
టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఇటీవల స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కెప్టెన్ అయ్యాక కోహ్లి ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి అని ఓ ఇంటర్వ్యూలో మిశ్రా సంచలన కామెంట్స్ చేశాడు.
తాజాగా ఇదే విషయంపై అమిత్ మిశ్రాకు మరో వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా పరోక్షంగా కౌంటరిచ్చాడు. కోహ్లితో తనకు మంచి అనుబంధం ఉందని, అతడిలో ఎటువంటి మార్పు రాలేదు అని చావ్లా చెప్పుకొచ్చాడు.
"విరాట్ నాకు మంచి స్నేహితుడు. మేమిద్దరం కలిసి జానియర్ స్ధాయిలో క్రికెట్ ఆడాము. ఆ తర్వాత ఐపీఎల్, భారత జట్టుకు కూడా మేము కలిసి ఆడాము. అతడి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా కోహ్లి అలానే ఉన్నాడు.
ఎక్కడ కలిసినా కూడా అంతే ప్రేమ, అభిమానాన్ని చూపిస్తాడు. మేమిద్దరం భోజన ప్రియులం. గతేడాది ఆసియాకప్‌లో కామెంటేటర్‌గా వ్యవహరించినప్పుడు నేను విరాట్ బ్రేక్ సమయంలో కలుసుకున్నాము.
అతడు నాదగ్గరకు వచ్చి మనద్దరికి మంచి ఫుడ్ ఆర్డర్ చేయమని చెప్పాడు. నేను అందుకు నవ్వతూ సరే అన్నానని" శుభమన్ గౌర్ అనే యూట్యాబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చావ్లా పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment