను విరాట్ బ్రేక్ సమయంలో కలుసుకున్నాము.అతడు నాదగ్గరకు వచ్చి మనద్దరికి మంచి ఫుడ్ ఆర్డర్ చేయమని చెప్పాడు. నేను అందుకు నవ్వతూ సరే అన్నానని" శుభమన్ గౌర్ అనే యూట్యాబర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చావ్లా పేర్కొన్నాడు. -
సాక్షి ఉద్యోగులతో పీయూష్ చావ్లా
-
నా ఆల్‌టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అతడే: టీమిండియా స్టార్
టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011.. టీమిండియా ట్రోఫీ గెలిచిన రెండు సందర్బాల్లోనూ జట్టులో భాగంగా ఉన్నాడు స్పిన్నర్ పీయూశ్ చావ్లా. ఏకంగా రెండుసార్లు ట్రోఫీని ముద్దాడే అదృష్టం దక్కించుకున్నాడు. 2006లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ యూపీ స్పిన్నర్ తన కెరీర్ మొత్తంలో 3 టెస్టులు, 25 వన్డేలు, ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 7, 32, 4 వికెట్లు తీశాడు.అయితే, ఈ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్‌కు ఐపీఎల్లో మాత్రం ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు క్యాష్ రిచ్ లీగ్‌లో 192 మ్యాచ్‌లు ఆడిన పీయూశ్ 192 వికెట్లు తీశాడు. ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తరఫున 11 మ్యాచ్‌లలో కలిపి 13 వికెట్లు పడగొట్టాడు.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ టూర్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ బృందంతో కలిసి పీయూశ్ చావ్లా హైదరాబాద్‌లోని సాక్షి మీడియా ఆఫీస్‌కు వచ్చాడు. ఈ సందర్భంగా ట్రోఫీని ఆవిష్కరించి టీమిండియాకు విష్ చేశాడు.ఈ క్రమంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలియజేశాడు. ‘‘రోహిత్ శర్మ నా ఆల్‌టైమ్ ఫేవరెట్. తను నాకు స్నేహితుడు. ఐపీఎల్-2024లో ఆఖరి మ్యాచ్ సందర్భంగా అతడు ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు. ఈసారి వరల్డ్‌కప్‌లో రోహిత్ ప్రదర్శన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని పీయూశ్ చావ్లా పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ఆటగాడిగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. 14 మ్యాచ్‌లు ఆడి 417 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై సెంచరీ చేసిన హిట్‌మ్యాన్.. లీగ్ దశలో ఆఖరిదైన లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లోనూ అర్ధ శతకం(38 బంతుల్లో 68)తో సత్తా చాటాడు. -
T20 WC 2024 Trophy At Sakshi: సెమీస్ చేరే జట్లు ఇవే: పీయూశ్ చావ్లా
టీ20 ప్రపంచకప్-2024 టూర్ భారత్‌లో కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న స్టార్ స్పోర్ట్స్ బృందం ఆదివారం ‘సాక్షి’ ఆఫీస్‌కు విచ్చేసింది.హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో.. ప్రముఖ క్రికెటర్, టీ20 వరల్డ్‌కప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011 విజేత పీయూశ్ చావ్లా ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాక్షి జర్నలిస్టులతో ఆయన చిట్‌చాట్ చేశారు. ఈ క్రమంలో ఔత్సాహికులు అడిగిన ప్రశ్నలకు పీయూష్ చావ్లా ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.టీ20 ప్రపంచకప్-2024 సెమీ ఫైనలిస్టులపై మీ అంచనా?ఇండియా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్.. ఈ మూడింటితో పాటు ఇంగ్లండ్ లేదంటే న్యూజిలాండ్ జట్లను టాప్-4లో చూసే అవకాశం ఉంది.స్పిన్నర్‌గా మీరు ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్ ఎవరు?వీరూ భాయ్(వీరేంద్ర సెహ్వాగ్), రాహుల్ భాయ్(రాహుల్ ద్రవిడ్).కీలక సమయంలో ముఖ్యంగా డెత్ ఓవర్లలో మీరు ఒత్తిడిని ఎలా జయిస్తారు?కెరీర్ ఆరంభంలో ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడికి గురికావడం సహజం. అయితే, అనుభవం గడిస్తున్న కొద్దీ మేనేజ్ చేసుకోగలుగుతాం.టీ20 వరల్డ్‌కప్-2024లో పేసర్లు, స్పిన్నర్లలో ఎవరు కీలకం కానున్నారు?వెస్టిండీస్ పిచ్‌లు స్లోగా ఉంటాయి. నాకున్న సమాచారం ప్రకారం అమెరికాలోనూ పరిస్థితి ఇలాగే ఉండబోతోంది. కాబట్టి స్పిన్నర్లు ఈసారి కీలక పాత్ర పోషిస్తారని అనుకుంటున్నా.టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా ఎదుర్కొనబోయే కఠినమైన ప్రత్యర్థి ఎవరనుకుంటున్నారు?ఆస్ట్రేలియా. ఎందుకంటే ఐసీసీ టోర్నీలో ఒత్తిడిని ఎలా జయించాలో వాళ్లకు బాగా తెలుసు.టీమిండియా స్పిన్నర్లలో ఈసారి ఎవరు కీలక పాత్ర పోషించనున్నారు?కుల్దీప్ యాదవ్.జస్ప్రీత్ బుమ్రా వరల్డ్‌కప్‌నకు సిద్ధంగా ఉన్నాడా?అవును. మెగా టోర్నీ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. కచ్చితంగా ఈసారి అద్భుతంగా రాణిస్తాడనే నమ్మకం ఉంది. మెగా టోర్నీకి సిద్ధమయ్యే క్రమంలో తను ఐపీఎల్లో ఆఖరి మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. ఇలా పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ పీయూశ్ చావ్లా సరదాగా గడిపారు. కాగా ఐపీఎల్-2024లో పీయూశ్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించారు. 11 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టారు.చదవండి: Virat Kohli: కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.. వీడియో వైరల్ -
T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఆటల్లో క్రికెట్ ఒకటి. బ్రిటిష్ నేలకు ఒకప్పుడు అది వేసవి క్రీడ. క్రమంగా ఆదరణ చురగొని ‘జెంటిల్మెన్ గేమ్’గా అన్ని దేశాలకు విస్తరించింది(ఇలా ఎందుకు పిలుస్తారో చివర్లో చెబుతాం). ఇప్పుడు.. కోట్ల మందికి వినోదాన్ని పంచే విశ్వక్రీడ ఇది. ఇందులోనే ప్రధాన టోర్నీలను కైవసం చేసుకునేందుకు పలు జట్లు పోటీ పడుతుంటాయి. ఇందులో ఒకటే టీ 20 ప్రపంచకప్. స్టేడియంలో సీటుల్లో కూర్చోనివ్వకుండా వేల మందిని.. స్మార్ట్తెరలకు అతుక్కుపోయేలా కోట్లమందిని అలరించేందుకు.. మస్త్ మజా టీ20 వరల్డ్ కప్ టోర్నీ మరోసారి వచ్చేస్తోంది.‘‘హాయ్.. నా పేరు పొట్టోడు. క్రికెట్‌కు పుట్టిన ముగ్గురం పిల్లల్లం మేం. పెద్ద కొడుకు.. నా అన్న టెస్టు. రెండో కొడుకు.. నా చిన్నన్న వన్డే. ఇంక నేనేమో చిన్నోడిని.. పేరు టీ20. ఎంతైనా ఫార్మట్ చిన్నది కదా!. అందుకే అంతా ముద్దుగా నన్ను పొట్టోడు అంటారు. నా కోసం కూడా ఓ మహా సంగ్రామం జరుగుతుంటుంది. ఆ సంబురం పంచేందుకు మరో రెండు వారాల్లో మళ్లీ మీ ముందుకు వస్తున్నా. నన్ను గెలవడమే లక్ష్యంగా పెట్టుకుని 20 దేశాల జట్లు సమరం తలపడబోతున్నాయి. అందుకే నా గురించి మీతో కొన్ని ముచ్చట్లు పంచుకునేందుకు వచ్చా. క్రికెట్‌కు పెద్దన్నగా వ్యవహరించే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆధ్వర్యంలో నా కోసం ఈ టీ20 ప్రపంచ కప్ జరుగుతుంది. తుది సమరంలో నెగ్గిన జట్టుకే నన్ను బహుకరిస్తారు. లండన్‌లోని లింక్స్ లండన్ కంపెనీ వాళ్లు నన్ను తయారు చేస్తున్నారు. సిల్వర్-రోడియం కలయికతో ఏడున్నర కేజీల బరువు ఉంటా నేను. ఇప్పటి వరకు 8 సార్లు టోర్నీ నిర్వహిస్తే.. రెండు జట్లు(ఇంగ్లండ్, వెస్టిండీస్) రెండేసిసార్లు నన్ను గెల్చుకున్నాయి. మిగతా నాలుగు సార్లు నాలుగు జట్లు గెలిచాయి. ఆస్ట్రేలియా తప్పించి ఇందులో మూడు ఆసియా దేశాలే ఉన్నాయి. అయితే.. 2007లో తొలిసారి దక్షిణాఫ్రికా ఆతిథ్యంలో నా కోసం తొలి టోర్నీ జరిగితే.. ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ ఉత్కంఠభరిత విక్టరీతో నన్ను కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ప్రతీ టోర్నీలోనూ నా కోసం టఫ్ ఫైట్ జరుగుతూనే వస్తోంది.గెలిచిన జట్టుకు ఐసీసీ కేవలం నా టోర్నీని మాత్రమే చేతులో పెట్టదు. ప్రైజ్‌మనీ కూడా ఉంటుంది. గత టోర్నీలో గెలిచిన ఇంగ్లండ్ జట్టుకు 1.6 మిలియన్ డాలర్ల(సుమారు రూ.13 కోట్లు) ప్రైజ్‌మనీ ఇచ్చారు. రన్నరప్‌గా నిలిచిన పాక్‌కు 8,00,000 డాలర్లు ఇచ్చారు. కేవలం విన్నర్ రన్నర్ మాత్రమే కాదు.. టోర్నీలో పాల్గొనే మిగతా జట్లకు కూడా వాళ్ల వాళ్ల ఫర్ఫార్మెన్స్ను బట్టి రివార్డు ఇస్తారు. అలా కిందటి సీజన్లో మొత్తం 5.6 మిలియన్ డాలర్లను(రూ46 కోట్ల పైనే) 16 జట్లకు పంచారు. మరి ఈసారి 20 జట్లు కదా. ఆ ప్రైజ్ మనీని పెంచుతారేమో!.నేనిప్పుడు భారత్‌లోనే ఉన్నా.వహ్.. ఈ దేశం ఇస్తున్న ఆతిథ్యం అంతా ఇంతా కాదు. ఈసారి ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. నేనే కాదు సగటు భారతీయ అభిమానులు.. నన్ను ఎలాగైనా దక్కించుకుని దాదాపు 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు ఈసారైనా ముగింపు పలికాలని కోరుకుంటున్నారు.జూన్ 2 నుంచి టీ20 ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్ నెదర్లాండ్ లాంటి చిన్నజట్టుతో అయినా.. జూన్ 9న పాకిస్థాన్‌తో గ్రూప్ స్టేజ్‌లో టీమ్ఇండియా తలపడనుంది. అయితే, ఆ ఒక్కసారే కాకుండా టైటిల్ పోరు దాయాదుల మధ్యే జరగాలని.. ఆ మ్యాచ్ వీక్షిస్తే అద్భుతంగా ఉంటుందేమో కదా!.చివరిసారిగా 2013లో ధోనీ నాయకత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీని భారత జట్టు కైవసం చేసుకుందట. గతేడాది వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరినప్పటికీ ప్చ్.. కప్‌ను అందుకోలేకపోయిందట. అందుకే ఈసారి నన్ను ఎలాగైనా దక్కించుకోవాలని భారత జట్టు సన్నద్ధం అయ్యింది. మిగతా జట్లకు చెప్పినట్లే టీమిండియాకు కూడా ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం.అన్నట్లు.. ఈరోజు పీయూష్ చావ్లాతో కలిసి తెలుగు మీడియా సంస్థ సాక్షి ఆఫీస్‌కు వచ్చా ఇవాళ. ఇక్కడ నన్ను చూసేందుకు ఉద్యోగులు ఉత్సాహం ప్రదర్శించారు. నాతో సెల్ఫీలు దిగారు. నన్ను తీసుకొచ్చిన వాళ్లతో సరదాగా ముచ్చటించారు. సాక్షిలో గడిపిన కాసేపు క్షణాలు ఎంతో బాగున్నాయి.C- కస్టమర్ ఫోకస్ (వినియోగదారునిపై దృష్టి)R - రెస్పెక్ట్ ఫర్ ఇండివిడ్యువల్ (ప్రతీ వ్యక్తికీ గౌరవం)I- ఇంటిగ్రిటీ (సమగ్రత)C- కమ్యూనిటీ కంట్రిబ్యూషన్ (సామాజిక సహకారం)K- నాలెడ్జ్ వర్షిప్ (జ్ఞాన ఆరాధన)E-ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ (వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణ)T- టీమ్వర్క్క్రికెట్లోని ప్రతీ అక్షరానికి ఒక అర్థం ఉంది. ఈ లక్షణాలన్నీ హుందాతనం కలిగిన వాళ్లలో కనిపిస్తాయి. అందుకే క్రికెట్‌ను జెంటిల్మన్ గేమ్ అంటారు. -
సాక్షి ఆఫీస్‌లో టీ20 ట్రోఫీ.. పీయూష్ చావ్లా సందడి (ఫొటోలు)
-
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్, టీమిండియా కెప్టెన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగడం సందేహాలకు తావిచ్చింది. ఐపీఎల్-2024 ఆరంభం నుంచి ముంబై తరఫున అన్ని మ్యాచ్‌లలోనూ మైదానంలోకి దిగాడు హిట్‌మ్యాన్.అయితే, కేకేఆర్‌తో మ్యాచ్‌లో మాత్రం అతడు ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో విశ్రాంతి తీసుకున్న రోహిత్.. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు వచ్చాడు.కానీ ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 12 బంతులు ఎదుర్కొని ఒక సిక్స్ సాయంతో 11 పరుగులు మాత్రమే చేసి.. సునిల్ నరైన్ బౌలింగ్‌లో మనీశ్ పాండేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.ఆందోళనలో అభిమానులుఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై సందేహాలు తలెత్తాయి. అసలే టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి సమయం దగ్గరపడుతున్న తరుణంలో కెప్టెన్ సాబ్‌కు ఏమైందంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. క్లారిటీ ఇచ్చిన చావ్లాఈ క్రమంలో ముంబై ఇండియన్స్ స్పిన్నర్ పీయూశ్ చావ్లా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘‘రోహిత్ తేలికపాటి వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది’’ అని రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపడానికి గల కారణం వెల్లడించాడు.అదే విధంగా.. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ వరుస వైఫల్యాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పేరు, ప్రఖ్యాతుల కోసం బరిలోకి దిగినపుడు.. పోరాటం కొనసాగిస్తూనే ఉండాలి. ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధిస్తామా లేదా అన్నది పక్కనపెడితే.. జట్టు ప్రయోజనాల కోసం ఆడటమే ఆటగాళ్ల ప్రథమ కర్తవ్యం’’ అని పీయూశ్ చావ్లా చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో ముంబై ఎనిమిది ఓడిపోయింది.ఇదిలా ఉంటే.. జూన్ 1 నుంచి మొదలుకానున్న టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు.. ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఇటు కెప్టెన్‌గా.. అటు ఆల్‌రౌండర్ పాండ్యా విఫలమవుతున్నా బీసీసీఐ అతడిపై నమ్మకం ఉంచింది. గతేడాది అక్టోబరు తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా.. ఐసీసీ టోర్నీలో ఏకంగా వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. -
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
టీమిండియా మాజీ క్రికెటర్, ముంబై ఇండియన్స్ వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా పీయూష్ చావ్లా రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో రింకూ సింగ్‌ను ఔట్ చేసిన చావ్లా.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటివరకు 189 మ్యాచ్‌లు ఆడిన చావ్లా.. 184 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు విండీస్ దిగ్గజం డ్వెన్ బ్రావో(183) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బ్రావో రికార్డును పీయూష్ బ్రేక్ చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఉన్నాడు. చాహల్ ఇప్పటివరకు 155 మ్యాచ్‌ల్లో 200 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 169 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(70) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మనీష్ పాండే(42) పరుగులతో రాణించాడు. ఇక ముంబై బౌలర్లలో తుషారా, బుమ్రా తలా 3 వికెట్లతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా రెండు, చావ్లా ఒక్క వికెట్ సాధించారు. -
'అశ్విన్ ఎంపికలో ఆశ్చర్యమేమీలేదు.. చెన్నైలో చుక్కలు చూపిస్తాడు'
వన్డే ప్రపంచకప్-2023కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఖారారు చేసింది. ఆఖరి నిమిషంలో గాయపడిన అక్షర్ పటేల్ స్ధానంలో అశ్విన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇది మినహా ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే అక్షర్ పటేల్ స్ధానంలో అశ్విన్‌ను ఎంపిక చేయడం పట్ల చాలా మంది మాజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ స్పిన్నర్, 2011 వరల్డ్‌కప్ విన్నర్ పీయూష్ చావ్లా తన అభిప్రాయాలను వెల్లడించాడు. అశ్విన్‌పై చావ్లా ప్రశంసల వర్షం కురిపించాడు. అశ్విన్‌కు బ్యాట్, బాల్‌తో రాణించగల సత్తా ఉందని చావ్లా కొనియాడాడు. అక్సర్‌కు అశ్విన్ సరైన ప్రత్యామ్నాయమని చావ్లా అభిప్రాయపడ్డాడు. "అక్షర్ పటేల్ స్ధానంలో అశ్విన్‌ను ఎంపిక చేసి మేనెజ్మెంట్ సరైన నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అశ్విన్‌కు ఉన్న అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. అశ్విన్ భారత పిచ్‌లపై మంచి ట్రాక్ రికార్డు ఉంది. అదే విధంగా అతడు బ్యాట్‌తో కూడా రాణించగలడు. అతడొక స్మార్ట్ క్రికెటర్. గత రెండేళ్లుగా వన్డేల్లో పెద్దగా ఆడకపోయినప్పటికీ అశ్విన్‌కు అపారమైన అనుభవం ఉంది. చెన్నై వేదికగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే చెన్నై వికెట్(పిచ్) పరిస్ధితులు అశ్విన్‌కు బాగా తెలుసు. కాబట్టి అతడికి కచ్చితంగా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కుతోంది" అని ఈఎస్పీఈన్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చావ్లా పేర్కొన్నాడు. చదవండి:World Cup 2023: అరుదైన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లి.. కపిల్ దేవ్, ధోని సరసన -
అతిపెద్ద పొరపాటు.. తప్పని భారీ మూల్యం.. కనీసం సింగిల్ తీసినా..
Afghanistan vs Sri Lanka: ఆసియా కప్-2023 నుంచి అఫ్గనిస్తాన్ నిష్క్రమించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓడి నిరాశగా ఇంటిబాట పట్టింది. గ్రూప్-బిలో ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో అఫ్గన్‌పై గెలిచిన దసున్ షనక బృందం సూపర్-4లో ఎంట్రీ ఇచ్చి ముందడుగు వేసింది. కచ్చితంగా సూపర్-4కి అర్హత సాధిస్తారనుకున్నాం ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ పీయూశ్ చావ్లా కీలక వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంక- అఫ్గన్ మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషిస్తూ.. ‘‘అఫ్గనిస్తాన్ బ్యాటింగ్ చూస్తే కచ్చితంగా వాళ్లు సూపర్-4కు అర్హత సాధిస్తారని అనిపించింది. కానీ.. ఎప్పుడైతే ముజీబ్ ఉర్ రహమాన్ వికెట్ కోల్పోయిందో.. ఫజల్హక్ ఫారూకీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అంతా తలకిందులైంది. అతడు కనీసం సింగిల్ తీయడానికి కూడా ప్రయత్నించలేదు. క్రీజులోకి వచ్చాడు.. అలా స్టక్ అయిపోయాడు. బహుశా.. కనీసం సింగిల్ అయినా తీయాలని ఎవరూ అతడికి చెప్పలేదేమో! ముజీబ్ అవుట్ కాకపోయినా.. ఫారూకీ సింగిల్ తీసినా.. తర్వాతి బంతికి రషీద్ ఖాన్ ఫోర్ బాది ఉంటే.. అఫ్గనిస్తాన్‌కు అనుకూలంగా ఫలితం వచ్చి ఉండేది. అతిపెద్ద పొరపాటు కానీ అలా జరుగలేదు. బహుశా.. ఇంకా తాము రేసులో ఉన్నామనే విషయాన్ని తెలిపే షీట్ మైదానంలో ఉన్న వాళ్లకు అంది ఉండదు. కీలక సమయంలో అఫ్గనిస్తాన్ చేసిన అతిపెద్ద పొరపాటు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో పీయూశ్ చావ్లా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా పాకిస్తాన్‌లోని లాహోర్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వన్‌డౌన్ బ్యాటర్, వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ 92 పరుగులతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గన్.. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా.. నాలుగో స్థానంలో వచ్చిన రహ్మత్ షా(45), కెప్టెన్ హష్మతుల్లా షాహిది(59), మహ్మద్ నబీ(65) ఇన్నింగ్స్‌తో గాడిన పడింది. ఆ విషయం తెలియదా? అయితే, రన్‌రేటు పరంగా వెనుకబడ్డ అఫ్గనిస్తాన్ 37.1 ఓవర్లలో టార్గెట్ ఛేదిస్తే సూపర్-4లో అడుగుపెట్టే అవకాశం. ఈ పరిస్థితుల్లో బ్యాటర్లంతా తలా ఓ చెయ్యి వేయగా.. 37 ఓవర్లలో స్కోరు 289 పరుగులకు చేరింది. మరో బంతికి ఇంకో 3 పరుగులు తీస్తే చాలు విజయం సాధిస్తామనగా.. ధనంజయ డిసిల్వా అఫ్గనిస్తాన్‌ను చావుదెబ్బ కొట్టాడు. అతడి బౌలింగ్‌లో 37.1వ ఓవర్ వద్ద ముజీబ్ ఉర్ రహమాన్ అవుట్ అయ్యాడు. అయినప్పటికీ అఫ్గనిస్తాన్ సాంకేతికంగా.. 37.3 ఓవర్లలో 294 పరుగులు, 37.4 ఓవర్లలో 295 పరుగులు సాధిస్తే.. క్వాలిఫై అయ్యే అవకాశం ముంగిట నిలవగా.. ధనుంజయ మళ్లీ దెబ్బేశాడు. సింగిల్ కూడా తీయకుండా బిగుసుకుపోయిన ఫారూకీని ఎల్బీ డబ్ల్యూ చేశాడు. దీంతో అఫ్గనిస్తాన్ ఆటగాళ్ల హృదయాలు ముక్కలయ్యాయి. చదవండి: అవును.. టీమిండియాలో నాకు చోటు లేదు.. ఇక: భువీ కీలక నిర్ణయం What a thrilling match! Sri Lanka secures a spot in the Super 4s with a heart-pounding 2-run victory over Afghanistan! 🇱🇰🇦🇫#AsiaCup2023 #AFGvSL pic.twitter.com/PxL53z217r — AsianCricketCouncil (@ACCMedia1) September 5, 2023 -
ఐపీఎల్ 2023లో అతి పెద్ద సర్ప్రైజ్ ఎవరు..?
ఐపీఎల్ 2023 సీజన్లో కొందరు వెటరన్లు అనూహ్యంగా సత్తా చాటారు. వీరిలో చాలా మంది తమ గతానికి భిన్నంగా రాణించి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. కొందరు తమ సహజ శైలికి భిన్నంగా రెచ్చిపోతే.. మరికొందరు తమ యుక్త వయసులో కూడా ప్రదర్శించని దూకుడును ప్రదర్శించి తమ జట్ల విజయాల్లో ప్రధాన పాత్ర పోషించారు. లేటు వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా అద్భుత ప్రదర్శనలు చేసిన ఆ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం. ఈ జాబితాలో ముందుంగా చెప్పుకోవాల్సింది గుజరాత్ పేసర్ మోహిత్ శర్మ పేరు. సరైన అవకాశాలు రాక, చాలాకాలంగా టీమిండియాతో పాటు ఐపీఎల్‌కు కూడా దూరంగా ఉండిన 34 ఏళ్ల మోహిత్‌ను ఈ ఏడాది వేలంలో గుజరాత్ టైటాన్స్ నామమాత్రపు 50 లక్షల ధరకు సొంతం చేసుకుంది. ఈ రైట్ ఆర్మ్ పేసర్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, ఈ సీజన్లో ఊహించిన దానికి మించి రాణిస్తున్నాడు. 13 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ముంబైతో జరిగిన క్వాలిఫయర్-2లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగి కెరీర్ అత్యుత్తమ గణాంకాలు (5/10) నమోదు చేశాడు. ఈ సీజన్‌కు ఇతనే అతి పెద్ద సర్ప్రైజ్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత అజింక్య రహానే.. 35 ఏళ్ల ఈ వెటరన్ బ్యాటర్‌ను సీఎస్కే ఈ ఏడాది వేలంలో కనీస ధర 50 లక్షలకు సొంతం చేసుకుంది. రహానే.. తనకు సరైన అవకాశాలు రావడం లేదన్న కసితో ఆడాడో ఏమో కానీ, అతని శైలికి భిన్నంగా రెచ్చిపోయి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి చెన్నై విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. రహానే ఈ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడి 169.89 స్ట్రయిక్ రేట్‌తో 2 అర్ధసెంచరీల సాయంతో 299 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన కారణంగా అతను టీమిండియాలో కూడా చోటు దక్కించుకున్నాడు. పియుశ్ చావ్లా.. 35 ఏళ్ల ఈ వెటరన్ స్పిన్నర్‌ను ఈ ఏడాది వేలంలో ముంబై ఇండియన్స్ 50 లక్షలకు సొంతం చేసుకుంది. అంతా అయిపోయిందనుకున్న దశలో ఐపీఎల్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పియుశ్.. అంచనాలకు మించి రాణించి, తన 15 ఏళ్ల ఐపీఎల్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా 16 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టి, ముంబై క్వాలిఫయర్-2 దశ వరకు చేరడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతను ఐపీఎల్లో అత్యధిక వికెట్లు (179) సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. వీరి తర్వాత చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేసిన వెటరన్లలో ఇషాంత్ శర్మ ఉన్నాడు. 35 ఏళ్ల ఈ వెటరన్ పేసర్‌ను ఈ ఏడాది వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ 50 లక్షలకు సొంతం చేసుకుంది. గత కొంతకాలంగా క్రికెట్‌కు పూర్తిగా దూరంగా ఉంటున్న ఇషాంత్.. ఈ సీజన్లో అనూహ్యంగా సత్తా చాటాడు. 8 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టి, ఓ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సైతం సొంతం చేసుకున్నాడు. ఇషాంత్ కూడా ఈ ఏడాది సర్ప్రైజ్ ఇచ్చిన ప్లేయరే అని చెప్పాలి. పై నలుగురు కాక ఈ ఐపీఎల్ సీజన్లో సర్ప్రైజ్ ప్లేయర్స్ జాబితాలో మరో ముగ్గురు వెటరన్లు ఉన్నారు. గుజరాత్.. విజయ్ శంకర్ (32 ఏళ్లు , 1.4 కోట్లు) (13 మ్యాచ్‌ల్లో 160.11 స్ట్రయిక్ రేట్‌తో 3 అర్ధ సెంచరీల సాయంతో 301 పరుగులు), రాజస్థాన్ రాయల్స్ సందీప్ శర్మ (12 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు), లక్నో అమిత్ మిశ్రా (41 ఏళ్లు, 50 లక్షలు) (7 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు). వీరు సైతం ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పై పేర్కొన్న ఆటగాళ్లలో దాదాపుగా అందరూ 50 లక్షల ధరకు, వివిధ జట్ల పంచన చేరిన వారే. మరి, మిమ్మల్ని ఈ ఏడాది అధికంగా సర్ప్రైజ్ చేసిన వెటరన్ ఆటగాడెవరో కామెంట్ రూపంలో తెలియజేయండి. చదవండి: కీలక మ్యాచ్‌ల్లో రోహిత్ రాణించడం ఎప్పుడు చూడలేదు.. అతనో ఫెయిల్యూర్...! -
అనుభవం ముందు పనికిరాలేదు.. తెలివైన బంతితో బోల్తా
ఐపీఎల్ 16వ సీజన్లో క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. కాగా గుజరాత్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను పియూష్ చావ్లాను తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. వేసింది వైడ్ బాల్ అయినప్పటికి సాహా ప్రంట్ఫుట్ వచ్చేలా ఊరించే బంతి వేయడం ఫలితాన్ని ఇచ్చింది. సాహా మిస్ చేయడంతో బంతిని అందుకున్న ఇషాన్ కిషన్ రెప్పపాటులో వికెట్లను గిరాటేయగా సాహా స్టంప్ఔట్ గా వెనుదిరిగాడు. దీంతో అనుభవం ముందు సాహా బ్యాటింగ్ పనికిరానట్లయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Mumbai was desperate for a wicket, and Piyush Chawla delivered in his very first over. What an underrated performer for Mumbai this season. Just incredible. #GTvsMI #IPL2023 pic.twitter.com/3ldhhAlZyz — Ridhima Pathak (@PathakRidhima) May 26, 2023 చదవండి: 'ఈసారి కప్ మనదే'.. రోహిత్ శర్మ సిగ్నల్! -
CSK VS MI: లేటు వయసులోనూ ఇరగదీస్తున్న పియూష్ చావ్లా.. మూడో స్థానానికి..!
ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ముంబై ఇండియన్స్ బౌలర్ పియూష్ చావ్లా మూడో స్థానానికి ఎగబాకాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇవాళ (మే 6, మధ్యాహ్నం 3:30 గంటలకు) జరుగుతున్న మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన చావ్లా.. సహచర వెటరన్, లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను వెనక్కు నెట్టి టాప్-3లోకి చేరాడు. ప్రస్తుతం పియూష్ ఖాతాలో 173 వికెట్లు ఉన్నాయి. ఈ జాబితాలో డ్వేన్ బ్రావో (183) టాప్‌లో ఉండగా.. రాజస్థాన్ స్పిన్నర్ చహల్ రెండులో.. పియూష్, అమిత్ మిశ్రా (172), మలింగ (170), అశ్విన్ (170) వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో ఉన్నారు. కాగా, ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిధ్య సీఎస్కే గెలుపు దిశగా సాగుతోంది. ఆ జట్టు మరో 17 పరుగులు చేస్తే (15 ఓవర్లలో 123/3) సీజన్లో ఆరో విజయాన్ని నమోదు చేస్తుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. సీఎస్కే బౌలర్లు పతిరణ (4-0-15-3), దీపక్ చాహర్ (3-0-18-2), తుషార్ దేశ్‌పాండే (4-0-26-2) విజృంభించడంతో 139 పరుగులకే పరిమితమైంది. ముంబై ఇన్నింగ్స్‌లో నేహల్ వధేరా (64) ఒక్కడే రాణించాడు. అనంతరం 140 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కేకు ఓపెనర్లు డెవాన్ కాన్వే (41నాటౌట్), శివమ్ దూబే (16 నాటౌట్) విజయం దిశగా నడిపిస్తున్నారు. రుతురాజ్ (30), రహానే (21), రాయుడు (12) ఔటయ్యారు. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా 2, ట్రిస్టన్ స్టబ్స్‌కు ఓ వికెట్ దక్కింది. చదవండి: రోహిత్ డకౌట్ వెనుక ధోని మాస్టర్‌మైండ్! -
'అర్జున్ను తిడుతున్నావా? చావ్లా విషయంలో నువ్వు చేసిందేంటి!'
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 55 పరుగుల తేడాతో ఓటమిపాలై 2017 తర్వాత అత్యంత పెద్ద ఓటమిని మూటగట్టుకుంది. నెహల్ వదేరా 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చావ్లాను బలిచేసిన నెహల్ వదేరా.. అయితే మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన నెహర్ వదేరా చేసిన ఒక తప్పిదం చర్చనీయాంశంగా మారింది. తాను బ్యాటింగ్ చేయడం కోసం లేని పరుగు కోసం యత్నించి పియూష్ చావ్లాను రనౌట్ చేశాడు. ఆ తర్వాత అర్జున్ టెండూల్కర్ సింగిల్ తీయడానికి ప్రయత్నిస్తే అతనిపై అసహనం వ్యక్తం చేయడం ఆసక్తిగా మారింది. విషయంలోకి వెళితే.. 18వ ఓవర్లో మోహిత్ శర్మ వేసిన తొలి బంతిని పియూష్ చావ్లా మిస్ చేయడంతో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా బంతిని అందుకున్నాడు. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న నెహాల్ వదేరా వేగంగా పరిగెత్తుకొచ్చాడు. బంతి మిస్ అయిందని తెలిసినా కూడా పరిగెత్తుకురావడం పియూష్ చావ్లాను ఆశ్చర్యానికి గురి చేసింది. (Virat Kohli: చరిత్రకెక్కిన కోహ్లి.. 580 రోజుల తర్వాత) Photo: IPL Twitter అంతటితో ఆగక చావ్లాను క్రీజు వదలమని సంకేతం ఇచ్చాడు. చివరికి చేసేదేం లేక చావ్లా వదేరా కోసం క్రీజు నుంచి బయటకు వచ్చి పరిగెత్తాడు. కానీ అప్పటికే సాహా మోహిత్‌కు బంతి ఇవ్వడం.. ఆలస్యం చేయకుండా వికెట్లను ఎగురగొట్టడంతో చావ్లా రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత బంతిని నెహాల్ వదేరా డీప్స్వ్కేర్లెగ్ దిశగా ఆడాడు. అర్జున్‌పై అసహనం నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న అర్జున్ సింగిల్ కోసం పరిగెత్తుకొచ్చాడు. తన వద్దే స్ట్రైక్ ఉంచుకోవాలని భావించిన వదేరా తొలుత సింగిల్ తీయడానికి ఇష్టపడలేదు. కానీ అర్జున్ అప్పటికే సగం క్రీజు దాటడంతో చేసేదేంలేక సింగిల్ పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఎందుకు పరిగెత్తుకొచ్చావ్ అంటూ అర్జున్‌పై అసహనం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ తర్వాత బంతికి అర్జున్ సింగిల్ తీసి వదేరాకు స్ట్రైక్ ఇవ్వగా.. ఫిఫ్టీ పూర్తి చేయకుండానే వదేరా.. మోహిత్ శర్మ బౌలింగ్‌లో షమీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. (సెంచరీలతో విధ్వంసం.. పసికూనపై లంక ఓపెనర్ల ప్రతాపం) కాగా నెహల్ వదేరాపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''అర్జున్ సింగిల్ తీయడానికి ప్రయత్నించాడని తిడుతున్నావా.. మరి పియూష్ చావ్లా విషయంలో నువ్వు చేసిందేంటి''.. ''సిగ్గుండాలి.. ఫిఫ్టీ కోసం చావ్లాను బలిచేశావు.. పైగా అర్జున్‌ని తిడుతున్నావు''.. ''ఒక రకంగా నీవల్లే ముంబై ఓడింది '' అంటూ కామెంట్ చేశారు. Nehal Wadhera gets frustrated after immature run by Arjun Tendulkar. He was saying 'No' but Arjun covered 70% pitch already. #NehalWadhera #GTvsMI pic.twitter.com/VAPip85lyF — Vikram Rajput (@iVikramRajput) April 25, 2023 -
టెండుల్కర పై పగ తీర్చుకునే రోహిత్ శర్మ
-
SRH VS MI: ముంబై ఇండియన్స్ బౌలర్ చెత్త రికార్డు.. వికెట్లు తీశాడనే కానీ..!
ఐపీఎల్-2023లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ పియూష్ చావ్లా ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌల్ చేసిన చావ్లా.. తన స్పెల్ ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లు సమర్పించుకోవడంతో, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్‌గా అన్ వాంటెడ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: 14 ఏళ్ల కిందట తండ్రికి ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న అర్జున్ టెండూల్కర్ క్యాష్ రిచ్ లీగ్‌లో 170 మ్యాచ్‌లు ఆడిన చావ్లా.. రికార్డు స్థాయిలో 185 సిక్సర్లు సమర్పించుకున్నాడు. ఐపీఎల్లో మరే ఇతర బౌలర్ ఇన్ని సిక్సర్లు ఇవ్వలేదు. చావ్లా తర్వాత రాజస్థాన్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ 182 సిక్సర్లు, సీఎస్కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (180), లక్నో స్పిన్నర్ అమిత్ మిశ్రా (176), రాజస్థాన్ ఆల్‌రౌండర్ అశ్విన్ (173) అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న వారిలో ఉన్నారు. కాగా, సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో చావ్లా ధారాళంగా పరుగులు (4-0-43-2) సమర్పించుకున్నప్పటికీ ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. కెమారూన్ గ్రీన్ (64 నాటౌట్), తిలక్ వర్మ (37) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో మరో బంతి మిగిలుండగానే 178 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ (48), హెన్రిచ్ క్లాసెన్ (36) ఓ మోస్తరుగా రాణించగా.. ముంబై బౌలర్లు పరుగులు సమర్పించుకున్నప్పటికీ మూకుమ్మడిగా సత్తా చాటారు. చదవండి: IPL 2023: ఫిక్సింగ్ కలకలం.. సిరాజ్‌కు అజ్ఞాత వ్యక్తి నుంచి కాల్! అతడెవరో కాదు.. -
క్రికెటర్ పియూష్ చావ్లా ఇంట విషాదం
న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ బౌలర్, ముంబై ఇండియన్స్ క్రికెటర్ పీయూష్ చావ్లా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి ప్రమోద్ కుమార్ చావ్లా కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన, సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని పీయూష్ చావ్లా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తన తండ్రి ఫొటోను ఇందుకు జత చేసిన పీయూష్.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాల్సిందిగా కోరాడు. ‘‘ఆయన లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టం. పరిస్థితులు ఇంతకు ముందులా ఉండబోవు. నా అండను కోల్పోయాను’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా టీ20 వరల్డ్ కప్-2007, వన్డే వరల్డ్ కప్-2011 టీమిండియాలో సభ్యుడైన పియూష్.. ఐపీఎల్లో తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, ఈ ఏడాది మినీ వేలంలో భాగంగా ముంబై ఇండియన్స్ 2.40 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ స్పిన్నర్‌ను సొంతం చేసుకుంది. కానీ, ఈ సీజన్లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. ఇక కరోనా విజృంభణ నేపథ్యంలో ఐపీఎల్-2021 నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. రైనా సంతాపం పియూష్ చావ్లా తండ్రి మృతి పట్ల చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా సంతాపం ప్రకటించాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాడు. ఇక ముంబై ఇండియన్స్ సైతం.. ‘ ఈ విషాదకరమైన సమయంలో తనకు, తన కుటుంబానికి మా పూర్తి మద్దతు ఉంటుంది’’ అని ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. చదవండి: చేతన్ సకారియా ఇంట మరో విషాదం Our thoughts go out to Piyush Chawla who lost his father, Mr. Pramod Kumar Chawla this morning. We are with you and your family in this difficult time. Stay strong. pic.twitter.com/81BJBfkzyv — Mumbai Indians (@mipaltan) May 10, 2021 -
అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నాం.. గెలుపు మాదే!
ముంబై: వెటరన్ బౌలర్ పియూష్ చావ్లా వంటి అనువజ్ఞుడైన ఆటగాడు తమ జట్టులో ఉండటం ఎంతో ప్రయోజనకరమని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టుకు బలంగా నిలుస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. కాగా గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించిన పియూష్ చావ్లాను మినీ వేలం-2021లో భాగంగా ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 2.40 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ స్పిన్నర్‌ను సొంతం చేసుకుంది. అయితే, అప్పటికే జట్టులో రాహుల్ చహర్, జయంత్ యాదవ్, కృనాల్ పాండ్యా వంటి బౌలర్లు ఉండగా, పియూష్ కోసం పెద్ద మొత్తం వెచ్చించడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పీయూశ్ చావ్లా(ఫొటో కర్టెసీ: బీసీసీఐ) ఇక మరికొన్ని గంటల్లో ఆర్సీబీతో తొలి మ్యాచ్ ఆడనున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ పరిణామాలపై స్పందిస్తూ.. ‘‘గత కొన్నేళ్లుగా పియూష్ ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. అతడికి కొండంత అనుభవం ఉంది. తన నుంచి జట్టు ఏం కోరుకుంటుందో అతడికి బాగా తెలుసు. కచ్చితంగా అంచనాలను అందుకుంటాడనే భావిస్తున్నా. ఐపీఎల్లో ఇంతవరకు తను ఎన్నో వికెట్లు కూల్చాడు. తన చేరికతో మా జట్టు మరింత విలక్షణంగా మారింది. నిజానికి అండర్-19 జట్టులో పియూష్తో కలిసి ఆడాను. కాబట్టి తన గురించి నాకు బాగా తెలుసు. మా మధ్య ఉన్న స్నేహం మైదానంలోనూ ప్రస్ఫుటిస్తుంది’’ అంటూ పియూష్ ను జట్టులోకి తీసుకోవడం వెనుక ఉన్న కారణాల గురించి చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ(ఫొటో కర్టెసీ: ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా) ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు 164 మ్యాచ్‌లు ఆడిన పియూష్ చావ్లా 7.87 ఎకానమీతో 156 వికెట్లు తీశాడు. కాగా నేడు ఎంఐ- ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ విషయం గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. జట్టులో కొత్త ఆటగాళ్లు చేరానని, తొలి మ్యాచ్ ఆడేందుకు ఆటగాళ్లంతా ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చాడు. దుబాయ్ ఫలితాలే పునరావృతం చేస్తామంటూ ఈసారి కూడా టైటిల్ తమదేనన్న విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా ముంబై ఇప్పటివరకు ఐదుసార్లు విజేతగా నిలిచింది. చదవండి: గా ముంబైల అందరు బ్యాట్స్మెన్లే.. ఎందర్నని ఔట్ జేయాల్రా! IPL 2021: ఈ ఆటగాళ్లకు ఇదే చివరి సీజన్ కాబోతోందా?! "Looking forward to get going!" 💪💙#KhelTakaTak #OneFamily #MumbaiIndians #MI #IPL2021 @ImRo45 pic.twitter.com/yS6IQtzxks — Mumbai Indians (@mipaltan) April 9, 2021 -
రాంచీలో ధోని ఏదో చేశాడు.. లేకపోతే ఎలా?
న్యూఢిల్లీ: గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్ తర్వాత ఎంఎస్ ధోని ఎక్కడ కూడా క్రికెట్ మ్యాచ్ ఆడలేదు. కేవలం ప్రాక్టీస్ వరకూ పరిమితమైన ధోని.. భారత జట్టుకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ధోని రిటైర్మెంట్పై ఊహాగానాలకు తెరలేచాయి. అయితే వాటిపై ధోని నుంచి ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోగా, ఐపీఎల్ ఆడటమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేశాడు కూడా. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం మార్చి 29వ తేదీన ఐపీఎల్ ఆరంభం కావాల్సి ఉండగా ధోని నెల ముందుగానే బ్యాటింగ్ ప్రాక్టీస్ ఆరంభించాడు. సీఎస్కే సన్నాహకంలో భాగంగా ఆటగాళ్లతో కలిసి ధోని ముమ్మర ప్రాక్టీస్ చేశాడు. అయితే కరోనా వైరస్ కారణంగా మొత్తం అంతా అస్తవ్యస్తం కావడంతో ఐపీఎల్ వాయిదాలు పడుతూ వస్తుంది. ఇప్పటికైతే ఐపీఎల్‌పై ఎటువంటి స్పష్టత లేకపోయినప్పటికీ, జరుగుతుందనే ఆశ మాత్రం ఉంది. టీ20 వరల్డ్‌కప్ వాయిదాకే ఐసీసీ మొగ్గుచూపిన క్రమంలో ఐపీఎల్‌పై ఆశలు చిగురించాయి. (‘ఈ ఏడాది ఐపీఎల్లో నాకు చాన్స్ ఉంది’) ఇదిలా ఉంచితే, ధోని నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ గురించి సహచర ఆటగాడు, స్పిన్నర్ పీయూష్ చావ్లా కొన్ని సందేహాలు వ్యక్తం చేశాడు. ప్రధానంగా నెట్స్‌లో ధోని హిట్టింగ్ చేయడంపై చావ్లా విశ్లేషించాడు. మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రాతో యూట్యూబ్ చానెల్లో ముచ్చటించాడు. ఈ క్రమంలోనే రాంచీలో ధోని ఏదో చేశాడనే అనుమానం వ్యక్తం చేశాడు చావ్లా. ‘ ఒక సుదీర్ఘమైన బ్రేక్ తర్వాత ధోని నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన తీరుతో ఆశ్చర్యపోయా. నిజాయితీగా చెప్పాలంటే ఎప్పటి మాదిరిగానే బంతుల్ని హిట్ చేశాడు. ఒక ఐదు-ఆరు బంతుల్ని చూసేవాడు.. ఆ తర్వాత భారీ షాట్లు ఆడేవాడు. ధోని ఏదో(మనకు ఎవరు తెలియకుండా)చేసి ఉంటేనే ఈ తరహా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం సాధ్యం. రాంచీ(ధోని స్వస్థలం)లో ఏదో చేసి ఉండాలి. లేకపోతే అంతటి భారీ షాట్లు ఆడటం కష్టం. ఎటువంటి అలసటా లేకుండా నిర్విరామంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. ఆ క్యాంపులో కొద్ది మంది మాత్రమే క్రికెటర్లు ఉన్నాం. రైనా, రాయుడు, ధోని భాయ్ ఇలా కొద్ది మందితో మాత్రమే శిక్షణా శిబిరంలో ప్రాక్టీస్ చేసే వాళ్లం. ప్రతీ బ్యాట్స్‌మన్ 200 నుంచి 250 బంతులు ప్రాక్టీస్ చేసేవారు. కనీసం రెండున్నర గంటలు విరామం లేకుండా ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యేవారు’అని సీఎస్కే స్పిన్నర్ చావ్లా తెలిపాడు. -
ఐపీఎల్: సింగిల్ హ్యాండ్ చావ్లా
కోల్‌కతా : ఐపీఎల్-11 సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ పీయూష్ చావ్లా సింగిల్ హ్యాండ్ క్యాచ్‌తో అదరగొట్టాడు. క్రీజులో పాతుకుపోతున్న ఓపెనర్, కీలక బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠి వికెట్ పడగొట్టాడు. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఓపెనర్లు అజింక్యా రహానే, రాహుల్ త్రిపాఠిలు ఇన్నింగ్స్‌ను దాటిగా ఆరంభించారు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడిని చావ్లా అద్భుత బంతితో విడదీశాడు. చావ్లా వేసిన 5 ఓవర్ తొలిబంతిని త్రిపాఠి డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి అనూహ్యంగా గాల్లోకి లేచింది. అంతే వేగంతో చావ్లా ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. దీంతో రిటర్న్ క్యాచ్ త్రిపాఠి(20: 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) పెవిలియన్ చేరాడు. ఇక బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో త్రిపాఠి హాఫ్ సెంచరీతో రాణించిన విషయం తెలిసిందే. -
‘ఒత్తిడిలో కుల్దీప్’
కోల్‌కతా : వన్డేల్లో మంచి ఫామ్ కొనసాగిస్తున్న కుల్దీప్ యాదవ్‌పై ఐపీఎల్-11లో భారీ అంచనాలు ఉంటాయని టీమిండియా లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా అభిప్రాయపడ్డారు. కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కుల్దీప్పై భారీ అంచానాలు ఉన్నందున కొంత ఒత్తిడికి గురికావాల్సిన ఉంటుందని, ఒత్తిడిలో కూడా రాణించగల సత్తా అతనికి ఉందని యాదవ్ పై ప్రశంశల జల్లు కురిపించారు. కుల్దీప్ కేకేఆర్‌కు ఆడటంతో మా బౌలింగ్ బలం మరింత దృఢంగా మారిందన్నారు. వన్డేల్లో మాదిరిగానే ఐపీఎల్లో కూడా వికెట్స్ తీయగల సత్తా కుల్దీప్కు ఉందని, తనతో కలిసి ఆడటం ఆశ్వాదిస్తానని తెలిపారు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆరు మ్యాచ్‌ల్లో 17 వికెట్స్‌తో బౌలర్ల జాబితాలో కుల్దీప్ మొదటి స్థానంలో నిలవగా, గత కొంత కాలంగా వన్డేలో టీమిండియా తరుఫున అద్భుతంగా రాణిస్తున్న నేపథ్యంలో పీయూష్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా నిడహాస్ ట్రోఫీ మ్యాచ్ హీరో దినేష్ కార్తీక్ ప్రాతినిథ్యం వహిస్తున్న కేకేఆర్‌కు పీయూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, సునీల్ నరేన్‌తో కూడిన స్పిన్ విభాగం బలంగా ఉందన్నారు. కాగా కేకేఆర్ తన మొదటి మ్యాచ్‌ను ఏప్రిల్ 8న కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్లో బెంగుళూర్ రాయల్ చాలెంజర్స్‌తో పోటి పడనుంది. చావ్లా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన టీంలో సభ్యుడు, దేశవాళీ క్రికెట్లో రాణిస్తూ, ఐపీఎల్లో కేకేఆర్కే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
వారికి ఈడెన్ 'వికెట్' అనుకూలించింది!
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆదివారం గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ జట్టు ఓటమి పాలు కావడానికి ఈడెన్ గార్డె న్ వికెట్ తాజాగా ఉండటమే ప్రధాన కారణమని కోల్ కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ పీయూష్ చావ్లా అభిప్రాయపడ్డాడు. అంతకుముందు రాత్రి వర్షం పడటం వల్ల వికెట్ కొత్తదనాన్ని సంతరించుకుని గుజరాత్‌కు లాభించిందన్నాడు. ఆ వికెట్ పై టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేయడంతో తాము కష్టాల్లో పడినట్లు చావ్లా తెలిపాడు. తమ జట్టు 24 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరును నమోదు చేయలేకపోయామన్నాడు. 'వికెట్ తాజాగా ఉంది. అందుచేత ఫస్ట్ బ్యాటింగ్ మాకు అనుకూలించలేదు. మ్యాచ్ ఆరంభంలోనే కొన్ని కీలక వికెట్లును చేజార్చుకుని ఇబ్బందుల్లో పడ్డాం. ఆపై తేరుకుని గౌరవప్రదమైన స్కోరును చేయడం నిజంగా అభినందనీయమే. మా ఓటమికి చాలా కారణాలున్నా, కొన్ని సందర్భాల్లో చివరి ఓవర్లలో బౌలింగ్ కూడా సరిగా లేదు. గత పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మా లక్ష్యాన్ని కాపాడుకుని స్వల్ప తేడాతో గెలిచాం. అన్నిసార్లూ పరిస్థితి ఒకేలా ఉండదు. ఇది టీ 20 ఫార్మాట్ కావడంతో బంతికి ఒక పరుగు సాధించడం కష్ట సాధ్యమేమీ కాదు' అని పీయూష్ తెలిపాడు. -
ఓ ఇంటివాడైన పీయూష్ చావ్లా
మొరాదాబాద్: భారత లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలైన అనుభూతి చౌహాన్‌ను శుక్రవారం రాత్రి పెళ్లాడాడు. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, క్రికెట్ సహచరులు ఇర్ఫాన్ పఠాన్, భువనేశ్వర్ కుమార్, జ్ఞానేంద్ర పాండే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంబీఏ చదివిన అనుభూతి కుటుంబం గతంలో చావ్లా ఇంటి పక్కనే ఉండేది. దీంతో ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం పెళ్లికి దారితీసింది. అనుభూతి తండ్రి డాక్టర్ అమర్ సింగ్ చౌహాన్ ప్రస్తుతం మీరట్‌లో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. భారత మాజీ కెప్టెన్, స్థానిక ఎంపీ మహమ్మద్ అజహరుద్దీన్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించినా.. కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు.