amit mishra
-
'కోహ్లిలో ఏ మార్పు లేదు.. మేమిద్దరం మంచి స్నేహితులం'
టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఇటీవల స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కెప్టెన్ అయ్యాక కోహ్లి ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి అని ఓ ఇంటర్వ్యూలో మిశ్రా సంచలన కామెంట్స్ చేశాడు.తాజాగా ఇదే విషయంపై అమిత్ మిశ్రాకు మరో వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా పరోక్షంగా కౌంటరిచ్చాడు. కోహ్లితో తనకు మంచి అనుబంధం ఉందని, అతడిలో ఎటువంటి మార్పు రాలేదు అని చావ్లా చెప్పుకొచ్చాడు."విరాట్ నాకు మంచి స్నేహితుడు. మేమిద్దరం కలిసి జానియర్ స్ధాయిలో క్రికెట్ ఆడాము. ఆ తర్వాత ఐపీఎల్, భారత జట్టుకు కూడా మేము కలిసి ఆడాము. అతడి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా కోహ్లి అలానే ఉన్నాడు. ఎక్కడ కలిసినా కూడా అంతే ప్రేమ, అభిమానాన్ని చూపిస్తాడు. మేమిద్దరం భోజన ప్రియులం. గతేడాది ఆసియాకప్‌లో కామెంటేటర్‌గా వ్యవహరించినప్పుడు నేను విరాట్ బ్రేక్ సమయంలో కలుసుకున్నాము.అతడు నాదగ్గరకు వచ్చి మనద్దరికి మంచి ఫుడ్ ఆర్డర్ చేయమని చెప్పాడు. నేను అందుకు నవ్వతూ సరే అన్నానని" శుభమన్ గౌర్ అనే యూట్యాబర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చావ్లా పేర్కొన్నాడు. -
‘సంజూకు వయసు మీద పడింది.. జట్టులో చోటు కష్టమే’
సంజూ శాంసన్.. ఈ టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్‌కు అంతర్జాతీయ క్రికెట్లో తగినన్ని అవకాశాలు రావడం లేదనేది అతడి అభిమానుల వాదన. ప్రతిభ ఉన్నా ఈ కేరళ ఆటగాడి పట్ల సెలక్టర్లు వివక్ష చూపుతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బీసీసీఐని ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి.అందుకు తగ్గట్లుగానే వన్డే ప్రపంచకప్-2023 సమయంలో మెరుగైన గణాంకాలున్న సంజూను కాదని.. టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌కు జట్టులో చోటు ఇచ్చారు. అందుకు తగ్గ మూల్యం కూడా చెల్లించారు. ఈ టోర్నీలో సూర్య పూర్తిగా తేలిపోవడంతో జట్టు యాజమాన్యం విమర్శలపాలైంది. ఈ క్రమంలో ఐపీఎల్-2024 రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా, వికెట్ కీపర్ బ్యాటర్‌గా సత్తా చాటిన సంజూ ఎట్టకేలకు.. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కించుకోగలిగాడు.అయితే, రిషభ్ పంత్ రూపంలో గట్టి పోటీ ఎదురుకావడంతో అతడు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అనంతరం జింబాబ్వే పర్యటనలో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన సంజూకు.. తదుపరి శ్రీలంక టూర్‌కు వెళ్లబోయే జట్టులో చోటు దక్కుతుందో లేదోనన్నది ఆసక్తికరంగా మారింది. వయసు మీద పడింది.. జట్టులో చోటు కష్టమేఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సంజూ శాంసన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. శుభంకర్ మిశ్రా యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో అమిత్ మిశ్రా టీ20 ప్రపంచకప్-2026 జట్టులో సంజూకు చోటు దక్కకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ‘‘అతడు మరో వరల్డ్‌కప్ ఆడతాడని నేను అనుకోవడం లేదు. ఇప్పటికే అతడికి వయసు మీద పడింది. టీ20 జట్టులో యువ ఆటగాళ్లకే పెద్ద పీట వేస్తామనే సంప్రదాయాన్ని విరాట్ కోహ్లి ప్రవేశపెట్టాడు.వాళ్లే బాగా ఆడతారని అతడి నమ్మకం. అయితే, తనకు 35 ఏళ్లు వచ్చినా కోహ్లి ఆడాడనుకోండి. అది వేరే విషయం. ఒకవేళ శాంసన్ గనుక టీ20 జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకోవాలంటే అత్యద్భుతంగా ఆడాలి.వారి నుంచి తీవ్రమైన పోటీఅలా అయితే, రెండేళ్ల తర్వాత జరిగే ప్రపంచకప్ జట్టులో అతడికి చోటు దక్కుతుంది. లేదంటే కష్టమే. నిజానికి ఇషాన్ కిషన్ అత్యంత ప్రతిభ ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్.కానీ అతడిని టీ20ల నుంచి పక్కనపెట్టేశారు. ఇక రిషభ్ పంత్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? అతడొక అత్యుత్తమ ప్లేయర్. ధ్రువ్ జురెల్, జితేశ్ శర్మ.. ఇలా వికెట్ కీపర్ల లిస్టు పెద్దగానే ఉంది. కాబట్టి సంజూ శ్రమించక తప్పదు’’ అని అమిత్ మిశ్రా పేర్కొన్నాడు.కాగా 29 ఏళ్ల సంజూ శాంసన్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 16 వన్డేలు ఆడి 510 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 28 అంతర్జాతీయ టీ20లలో సంజూ 444 రన్స్ సాధించాడు. చదవండి: హార్దిక్ పాండ్యాకు షాక్!.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా అతడే! -
టీమిండియా కెప్టెన్‌గా అతడు పనికిరాడు: భారత క్రికెటర్
జింబాబ్వే పర్యటనను శబ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఘనంగా ముగించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో తేడాతో భారత్ సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత టీమిండియా దెబ్బ తిన్న సింహంలా గర్జించింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఆతిథ్య జట్టును భారత్ చిత్తు చేసింది. తొలిసారి భారత జట్టు పగ్గాలను చేపట్టిన శుబ్‌మన్ గిల్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సిరీస్‌లో గిల్ కెప్టెన్సీ, వ్యక్తిగత ప్రదర్శన పరంగా ఆకట్టుకున్నాడు. అయితే శుబ్‌మన్ గిల్‌ను అందరూ ప్రశంసిస్తుంటే.. భారత వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా మాత్రం ఘాటు వ్యాఖ్యలు చేశాడు.గిల్ కెప్టెన్‌గా పనికిరాడని, అస్సలు నాయకత్వ లక్షణాలు లేవని మిశ్రా తెలిపాడు. మిశ్రా తాజాగా శుభాంకర్ మిశ్రా అనే యూట్యూబర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో టీమిండియాకు ఫ్యూచర్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ని ఎంపిక చేస్తారా అన్న ప్రశ్న మిశ్రాకు ఎదురైంది."భారత్ ఫ్యూచర్ కెప్టెన్‌గా గిల్‌ను అస్సలు నేను ఎంపిక చేయను. అతడికి అస్సలు కెప్టెన్సీ స్కిల్స్ లేవు. ఐపీఎల్‌లోనే అతడి నాయకత్వాన్ని చూశాను. అతనికి కెప్టెన్సీ ఎలా చేయాలో తెలియదని" మిశ్రా బదులిచ్చాడు. కాగా ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన గిల్.. తన జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చడంలో విఫలమయ్యాడు. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించి లీగ్ స్టేజ్‌లోనే నిష్క్రమించింది. -
'కెప్టెన్ అయ్యాక కోహ్లి చాలా మారిపోయాడు.. కానీ రోహిత్ అలా కాదు'
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి భారత మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ అయినా తర్వాత విరాట్ ప్రవర్తనా విధానంలో తేడా వచ్చిందని మిశ్రా తెలిపాడు.ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లి మధ్య ఎంతో తేడా ఉందని మిశ్రా అభిప్రాయపడ్డాడు. మిశ్రా తాజాగా శుభాంకర్ మిశ్రా అనే యూట్యూబర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో కోహ్లి, రోహిత్లో ఎవరు బెస్ట్ కెప్టెన్ ? ఎవరికి జట్టులో స్నేహితులు ఎక్కువ? అనే ప్రశ్నలు మిశ్రాకు ఎదురయ్యాయి."నేను అబద్దం చెప్పను. ఒక క్రికెటర్‌గా విరాట్‌ని నేను చాలా గౌరవిస్తాను. కానీ కోహ్లి కెప్టెన్ అయ్యాక అతడిలో చాలా మార్పులు వచ్చాయి. అందుకే గతంలో అతనితో ఉన్నట్లు ఇప్పుడు ఉండటం లేదు. దాదాపుగా మాట్లాడటం మానేశాను.కోహ్లికి ఒక ఫేమ్ వచ్చాక వచ్చాక పూర్తిగా మారిపోయాడు. అందుకే అతడికి జట్టులో స్నేహితులు తక్కువ. మనకు కీర్తి, డబ్బు వచ్చింది కాబట్టి, ఎవరైనా ఏదో ప్రయోజనం ఆశించే మన దగ్గరకు వస్తారని కొందరు అనుకుంటారు.కానీ నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. అయితే రోహిత్ శర్మకు విరాట్‌కు చాలా తేడా ఉంది. విరాట్, రోహిత్ స్వభావాలు వేరు. రోహిత్ గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రోహిత్‌ను మొదటి రోజు కలిసినప్పిడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. నేను కొన్నేళ్లుగా భారత జట్టులో భాగం కాలేదు. కానీ ఇప్పటకీ నేను రోహిత్‌ను ఐపీఎల్లో లేదా మరేదైనా ఈవెంట్లో కలిసినప్పుడు అతడు చాలా సరదగా మాట్లాడుతుంటాడు. భారత జట్టు కెప్టెన్ అయినా నాతో స్నేహంగా మెలిగి జోక్‌లు వేసేవాడు. రోహిత్ ఇప్పుడు వరల్డ్‌లోనే నెం1 కెప్టెన్. వరల్డ్ కప్ విజేత. అంతేకాదు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచాడు’ అని మిశ్రా పేర్కొన్నాడు. Amit Mishra said "Woh khush nhi tha IPL mein! Rohit uss cheez se 100 percent upset hua hoga, kyunki woh emotional aadmi hai"That c* franchise played with him and his precious emotions and few dumba** were like why his fans are making a fuss out of it and all that bullcrap! pic.twitter.com/Ov2NDD24p1— S:) (@sunskie_45) July 15, 2024 -
అంపైర్‌తో వాగ్వాదం.. హెన్రిచ్ క్లాసెన్‌కు బిగ్ షాక్! భారీ జరిమానా
ఐపీఎల్-2023లో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ ఓటమి పాలైంది. దీంతో ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్లేఆఫ్ రేసు నుంచి ఎస్ఆర్హెచ్ నిష్క్రమించింది. ఇక ఎస్ఆర్హెచ్ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు క్లాసెన్‌కు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించాడు. అతడి మ్యాచ్‌లో 10 శాతం కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. క్లాసెన్ లెవెల్1 అత్రికమణకు పాల్పడ్డాడని, ఈ విషయంలో మ్యాచ్ రెఫరీదే తుది నిర్ణయమని ఐపీఎల్ నిర్వహకులు తెలిపారు. ఈ మ్యా్చ్లో 29 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్ 47 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు లక్నో స్పిన్నర్ అమిత్ మిశ్రాకు కూడా ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. ఈ మ్యాచ్‌లో ఎక్విప్‌మెంట్‌పై ప్రతాపం చూపించినందుకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. నో బాల్ వివాదం ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ల 19 ఓవర్ ఓవర్ ఆవేశ్ ఖాన్ వేశాడు. ఓవర్ మూడో బంతి హైఫుల్ టాస్‌గా వెళ్లింది. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. అయితే లక్నో కెప్టెన్ అంపైర్ కాల్‌ను చాలెంజ్ చేశారు. అయితే రిప్లేలో చూసిన థర్డ్ అంపైర్ బంతి క్లియర్‌గా ఉందని.. నో బాల్ కాదని చెప్పాడు. నడుము పై నుంచి బంతి వెళ్లినప్పటికీ.. థర్డ్ అంపైర్ ఫెయిర్ డెలివరీగా ప్రకటించడం క్రీజులో ఉన్న సమద్, క్లాసెన్‌తో పాటు అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఈ క్రమంలో క్లాసెన్ లెగ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అదే విధంగా ఎస్ఆర్హెచ్ అభిమానులు అయితే కాస్త అతి చేశారు. నట్టులు, మేకులు లక్నో డగౌట్పైన విసిరారు. దీంతో మ్యాచ్‌కు కాసేపు నిలిపివేశారు. కాగా అంపైర్‌తో వాగ్వాదానికి దిగినుందకే క్లాసెన్‌కు జరిమానా పడినట్లు తెలుస్తోంది. చదవండి: #SunilGavaskarVsHCA: హెచ్‌సీఏను ఏకిపారేసిన సునీల్ గావస్కర్ -
CSK VS MI: లేటు వయసులోనూ ఇరగదీస్తున్న పియూష్ చావ్లా.. మూడో స్థానానికి..!
ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ముంబై ఇండియన్స్ బౌలర్ పియూష్ చావ్లా మూడో స్థానానికి ఎగబాకాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇవాళ (మే 6, మధ్యాహ్నం 3:30 గంటలకు) జరుగుతున్న మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన చావ్లా.. సహచర వెటరన్, లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను వెనక్కు నెట్టి టాప్-3లోకి చేరాడు. ప్రస్తుతం పియూష్ ఖాతాలో 173 వికెట్లు ఉన్నాయి. ఈ జాబితాలో డ్వేన్ బ్రావో (183) టాప్‌లో ఉండగా.. రాజస్థాన్ స్పిన్నర్ చహల్ రెండులో.. పియూష్, అమిత్ మిశ్రా (172), మలింగ (170), అశ్విన్ (170) వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో ఉన్నారు. కాగా, ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిధ్య సీఎస్కే గెలుపు దిశగా సాగుతోంది. ఆ జట్టు మరో 17 పరుగులు చేస్తే (15 ఓవర్లలో 123/3) సీజన్లో ఆరో విజయాన్ని నమోదు చేస్తుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. సీఎస్కే బౌలర్లు పతిరణ (4-0-15-3), దీపక్ చాహర్ (3-0-18-2), తుషార్ దేశ్‌పాండే (4-0-26-2) విజృంభించడంతో 139 పరుగులకే పరిమితమైంది. ముంబై ఇన్నింగ్స్‌లో నేహల్ వధేరా (64) ఒక్కడే రాణించాడు. అనంతరం 140 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కేకు ఓపెనర్లు డెవాన్ కాన్వే (41నాటౌట్), శివమ్ దూబే (16 నాటౌట్) విజయం దిశగా నడిపిస్తున్నారు. రుతురాజ్ (30), రహానే (21), రాయుడు (12) ఔటయ్యారు. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా 2, ట్రిస్టన్ స్టబ్స్‌కు ఓ వికెట్ దక్కింది. చదవండి: రోహిత్ డకౌట్ వెనుక ధోని మాస్టర్‌మైండ్! -
LSG VS RCB: టాప్-3లోకి చేరిన అమిత్ మిశ్రా.. ఒకేసారి ముగ్గురిని అధిగమించి..!
లక్నోలోని అటల్ బిహారీ స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ వెటరన్ బౌలర్ అమిత్ మిశ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. సుయాశ్ ప్రభుదేశాయ్ వికెట్ పడగొట్టడం ద్వారా మిశ్రా ఐపీఎల్ టాప్-3 బౌలర్ల జాబితాలోకి దూసుకొచ్చాడు. మూడో ప్లేస్‌కు ఎగబాకే క్రమంలో మిశ్రా ఒకేసారి ముగ్గురు బౌలర్లను అధిగమించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో డ్వేన్ బ్రావో (161 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. యుజ్వేంద్ర చహల్ (140 మ్యాచ్‌ల్లో 178) రెండో స్థానంలో, అమిత్ మిశ్రా (160 మ్యాచ్‌ల్లో 171 వికెట్లు) మూడో ప్లేస్‌లో ఉన్నారు. ఒక్క వికెట్‌తో ముగ్గురిని అధిగమించిన మిశ్రా.. ఐపీఎల్లో టాప్-3 బౌలర్ స్థానానికి చేరుకునే క్రమంలో అమిత్ మిశ్రా ఒకేసారి ముగ్గురు బౌలర్లను అధిగమించాడు. లక్నోతో మ్యాచ్‌కు ముందు 169 వికెట్లు కలిగిన మిశ్రా.. ఒక్క వికెట్‌తో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ (122 మ్యాచ్‌ల్లో 170), ముంబై స్పిన్నర్ పియూష్ చావ్లా (173 మ్యాచ్‌ల్లో 170), రాజస్థాన్ బౌలర్ అశ్విన్ (193 మ్యాచ్‌ల్లో 170)లను దాటేశాడు. మరో వికెట్ కూడా.. ఈ మ్యాచ్‌లో మిశ్రా ఖాతాలో మరో వికెట్ కూడా పడింది. దీంతో అతని వికెట్ల సంఖ్య 172కు చేరింది. రెండో స్థానంలో ఉన్న చహల్‌కు మిశ్రాకు కేవలం 6 వికెట్ల తేడా మాత్రమే ఉంది. సుయాశ్ ప్రభుదేశాయ్ వికెట్ తర్వాత మిశ్రా.. కీలకమైన డుప్లెసిస్ వికెట్ తీశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. 18 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 115/6గా ఉంది. దినేశ్ కార్తీక్ (15), హసరంగ (1) క్రీజ్‌లో ఉన్నారు. -
అమిత్ మిశ్రాపై విరాట్ కోహ్లీ ఫాన్స్ ఫైర్..
-
RCB VS LSG: అమిత్ మిశ్రా తొండాట.. కోహ్లి బలయ్యాడు..!
ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్ 10) జరిగిన హైఓల్టేజీ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఓ కీలక వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతూ వైరలవుతోంది. క్రికెట్ సర్కిల్స్‌లో ఈ వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. నిన్నటి మ్యాచ్‌లో లక్నో స్పిన్నర్ అమిత్ మిశ్రా బంతిపై ఉమ్మిని రాస్తూ కనిపించాడు. Is saliva allowed in ipl?? #iplinhindi #IPL2023 #ipl #rcb #JioCinema pic.twitter.com/Uh7hiR7D2G — ROHIT RAJ (@RohitRajSinhaa) April 10, 2023 ఐసీసీ నిబంధనల ప్రకారం ఈ చర్య నిషేధించబడింది. కోవిడ్ అనంతరం ఐసీసీ ఈ నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఉమ్మికి బదులు బంతిపై చమటను అప్లై చేసేందుకు ఐసీసీ పర్మిషన్ ఇచ్చింది. ఈ కారణంగానే అమిత్ మిశ్రా చర్యపై క్రికెట్ సర్కిల్స్‌లో చర్చ సాగుతోంది. మిశ్రా చర్యను మెజార్టీ శాతం తప్పుపడుతున్నారు. తెలిసి చేసినా, పొరపాటున చేసినా మిశ్రాపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. మిశ్రా బంతిపై ఉమ్మిని రుద్దిన ఓవర్లోనే (మూడో బంతికి) విరాట్ కోహ్లి ఔట్ కావడంతో.. రన్ మెషీన్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారు. మిశ్రా తొండాట ఆడాడని.. అలా చేయకపోయి ఉంటే కోహ్లి ఔటయ్యే వాడే కాదని వితండవాదానికి దిగుతున్నారు. ఉమ్మి అప్లై చేయడం వల్ల బంతి షైన్ అయ్యి కోహ్లి ఔట్ కావడానికి కారణమైందని కామెంట్స్ చేస్తున్నారు. రూల్స్ ప్రకారం ఇలాంటి చర్యకు పాల్పడినందుకు మిశ్రా జట్టు లక్నోకు 5 పరుగుల పెనాల్టి విధించి ఆర్సీబీని విజేతగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ ఐసీసీ నిషేధించింది కాబట్టి మిశ్రా అలా చేయడం తప్పని మరికొందరు అంటున్నారు. కాగా, 2021 ఐపీఎల్‌లోనూ మిశ్రా ఇలాంటి చర్యకే పాల్పడి అంపైర్ వార్నంగ్కు గురయ్యాడు. ఈ చర్య మరోసారి రిపీట్ చేస్తే పెనాల్టి విధిస్తానని అప్పుడు అంపైర్ మిశ్రాను గట్టిగా మందలించాడు. ఇదిలా ఉంటే, లక్నోతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్ (46 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో స్టోయినిస్ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), పూరన్ (18 బంతుల్లో 62; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోవడంతో లక్నో విజయం సాధించింది. -
Amit Mishra: స్టన్నింగ్ క్యాచ్.. వయసుతో పనేంటి?
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ అమిత్ మిశ్రా 40 ఏళ్ల వయసులోనూ అదరగొడుతున్నాడు. ఒక క్రికెటర్‌కు 40 ఏళ్లు వచ్చాయంటే మాములుగా అయితే రిస్క్‌లు చేయడానికి ఇష్టపడడు. కానీ మిశ్రా అలా కాదు. తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో అమిత్ మిశ్రా స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన యష్ ఠాకూర్ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠి థర్డ్‌మన్ దిశగా ఆడాలనుకున్నాడు. అయితే బంతి ఔట్‌సైడ్ అయి బ్యాట్ ఎడ్జ్ అయి గాల్లోకి లేచింది. అక్కడే ఉన్న అమిత్ మిశ్రా ఎడమవైపుకు డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. మిశ్రా కళ్లు చెదిరే క్యాచ్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ''స్టన్నింగ్ క్యాచ్.. వయసుతో పనేంటి అని మిశ్రా నిరూపించాడు''.. ''40 ఏళ్ల వయసులోనూ స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్న మిశ్రాకు హ్యాట్సాఫ్'' అంటూ కామెంట్ చేశారు. ఇక బౌలింగ్‌లోనూ అమిత్ మిశ్రా మెరిశాడు. తన ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు తీసిన అమిత్ మిశ్రా ఐపీఎల్లో తన వికెట్ల సంఖ్యను 168కి పెంచుకున్నాడు. మార్క్‌వుడ్ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో అమిత్ మిశ్రా తుది జట్టులోకి వచ్చాడు. ఓవరాల్‌గా అమిత్ మిశ్రా ఐపీఎల్లో 155 మ్యాచ్‌లాడి 168 వికెట్లు తీసుకున్నాడు. 40 Years Old Amit Mishra while making debut for Lucknow & taking this catch means age is just a number for him #LSGvsSRH #MIvsCSK #amitmishra #T20 #IPL #IPL2023 #cricketmatlabMyfab11 #CricketTwitter pic.twitter.com/ZC3dZYh6LP — raman thind (@thindpau87) April 7, 2023 40 years O̵l̵d̵ young 🙌 Amit Mishra took a brilliant diving catch much to the delight of his teammates. Also bowled a brilliant spell of 4-0-23-2 📸 : Jio Cinema#LSGvSRH #IPL2023 pic.twitter.com/X8rnIqBTIC — 12th Khiladi (@12th_khiladi) April 7, 2023 -
కంగ్రాట్స్ ఐర్లాండ్.. ఇంగ్లండ్ అలా అనకుంటే చాలు!
టి20 ప్రపంచకప్‌లో ఈసారి పరుగుల కన్నా వర్షం తన జోరు చూపిస్తుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాకు షాక్ ఇచ్చిన వరుణుడు.. ఈసారి ఇంగ్లండ్‌కు కోలుకోలేని దెబ్బను మిగిల్చాడు. అంతేకాదు అఫ్గానిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డుపడ్డాడు. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇక బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఐదు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. వర్షం ఆటంకం కలిగించే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 105/5గా ఉంది. వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఐర్లాండ్ గెలిచినట్లు పేర్కొన్నారు. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో విజయాన్ని దక్కించుకున్న ఐర్లాండ్‌కు కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియాలో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ''ఏదైతేనేం.. ఇంగ్లండ్ లాంటి టాప్ జట్టును మట్టికరిపించింది'' అంటూ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా కూడా స్పందించాడు. ''కంగ్రాట్స్ ఐర్లాండ్.. అయితే డక్‌వర్త్ లూయిస్ అనేది క్రీడాస్పూర్తికి విరుద్దం అని ఇంగ్లండ్ అనదనే నమ్మకంతోనే ఉన్నా'' అంటూ వినూత్నంగా స్పందించాడు. ఇంతకముందు టీమిండియా ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, మహిళా క్రికెటర్ దీప్తి శర్మలు మన్కడింగ్ చేయడంపై క్రీడాస్పూర్తికి విరుద్ధమంటూ ఇంగ్లండ్ నానా యాగీ చేసింది. దీనిని దృష్టిలో పెట్టుకొనే అమిత్ మిశ్రా ఇంగ్లండ్ జట్టుకు కౌంటర్ ఇచ్చాడంటూ కొంతమంది అభిమానులు పేర్కొన్నారు. ఇక టి20 ప్రపంచకప్‌లో మరో మ్యాచ్ పూర్తిగా సాగకుండానే ఫలితం వచ్చింది.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. మార్క్ వుడ్ (3/34), లివింగ్‌స్టోన్ (3/17), సామ్ కర్రన్ (2/31), స్టోక్స్ (1/8) చెలరేగడంతో 19.2 ఓవర్లలో 157 పరుగులకు చాపచుట్టేసింది. కెప్టెన్ బల్బిర్నీ (47 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే వరుస షాక్‌లు తగిలాయి. ఓపెనర్ జోస్ బట్లర్ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్ 7 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆతర్వాత వచ్చిన మలాన్ కాసేపు ఓపిగ్గా ఆడినప్పటికీ 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. చివర్లో మొయిన్ అలీ (12 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), లివింగ్‌స్టోన్ (1 నాటౌట్) ఇంగ్లండ్‌కు గట్టెక్కించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. ఈ దశలో ఇంగ్లండ్ స్కోర్ 105/5గా ఉంది. వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఐర్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. చదవండి: 'అవసరమా మనకు.. 'స్పైడర్'ను బ్యాన్ చేయండి' Congratulations @cricketireland on a massive victory. Hope England doesn’t say winning through DLS isn’t in the spirit of the game. 😄 #EngvsIRE pic.twitter.com/0S4L5f1ZTi — Amit Mishra (@MishiAmit) October 26, 2022 Group 1's elite toples over to the luck of the three leaf clover! #irevseng #T20worldcup22 — Brad Hogg (@Brad_Hogg) October 26, 2022 IRE Vs ENG: టీ20 వరల్డ్‌కప్‌లో పెను సంచలనం.. ఇంగ్లండ్‌కు ‘షాకిచ్చిన పసికూన’ -
Amit Mishra: గర్ల్‌ఫ్రెండ్‌తో డేట్‌కి వెళ్లాలి! 300 కాదు ఐదొందలు తీసుకో!
Amit Mishra Viral Tweet: టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటాడు. అప్పుడప్పుడూ పప్పులో కాలేస్తూ ట్రోలింగ్ బారిన పడతాడు కూడా! ట్విటర్లో 1.4 మిలియన్ మందికి పైగా ఫాలోవర్లు కలిగి ఉన్న అమిత్ మిశ్రాకు.. ఇటీవల ఓ అభిమాని నుంచి అతడికి ఓ రిక్వెస్టు వచ్చింది. 300 కాదు.. ఐదొందలు తీసుకో తన గర్ల్‌ఫ్రెండ్‌ను డేట్‌కు తీసుకువెళ్లాలనుకుంటున్నానని.. ఇందుకు తనకు మూడు వందల రూపాయలు ఇచ్చి సాయం చేయాలని ఓ ఫ్యాన్ అమిత్ మిశ్రాను ట్యాగ్ చేశాడు. అయితే, అతడి అభ్యర్థనను ‘సీరియస్’గా తీసుకున్న మిశ్రా.. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా 500 రూపాయలు పంపించాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘‘పంపించాను. డేట్‌కి వెళ్తున్నావుగా.. ఆల్ ది బెస్ట్’’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేశాడు. నిజమే అంటారా? అమిత్ మిశ్రా ట్వీట్‌పై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. ‘‘సర్ నా దగ్గర డబ్బు ఉంది కానీ. బాయ్‌ఫ్రెండ్ లేడు. సాయం చేయగలరా?’’ అని ఓ అమ్మాయి కొంటెగా అడుగగా.. డబ్బులిచ్చీ మరీ అబ్బాయిని చెడగొడుతున్నారండీ అంటూ మరొకరు ఫన్నీగా రిప్లై ఇచ్చారు. ఇంకొందరేమో.. ‘‘నిజంగా డేట్‌కి వెళ్లి ఉంటే ఆ ఫొటోలు కూడా షేర్ చేయమని చెప్పండి. మీరు మాతో ఆ ఫొటోలు పంచుకోండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మొత్తానికి అలా.. మూడు వందలు అడిగితే 500 ఇచ్చి ‘ఉదారత’ను చాటుకున్న అమిత్ మిశ్రా నెట్టింట వైరల్‌గా మారాడు. ఆ మ్యాచ్ చివరిది టీమిండియా తరఫున 2003లో సౌతాఫ్రికాతో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అమిత్ మిశ్రా.. 2008లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇక 2010లో పొట్టి ఫార్మాట్లో ఎంట్రీ ఇచ్చిన ఈ స్పిన్ బౌలర్.. 2017లో చివరిసారిగా టీమిండియాకు ఆడాడు. ఇక ఐపీఎల్లో సుదీర్ఘకాలం పాటు ఢిల్లీ జట్టుకు అమిత్ మిశ్రా ప్రాతినిథ్యం వహించాడు. అయితే, మెగా వేలం-2022లో మాత్రం అతడిని ఏ జట్టు కొనుగోలు చేయలేదు. దీంతో క్యాష్ లీగ్ చరిత్రలో మూడో అత్యధిక వికెట్ టేకర్‌గా(154 మ్యాచ్‌ల్లో 166 వికెట్లు)గా మిశ్రా అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలాడు. గతేడాది ఆర్సీబీతో ఆడిన మ్యాచ్ అతడికి ఐపీఎల్లో చివరిది. చదవండి: T20 WC: అతడి స్థానాన్ని ప్రపంచంలో ఎవరూ భర్తీ చేయలేరు.. భారత్ గెలవడం కష్టమే: ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ Ind Vs Sa 2nd T20: సూర్య మరో 24 పరుగులు సాధించాడంటే! ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులివే Done, all the best for your date. 😅 https://t.co/KuH7afgnF8 pic.twitter.com/nkwZM4FM2u — Amit Mishra (@MishiAmit) September 29, 2022 -
'అందరూ నీలా ఉండరు'.. అఫ్రిదిని ఏకిపారేసిన టీమిండియా వెటరన్ క్రికెటర్
టీమిండియా వెటరన్ క్రికెటర్ అమిత్ మిశ్రా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. యాసిన్ మాలిక్ వ్యవహారంలో వెటకారంగా మాట్లాడిన అఫ్రిదికి అమిత్ మిశ్రా అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. యాసిన్ మాలిక్ నేరాన్ని ఒప్పుకున్నాడని.. నీలాగా అబద్దపు బర్త్ డేట్స్ చెప్పరని దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. విషయంలోకి వెళితే కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ నేరాన్ని అంగీకరించడంతో అతన్ని ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు బుధవారం దోషిగా నిర్దారించింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న నేరానికి సంబంధించి యాసిన్‌పై అభియోగాలు వచ్చాయి. విచారణలో అవన్నీ నిజమని తేలాయి. దీంతో యాసిన్ మాలికు జీవితకాల జైలుశిక్షతోపాటు రూ. పది లక్షల జరిమానా విధిస్తూ ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు తీర్పునిచ్చింది. అంతకముందు యాసిన్ మాలిక్ వ్యవహారంతో పాటు కాశ్మీర్ అంశంపై అఫ్రిది ట్వీట్ చేస్తూ.. ‘భారత్ లో మానవ హక్కుల మీద గొంతెత్తుతున్నవారి గొంతు నొక్కడం కొనసాగుతూనే ఉంది. యాసిన్ మాలిక్ మీద నేరం మోపినంత మాత్రానా కాశ్మీర్ స్వేచ్ఛ కోసం చేసే పోరు ఆగేది కాదు. కాశ్మీరీ లీడర్ల మీద చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోమని ఐక్యరాజ్యసమితిని కోరుతున్నా.’ అంటూ ట్వీట్ చేశాడు. అఫ్రిది ట్వీట్ కు అమిత్ మిశ్రా స్పందిస్తూ.. ‘డియర్ షాహిద్ అఫ్రిది.. అతడు (యాసిన్ మాలిక్) స్వయంగా నేరాన్ని అంగీకరించాడు. అందరూ నీలాగా బర్త్ డేట్ ను తప్పు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించరు.'' అంటూ ట్వీట్ చేశాడు. అఫ్రిది బర్త్ డేట్ వివాదం విషయానికొస్తే.. గతంలో అతడు తన బర్త్ డే ను తప్పుగా రాసి క్రికెట్ టోర్నీలలో పాల్గొన్నాడని వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఐసీసీ అధికారులనే అఫ్రిది తప్పుదారి పట్టించాడని అఫ్రిదిపై ఆరోపణలున్నాయి. ఆ తర్వాత ఐసీసీ అధికారులే తన పుట్టినతేదీని తప్పుగా రాసుకున్నారని మాటమార్చాడు. కానీ అతడి మాటలు ఎవరూ నమ్మలేదు. చదవండి: Mohammad Hafeez: చెత్త రాజకీయాలకు సామాన్యులు బలవ్వాలా?.. మాజీ క్రికెటర్ ఆగ్రహం PAK-W Vs SL-W: డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీసింది.. టి20 క్రికెట్లో పాక్ బౌలర్ కొత్త చరిత్ర Dear @safridiofficial he himself has pleaded guilty in court on record. Not everything is misleading like your birthdate. 🇮🇳🙏https://t.co/eSnFLiEd0z — Amit Mishra (@MishiAmit) May 25, 2022 India's continued attempts to silence critical voices against its blatant human right abuses are futile. Fabricated charges against #YasinMalik will not put a hold to #Kashmir's struggle to freedom. Urging the #UN to take notice of unfair & illegal trails against Kashmir leaders. pic.twitter.com/EEJV5jyzmN — Shahid Afridi (@SAfridiOfficial) May 25, 2022 -
IPL 2022: ఆర్సీబీ టైటిల్ నెగ్గే వరకు ఆ అమ్మడు పెళ్లి చేసుకోదట..!
Amit Mishra Tweet: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో నిన్న(ఏప్రిల్ 12) జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అన్నీ రంగాల్లో రాణించి సీజన్ తొలి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాబిన్ ఉతప్ప (50 బంతుల్లో 88; 4 ఫోర్లు, 9 సిక్సర్లు), శివమ్ దూబే (46 బంతుల్లో 95; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ఆర్సీబీ సైతం చివరిదాకా పోరాడినప్పటికీ ఫలితం అనుకూలంగా రాలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా సీఎస్కే 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. Really worried about her parents right now.. #CSKvsRCB pic.twitter.com/fThl53BlTX — Amit Mishra (@MishiAmit) April 12, 2022 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో కనిపించిన ఓ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ గెలిచేంతవరకు వరకూ పెళ్లి చేసుకోనంటూ ఓ అమ్మడు ప్లకార్డుతో కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోను ఐపీఎల్ లీడింగ్ వికెట్టేకర్లలో ఒకరైన అమిత్ మిశ్రా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా నెట్టింట వైరలవుతోంది. ఈ అమ్మాయి తల్లిదండ్రుల పరిస్థితి తలచుకుంటే ఆందోళనగా ఉందంటూ క్యాప్షన్ జోడించిన ఈ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. భారీ స్థాయిలో ట్రోల్స్ పేలుతున్నాయి. మంగమ్మ శపథం చేయకు తల్లీ.. జీవితాంతం సింగిల్‌గానే మిగిలిపోగలవంటూ నెటిజన్లు ఆర్సీబీకి వ్యతిరేకంగా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఐపీఎల్ 2022కు సంబంధించి కీలక అప్డేట్..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: మిశీ భాయ్, నీ సేవలకు సలాం.. ఢిల్లీ జట్టు ఎప్పటికీ నీదే..!
ఐపీఎల్ కెరీర్లో సింహ భాగం ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి, లీగ్ చరిత్రలో మూడో అత్యధిక వికెట్ టేకర్‌గా(154 మ్యాచ్‌ల్లో 166 వికెట్లు) నిలిచిన అమిత్ మిశ్రాను తాజాగా ముగిసిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఏ జట్టు కూడా సొంతం చేసుకోకపోవడంతో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. ఈ నేపథ్యంలో ఈ టీమిండియా వెటరన్ లెగ్ స్పిన్నర్‌ను ఉద్దేశిస్తూ.. ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని పార్థ జిందాల్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. To one of the @IPL greats @MishiAmit we @DelhiCapitals would like to salute everything you have done for us over all these years and would love to have you back at DC in whatever capacity you see fit as your insights would be most valuable. Mishy bhai DC is yours for life — Parth Jindal (@ParthJindal11) February 13, 2022 ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బౌలర్లలో ఒకడివైన మిశి భాయ్.. ఢిల్లీ క్యాపిటల్స్ నీ సేవలకు సలాం చేస్తుంది, నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నీ సేవలను వినియోగించుకునేందుకు డీసీ జట్టు సిద్ధంగా ఉంది, ఈ జట్టు ఎప్పటికీ నీదే అంటూ పార్థ.. ట్విటర్ వేదికగా ఐపీఎల్ దిగ్గజ స్పిన్నర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ట్విట్‌ను బట్టి చూస్తే.. డీసీ జట్టు అమిత్ మిశ్రా సేవలకు పరోక్షంగా వినియోగించుకునేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఇదిలా ఉంటే, ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో కోటి రూపాయల బేస్ ప్రైజ్ విభాగంలో పేరును నమోదు చేసుకున్న అమిత్ మిశ్రాపై ఢిల్లీ సహా ఏ ఇతర ఐపీఎల్ జట్టు కూడా ఆసక్తి కనబర్చలేదు. మిశ్రా గతేడాది లీగ్‌లో చివరిసారిగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో దర్శనమిచ్చాడు. ఆ మ్యాచ్‌లో మిశ్రా 3 ఓవర్లలో 27 పరుగులు సమర్పించకుని ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో అమిత్ మిశ్రాతో పాటు టీమిండియా వెటరన్ ఆటగాళ్లు సురేశ్ రైనా, ఇషాంత్ శర్మ, పుజారా, కేదార్ జాదవ్, హనుమ విహారిలపై కూడా ఏ జట్టు ఆసక్తి కనబర్చలేదు. దీంతో ఈ టీమిండియా వెటరన్ క్రికెటర్లంతా అమ్ముడుపోని ఆటగాళ్లుగా మిగిలిపోయారు. చదవండి: వేలంలో వారికి పంట పండింది.. వీళ్లను అసలు పట్టించుకోలేదు -
"ఏంటి మిశ్రా మత్తులో ఉన్నావా.. ఇది తొలి టెస్ట్ మాత్రమే"
సెంచూరియాన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ ఆటగాడు అమిత్ మిశ్రా భారత జట్టును అభినందిస్తూ ట్వీట్ చేశాడు. అయితే అక్కడే మిశ్రా పప్పులో కాలేశాడు. "విజయం సాధించిన టీమిండియాకు శుభాకాంక్షలు. అద్భుతంగా ఆడారు. చారిత్రత్మక విజయం సాధించి తొలి టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్నందుకు గర్వంగా ఉంది" అని మిశ్రా ట్విటర్లో పేర్కొన్నాడు. ఇంకేమి ఉంది ఇక్కడే మిశ్రా నెటిజన్లుకు దొరికిపోయాడు. మొట్టమొదటి టెస్టు సిరీస్ గెలిచినందుకు టీమిండియాకి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసిన మిశ్రాని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. "ఏంటి మిశ్రా మత్తులో ఉండి ట్వీట్ చేశావా" అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఇలా తప్పుగా ట్వీట్ చేయడం మిశ్రా ఇదేం కొత్త కాదు. అంతకుముందు టీ20 ప్రపంచకప్-2021 విజేత న్యూజిలాండ్‌కు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు. చదవండి: Virat Kohli- Vamika: ‘చిట్టితల్లి... నాన్న గెలిచాడు వామిక.. ఆ సంతోషం వెలకట్టలేనిది’.. వీడియో వైరల్ Congratulations team India. Very well played. A historic win for India as they record their first Test series sweep against South Africa. A proud moment. #IndvsSA #BCCI #TestSeries #TeamIndia #IndiaToday #AajTak #ZeeNews #StarSports #SonySports #NDTVSports #IndiaTv #SportsTak pic.twitter.com/kfYlGfzMYg — Amit Mishra (@MishiAmit) December 30, 2021 -
విరాట్‌లాగే నాకు కూడా అన్యాయం జరిగింది.. టీమిండియా బౌలర్ సంచలన వ్యాఖ్యలు
Amit Mishra: టీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లిని తొలగిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై క్రికెట్ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌లాగే తనకు కూడా అన్యాయం జరిగిందని అర్ధం వచ్చేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తున్న కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఆయన ఫైరయ్యాడు. టీమిండియాలో కొందరు ఆటగాళ్లు అద్భుతంగా రాణించినా.. బీసీసీఐ అకారణంగా వారిపై వేటు వేసిందని పరోక్షంగా తన గురించిన తెస్తూ బీసీసీఐపై మండిపడ్డాడు. బీసీసీఐకి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం కొత్తేమీ కాదని, గతంలో తనతో సహా చాలామంది క్రికెటర్ల విషయంలోనూ ఇలానే వ్యవహరించిదని సంచలన కామెంట్స్ చేశాడు. జట్టులో చోటు దక్కించుకునేందుకు అష్టకష్టాలు పడే ప్లేయర్లకు తమను జట్టులో నుంచి ఎందుకు తొలగిస్తున్నారో తెలుసుకునే హక్కు ఉంటుందని అన్నాడు. ఆటగాళ్ల ఉద్వాసనకు గల కారణాలు తెలిస్తే.. ఆ విభాగంలో మెరుగయ్యేందుకు కృషి చేస్తారని పేర్కొన్నాడు. కాగా, అమిత్ మిశ్రా 2016లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి సత్తా చాటినా అతన్ని జట్టులో నుంచి తొలగించారు. అనంతరం 2017లో తిరిగి జట్టులోకి వచ్చిన అతను.. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 3 వికెట్లతో రాణించినప్పటికీ.. అకారణంగా అతన్ని పక్కకు పెట్టేశారు. 39 ఏళ్ల అమిత్ మిశ్రా భారత జట్టు తరఫున 22 టెస్ట్‌ల్లో 76 వికెట్లు, 36 వన్డేల్లో 64 వికెట్లు, 8 టీ20ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. టీమిండియాలో కుంబ్లే, హర్భజన్, అశ్విన్ హవా నడుస్తుండటంతో అతను జట్టులోకి వస్తూ, పోతూ ఉండేవాడు. ఐపీఎల్లో మలింగ(170) తర్వాత 166 వికెట్లతో లీగ్‌లో రెండో అత్యధిక వికెట్ టేకర్‌గా ఉన్నప్పటికీ.. టీమిండియాలో అతనికి తగినన్ని అవకాశాలు దక్కలేదు. చదవండి: Ashes 2nd Test: పాపం వార్నర్.. వందేళ్లలో ఒకే ఒక్కడు -
T20 WC 2021 Winner: మ్యాచ్ చూడలేదా అమిత్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
T20 WC 2021 Winner Australia: Amit Mishra Getting Trolled Why Deletes Tweet: టీమిండియా వెటరన్ ప్లేయర్ అమిత్ మిశ్రాను నెటిజన్లు ఆడుకుంటున్నారు. ‘‘అయ్యో.. ఇదేంటి అమిత్ మ్యాచ్ చూడలేదా ఏంటి?’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. నవంబరు 14న దుబాయ్ వేదికగా టీ20 ప్రపంచకప్-2021 ఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఆస్ట్రేలియా కొత్త చాంపియన్‌గా అవతరించింది. ఇన్నాళ్లు ఊరిస్తున్న పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుని చిరకాల కోరిక నెరవేర్చుకుంది. ఈ నేపథ్యంలో ఆరోన్ ఫించ్ బృందానికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. టీమిండియా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సైతం... విజేతను అభినందిస్తూ ట్వీట్ చేశాడు. అయితే, అక్కడే అమిత్ పప్పులో కాలేశాడు. ‘‘వరల్డ్‌కప్ గెలిచిన బ్లాక్‌కాప్స్‌కు శుభాకాంక్షలు. సమష్టి విజయం. చాలా బాగా ఆడారు’’ అని ట్వీటాడు. విన్నర్ ఆసీస్‌కు బదులు న్యూజిలాండ్‌కు విషెస్ చెప్పాడు. ఇంకేం ఉంది.. అమిత్ మిశ్రా ‘తప్పిదాన్ని’ గుర్తించిన నెటిజన్లు ఫన్నీగా అతడిని ట్రోల్ చేస్తున్నారు. దీంతో.. అమిత్ మిశ్రా తన ట్వీట్‌ను డెలిట్ చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ క్రికెట్ హాండిల్ స్థానంలో ఆసీస్‌ను రీప్లేస్ చేసి అభినందనలు తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న మిచెల్ మార్ష్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. స్కోర్లు: న్యూజిలాండ్- 172/4 (20) ఆస్ట్రేలియా- 173/2 (18.5) చదవండి: Kane Williamson: వినండి పక్కనే వాళ్లు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో.. మరేం పర్లేదు కేన్.. మనసులు గెలిచారు! -
ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పనున్న భారత ఆటగాళ్లు వీరే!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా ఈవెంట్ ఐపీఎల్- 2021 సెకండ్ ఫేజ్ ప్రారంభమైంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమైంది . అయితే ఈ సీజన్ తర్వాత కొంత మంది భారత ఆటగాళ్లు లీగ్‌కు వీడ్కోలు పలుకనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తెరమీదకు వచ్చిన ఆ ఆటగాళ్లు ఎవరో పరిశీలిద్దాం. హర్భజన్ సింగ్ హర్భజన్ సింగ్ భారత అత్యత్తుమ స్పిన్నర్లలోఒకడు. టెస్టుల్లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా 2001లో అరుదైన ఘనత సాధించాడు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే.. తన ఐపీఎల్ కెరీర్‌ను ముంబై ఇండియన్స్‌తో ప్రారంభించాడు. పది సీజన్ల తరువాత 2018 లో ముంబై భజ్జీను వేలంలో పెట్టింది. తరువాత చెన్నై సూపర్ కింగ్స్ కనీస ధరతో అతడుని దక్కించుకోంది. ఆనంతరం రెండు సీజన్ల తరువాత 2021లో చెన్నై కూడా హర్భజన్ ను వేలంలో పెట్టింది. ఈ ఏడాది సీజన్లో ఈ వెటరన్ ఆఫ్ స్పిన్నర్‌ని కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. కానీ ఐపీఎల్ మెదటి దశలో కోల్‌కతా తరుపున అతడకి తుది జట్టులో పెద్దగా అవకాశం దక్కలేదు. ఈ ఏడాది జూలైలో 40వ పడిలోకి అడుగు పెట్టిన హర్భజన్ సింగ్.. ఐపీఎల్ సెకండ్ ఫేజ్ పూర్తయిన తర్వాత ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటి వరకు తన ఐపీఎల్ కెరియర్లో 160 మ్యాచ్‌లు ఆడిన హర్భజన్ సింగ్ మొత్తం 150 వికెట్లు పడగొట్టాడు. అమిత్ మిశ్రా అమిత్ మిశ్రా భారత లెగ్ స్పిన్ దిగ్గజం. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే.. తన ఐపీఎల్ కెరీర్‌ను ఢిల్లీ డెర్‌డెవిల్స్ తో ప్రారంభించాడు. ఆ తరువాత సన్ రైజర్స్ హైదరాబాద్, పుణే వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ లో కొనసాగుతున్నాడు. కాగా ఐపీఎల్లో మిశ్రా తన పేరు మీద అనేక రికార్డులు కలిగి ఉన్నాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా మిశ్రా ఉన్నాడు. ఈ లీగ్‌లో అత్యధిక హ్యాట్రిక్‌లు(3) సాధించిన బౌలర్‌గా అమిత్ మిశ్రా రికార్డు సాధించాడు. అయితే.. వెటరన్ స్పిన్నర్ కొన్ని నెలల్లో 39 ఏళ్లు పూర్తి చేసుకుంటాడు. ఈ నేపథ్యంలో ఇదే అతని అఖరి సీజన్ కావచ్చు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటి వరకు తన ఐపీఎల్ కెరీర్లో 154 మ్యాచ్‌లు ఆడిన అమిత్ మిశ్రా 166 వికెట్లు సాధించాడు. వృద్ధిమాన్ సాహా సాహా తన కెరీర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ తో ప్రారంభించాడు. ఆ తరువాత మూడు సీజన్ల ఆనంతరం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్‌కు ప్రతినిధ్యం వహించాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కొనసాగుతున్నాడు. కాగా ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌కు ఆజట్టు స్టార్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో దూరమయ్యాడు. ఈ క్రమంలో సాహా హైదరాబాద్‌కు ఓపెనింగ్ చేసే అవకాశాఉ ఉన్నాయి. కాగా మరో నెలలో 37 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న సాహా ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పనున్నాడని సమాచారం. కాగా సాహా తన ఐపీఎల్ కెరీర్లో 126 మ్యాచ్‌లు ఆడి 1987 పరుగులు సాధించాడు. కేదార్ జాదవ్ కేదార్ జాదవ్ ఐపీఎల్లో ఆద్బతమైన ఆటగాడు కానప్పటికీ, తన ఐపీఎల్ కెరీర్లో కొన్ని మ్యాచ్‌లలో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. జాదవ్ తన కేరిర్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ప్రారంభించగా.. 2018లో అతడుని చెన్నై సూపర్ కింగ్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆనంతరం 2021లో చెన్నై జాదవ్‌ను వేలంలో పెట్టింది. తరువాత సన్‌రైజర్స్ హైదరాబాద్ కేదార్‌ను దక్కించుకోంది. 36 ఏళ్ల జాదవ్ ఫామ్‌లో లేనందున, ఇది అతని చివరి సీజన్ కావచ్చోని వినికిడి. కాగా జాదవ్ తన కేరిర్‌లో 91మ్యాచ్‌ల్లో 1181 పరుగులు సాధించాడు. రాబిన్ ఉతప్ప రాబిన్ ఉతప్ప తన ఐపీఎల్ కెరీర్ ను కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ప్రారంభించాడు. 2014 నుంచి 2019 వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ తరుపున అద్భతంగా రాణించాడు. 2014 సీజన్లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం ఉతప్ప చెన్నై సూపర్ కింగ్స్‌తో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2021 మొదటి దశలో చెన్నై తరుపున ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం దొరకలేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌కు విడ్కోలు పలకవచ్చని సమాచారం. చదవండి: IPL 2021 2nd Phase CSK VS MI: రుతురాజ్ మెరుపులు.. ముంబై ఇండియన్స్ టార్గెట్ 157 -
Covid-19: కోలుకున్న క్రికెటర్.. ఇంగ్లండ్ టూర్‌కు లైన్ క్లియర్!
న్యూఢిల్లీ: ఐపీఎల్ టోర్నీలో కరోనా వైరస్ బారిన పడ్డ భారత జట్టు వికెట్ కీపర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయర్ వృద్ధిమాన్ సాహా కోలుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేందుకు సాహాకు మార్గం సుగమం అయ్యింది. ఢిల్లీలో క్వారంటైన్లో ఉంటూ చికిత్స తీసుకున్న సాహాకు నెగెటివ్ రావడంతో అతను కోల్‌కతాలోని తన ఇంటికి చేరుకున్నాడు. ఇక అక్కడ కొన్ని రోజు లు గడిపిన తర్వాత ఇంగ్లండ్‌కు బయలుదేరే భారత జట్టు కోసం ముంబైలో ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో అడుగు పెట్టనున్నాడు. అయితే ఇంగ్లండ్‌కు వెళ్లేలోపు సాహా తన ఫిట్నెస్ను నిరూపించుకోవాలి. జూన్ 2న భారత్ అక్కడికి బయలుదేరనుంది. మరోవైపు.. ఐపీఎల్-2021 సీజన్ ఆడే క్రమంలో కోవిడ్ బారిన పడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అమిత్ మిశ్రా కూడా కోలుకున్నాడు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించిన అతడు.. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. చదవండి: WTC Final: అందుకే వాషింగ్టన్‌తో కలిసి ఉండటం లేదు! The real heroes. Our Frontline workers. All I can say post my recovery is, You have my support and heartfelt appreciation for all you do. We are deeply grateful to you for all the sacrifices that you and your family are making. .#grateful #coronawarriors #bcci #DelhiCapitals pic.twitter.com/Wg3vbqd42j — Amit Mishra (@MishiAmit) May 18, 2021 -
IPL 2021: నీ వల్లే ఐపీఎల్ ఆగిపోయిందంటూ నెటిజన్ల ఫైర్!
న్యూఢిల్లీ: ఇటీవల ఆటగాళ్లకి కరోనా వైరస్ సోకడంతో అనూహ్యంగా ఐపీఎల్ 2021 ని బీసీసీఐ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పక్కాగా జాగ్రత్తలు తీసుకుని, ఆటగాళ్లను బయోబబుల్‌లో ఉంచినప్పటికీ ఈ మహమ్మారి ఎలా సోకిందో బోర్డుకు అంతుచిక్కడం లేదు. ఎక్కడో ఏదో చిన్న నిర్లక్ష్యం కారణంగా భారీ మూల్యాన్నే బోర్డు చెల్లించాల్సి వచ్చింది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఈ బయోబబుల్ లీక్‌కు.. మొదట కోల్‌కతా నైటరైడర్స్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తికి.. అక్కడి నుంచి సందీప్ వారియర్.. అక్కడి నుంచి అమిత్ మిశ్రాకు వైరస్ సోకడం వెనుక నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తుంది. ఏదేమైనా తమకిష్టమైన ఐపీఎల్ వాయిదాకి వరుణ్ కారణమంటూ సోషల్ మీడియాలో అతనిపై మీమ్స్ చేస్తూ అభిమానులు వాళ్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బయోబబుల్ ఉల్లంఘన ఎక్కడ జరిగింది? ఇటీవల ఓ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరణ్‌ని గ్రీన్ చానెల్ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. భుజం గాయం కావడంతో స్కానింగ్ చేసినట్లు అందరికి చెప్పారు. కానీ అతనికి భుజ గాయం కాలేదని, కడుపులో మంటతో బాధపడడంతో చికిత్స అందించారని తెలుస్తోంది. అక్కడి నుంచి హోటల్ రూమ్‌కు తిరిగి వచ్చిన తర్వాత వరుణ్ నిబంధనల ప్రకారం వారం రోజులు క్వారంటైన్లోకి వెళ్లాలి. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది. నేరుగా వెళ్లి సందీప్‌తో కలిశాడు. ఇక్కడ రూల్ బ్రేక్ అయ్యింది. అదే క్రమంలోనే ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రాతో మాట్లాడాడు. ఇలా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెంది లీగ్ వాయిదాకు కారణమైనట్లు భావిస్తున్నారు. అందుకే బోర్డు దీనిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అసలు బయోబబుల్ లీక్ పై విచారణ జరిపిస్తోంది. వరుణ్‌పై సెటైరికల్ మీమ్స్ ఐపీఎల్ 2021 సీజన్ వాయిదాకు వరుణ్ చక్రవర్తి కారణమంటూ అతనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సామాజిక మాధ్యమంలో వరుణ్‌పై సెటైరికల్ మీమ్స్, కామెంట్స్ పెడుతున్నారు.‘గేమ్ చేంజర్ ఆఫ్ ది సీజన్ వరుణ్ చక్రవర్తి’ అని ఒకరంటే.. ‘డ్రీమ్ 11 సీజన్ క్యాన్స్‌లర్ అవార్డు అతనికేనని’ మరొకరు వ్యంగ్యంగా అతనిపై ట్వీట్ చేస్తున్నారు. వాళ్లు వరుణ్ ఫొటోను ఎడిటింగ్ చేసి మరీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. పాపం వరుణ్ నెటిజన్లుకు ఇలా బుక్కయ్యాడు. ( చదవండి: భారత్‌ను విడిచిపెట్టి వెళ్తున్నా.. నన్ను క్షమించండి ) #iplcancel #iplpostponed #COVIDSecondWaveInIndia #COVIDEmergencyIndia #VarunChakravarthy pic.twitter.com/Rh3ZzamrmT— Gotu Manthan Dave (@GotuDave) May 4, 2021 Dream11 Game Changer of the tournament #ipl2021 goes to #VarunChakravarthy pic.twitter.com/6BZTQ6wPta— Hibernator 🐺 (@PrestigiouStark) May 4, 2021 Suspending IPL is ok but What about suspending @KKRiders . For not following rules & allowing #VarunChakravarthy to join team without quarantine & played match. Bcoz of this 1 wrong decision & match jeetne ki lalach best playing11 ko leke Result- Whole #IPL2021 suspended@BCCI — Jadhav Ashish (@im_jadhavashish) May 4, 2021 -
IPL 2021 సీజన్ రద్దు: బీసీసీఐ
-
IPL 2021 నిరవధిక వాయిదా: బీసీసీఐ
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ సెకండ్‌వేవ్ విజృంభణ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో ఐపీఎల్-2021 సీజన్‌ను రద్దు చేసే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కాగా వేర్వేరు జట్లలో ఇప్పటికే 9 మంది ఆటగాళ్లకు కోవిడ్-19 సోకింది. బయో బబుల్‌లో ఉన్నప్పటికీ క్రికెటర్లు, ఇతర సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తొలుత టోర్నీని నిరవధికంగా వాయిదా వేయాలని భావించిన బీసీసీఐ.. 31 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఈ సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరింటిలో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, 7 మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో విజయం సాధించిన సీఎస్కే రెండో స్థానంలో ఉంది. వాయిదా వేస్తాం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్-2021)కు కరోనా సెగ తగిలింది. తాజాగా మరో ఇద్దరు క్రికెటర్లు కోవిడ్ బారిన పడటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్యాష్ రిచ్ లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ధ్రువీకరించారు. కాగా, ఇప్పటికే కోల్‌కతా ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్లకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం జరగాల్సిన కేకేఆర్- ఆర్సీబీ మ్యాచ్‌ను వాయిదా వేశారు. ఈ క్రమంలో తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అమిత్ మిశ్రాకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో బయో బబుల్‌లో ఉన్నప్పటికీ ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో టోర్నీ నిర్వహణపై సందిగ్దత నెలకొనగా.. నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. 8 ఫ్రాంఛైజీలు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాయి. కాగా ఐపీఎల్ వాయిదా పడటంతో క్రికెట్ ప్రేమికులు నిరాశకు గురైనప్పటికీ ఆటగాళ్ల క్షేమం దృష్ట్యా సరైన నిర్ణయమే తీసుకున్నారని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. బాంబే హైకోర్టులో పిటిషన్ కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఐపీఎల్‌ను రద్దు చేయాలని పిటిషన్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఐపీఎల్‌కు కేటాయించిన వనరులను కోవిడ్ రోగులకు ఉపయోగించవచ్చని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. రద్దు చేస్తేనే మంచిది.. భారత్‌లో రోజూవారీ కేసులు మూడున్నర లక్షలకు పైగా నమోదవుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌ను రద్దు చేయాలంటూ మెజార్టీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఐపీఎల్ నిర్వహణ రద్దు అంశంపై sakshi.com నిర్వహించిన పోల్‌లోనూ ఈ విషయం నిరూపితమైంది. ఐపీఎల్‌ను ఆపేస్తేనే మంచిదని చాలా మంది అభిప్రాయపడ్డారు. చదవండి: వైరల్: డ్రింక్స్ మోసుకెళ్లినా.. వి లవ్ యూ వార్నర్ అన్నా! IPL suspended for this season: Vice-President BCCI Rajeev Shukla to ANI#COVID19 pic.twitter.com/K6VBK0W0WA — ANI (@ANI) May 4, 2021 -
'రికార్డుల కోసం నేను ఎదురుచూడను'
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించడం వెనుక సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కీలకంగా వ్యవహరించాడు. 4 ఓవర్లు వేసిన మిశ్రా 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మలింగ తొలి స్థానంలో ఉండగా.. అమిత్ మిశ్రా రెండో స్థానంలో ఉన్నాడు. మలింగ ఇప్పటివరకు ఐపీఎల్లో 122 మ్యాచ్‌లాడి 170 వికెట్లు తీయగా.. అమిత్ మిశ్రా 152 మ్యాచ్‌లాడి 164 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలవడానికి మిశ్రా కేవలం 7 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఈ సీజన్లో ఇంకా ఢిల్లీ చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో మిశ్రా ఈ రికార్డును తొందరగానే బ్రేక్ చేసే అవకాశం ఉంది. అయితే తాను రికార్డులు సాధించడం కంటే జట్టును గెలిపించడంపైనే ఫోకస్ పెట్టినట్లు మిశ్రా తెలిపాడు. మ్యాచ్ విజయం అనంతరం పృథ్వీ షాతో జరిగిన సంభాషణలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ''నేనెప్పుడు రికార్డుల గురించి ఆలోచించలేదు. అసలు లసిత్ మలింగ రికార్డు బ్రేక్ చేయబోతున్నానే విషయం నాకు తెలియదు. రాబోయే మ్యాచ్‌ల్లో దానిని బ్రేక్ చేసినంత మాత్రానా నాకు వచ్చేది ఏం లేదు.. కేవలం ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పేరు తప్ప.. ప్రస్తుతం నా దృష్టంతా వికెట్లు తీసి ఢిల్లీ జట్టును గెలిపించడమే..'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రోహిత్‌శర్మను ఐపీఎల్లో 7సార్లు ఔట్ చేయడంపై మిశ్రాను అడగ్గా.. '' రోహిత్‌కు బౌలింగ్ వేసేటప్పుడు అతను హిట్టింగ్ చేయకుండా వైవిధ్యమైన బంతులు వేస్తూ అతని ఏకాగ్రతను దెబ్బతీస్తాను. అందులోనూ నేను వేసే వాటిలో ఎక్కువగా ఫ్లైట్ డెలివరీలు ఉండడంతో రోహిత్ అవుటవుతున్నాడు. అయితే రోహిత్ నా బౌలింగ్‌లో ఏడు సార్లు ఔటయ్యాడన్న విషయం నాకు తెలియదు.'' అంటూ తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా (4/24) తిప్పేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి గెలిచింది. శిఖర్ ధావన్ (42 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్), స్మిత్ (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. చదవండి: మిశ్రా నువ్వు తోపు.. వచ్చీ రావడంతోనే ఐపీఎల్ 2021: అతను వండర్స్ చేయగలడు -
ఢిల్లీకి అమితానందం
గత సీజన్ ఫైనలిస్టుల మధ్య జరిగిన పోరు ప్రేక్షకులకు వినోదాన్ని పంచలేదు. ఆసక్తి కలిగించనూ లేదు. కానీ గతేడాది ఫైనల్లో తమను ఓడించి ఐపీఎల్‌లోనే ‘ఫైవ్ స్టార్ చాంపియన్’ జట్టుగా నిలిచిన ముంబై ఇండియన్స్‌కి ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ షాక్ ఇచ్చింది. అమిత్ మిశ్రా మాయాజాలం... శిఖర్ ధావన్ నిలకడ... వెరసి వరుస మ్యాచ్‌ల విజయాలతో జోరు మీదున్న ముంబైని నేలకి దించిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడో విజయాన్ని నమోదు చేసింది. చెన్నై: ఈ మ్యాచ్‌లో స్కోర్లు తక్కువే! ఆటగాళ్ల జోరు తక్కువే! బౌండరీలు, సిక్సర్లు ఇలా అన్నీ తక్కువే! విజయం సులువుగా ఏమీ దక్కలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ 138 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 20వ ఓవర్‌దాకా పోరాటం చేసింది. చివరకు 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌కు షాక్ ఇచ్చి విజయానందాన్ని పొందింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ఢిల్లీ స్పిన్నర్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అమిత్ మిశ్రా (4/24) తిప్పేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి గెలిచింది. శిఖర్ ధావన్ (42 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్), స్మిత్ (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. ఆరంభంలోనే దెబ్బ... మూడో ఓవర్లోనే ముంబైకి తొలిదెబ్బ తగిలింది. స్టొయినిస్ ఓపెనర్ డికాక్ (2)ను కీపర్ క్యాచ్‌తో పంపించాడు. కానీ రోహిత్ ఉన్నాడన్న ధీమా... సూర్యకుమార్ యాదవ్ జతయ్యాడన్న విశ్వాసం ముంబై అభిమానుల్లో మెండుగా ఉంది. ఇది ఆ తర్వాతి ఓవర్లో కనిపించింది. అశ్విన్ బౌలింగ్‌లో సూర్య ఓ బౌండరీ బాదితే, రోహిత్ 4, 6 కొట్టాడు. అనంతరం రబడను ఫోర్, సిక్సర్‌తో ఇద్దరూ ఆడుకున్నారు. ఒక్కసారిగా ఇన్నింగ్స్‌కు జోరు తెచ్చిన మురిపెం ఆవిరయ్యేందుకు ఎంతోసేపు పట్టనేలేదు. మిశ్రా మాయ... ముందుగా సూర్యకుమార్ (15 బంతుల్లో 24; 4 ఫోర్లు)ను అవేశ్ ఖాన్ ఔట్ చేస్తే... ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ ముంబై పాలిట శరాఘాతమైంది. స్పిన్నర్ మిశ్రా... కెపె్టన్ రోహిత్ శర్మ, హిట్టర్ హార్దిక్ పాండ్యా (0)లను పెవిలియన్ చేర్చాడు. దీంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. కృనాల్ పాండ్యా (1) వచి్చనా, పొలార్డ్ బ్యాటింగ్‌కు దిగినా ముంబైని ఆదుకోలేకపోయారు. కృనాల్‌ను లలిత్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేస్తే, ఆ మరుసటి ఓవర్లోనే మిశ్రా పొలార్డ్‌ను ఎల్బీగా దొరకబుచ్చుకున్నాడు. ఉన్నంతలో ఇషాన్ కిషన్ (28 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్), జయంత్ యాదవ్ (22 బంతుల్లో 23; 1 ఫోర్) చేసిన రెండంకెల పరుగులు ముంబైని మూడంకెల స్కోరుదాకా తీసుకొచ్చాయి. ధావన్ నిలకడ... ఆరంభంలోనే ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా (7) నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకున్నాడు. జయంత్ యాదవ్ బౌలింగ్‌లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఓపెనర్ ధావన్‌కు స్మిత్ జతయ్యాడు. ముంబై బౌలర్లకు మరో అవకాశం ఇవ్వకుండా ఈ ఇద్దరు కుదురుగా ఆడారు. రెండో వికెట్‌కు 53 పరుగులు జతయ్యాక పొలార్డ్ బౌలింగ్‌లో స్మిత్ (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన లలిత్ యాదవ్‌తో కలిసి జట్టు స్కోరును ధావన్ లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు. రాహుల్ చహర్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ధావన్ వరుసగా 6, 4 బాదాడు. అదే ఊపులో భారీషాట్‌కు యత్నించిన ధావన్ లాంగ్‌లెగ్‌లో కృనాల్ పాండ్యా చేతికి చిక్కాడు. కాసేపటికే కెపె్టన్ పంత్ కూడా (7) సింగిల్ డిజిట్‌కే చేరడంతో ముంబై గత మ్యాచ్‌ల్లాగే పట్టుబిగించే ప్రయత్నం చేసింది. లలిత్ పోరాటం... స్మిత్ ఔటయ్యాక బ్యాటింగ్‌కు దిగిన లలిత్ యాదవ్ (25 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్) జట్టుకు విలువైన పోరాటం చేశాడు. పంత్ ఔటయ్యే సమయానికి జట్టు స్కోరు 115/4. విజయానికి 19 బంతుల్లో 23 పరుగులు కావాలి. ఈ దశలో వచ్చిన హెట్మెయిర్ (9 బంతుల్లో 14 నాటౌట్; 2 ఫోర్లు) దూకుడు, లలిత్ యాదవ్ నిలకడ ఢిల్లీ జట్టుకు విజయాన్ని కట్టబెట్టింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) స్మిత్ (బి) మిశ్రా 44; డికాక్ (సి) పంత్ (బి) స్టొయినిస్ 1; సూర్యకుమార్ (సి) పంత్ (బి) అవేశ్ ఖాన్ 24; ఇషాన్ కిషన్ (బి) మిశ్రా 26; హార్దిక్ (సి) స్మిత్ (బి) మిశ్రా 0; కృనాల్ (బి) లలిత్ యాదవ్ 1; పొలార్డ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మిశ్రా 2; జయంత్ (సి అండ్ బి) రబడ 23; రాహుల్ చహర్ (సి) పంత్ (బి) అవేశ్ ఖాన్ 6; బుమ్రా (నాటౌట్) 3; బౌల్ట్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–9, 2–67, 3–76, 4–77, 5–81, 6–84, 7–123, 8–129, 9–135. బౌలింగ్: స్టొయినిస్ 3–0–20–1, అశ్విన్ 4–0–30–0, రబడ 3–0–25–1, అమిత్ మిశ్రా 4–0–24–4, అవేశ్ ఖాన్ 2–0–15–2, లలిత్ యాదవ్ 4–0–17–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి అండ్ బి) జయంత్ 7; ధావన్ (సి) కృనాల్ (బి) రాహుల్ చహర్ 45; స్మిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) పొలార్డ్ 33; లలిత్ యాదవ్ (నాటౌట్) 22; రిషభ్ పంత్ (సి) కృనాల్ (బి) బుమ్రా 7; హెట్మెయిర్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 138. వికెట్ల పతనం: 1–11, 2–64, 3–100, 4–114. బౌలింగ్: బౌల్ట్ 4–0–23–0, జయంత్ 4–0–25–1, బుమ్రా 4–0–32–1, కృనాల్ 2–0–17–0, రాహుల్ చహర్ 4–0–29–1, పొలార్డ్ 1.1–0–9–1. -
మిశ్రా నువ్వు తోపు.. వచ్చీ రావడంతోనే
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అదరగొట్టాడు. మిశ్రా ఈ మ్యాచ్‌లో 4-0-24-4 తో రాణించాడు. తద్వారా ముంబై ఇండియన్స్‌పై ఐపీఎల్లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఈ సీజన్లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న మిశ్రా ముంబైతో మ్యాచ్‌కు తుది జట్టులోకి వచ్చాడు.ఐపీఎల్లో తనకున్న రికార్డును నిలబెట్టుకుంటూ రోహిత్, హార్దిక్, పోలార్డ్ సహా ఇషాన్ కిషన్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్ ఎలా ఉన్నా ఐపీఎల్లో మాత్రం అమిత్ మిశ్రా మంచి రికార్డులు ఉన్నాయి. ఓవరాల్‌గా ఐపీఎల్లో ఇప్పటివరకు 152 మ్యాచ్‌లాడిన అమిత్ మిశ్రా 164 వికెట్లు తీశాడు. చదవండి: 'నా జట్టు అంత స్టైల్‌గా ఉండడానికి కారణం తనే' ఓడిపోయినా సెలబ్రేట్ చేసుకున్నారు.. అదేంటో -
ఆర్సీబీ వదులుకుంది.. ఢిల్లీ తీసుకుంది
దుబాయ్: గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా స్థానంలో కర్ణాటకకు చెందిన ప్రవీణ్ దూబేకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం తొమ్మిది మ్యాచ్‌లు ఆడి ఏడు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఢిల్లీ.. గాయపడి టోర్నీకి దూరమైన ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేస్తోంది. ఈ క్రమంలోనే అమిత్ మిశ్రా స్థానంలో లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ దూబేను తీసుకున్నారు. ఈ మేరకు దూబేతో ఒప్పందం చేసుకుంది డీసీ. ఈ సీజన్లో అమిత్ మిశ్రా మూడు మ్యాచ్‌లే ఆడాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో మిశ్రా ఉంగరం వేలికి గాయమైంది. దాంతో అతను సీజన్ నుంచి నిష్క్రమించాడు. దాంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడం కోసం ఢిల్లీ అన్వేషణ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ప్రవీణ్ దూబే అవకాశం దక్కించుకున్నాడు. మిశ్రా టోర్నీ నుంచి వైదొలిగిన రెండు వారాల తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేశారు. ఇక ఇషాంత్ శర్మ కూడా గాయపడి టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పేస్ విభాగంలో ఢిల్లీకి ఎటువంటి ఇబ్బందులు లేవు. రబడా, నోర్జే, దేశ్‌పాండేలు పేస్ విభాగంలో ఉన్నారు. దాంతో ఇషాంత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేందుకు డీసీ తొందరపడటం లేదు.(రోహిత్ దూరమైతే.. కెప్టెన్‌గా ఎవరు?) ప్రవీణ్ దూబే ఎవరు? కర్ణాటకకు చెందిన ప్రవీణ్ దూబే.. ఈ ఏడాది ఆరంభంలో తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌ను ప్రారంభించాడు. ఇప్పటివరకూ ఒకే ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ను దూబే ఆడాడు. ఇక 8 లిస్ట్-ఎ మ్యాచ్‌లు, 14 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కాగా, ప్రవీణ్ దూబే వెలుగులోకి వచ్చింది మాత్రం 2015లో. కర్ణాటక ప్రీమియర్ లీగ్ ఆడిన సమయంలో ఆర్సీబీని ఆకర్షించాడు. దాంతో 2016లో అతన్ని ఆర్సీబీ తీసుకుంది. అతని కనీస ధర రూ. 35లక్షలకు కొనుగోలు చేసింది. అయితే రెండు సీజన్ల పాటు ఆర్సీబీ వెంటే ఉన్నాడు ప్రవీణ్ దూబే. కానీ ఆ తర్వాత అతన్ని రిలీజ్ చేయగా, ఎవరూ కొనుగోలు చేయలేదు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని తీసుకోవడంతో మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ‘ నాకు చాలా సంతోషంగా ఉంది. నా టాలెంట్‌ను గుర్తించి అవకాశం ఇచ్చినందుకు ఢిల్లీ ఫ్రాంచైజీకి థాంక్స్. నా సీనియర్లు రవి అశ్విన్, అక్షర్ పటేల్‌తో కలిసి బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా’ అని ప్రవీణ్ తెలిపాడు. చివరకు ప్రవీణ్ దూబేను తీసుకోవడంలో రికీ పాంటింగ్, మహ్మద్ కైఫ్‌ల కీలక పాత్ర పోషించారు. మేనేజ్మెంట్ను ఒప్పించి ప్రవీణ్‌కు అవకాశం కల్పించారు. -
ఇటు భువనేశ్వర్...అటు అమిత్ మిశ్రా
దుబాయ్: ఐపీఎల్లో ఇప్పటికే తడబడుతూ ముందుకు సాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ తొడ కండరాల గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. బీసీసీఐ అధికారి ఒకరు ఈ విషయాన్ని నిర్ధారించారు. ‘తొడ కండరాల గాయంతో బాధపడుతున్న భువనేశ్వర్ ఇక ఐపీఎల్లో ఆడే అవకాశం లేదు. అది గ్రేడ్–2 లేదా గ్రేడ్–3 స్థాయి గాయం కావచ్చు. దీని వల్ల కనీసం 6–8 వారాలు ఆటకు దూరం కావాల్సి ఉంటుంది. అంటే అతను ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే అవకాశం కూడా లేనట్లే’ అని ఆయన వెల్లడించారు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 19వ ఓవర్ బౌలింగ్ చేస్తూ భువనేశ్వర్‌కు గాయమైంది. అతని తొడ కండరాలు పట్టేయడంతో ఒక బంతి మాత్రమే వేసి తప్పుకున్నాడు. ఆరంభ ఓవర్లలో ప్రత్యర్థిని కట్టిపడేయడంతో పాటు డెత్ ఓవర్లలో కూడా పరుగులు నియంత్రించగల, అనుభవజ్ఞుడైన భువీ దూరం కావడం హైదరాబాద్ టీమ్ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. ఈ సీజన్లో 4 మ్యాచ్‌లలో 3 వికెట్లే తీసినా... కేవలం 6.8 ఎకానమీతో పరుగులివ్వడం భువీ విలువేమిటో చూపిస్తుంది. ఢిల్లీకి సమస్యే... సీనియర్ లెగ్‌స్పిన్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అమిత్ మిశ్రా కూడా చేతి వేలికి గాయంతో లీగ్ నుంచి నిష్క్రమించాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో నితీశ్ రాణా ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను అందుకునే క్రమంలో మిశ్రాకు గాయమైంది. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసి కీలకమైన గిల్ వికెట్ తీసిన అతనికి మ్యాచ్ తర్వాత పరీక్షలు నిర్వహించగా వేలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. తాజా పరిణామం పట్ల తాము తీవ్రంగా నిరాశ చెందుతున్నామని క్యాపిటల్స్ యాజమాన్యం పేర్కొంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మలింగ (170) తర్వాత మిశ్రా (160) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్‌లలో కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. మిశ్రా దూరమైన నేపథ్యంలో మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ తుది జట్టులోకి రావచ్చు. -
అమిత్ నీకిది తగునా..?
హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ 12లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ ద్వారా ఔటయ్యాడు. ఐపీఎల్లో ఇలా ఔటైన రెండో ఆటగాడిగా మిశ్రా నిలిచాడు. ఐపీఎల్ 2013లో రాంచీ వేదికగా పుణే వారియర్స్‌తో జరుగిన మ్యాచ్‌లో అప్పటి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు యుసఫ్ పఠాన్ కూడా సరిగ్గా ఇలానే పెవిలియన్‌కు చేరాడు. ఇక మిశ్రా తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. క్రీడా స్పూర్తికి విరుద్దంగా ఈ వెటరన్ ఆటగాడు ప్రవర్తించాడని కొందరు కామెంట్ చేశారు. పరిగెత్తేప్పుడు మిశ్రా గూగ్లీకి ప్రయత్నించాడని మరికొందరు చమత్కరించారు. అసలేం జరిగిందంటే.. ఢిల్లీ క్యాపిటల్స్-సన్‌రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి ఓవర్లో రసవత్తర డ్రామా నడిచింది. 3 బంతుల్లో 2 పరుగులు అవసరమైన స్థితిలో ఖలీల్ బంతికి షాట్ ఆడబోయి విఫలమయ్యాడు అమిత్ మిశ్రా. బంతి బీట్ అయ్యాక అతను పరుగందుకున్నాడు. వికెట్ కీపర్ సాహా బంతిని స్టంప్స్‌కు కొట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. పిచ్ మధ్యలో ఉన్న ఖలీల్ బంతిని అందుకుని నాన్-స్ట్రైకింగ్ వైపున్న స్టంప్స్ కొట్టబోయాడు. ఐతే మిశ్రా ఈ సంగతి గమనించి ఉన్నట్లుండి తన దారి మార్చుకున్నాడు. స్టంప్స్‌కు అడ్డంగా పరుగెత్తే ప్రయత్నం చేశాడు. దీంతో ఖలీల్ విసిరిన బంతి అతడికే తాకింది. దీనిపై ఖలీల్ సమీక్ష కోరాడు. మూడో అంపైర్ రీప్లే చూసి మిశ్రా ఉద్దేశపూర్వకంగానే బంతికి అడ్డం పడ్డాడని నిర్ధరించి.. ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ కింద అతడిని ఔట్‌గా ప్రకటించాడు. -
ఐపీఎల్ చరిత్రలో రెండో ఆటగాడు మిశ్రా
-
మేం తుస్ కాదు.. మీరే చూస్తారుగా!
న్యూఢిల్లీ: టీమిండియా స్పిన్నర్ అమిత్ మిశ్రా తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశాడు. తమ జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్ ఖాళీ అయిపోయిందంటూ వదంతులు ప్రచారం కావడంపై స్పందించాడు. గత ఐపీఎల్ సీజన్లలో ప్లే ఆఫ్‌కు తాము అర్హత సాధించిన విషయాన్ని గుర్తించాలన్నాడు. కేవలం ఇద్దరు కీలక ఆటగాళ్లు, దక్షిణాఫ్రికా క్రికెటర్లు క్వింటన్ డికాక్, జేపీ డుమిని జట్టుకు దూరమైనంత మాత్రాన ఢిల్లీ పనైపోయిందంటూ ప్రచారమవుతున్న ఊహాగానాలను తెరదించాడు మిశ్రా. డుమిని వ్యక్తిగత కారణాలతో తప్పుకోగా, గాయం కారణంగా డికాక్ సేవలను కోల్పోవడం బాధిస్తోందని తెలిపాడు. గాయం నుంచి కోలుకుంటే డికాక్ జట్టులో చేరతాడని ధీమా వ్యక్తం చేశాడు. కోరే అండర్సన్, కార్లోస్ బ్రాత్‌వైట్, ఏంజెలో మాథ్యూస్, రిషబ్ పంత్, కరుణ్ నాయర్, సంజు శాంసన్ లాంటి స్టార్ ప్లేయర్లో ఈసారి బరిలోకి దిగుతున్నామని ప్రత్యర్థి జట్లను హెచ్చరించాడు. 'డేర్ డెవిల్స్ 2012లో ప్లే ఆఫ్‌కు చేరుకుంది. ఆ తర్వాత ఎన్నో ఉత్తమ ప్రదర్శనలు చేశాం. గత మూడేళ్లలో జట్టులో ఎంతో మార్పు వచ్చింది. ఈ సీజన్లలో సమష్టిగా రాణించి అద్భుతాలు సృష్టిస్తాం. జహీర్‌ఖాన్, క్రిస్ మోర్గాన్, కగిసో రబాడ, పాట్ కమ్మిన్స్ లాంటి ఫాస్ట్ బౌలర్లు, నేను, జయంత్ యాదవ్, షాబాజ్ నదీమ్, ఎం అశ్విన్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లం ఉన్నాం. మ్యాచ్ గమనాన్ని మార్చివేసేందుకు ఒక్క మంచి బంతి చాలు. బ్యాట్స్‌మెన్ బంతి వైవిధ్యాన్ని అంచనా వేయకుండా బౌలింగ్ తో దాడి మొదలు పెడతాం. బ్యాట్స్మన్లు మిగతా పనిని పూర్తిచేస్తారు' అని డేర్ డెవిల్స్ ప్లేయర్ అమిత్ మిశ్రా అభిప్రాయపడ్డాడు. -
మిశ్రా స్థానంలో కుల్దీప్ యాదవ్
బంగ్లాదేశ్‌తో జరిగే ఏకైక టెస్టు నుంచి లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అతని మోకాలుకు గాయమైంది. మిశ్రా స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను భారత జట్టులోకి తీసుకున్నారు. భారత్ ‘ఎ’ తరఫున కుల్దీప్ బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడాడు. గతంలో వన్డే జట్టులోకి ఎంపికైనా అతనికి మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల కుల్దీప్ 22 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 81 వికెట్లు పడగొట్టాడు. -
టీమిండియాలో కొత్త కుర్రాడు అరంగేట్రం!
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరగనున్న ఏకైక టెస్టులో టీమిండియా సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఆడటం లేదు. టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకున్న మిశ్రాను మోకాలి గాయం బాధిస్తోంది. ఇంగ్లండ్ తో జరిగిన చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ మిశ్రా ఇంకా కోలుకోలేదు. గురువారం నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభంకానున్న ఏకైక టెస్టు నుంచి అతడికి విశ్రాంతి ఇచ్చారు. జట్టులో అశ్విన్, రవీంద్ర జడేజాలు ఆఫ్ స్పిన్నర్లు ఉన్నందున గాయపడ్డ మిశ్రా స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ తుది జట్టులో అవకాశం లభించనుంది. కుల్దీప్ యాదవ్ టెస్టు అరంగేట్రం సీనియర్ స్పిన్నర్ మిశ్రా గాయం కారణంగా యువ బౌలర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీంతో యువ బౌలర్ కుల్దీప్ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. బంగ్లాదేశ్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో కుల్దీప్ 1/32, 2/2 ప్రదర్శన చేశాడు. 22 ఫస్ట్ క్లాస్ మ్యాచులాడిన కుల్దీప్ 33.11 సగటుతో 81 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ ల్లో 5వికెట్ల ప్రదర్శనతో కుల్దీప్ ఆకట్టుకున్నాడు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని సహచరులు సన్నాహాలు మొదలుపెట్టారు. మ్యాచ్ వేదికైన ఉప్పల్ స్టేడియంలో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. -
మిశ్రా మిస్సైల్
అమిత్ మిశ్రా... నిజానికి అంతర్జాతీయ క్రికెట్లోకి ధోని కంటే ముందు వచ్చాడు. దాదాపు 13 ఏళ్ల క్రితం తను తొలి వన్డే ఆడాడు. కానీ ఇప్పటికీ అతను ఆడిన వన్డేల సంఖ్య 36. అలా అని తనేమైనా ఫెరుులయ్యాడా?అంటే లేదు. 4.72 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 64 వికెట్లు తీశాడు. మరో 15 రోజుల్లో తనకు 34 ఏళ్లు నిండుతారుు. నిజానికి ఇది ఓ క్రికెటర్ రిటైర్మెంట్కు దగ్గరైన వయసు. కానీ మిశ్రా అలా కనిపించడం లేదు. రోజు రోజుకూ మరింత చురుగ్గా తయారవుతున్నాడు. ఒక రకంగా సుదీర్ఘ కెరీర్లో తన నైపుణ్యానికి తగిన గుర్తింపు మిశ్రాకు దక్కలేదు. అనిల్ కుంబ్లే రిటైరైన తర్వాత మారిన పరిణామాలు, కూర్పులతో మరో లెగ్ స్పిన్నర్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమైంది. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్, ఆల్‌రౌండర్‌గా జడేజా లేదా మరో స్పిన్ ఆల్‌రౌండర్ కారణంగా లెగ్ స్పిన్నర్‌కు అవకాశం లేకపోరుుంది. నిజానికి ఈ సిరీస్‌లోనూ అశ్విన్‌కు విశ్రాంతి ఇవ్వకపోరుు ఉంటే మిశ్రా తుది జట్టులో ఉండేవాడు కాదేమో. ఇంతటి క్లిష్ట స్థితిలో కూడా తనకు లభించిన ప్రతి చిన్న అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్న మిశ్రాకు ఇంతకాలానికై నా గుర్తింపు లభించింది. కానీ మిశ్రా రాబోయే మ్యాచ్‌ల్లో కూడా తుది జట్టులో ఉంటాడా అనేదే అసలు ప్రశ్న. సాక్షి క్రీడావిభాగం షేన్ వార్న్, అనిల్ కుంబ్లే రిటైరైన తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో లెగ్ స్పిన్నర్ల వైభవం కాస్త తగ్గిందనే చెప్పుకోవాలి. కానీ మొహాలీ వన్డేలో టేలర్, రోంచీ అవుటైన బంతులు, విశాఖపట్నంలో నీషమ్ అవుటైన బంతిని చూస్తే లెగ్ స్పిన్ కళను మిశ్రా బతికిస్తున్నాడని అనిపించింది. ఈ మూడు బంతులూ అద్భుతాలే. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ తర్వాత మరోసారి అమిత్ మిశ్రా గురించి చర్చ మొదలైంది. వైజాగ్ వన్డేలో తను ఐదు వికెట్లు తీయడం ద్వారా... స్పిన్‌కు సహకరించే పిచ్‌లపై తన అవసరం ఎంత ఉందో మరోసారి చూపించాడు. రాబోయే ఇంగ్లండ్ సిరీస్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడితే మిశ్రా కచ్చితంగా తుది జట్టులో ఉంటాడు. ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లే చాలనుకుంటే మరోసారి బెంచ్‌కే పరిమితం కావలసి వస్తుందేమో అనే ఆందోళన ఉంది. అరుుతే వన్డేల్లో ప్రదర్శన ద్వారా తను కచ్చితంగా టెస్టుల్లో తుది జట్టులోనూ రేసులోకి వచ్చాడు. వికెట్ల స్పెషలిస్ట్ జట్టుకు అవసరమైన సందర్భంలో వికెట్ తీయాలంటే మిశ్రా ఉండాలి. ‘మిశ్రాకు బంతి ఇస్తే కచ్చితంగా వికెట్ తీస్తాడు’ అన్ని స్థారుుల క్రికెట్లోనూ తనకు ఈ పేరు ఉంది. వన్డేల్లో మధ్య ఓవర్లలో బ్యాట్స్‌మెన్ భారీ షాట్లకు వెళ్లకుండా నెమ్మదిగా ఆడే సమయంలో వికెట్లు తీయడంలో తను నిపుణుడు. 2014లో బంగ్లాదేశ్‌లో జరిగిన టి20 ప్రపంచకప్‌లో మిశ్రా 10 వికెట్లు తీశాడు. అశ్విన్ 11 వికెట్లు తీయగా... రెండో స్థానం మిశ్రాదే. కానీ రెండేళ్ల పాటు తనకు మరో టి20 మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. స్వదేశంలో జరిగిన టోర్నీలోనూ తనను తీసుకోలేదు. జింబాబ్వేలో ద్వితీయశ్రేణి ఆటగాళ్లతో సిరీస్ ఆడిన సమయంలో మాత్రమే తనకు మళ్లీ అవకాశం వచ్చింది. నిజానికి దీనికి ఎవరినీ తప్పుబట్టలేం. మిశ్రా ఫీల్డింగ్‌లో బాగా నెమ్మది. బ్యాటింగ్‌లోనూ లోయర్ ఆర్డర్లో పెద్దగా ఉపయోగపడడు. ఈ రెండు కారణాల వల్ల తను కాస్త వెనకబడ్డ మాట వాస్తవం. అందుకే గత ఏడాది కాలంలో తను ఈ రెండు అంశాలపై దృష్టి పెట్టాడు. ఇప్పుడు కాస్త మెరుగయ్యాడు. నిజానికి తన బ్యాటింగ్ ఇంకాస్త మెరుగుపడితే కచ్చితంగా తను తుది జట్టులో ఉంటాడు. తన కెరీర్లో మిశ్రా ఐదు వన్డేల సిరీస్‌లో పూర్తిగా ఐదు మ్యాచ్‌లు ఇప్పటికి రెండుసార్లు మాత్రమే ఆడాడు. రెండు సందర్భాల్లోనూ ఒకసారి 18 వికెట్లు, ఒకసారి 15 వికెట్లు తీశాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్ల రికార్డుల జాబితాలో తొలి రెండు స్థానాలు మిశ్రావే. ఈ గణాంకం చాలు... తనకు పూర్తి స్థారుులో అవకాశం లభిస్తే ఏం చేయగలడో చెప్పడానికి. ఆశావహ దృక్పథం... నిజానికి జట్టుతో పాటే తిరుగుతూ తుది జట్టులో అవకాశం రాకుండా నెలలు నెలలు గడపడం చాలా కష్టం. మ్యాచ్‌లో లేకపోరుునా పూర్తిగా ఫిట్నెస్తో ఉండాలి. ఎప్పుడు అవకాశం వచ్చినా కచ్చితంగా రాణించాలనే ఒత్తిడి ఉంటుంది. మానసికంగా కూడా ఇది చాలా కష్టం. అరుునా మిశ్రా నిరాశపడకుండా వేచి చూశాడు. ‘నా చేతుల్లో లేని అంశం గురించి నేనెప్పుడూ ఆలోచించను. నా ఫిట్నెస్ను, బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకోవడమే నా చేతుల్లో ఉంది. అది తప్ప వేరే ఏదీ ఆలోచించను. అవకాశం వచ్చినప్పుడు నా పూర్తి సామర్థ్యంతో జట్టుకు ఉపయోగపడటమే క్రికెటర్‌గా నా లక్ష్యం’ అని మిశ్రా చెప్పాడు. ఆశావహ దృక్పథంతో ముందుకు వెళ్లడం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఇప్పటికీ అవకాశం దొరికిన ప్రతిసారీ మెరుస్తున్నాడు. అన్ని చోట్లా నిలకడ... కెరీర్ ఆరంభం నుంచి మిశ్రా ఫామ్‌లో లేడనో, సరిగా ఆడటం లేదనో మాట ఇప్పటివరకూ వినపడలేదు. రంజీల్లో హరియాణా జట్టుకు దశాబ్దానికి పైగా వెన్నెముకలా నిలిచాడు. అలాగే ఐపీఎల్లో మూడుసార్లు హ్యాట్రిక్ తీసిన ఒకే ఒక్క బౌలర్‌గా ఘనత సాధించాడు. భారత టెస్టు జట్టులోనూ ఏనాడూ నిరాశపరచలేదు. 2015లో శ్రీలంకలో జరిగిన సిరీస్‌లో ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతో ఆడాలని కోహ్లి భావించడం మిశ్రాకు కలిసొచ్చింది. ఆ సిరీస్‌లో అశ్విన్‌కు ధీటుగా రాణించి 15 వికెట్లు తీశాడు. అప్పటి నుంచి జట్టుతో పాటే ఉన్నా... తుది జట్టులో అవకాశాలు పెద్దగా రాలేదు. నిజానికి మిశ్రా టాలెంట్‌ను భారత్ పూర్తిగా ఉపయోగించుకోలేదు. వయసు దృష్ట్యా తను మహా అరుుతే మరో మూడు, నాలుగేళ్లు ఆడతాడేమో. కాబట్టి కెరీర్ చివరి దశలో అరుునా తనకు అవకాశాలు పెరిగితే... అది భారత క్రికెట్‌కే మేలు చేస్తుంది. కుంబ్లే ప్రోత్సాహం నిజానికి మిశ్రా కెరీర్ ఆలస్యం కావడానికి కుంబ్లే కూడా ఓ కారణం. కుంబ్లే బాగా ఆడుతున్న సమయంలోనే మిశ్రా కెరీర్ కూడా మొదలైంది. ఇద్దరు లెగ్ స్పిన్నర్లకు అవకాశం ఉండదు కాబట్టి సహజంగానే అవకాశాలు రాలేదు. 2008లో మొహాలీలో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ సందర్భంగా కుంబ్లే అనారోగ్యం కారణంగా మిశ్రాకు తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. ఆ మ్యాచ్‌లో తన తొలి ఇన్నింగ్సలోనే ఐదు వికెట్లు తీసి సత్తా చాటి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత అదే సిరీస్‌లో తర్వాతి మ్యాచ్‌తోనే కుంబ్లే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో మిశ్రాకు ఇక తిరుగులేదని భావించారు. కానీ మూడేళ్లలోనే పరిస్థితి మారిపోరుుంది. అశ్విన్ శకం మొదలైంది. అప్పటినుంచి ముగ్గురు స్పిన్నర్లు ఆడితే తప్ప మిశ్రాకు తుది జట్టులో చోటు లేని పరిస్థితి. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ కుంబ్లే కోచ్‌గా డ్రెస్సింగ్‌రూమ్‌లోకి వచ్చాడు. ఒక లెగ్ స్పిన్నర్ బాధను మరో లెగ్ స్పిన్నర్ బాగా అర్థం చేసుకుంటాడన్నట్లు... మిశ్రా పరిస్థితి కోచ్‌కు అర్థమైంది. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో మూడు మ్యాచ్‌లకూ మిశ్రా డ్రెస్సింగ్‌రూమ్‌కే పరిమితమయ్యాడు. ‘ఆందోళన వద్దు. నీకూ సమయం వస్తుంది’ అని కుంబ్లే ధైర్యం చెప్పాడట. కోచ్ సలహాలు తన బౌలింగ్ శైలిలోనూ మార్పులు తెచ్చాయని చెప్పాడు. ‘ఫీల్డర్లను ఎలా సెట్ చేసుకోవాలి, బంతుల్లో మార్పులు లాంటి విషయాలతో పాటు మానసికంగా దృఢంగా తయారు కావడానికి కుంబ్లే సలహాలు ఉపయోగపడ్డారుు. అలాగే బ్యాటింగ్‌లో మెరుగుపడటం ఎందుకు కీలకమో వివరించాడు. అనిల్ భాయ్ సలహాలు నాలో ఎంతో మార్పు తెచ్చారుు’ అని మిశ్రా చెప్పాడు. -
అతడే నాకు అండ: అమిత్ మిశ్రా
విశాఖపట్నం: తన కెరీర్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం పట్ల టీమిండియా స్పిన్నర్ అమిత్ మిశ్రా సంతోషం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్ తో శనివారం జరిగిన ఐదో వన్డేలో 5 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు మాట్లాడుతూ... 'నా కెరీర్ లో ఆరోజు చాలా మంచి ప్రదర్శన చేశాను. నేను వికెట్లు తీయాలని ప్రతిఒక్కరు ఆశిస్తారు. అంచనాలకు అనుగుణంగా రాణించాను. గతంలో సాధించిన వాటి గురించి ఆలోచించలేదు. ఈరోజు మ్యాచ్ పైనే పూర్తిగా దృష్టి పెట్టాను. తదనుగుణంగా బౌలింగ్ చేశాన'ని అమిత్ మిశ్రా తెలిపాడు. టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే తనకు అండగా నిలబడడం వల్లే తానేంటో నిరూపించుకున్నానని అన్నాడు. కుంబ్లే సహకారం ఎప్పటికీ మరువలేనని, తన కష్టానికి ఫలితం దక్కిందని పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అమిత్ మిశ్రా గతంలోనూ సత్తా చాటాడు. రవిచంద్రన్ అశ్విన్ విశ్రాంతి తీసుకోవడంతో వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. కివీస్ తో ముగిసిన 5 వన్డేల సిరీస్ లో 15 వికెట్లు పడగొట్టి ఈ టోర్నిలో టాప్ బౌలర్ గా నిలిచాడు. -
వన్డే సిరీస్ టీమిండియా కైవసం.
-
భారత్ ‘జిగేల్’
ఐదు వికెట్లతో చెలరేగిన అమిత్ మిశ్రా సిరీస్ 3-2తో ధోని సేన సొంతం చివరి వన్డేలో 190 పరుగులతో న్యూజిలాండ్‌పై అద్భుత విజయం వెలుగుల పండుగకు ఒక రోజు ముందే భారత క్రికెట్ అభిమానులు దీపావళి చేసుకున్నారు. మన బౌలింగ్ ‘బాంబు’ అదిరేలా పేలడంతో విశాఖలో కివీస్ ‘తుస్’మంది. మిశ్రా ‘మిస్సైల్’ దాడికి ఆ జట్టు తునాతునకలైంది. వన్డే సిరీస్ అంతటా ఆకట్టుకున్న న్యూజిలాండ్ బ్యాటింగ్... అసలు సమయంలో పేలని టపాసులా తుస్‌మంది. ఎప్పటిలాగే సీజన్‌తో సంబంధం లేకుండా వెలుగులు విరజిమ్మే కోహ్లితో పాటు ‘దోసౌవాలా’ రోహిత్ తారాజువ్వలా ఉవ్వెత్తున ఎగిస్తే... చిన్నపాటి చిచ్చుబుడ్లలా ధోని, జాదవ్‌ల ఆట పండుగ వెలుగులు తెచ్చింది. మొత్తం మీద భారత జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో న్యూజిలాండ్‌ను చీకటిలోకి పంపుతూ సగర్వంగా సిరీస్‌ను చేజిక్కించుకుంది. పదమూడేళ్ల వన్డే కెరీర్... ఆడిన మ్యాచ్‌లు మాత్రం నాలుగు పదులు దాటలేదు... జట్టుతోనే ఉన్నా మ్యాచ్‌లో ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు తీసేస్తారో తెలీదు. కానీ అమిత్ మిశ్రా మాత్రం తన ఆటపై పట్టును, పట్టుదలను కోల్పోలేదు. ఒక లెగ్‌స్పిన్నర్‌గా కుంబ్లే గర్వంగా చూస్తుండగా... భూచక్రాల్లా తిరుగుతూ అందకుండా వెళ్లిన గుగ్లీలతో కివీస్ పతనాన్ని శాసించి కోచ్‌కు కృతజ్ఞతలు ప్రకటించాడు. ‘ఈ సారి అంటించడం నా వంతు’ అన్న తరహాలో 19 బంతుల వ్యవధిలో 5 వికెట్లు తీసి అద్భుతం చేశాడు. వైజాగ్ గత రికార్డుతో పోలిస్తే అసాధ్యమేమీ కాకపోరుునా మరీ 79 పరుగులకే ఆట ముగించి కివీస్ పర్యటన ముగించింది. టెస్టు సిరీస్‌లో ఏకపక్షంగా 3-0తో ఘన విజయం అనంతరం వన్డేల్లో తడబాటుతో సిరీస్‌తో 2-2తో సమంగా నిలిచిన స్థితి. ఈ సమయంలో ధోని తన ఆటతో, వ్యూహంతో కివీస్‌ను చిత్తుగా ఓడించి పరువు పోకుండా (పోగొట్టుకోకుండా) కాపాడుకున్నాడు. ఒత్తిడిలో బరిలోకి దిగి చివరకు గెలుపుతో అందరికీ ఆనందం పంచాడు. సొంతగడ్డపై విజయంతో మొదలైన కొత్త సీజన్లో తొలి అంకం ఇప్పుడు విజయంతో ముగిసింది. ఇక ధోనికి మరి కొద్ది రోజులు ప్రశాంతంగా విశ్రాంతి... వచ్చే నెల 9నుంచి ఇంగ్లండ్‌తో కోహ్లి కొత్త ఆట (టెస్టులు) మొదలు! విశాఖపట్నం: సాగర తీరంలో భారత జట్టు అద్భుతం చేసింది. గత మ్యాచ్ వరకు తడబాటుగా సాగిన ఆటతో చివరి వన్డేకు ముందు సందేహాలు రేకెత్తించిన ధోని బృందం తమ అసలు సత్తాను ప్రదర్శించింది. కనీస పోటీకి కూడా అవకాశం లేకుండా న్యూజిలాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించి సిరీస్‌ను 3-2తో సొంతం చేసుకుంది. శనివారం ఇక్కడి వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఐదో వన్డేలో భారత్ 190 పరుగుల భారీ తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (65 బంతుల్లో 70; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లి (76 బంతుల్లో 65; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేయగా, ధోని (59 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం న్యూజిలాండ్ 23.1 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. విలియమ్సన్ (27)దే టాప్ స్కోరు. 18 పరుగులకే 5 వికెట్లు పడగొట్టిన అమిత్ మిశ్రా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకోవడంతో పాటు మొత్తం 15 వికెట్లతో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా కూడా నిలిచాడు. ఈ సిరీస్‌లో ధర్మశాల, మొహాలీ, వైజాగ్‌లలో జరిగిన మ్యాచ్‌లలో భారత్ గెలవగా, న్యూఢిల్లీ, రాంచీలలో కివీస్ విజయం అందుకుంది. ఈ పర్యటనలో కివీస్ టెస్టు, వన్డే సిరీస్‌లు రెండూ కోల్పోరుుంది. రోహిత్ మెరిశాడు సిరీస్ ఫలితాన్ని తేల్చే మ్యాచ్‌లో భారత జట్టు ధావల్ స్థానంలో బుమ్రాకు తిరిగి చోటు కల్పించగా, హార్దిక్ పాండ్యా స్థానంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం జయంత్ యాదవ్‌కు లభించింది. కివీస్ టీమ్‌లో డెవ్‌సిక్ స్థానంలో అండర్సన్ వచ్చాడు. సిరీస్‌లో గత వన్డేలతో పోలిస్తే విశాఖ పిచ్ చాలా నెమ్మదిగా కనిపించింది. దీంతో ఆరంభంలో భారత జట్టు జాగ్రత్తగా ఆడింది. ముఖ్యంగా రహానే (39 బంతుల్లో 20; 3 ఫోర్లు) కాస్త ఇబ్బంది పడ్డాడు. అరుుతే సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లలో విఫలమైన రోహిత్ అసలు పోరులో తన సత్తా ప్రదర్శించాడు. పవర్‌ప్లే చివరి ఓవర్లో రహానే అవుటైన తర్వాత భారత్ స్కోరు 45 పరుగులు. తొలి పది ఓవర్లలో 19 బంతులు మాత్రమే ఆడే అవకాశం వచ్చిన రోహిత్ ఆ తర్వాత చెలరేగిపోయాడు. నీషమ్, సోధి ఓవర్లలో అతను కొట్టిన సిక్సర్లు హైలైట్‌గా నిలిచారుు. అరుుతే 17వ ఓవర్లో సింగిల్ తీసే ప్రయత్నంలో అతని కండరాలు పట్టేయడంతో ఫిజియో సహాయం తీసుకోవాల్సి వచ్చింది. చికిత్స తర్వాత సోధి ఓవర్లో ఫోర్‌తో 49 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్, అదే ఓవర్లో మరో భారీ సిక్సర్ బాదాడు. అరుుతే 66 పరుగుల వద్ద టేలర్ క్యాచ్ వదిలేసినా... దానిని ఉపయోగించుకోవడంలో విఫలమైన అతను తర్వాతి ఓవర్లో వెనుదిరిగాడు. రోహిత్, కోహ్లి రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. అనంతరం కోహ్లి, ధోని కలిసి ఇన్నింగ్‌సను నడిపించారు. తన తొలి 22 బంతుల్లో 8 పరుగులే చేసిన ధోని...సోధి ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టి ఊపు మీదకు రాగా, కోహ్లి కూడా మరో భారీ సిక్స్‌తో వేగం పెంచాడు. ఈ జోడి కుదురుకునే ప్రయత్నంలో తొలి 40 బంతుల్లో 20 పరుగులే జోడించినా... తర్వాతి 52 బంతుల్లో 51 పరుగులు జత చేసింది. 71 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం తర్వాత ధోని వెనుదిరగ్గా, పాండే (0) విఫలమయ్యాడు. 44వ ఓవర్లో 220 పరుగుల వద్ద కోహ్లి వెనుదిరిగినప్పుడు జట్టు పరిస్థితి ఇబ్బందకరంగా కనిపించింది. కానీ కేదార్ జాదవ్ (37 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (18 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్) ఆరో వికెట్‌కు 39 బంతుల్లోనే 46 పరుగులు జత చేయడంతో జట్టు మెరుగైన స్కోరు చేసింది. ఐదుగురు డకౌట్ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ జట్టు స్వీయ విధ్వంసానికి పాల్పడింది. ఒక్క ఆటగాడు కూడా కనీస ప్రదర్శన ఇవ్వలేక చేతులెత్తేశాడు. క్రీజ్‌లోకి వచ్చీ రావడంతో వికెట్ ఇచ్చేసి భారత్ విజయాన్ని మరింత సునాయాసం చేశారు. తొలి ఓవర్లోనే అద్భుత బంతితో గప్టిల్ (0)ను అవుట్ చేసి ఉమేశ్ భారత్‌కు శుభారంభం ఇచ్చాడు. ఆ తర్వాత విలియమ్సన్ రెండో వికెట్‌కు లాథమ్ (17 బంతుల్లో 19; 3 ఫోర్లు)తో 28 పరుగులు, మూడో వికెట్‌కు టేలర్ (32 బంతుల్లో 19; 1 ఫోర్)తో కలిసి 35 పరుగులు జోడించడం మినహా కివీస్ ఏమీ చేయలేకపోరుుంది. ఒక దశలో 63/2తో మెరుగ్గా కనిపించిన ఆ జట్టు మరో 17 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 8 వికెట్లు కోల్పోరుుంది. ఇందులో 5 మిశ్రానే పడగొట్టడం విశేషం. అక్షర్‌కు 2 వికెట్లు దక్కగా, కెరీర్లో తొలి మ్యాచ్ ఆడిన జయంత్ కూడా ఒక వికెట్‌తో సంబరంలో పాలుపంచుకున్నాడు. 1 పూర్తిగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఆడిన అతి తక్కువ ఓవర్లు (23.1) ఇవే. 5 భారత గడ్డపై ఒక జట్టులో ఐదుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్ కావడం ఇదే తొలిసారి. -
అమిత్ మిశ్రా అరుదైన రికార్డు
విశాఖ: న్యూజిలాండ్ తో జరిగిన చివరిదైన ఐదో వన్డేలో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన స్పిన్నర్ అమిత్ మిశ్రా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కించుకున్నాడు. ఇక్కడ జరిగిన మ్యాచ్ లో మిశ్రా ఆరు ఓవర్లు వేయగా అందులో 2 మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి. కాగా, 18 పరుగులే ఇచ్చిన మిశ్రా ఐదు వికెట్లు తీసి కివీస్ పతనాన్ని శాసించాడు. 15 ఓవర్ల వరకు పరవాలేదు అనుకున్న కివీస్ ఇన్నింగ్స్ మిశ్రా రంగంలోకి దిగాక పరిస్థితి మారిపోయింది. న్యూజిలాండ్ తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా మిశ్రా(15 వికెట్లు) నిలిచాడు. గతంలో షేన్ వార్న్, డారెన్ గాఫ్, సునీల్ నరైన్ లు 13 వికెట్లతో ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును బ్రేక్ చేశాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ నుంచి కివీస్ ఆటగాళ్ల తీరు సైకిల్ స్టాండ్ ను తలపించింది. అందుకు కారణం స్పిన్నర్ మిశ్రా. 16వ ఓవర్లో రెండు వికెట్లు తీసి బ్రేక్ ఇచ్చాడు. ఆ ఓవర్ నాలుగో బంతికి రాస్ టేలర్(19) ని, చివరి బంతికి వాట్లింగ్(0)ను క్లీన్ బౌల్డ్ చేసి భారత్ ను ఆధిక్యంలోకి తెచ్చాడు. తన అద్బుత బంతులతో కివీస్ ఆటగాళ్లను గింగిరాలు తిప్పిన మిశ్రా.. ఆ తర్వాత నీషమ్, టీమ్ సౌథీ, సోదీలను కూడా ఔట్ చేసి ఐదు వికెట్ల ఘనత(5/18) దక్కించుకున్నాడు. ఐదుగురు కివీస్ బ్యాట్స్ మన్ ఖాతా తెరవకుండానే డకౌట్ అవగా, అందులో ముగ్గురిని మిశ్రా పెవిలియన్ కు చేర్చాడు. -
ఆ అనుభూతి బాగుంది: అమిత్ మిశ్రా
-
ఆ అనుభూతి బాగుంది: అమిత్ మిశ్రా
మొహాలి:న్యూజిలాండ్ తో వన్డే సిరీస్‌లో భాగంగా భారత ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ గైర్హాజరీతో జట్టులో చోటు దక్కించుకున్న అమిత్ మిశ్రా తన సీనియారిటీపై ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం వన్డే సిరీస్ ఆడుతున్న భారత జట్టులోని యువకులు తన నుంచి అనేక సలహాలు తీసుకోవడం చాలా సంతృప్తికరంగా ఉందన్నాడు. 'నా అనుభవం కారణంగా యువ క్రికెటర్లకు అనేక సలహాలు ఇస్తున్నా. జట్టులోని యువ క్రికెటర్లు నా నుంచి కొన్ని సూచనలు తీసుకుంటున్నారు. అలా అడిగిన వారికి కొన్ని టిప్స్ ఇస్తున్నా. ఒక గేమ్ ఆడేటప్పుడే కాకుండా , మిగతా సమయాల్లో కూడా యువ క్రికెటర్లకు నాకు చేతనైన సాయం చేస్తున్నా. ఈ పాత్రతో నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. అలా సలహాలివ్వడం నాకు కర్తవ్యంలో భాగంగానే భావిస్తున్నా.ప్రత్యేకంగా అక్షర్ పటేల్, కేదర్ జాదవ్‌లతో నా అనుభవాన్ని పంచుకుంటున్నా. ఆ అనుభూతి బాగుంది ' అని అమిత్ మిశ్రా అన్నాడు. భారత కోచ్ అనిల్ కుంబ్లేతో కలిసి పని చేయడం అద్భుతంగా ఉందని మిశ్రా పేర్కొన్నాడు. జట్టులోని సభ్యుల్ని మానసికంగా బలంగా ఉంచడంలో కుంబ్లే తన పనిని సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాడని కొనియాడాడు. తాను తుది జట్టులో లేకపోయినా, కుంబ్లే మ్యాచ్ గురించి అనేక విషయాలు చర్చిస్తాడన్నాడు. ఇది ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు. ఈ వన్డే సిరీస్‌లో ఇప్పటివరకూ జరిగిన రెండు వన్డేల్లో మిశ్రా ఆకట్టుకున్నాడు. ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో మూడు వికెట్లు సాధించిన మిశ్రా.. ఢిల్లీ మ్యాచ్‌లో కూడా మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. -
అతడిని తీసుకుని రిస్క్ చేశాం: ధోని
లాడర్‌హిల్: వెస్టిండీస్ తో జరిగిన రెండో టి20లో అమిత్ మిశ్రాను తీసుకుని రిస్క్ చేశామని టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని అన్నాడు. అమిత్ మిశ్రా ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఆదివారం జరిగిన రెండో టి20 వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని మాట్లాడుతూ.. ‘మా బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు. 150 ఛేదించదగిన స్కోరు. అయితే మేమే గెలుస్తామని కచ్చితంగా చెప్పలేను. మా బ్యాటింగ్ బలంగా ఉంది. బిన్నీ స్థానంలో అమిత్ మిశ్రాను తీసుకుని కొద్దిగా రిస్క్ చేశాం. ఎందుకంటే మాకు ఒక బ్యాట్స్‌మన్ తగ్గుతాడు. అయితే ఈ వికెట్ కు లెగ్ స్పిన్నర్ అవసరమని భావించి అమిత్ మిశ్రాను తీసుకున్నాం. అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అశ్విన్ నుంచి అతడికి మంచి సహకారం లభించింది. ఇద్దరూ మంచి ప్రదర్శన చేశారు. అమెరికాలో మరిన్ని మ్యాచ్ లు నిర్వహించాలని కోరుకుంటున్నాన’ని చెప్పాడు. -
ఒత్తిడి పెంచడంలో సక్సెస్ అయ్యాను
జమైకా: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో మూడు వికెట్లే తీసినా, జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించానని లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా పేర్కొన్నాడు. బ్యాటింగ్ లో రాణించిన మిశ్రా హాఫ్ సెంచరీ(53)తో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత పేసర్లు ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ చెరో నాలుగు వికెట్లతో చెలరేగగా, రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ అద్భుత ప్రదర్శన(7/83) తో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ఉమేష్, షమీ వికెట్లు పడగొడుతుంటే విండీస్ ఆటగాళ్లపై మరో ఎండ్ నుంచి తాను మరింత ఒత్తిడి పెంచానని చెప్పాడు. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ చెలరేగుతుంటే మరో ఎండ్ లో అతనికి సహకారం అందించానన్నాడు. వ్యక్తిగతంగా రాణించలేరని, ఇతర బౌలర్లతో కలిసి ప్రత్యర్థి బ్యాట్స్ మన్లపై ఎదురుదాడికి దిగితే వికెట్లు సాధించడం సులభమని అభిప్రాయపడ్డాడు. అశ్విన్, తాను కలిసి నెలకొల్పిన సెంచరీ పైగా పరుగుల భాగస్వామ్యంతో భారత్ తమ తొలి ఇన్నింగ్స్ లో 550 పైచిలకు పరుగులు చేయగలిగిందని, తన ప్రదర్శనపై హర్షం వ్యక్తంచేశాడు. ప్రధాన ఆటగాళ్లతో పాటు టెయిలెండర్ల వికెట్లు తీయడంపై కూడా డ్రెస్సింగ్ రూములో చర్చించినట్లు అమిత్ మిశ్రా వివరించాడు. -
'విరాట్ హద్దులు విధించలేదు'
బసెటెర్రె (సెయింట్ కిట్స్): వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వార్మప్ మ్యాచ్‌లో ఆకట్టుకున్న అమిత్ మిశ్రా.. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లి ఎప్పుడూ సానుకూల దృక్పథంతోనే ఉంటూ, జట్టును ఉత్తేజ పరుస్తుంటాడని కొనియాడాడు. 'విరాట్ లోని సానుకూల ధోరణితో జట్టులో మంచి వాతావరణం నెలకొంది. అతను ఎప్పుడూ నాకు సహకారం అందిస్తూనే ఉంటాడు. నాకు ఎటువంటి హద్దులను విరాట్ విధించలేదు. ఏ సందర్భంలోనైనా అతనితో మాట్లాడాలిస్తే వస్తే నా అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెబుతా. నాకు విరాట్ చెప్పేది ఒకటే. నీకు వికెట్లు సాధించే సత్తా ఉంది. నువ్వు ఏ రకంగా అయితే వికెట్లు సాధిస్తావని అనుకుంటున్నావో అదే చేయి. నీ బలాన్ని నీవు నమ్ముకో. మిగతా విషయాలు ఏమీ పట్టించుకోవద్దు' అని మద్దతిస్తుంటాడని మిశ్రా తెలిపాడు. వెస్టిండీస్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ లో మిశ్రా 27 ఓవర్లలో 67 పరుగులిచ్చి 4 వికెట్లతో రాణించాడు. మరోవైపు భువనేశ్వర్ కుమార్, షమీ, ఉమేశ్ యాదవ్ తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్లు లోకేశ్ రాహుల్ (50), శిఖర్ ధావన్ (51)కు తోడు రోహిత్ శర్మ (54 నాటౌట్; 8 ఫోర్లు; 1 సిక్స్) కూడా అర్ధ సెంచరీలతో ఆకట్టుకోవడంతో టెస్టు సిరీస్ కు ముందు టీమిండియాకు మంచి ప్రాక్టీస్ లభించింది. -
అమిత్ మిశ్రా అదుర్స్
బసెటెర్రె (సెయింట్ కిట్స్): స్పిన్నర్ అమిత్ మిశ్రా సత్తా చాటడంతో వెస్టిండీస్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ను టీమిండియా డ్రా చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి రోజును భారత్ ఆరు వికెట్లకు 258 పరుగుల వద్ద ముగించింది. ఓపెనర్లు లోకేశ్ రాహుల్ (50), శిఖర్ ధావన్ (51)కు తోడు రోహిత్ శర్మ (54 నాటౌట్; 8 ఫోర్లు; 1 సిక్స్) కూడా అర్ధ సెంచరీలతో రాణించాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీమ్ 87 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. షాయి హోప్(118) సెంచరీ సాధించాడు. రాజేంద్ర చంద్రిక(69), వారికన్(50) అర్ధసెంచరీలతో రాణించారు. మిగతా బ్యాట్స్మెన్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు పడగొట్టాడు. 27 ఓవరల్లో 67 పరుగులిచ్చి 4 వికెట్లు నేలకూల్చాడు. భువనేశ్వర్ కుమార్, షమీ, ఉమేశ్ యాదవ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
అమిత్ మిశ్రాకు మందలింపు
ఢిల్లీ:ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా మ్యాచ్ రిఫరీ హెచ్చరికకు గురయ్యాడు. శనివారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో అమిత్ మిశ్రా దురుసుగా ప్రవర్తించడంతో అతన్ని మ్యాచ్ రిఫరీ మందలించాడు. కోల్ కతా ఆటగాడు ఆండ్రీ రస్సెల్ వికెట్ తీసిన అనంతరం అతనిపై నేరుగా మిశ్రా అసభ్యపదజాలం ప్రయోగించాడు. ఐపీఎల్ కోడ్ ఆర్టికల్ 2.1.4 ప్రకారం ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో మిశ్రా మందలింపుకు గురయ్యాడు. ఇది లెవల్-1 ఉల్లంఘన కావడంతోపాటు, మొదటి తప్పు కావడంతో మిశ్రాను హెచ్చరించి వదిలేశారు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 27 పరుగుల తేడాతో కోల్ కతాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
అమిత్ మిశ్రాకు అదృష్టం కలిసిరాలేదా?
న్యూఢిల్లీ: ప్రత్యర్థి బౌలర్ అమిత్ మిశ్రాపై పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ డేవిడ్ మిల్లర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అదే సమయంలో ఈ లెగ్ స్పిన్నర్‌కు అదృష్టం కలిసిరాలేదని ఒకింత ఆవేదన వ్యక్తం చేశాడు. నిజానికి అమిత్ ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన ఘనత సొంతం చేసుకొని ఉండేవాడని, కానీ ఆ అవకాశం అతనికి రాలేదని చెప్పాడు. మూడు ఓవర్లలో 11 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టిన అమిత్ మిశ్రా ఢిల్లీ డేర్‌డెవిల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మిల్లర్‌తోపాటు ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్ అయిన షాన్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్ ను తన స్పిన్ బౌలింగ్‌తో బోల్తా కొట్టించాడు అమిత్. అతని పర్ఫార్మెన్స్పై మిల్లర్ మాట్లాడుతూ 'మిశ్రాకు అదృష్టం కలిసిరాలేదు. అతను ఐదు వికెట్లు లభించలేదు. అతను గ్రేట్ బౌలర్. నన్ను, మాక్స్వెల్ ను, మార్ష్‌ను ఔట్ చేసి.. గేమ్ ఛేంజర్‌గా నిలిచాడు' అని చెప్పాడు. ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్లా మైదానంలోని బౌలింగ్ పిచ్‌పై మిల్లర్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. 'నిజానికి లో స్కోరింగ్‌తో గేమ్ గతి మారిపోయింది. మేం వరుసగా వికెట్లు కోల్పోవడం మ్యాచ్ గమనాన్ని మార్చింది. పిచ్ బాగానే ఉంది' అని చెప్పాడు. -
ఆ వికెటే టర్నింగ్ పాయింట్: అమిత్ మిశ్రా
న్యూఢిల్లీ: అనుభవానికి నైపుణ్యం జోడించి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఈ సీజన్లో తొలి విజయాన్ని అందించాడు లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా. గింగిరాలు తిరిగే తన బౌలింగ్‌తో విదేశీ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించిన అమిత్.. పంజాబ్ కెప్టెన్ డేవిడ్ మిల్లర్ వికెట్‌ను పడగొట్టడం మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ అని, అతని వికెట్ పడటంతో మిగతా బ్యాట్స్‌మెన్ ఒత్తిడిలో కూరుకుపోయారని అభిప్రాయపడ్డాడు. అద్భుతమైన బౌలింగ్‌తో అమిత్ మిశ్రా నాలుగు వికెట్లు తీయడంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 111 పరుగులకే పరిమితమైన సంగతి తెలిసిందే. స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి ఢిల్లీ తొలి విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన సీనియర్ బౌలర్ అమిత్ మాట్లాడుతూ 'మాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. కొన్ని వీడియోలు కూడా చూశాను. పంజాబ్ బ్యాట్స్‌మెన్ భారీ షాట్లకు ప్రయత్నిస్తే.. వారిని ఎలా పెవిలియన్‌కు పంపాలనే దానిపై కెప్టెన్ జాక్ (జహీర్ ఖాన్)తోనూ చర్చించాను. ఆ వ్యూహాలు ఫలించడం ఆనందంగా ఉంది' అని చెప్పాడు. ఈ ప్రదర్శన ద్వారా వందో మ్యాచ్‌లో పర్పుల్ క్యాప్ పొందడం ఆనందంగా ఉందని తెలిపాడు. శ్రీలంక బౌలర్ లసిత్ మలింగా తర్వాత ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అమిత్ మిశ్రా చరిత్ర సృష్టించాడు. తద్వారా పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. బాడీ లాంగ్వెజ్ ఆధారంగా బ్యాట్స్‌మెన్ భారీ షాట్లకు దిగుతారా? లేదా? అన్నదానిపై ఫోకస్ చేశామని, అలాంటి డెలివరీస్లోనే తనకు వికెట్లు పడటం ఆనందంగా ఉందని చెప్పారు. అమిత్ మిశ్రా స్పిన్ బౌలింగ్ బాగా పడినప్పటికీ అతనికి ( 3-0-11-4) మూడు ఓవర్లు మాత్రమే లభించాయి. కోటా మరో ఓవర్ ఉన్నా.. అది లభించకపోవడం బాధగా ఉందా? అని ప్రశ్నించగా.. అదేమీ లేదని, ఫాస్ట్ బౌలర్లకు అధిక ఓవర్లు ఇవ్వాల్సిన అవసరం ఉండటంతో తనకు మరో ఓవర్ వేసే అవకాశం రాలేదని సర్దిచెప్పాడు అమిత్. -
ఢిల్లీకి ‘అమితా’నందం!
♦ అమిత్‌మిశ్రా స్పిన్ మ్యాజిక్ ♦ డేర్‌డెవిల్స్‌కు సీజన్లో తొలి విజయం ♦ 8 వికెట్ల తేడాతో పంజాబ్ చిత్తు ♦ రాణించిన డికాక్, శామ్సన్ నైపుణ్యానికి అనుభవాన్ని జోడించిన అమిత్ మిశ్రా ఐపీఎల్లో తన పంజా విసిరాడు. ప్రత్యర్థి జట్టులో నలుగురు నాణ్యమైన విదేశీ బ్యాట్స్‌మెన్ ఉన్నా... గింగరాలు తిరిగే బంతులతో బోల్తా కొట్టించాడు. తన కోటా ఓవర్లు పూర్తికాకముందే కీలకమైన నాలుగు వికెట్లు తీసి పంజాబ్‌ను చుట్టేసి ఢిల్లీకి ‘అమితా’నందాన్ని అందించాడు. న్యూఢిల్లీ: తొలి మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో ఎదురైన పరాజయాన్ని మరిపిస్తూ.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఐపీఎల్-9లో విజయాల బోణీ చేసింది. కుర్రాళ్లతో బరిలోకి దిగినా... నాణ్యమైన ఆటతీరుతో సొంతగడ్డపై చెలరేగిపోయింది. అమిత్ మిశ్రా (4/11) స్పిన్ మ్యాజిక్కు తోడు బ్యాటింగ్‌లో నిలకడ చూపడంతో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై గెలిచింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా, పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 111 పరుగులు చేసింది. మన్నన్ వోహ్రా (24 బంతుల్లో 32; 5 ఫోర్లు), ప్రదీప్ సాహు (12 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఓ మాదిరిగా ఆడారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 13.3 ఓవర్లలో 2 వికెట్లకు 113 పరుగులు చేసింది. డికాక్ (42 బంతుల్లో 59 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్), సంజూ శామ్సన్ (32 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక భాగస్వామ్యంతో ఆకట్టుకున్నారు. మిశ్రా మ్యాజిక్ పిచ్ నుంచి లభించిన సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ఢిల్లీ బౌలర్లు ఆరంభం నుంచే చెలరేగారు. రెండో ఓవర్లో మురళీ విజయ్ (1)ను రనౌట్ చేయడంతో పంజాబ్ 8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత వోహ్రా, మార్ష్ (13)లు ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఆరో ఓవర్లో వోహ్రా మూడు ఫోర్లు బాదడంతో పవర్‌ప్లేలో పంజాబ్ స్కోరు 37/1కి చేరుకుంది. ఈ దశలో స్పిన్నర్ మిశ్రా పంజాబ్‌ను స్పిన్ ఉచ్చులో బిగించాడు. తన తొలి ఓవర్ రెండో బంతికి మార్ష్‌ను అవుట్ చేయడంతో రెండో వికెట్‌కు 31 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత తన రెండో ఓవర్లో నాలుగు బంతుల తేడాలో మిల్లర్ (9), మ్యాక్స్‌వెల్ (0)లను వెనక్కిపంపి షాకిచ్చాడు. ఇక తన మూడో ఓవర్లో నిలకడగా ఆడుతున్న వోహ్రానూ పెవిలియన్‌కు చేర్చడంతో పంజాబ్ 59 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. ఇక్కడి నుంచి ఢిల్లీ బౌలర్లు మరింత పకడ్బందిగా బౌలింగ్, ఫీల్డింగ్ చేయడంతో పంజాబ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. వృద్ధిమాన్ సాహా (3), అక్షర్ పటేల్ (11) నిరాశపర్చినా... మోహిత్ శర్మ (15) భారీ సిక్సర్, ఫోర్‌తో ఊపు తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ జహీర్, మోరిస్ వరుస ఓవర్లలో శర్మతో పాటు జాన్సన్ (4)ను అవుట్ చేయడంతో పంజాబ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. అద్భుత భాగస్వామ్యం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఢిల్లీ ఓపెనర్లలో శ్రేయస్ అయ్యర్ (3) విఫలమైనా... డికాక్, శామ్సన్ ఆచితూచి ఆడారు. భారీ షాట్లకు పోకుండా స్ట్రయిక్‌ను రొటేట్ చేయడంతో పవర్‌ప్లేలో రన్‌రేట్ బాగా మందగించింది. ఐదో ఓవర్లో క్యాచ్ అవుట్ ప్రమాదం నుంచి బయటపడ్డ డికాక్ ఆ తర్వాత వరుస ఫోర్లతో ఒత్తిడిని తగ్గించుకున్నాడు. రెండో ఎండ్‌లో సాహుకు భారీ సిక్సర్ రుచి చూపెట్టిన శామ్సన్ వీలైనంత వేగంగా ఆడాడు. దీంతో 11 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 79/1కి చేరుకుంది. జాన్సన్ వేసిన 12వ ఓవర్లో డికాక్ ఓ సిక్స్, రెండు ఫోర్లతో 17 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 13వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి శామ్సన్ అవుట్‌కావడంతో రెండో వికెట్‌కు 10.4 ఓవర్లలో 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక 42 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన దశలో డికాక్ ఓ ఫోర్, పవన్ నేగి (8 నాటౌట్) ఓ సిక్స్ బాది విజయాన్ని ఖాయం చేశారు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: విజయ్ రనౌట్ 1; వోహ్రా (బి) మిశ్రా 32; మార్ష్ (స్టం) డికాక్ (బి) మిశ్రా 13; మిల్లర్ ఎల్బీడబ్ల్యు (బి) మిశ్రా 9; మ్యాక్స్‌వెల్ (సి) బ్రాత్‌వైట్ (బి) మిశ్రా 0; అక్షర్ (సి) నేగి (బి) జయంత్ 11; సాహా రనౌట్ 3; జాన్సన్ (బి) మోరిస్ 4; మోహిత్ (సి) మోరిస్ (బి) జహీర్ 15; ప్రదీప్ సాహు నాటౌట్ 18; సందీప్ శర్మ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 111. వికెట్ల పతనం: 1-8; 2-37; 3-52; 4-52; 5-59; 6-65; 7-73; 8-90; 9-99. బౌలింగ్: జహీర్ 4-1-14-1; నేగి 1-0-10-0; మోరిస్ 4-0-19-1; బ్రాత్‌వైట్ 4-0-33-0; మిశ్రా 3-0-11-4; జయంత్ యాదవ్ 4-0-23-1. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డికాక్ నాటౌట్ 59; అయ్యర్ (సి) సాహా (బి) సందీప్ 3; శామ్సన్ (బి) అక్షర్ 33; పవన్ నేగి నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (13.3 ఓవర్లలో 2 వికెట్లకు) 113. వికెట్ల పతనం: 1-9; 2-100. బౌలింగ్: సందీప్ 2-1-6-1; జాన్సన్ 3-0-28-0; మోహిత్ శర్మ 2-0-10-0; అక్షర్ పటేల్ 3-0-25-1; ప్రదీప్ సాహు 2.3-0-27-0; మ్యాక్స్‌వెల్ 1-0-11-0. -
ఇంకా సరైన కాంబినేషన్ లేదు: కోహ్లి
బెంగళూరు: టీమిండియా క్రికెట్ జట్టులో ఇంకా సరైన కాంబినేషన్ ఏర్పడలేదని టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. అందువల్లే జట్టులో రకరకాల ప్రయోగాలు చేయాల్సి వస్తుందన్నాడు. ఈ క్రమంలోనే ఆటగాళ్లు జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడాల్సి వస్తుందన్నాడు. తొలి టెస్టులో అమిత్ మిశ్రా ఆడినా.. తదుపరి రెండో టెస్టుకు ఆడించకపోవడంపై విరాట్ స్పందించాడు. 'పరిస్థితుల్ని బట్టి జట్టును ఎంపిక చేయాల్సి ఉంటుంది. అంతేగానీ ఫలనా వారిని జట్టుకు ఎంపిక చేయాలని మూర్ఖంగా వ్యవహరించం. గత కొన్ని సంవత్సరాల నుంచి అమిత్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఆయా పరిస్థితుల్లో జట్టుకు రవీంద్ర జడేజా, స్టువర్ట్ బిన్నీ అవసరం ఉందని సెలెక్టర్లు భావిస్తే.. ఆ పరిస్థితిని మిశ్రా అర్ధం చేసుకుంటాడు. ఒకేసారి ఇద్దరు ఆల్ రౌండర్లను ఆడించకూడదనే నిబంధన ఏమీ లేదు. ఇంకా జట్టులో సరైన కాంబినేషన్ అంటూ సెట్ కాలేదు. అప్పటి పరిస్థితిని బట్టి ఆటగాళ్లు వారి ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా ఓ రకంగా జట్టుకు ఉపయోగపడుతుంది' అని కోహ్లి పేర్కొన్నాడు. -
'అమిత్ మిశ్రా అస్సలు పట్టించుకోలేదు'
బెంగళూరు: క్రికెటర్ అమిత్ మిశ్రాపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని మొదట అనుకున్నానని అతడి స్నేహితురాలు, బాలీవుడ్ నిర్మాత వందనా జైన్ తెలిపింది. అయితే తాను పెట్టిన కేసు గురించి అమిత్ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నానని వెల్లడించింది. 'కేసు ఉపసంహరించుకోవాలని మొదట్లో అనుకున్నా. కానీ కేసు గురించి అమిత్ మిశ్రా అసలు పట్టించుకోకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే నా నిర్ణయాన్ని మార్చుకున్నా. ఇప్పుడు కేసు కోర్టు, పోలీసుల ముందు ఉంది. తర్వాత ఏం జరుగుతుందనేది వారే తేలుస్తారు' అని వందన పేర్కొంది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అమిత్ మిశ్రా దాడికి పాల్పడినట్టు సెప్టెంబర్ 27న అశోక్ నగర్ పోలీసు స్టేషన్లో వందన ఫిర్యాదు చేసింది. దీంతో అమిత్ మిశ్రాను బెంగళూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మూడు గంటల విచారణ అనంతరం 'స్టేషన్ బెయిల్'పై విడుదల చేశారు. -
మూడేళ్ల ఫ్రెండ్షిప్..మూన్నాళ్ల ముచ్చటే
-
మాది సమర్థవంతమైన జోడీ
తాను, అశ్విన్ రెండు ఎండ్లలో బౌలింగ్ చేస్తే ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచగలుగుతామని భారత లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా చెప్పాడు. ‘ఒకరు వికెట్లు తీస్తుంటే రెండో బౌలర్ పరుగులు రాకుండా ఒత్తిడి పెంచాలి. మా ఇద్దరి జోడీ ఈ పని సమర్థంగా చేస్తుంది’ అని మిశ్రా వ్యాఖ్యానించాడు. దక్షిణాఫ్రికా బలమైన జట్టే అయినా, భారత జట్టులో క్రికెటర్లంతా మంచి ఫామ్‌లో ఉన్నందున సిరీస్ హోరాహోరీగా సాగుతుందని అభిప్రాయపడ్డాడు. -
గుర్‌కీరత్‌కు అవకాశం
♦ పేసర్ శ్రీనాథ్ అరవింద్ ఎంపిక ♦ అమిత్ మిశ్రాకు చోటు ♦ దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భారత వన్డే, టి20 జట్ల ప్రకటన బెంగళూరు : దక్షిణాఫ్రికాతో సొంతగడ్డపై తలపడే భారత టి20 జట్టును, తొలి మూడు మ్యాచ్‌ల కోసం వన్డే జట్టును సెలక్టర్లు ఆదివారం ప్రకటించారు. ఇటీవల భారత్ ‘ఎ’ తరఫున నిలకడగా రాణించిన గుర్కీరత్ సింగ్‌కు తొలిసారి టీమిండియా పిలుపు లభించింది. ఈ పంజాబ్ ఆల్‌రౌండర్‌ను వన్డే టీమ్‌లోకి ఎంపిక చేశారు. దేశవాళీ పోటీల్లో ఆకట్టుకున్న కర్ణాటక పేసర్ శ్రీనాథ్ అరవింద్‌కు టి20 జట్టులో స్థానం లభించింది. ఈ రెండు మార్పులు మినహా సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎలాంటి సంచలన మార్పులకు అవకాశం ఇవ్వలేదు. సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ టి20 జట్టులో స్థానం నిలబెట్టుకోగా, జింబాబ్వే సిరీస్‌కు అవకాశం దక్కని రవీంద్ర జడేజాకు మళ్లీ నిరాశే ఎదురైంది. కుర్రాళ్లకు నో చాన్స్... జింబాబ్వేతో వన్డేలను మినహాయిస్తే భారత జట్టు పూర్తి స్థాయి జట్టుతో చివరగా బంగ్లాదేశ్‌తో ఆడింది. ఆ సిరీస్‌లో ఉన్న ఆటగాళ్లలో ప్రధానంగా రెండు మార్పులు జరిగాయి. రవీంద్ర జడేజా, పేసర్ ధావల్ కులకర్ణిలను తప్పించారు. వారి స్థానాల్లో గుర్కీరత్, స్పిన్నర్ అమిత్ మిశ్రాలకు చోటు దక్కింది. శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో విశేషంగా రాణించిన మిశ్రా వన్డే, టి20లో పునరాగమనం చేయడం విశేషం. బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో స్థానం దక్కని జడేజా ఆ తర్వాత మరే దేశవాళీ మ్యాచ్ ఆడలేదు. ఫలితంగా సెలక్టర్లను ఆకట్టుకునే అవకాశం కూడా లభించలేదు. జింబాబ్వేతో సిరీస్‌లో రాణించి ఆశలు పెట్టుకున్న మనీశ్ పాండే, కేదార్ జాదవ్‌లు రెగ్యులర్ టీమ్‌లోకి మాత్రం రాలేకపోయారు. మొహమ్మద్ షమీ ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడంతో అతడిని ఎంపిక చేయలేదు. అదే విధంగా టీమిండియా ఫాస్టెస్ట్ బౌలర్లు ఉమేశ్, ఆరోన్, ఇషాంత్‌లను టి20 కోసం మాత్రం పరిగణలోకి తీసుకోకుండా మీడియం పేసర్లపైనే నమ్మకముంచారు. ధోనిపై చర్చకు ఫుల్స్టాప్: టెస్టు కెప్టెన్ కోహ్లికి వన్డే, టి20 నాయకత్వ బాధ్యతలు కూడా అప్పజెపుతారంటూ ఇటీవల సాగిన హడావుడికి సెలక్టర్లు ముగింపునిచ్చారు. ఈ రెండు టీమ్‌లకు ఎమ్మెస్ ధోనినే సరైన వ్యక్తిగా వారు స్పష్టం చేశారు. ‘అసలు కెప్టెన్సీ గురించి చర్చే జరగలేదు. ధోని నాయకత్వంపై మేం సంతోషంగా ఉన్నాం. అతనికి మా పూర్తి మద్దతు ఉంది’ అని పాటిల్ స్పష్టం చేశారు. భారత జట్ల వివరాలు: వన్డేలు: ధోని (కెప్టెన్), అశ్విన్, స్టువర్ట్ బిన్నీ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, భువనేశ్వర్, అక్షర్ పటేల్, రహానే, సురేశ్ రైనా, అంబటి రాయుడు, మోహిత్ శర్మ, రోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్, గుర్కీరత్ సింగ్, అమిత్ మిశ్రా. టి20లు: ధోని (కెప్టెన్), అశ్విన్, స్టువర్ట్‌బిన్నీ, ధావ న్, కోహ్లి, భువనేశ్వర్, అక్షర్, రహానే, రైనా, అంబటి రాయుడు, మోహిత్ శర్మ, రోహిత్ శర్మ, అరవింద్, హర్భజన్, మిశ్రా. గుర్కీరత్: పంజాబ్‌కు చెందిన 25 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ మూడేళ్ల క్రితమే దేశవాళీ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. 40 మ్యాచ్‌ల్లో 46.10 సగటుతో 1383 పరుగులు చేశాడు. 10 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో కూడా ఆకట్టుకున్న అతని ఇటీవలి ప్రదర్శన జట్టులోకి ఎంపికయ్యేలా చేసింది. భారత్ ‘ఎ’ తరఫున ఆడుతూ ఆసీస్ ‘ఎ’తో జరిగిన ముక్కోణపు టోర్నీ ఫైనల్లో 87 పరుగులు చేసి, 2 వికెట్లు తీసి జట్టును గెలిపించిన గుర్కీరత్... బంగ్లాదేశ్ ‘ఎ’తో తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో పాటు 5 వికెట్లు పడగొట్టాడు. శ్రీనాథ్ అరవింద్: లెఫ్టార్మ్ పేస్ బౌలింగ్‌తో పాటు అవసరమైతే అదే మ్యాచ్‌లో లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ చేయగలగడం అరవింద్ ప్రత్యేకత. ఏడేళ్లుగా కర్ణాటక జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా కీలక విజయాల్లో భాగస్వామిగా నిలిచిన 31 ఏళ్ల అరవింద్... ఐపీఎల్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తరఫున రాణించాడు. 2011లో తొలిసారి ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపికైనా ఇతనికి మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. -
పుజారా ‘షో’
♦ అజేయ సెంచరీతో చెలరేగిన ఓపెనర్ ♦ అమిత్ మిశ్రా అర్ధసెంచరీ ♦ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 292/8 ♦ }లంకతో మూడో టెస్టు కొలంబో : ‘మా టాప్-5 బ్యాట్స్‌మెన్‌లో పుజారాకు చోటు లేదు. అందరూ ఫామ్‌లో ఉన్నారు కాబట్టి స్థానం దక్కడం కష్టమే’ నిన్నటి వరకు భారత జట్టు మేనేజ్మెంట్ చేసిన వ్యాఖ్య ఇది. కానీ ఇప్పుడు... మూడో టెస్టులో ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లందరూ బ్యాట్లు ఎత్తేసి పెవిలియన్‌కు వెళ్తుంటే... అదే పుజారా ఆపద్బాంధవుడిలా జట్టును ఆదుకున్నాడు. లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఓపికగా బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. చతేశ్వర్ (277 బంతుల్లో 135 బ్యాటింగ్; 13 ఫోర్లు) అజేయ సెంచరీతో శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 95.3 ఓవర్లలో 8 వికెట్లకు 292 పరుగులు చేసింది. అమిత్ మిశ్రా (87 బంతుల్లో 59; 7 ఫోర్లు) రాణించాడు. పుజారాతో పాటు ఇషాంత్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. మూడో సెషన్ చివర్లో వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను ముందుగానే ముగించారు. 50/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన పుజారా, కోహ్లి నెమ్మదిగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ పిచ్ నుంచి సహకారం అందుకున్న లంక బౌలర్లు ఒత్తిడి పెంచారు. సెషన్ తొలి ఓవర్లో రెండుసార్లు ఎల్బీ అప్పీల్ల నుంచి బయటపడ్డ కోహ్లిని 24వ ఓవర్లో మ్యాథ్యూస్ అవుట్ చేశాడు. దీంతో మూడో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తొలి గంటలో భారత్ 15 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 22 పరుగులు చేసింది. తర్వాత రోహిత్ (26) స్పిన్నర్లపై అటాకింగ్‌కు దిగడంతో పరుగుల వేగం పెరిగింది. రెండో ఎండ్‌లో పుజారా కూడా కౌశల్ బౌలింగ్‌లో వరుస బౌండరీలు బాదాడు. దీంతో 41వ ఓవర్లో టీమిండియా 100 పరుగులకు చేరుకుంది. అదే క్రమంలో పుజారా 127 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. లంచ్‌కు కొద్ది ముందు రోహిత్ భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. లంచ్ తర్వాత తొలి బంతికే బిన్నీ (0) వెనుదిరగడంతో భారత్ స్కోరు 119/5గా మారింది. తర్వాత నమన్ ఓజా (21) నిలకడగా ఆడి పుజారాకు చక్కని సహకారం అందించాడు. అయితే ఏడు పరుగుల తేడాలో ఓజా, అశ్విన్ (5) అవుట్‌కావడంతో భారత్ మరోసారి తడబడింది. ఈ దశలో టెయిలెండర్ మిశ్రా కీలక ఇన్నింగ్స్ ఆడగా... పుజారా 214 బంతుల్లో ఏడో సెంచరీ సాధించాడు. మిశ్రా, పుజారా ఎనిమిదో వికెట్‌కు 104 పరుగులు జోడించడంతో భారత్ మళ్లీ మ్యాచ్‌లోకి వచ్చింది. 71 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన మిశ్రా సెషన్ చివర్లో అవుటయ్యాడు. తర్వాత ఇషాంత్ మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు. దమ్మిక ప్రసాద్ 4 వికెట్లు తీశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (బి) ప్రసాద్ 2; పుజారా బ్యాటింగ్ 135; రహానే ఎల్బీడబ్ల్యు (బి) ప్రదీప్ 8; కోహ్లి (సి) పెరీరా (బి) మ్యాథ్యూస్ 18; రోహిత్ (సి) తరంగ (బి) ప్రసాద్ 26; బిన్నీ ఎల్బీడబ్ల్యు (బి) ప్రసాద్ 0; ఓజా (సి) తరంగ (బి) కౌశల్ 21; అశ్విన్ (సి) పెరీరా (బి) ప్రసాద్ 5; మిశ్రా (స్టంప్డ్) పెరీరా (బి) హెరాత్ 59; ఇషాంత్ బ్యాటింగ్ 2; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: (95.3 ఓవర్లలో 8 వికెట్లకు) 292. వికెట్ల పతనం: 1-2; 2-14; 3-64; 4-119; 5-119; 6-173; 7-180; 8-284. బౌలింగ్: ప్రసాద్ 23.3-4-83-4; ప్రదీప్ 22-6-52-1; మ్యాథ్యూస్ 13-6-24-1; హెరాత్ 25-3-81-1; కౌశల్ 12-2-45-1. -
టాప్ టెన్ నుంచి కోహ్లి అవుట్
దుబాయ్: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో టాప్ టెన్ నుంచి పడిపోయాడు. తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో 11వ స్థానం దక్కించుకున్నాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో విశేషంగా రాణించిన అశ్విన్ పైకి ఎగబాకాడు. బౌలింగ్ లో అశ్విన్ 8వ స్థానంలో నిలిచాడు. ఆల్ రౌండర్ విభాగంలో 2వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన కుమార సంగక్కర 7, మైఖేల్ క్లార్క్ 25 ర్యాంకుల్లో నిలిచారు. అజింక్య రహానే రెండు స్థానాలు ఎగబాకి 20వ స్థానం దక్కించుకున్నాడు. స్పిన్నర్ అమిత్ మిశ్రా అనూహ్యంగా 42 స్థానాలు ఎగబాకి 39వ ర్యాంకులో నిలిచాడు. -
చండిమల్‌ను కట్టడి చేస్తాం: మిశ్రా
కొలంబో : తొలి టెస్టులో వీరోచిత సెంచరీతో లంక జట్టును గెలిపించిన దినేశ్ చండిమల్‌ను కట్టడి చేస్తామని భారత లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అన్నాడు. గురువారం నుంచి జరిగే రెండో టెస్టులో అలాంటి ప్రదర్శన పునరావృతం కాకుండా అడ్డుకుంటామన్నాడు. ‘చండిమల్ బ్యాటింగ్ వీడియోస్‌ను పరిశీలించాం. అతను అదే విధంగా దాడి చేస్తే మేం కూడా ఎదురుదాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అతనికి బౌలింగ్ ఎలా చేయాలన్న దానిపై జట్టు సమావేశంలో మరింతగా చర్చిస్తాం. మా వ్యూహాలకు తగ్గట్టుగా ఫీల్డర్లను మోహరిస్తాం. భారీ షాట్లు కొట్టకుండా ఒత్తిడి పెంచుతాం’ అని మిశ్రా పేర్కొన్నాడు. స్పిన్ ఆడటంలో భారత బ్యాట్స్‌మెన్‌కు సరైన అనుభవం లేదనడం వాస్తవం కాదన్నాడు. కొన్నిసార్లు ఒత్తిడిలో ఒకటి, రెండు వికెట్లు పడిపోతాయని చెప్పాడు. గాలె టెస్టులో ఓడినా తమలో ఆత్మ విశ్వాసం ఏమాత్రం తగ్గలేదని తెలిపాడు. ‘రెండో ఇన్నిం గ్స్‌లో మరింత దూకుడుగా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఓటమిని పక్కనబెడితే మాలో ఆత్మ విశ్వాసం పెరిగిందే తప్ప తగ్గలేదు. కాబట్టి రెండో టెస్టులో రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగుతాం. తొలి టెస్టులో కొన్ని తప్పులు జరిగాయి. వాటిని మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని ముందుకెళ్తాం’ అని మిశ్రా చెప్పాడు. -
చండీమల్ కట్టడికి టీమిండియా వ్యూహం
కొలంబో: శ్రీలంకతో తొలిటెస్టులో చిత్తుగా ఓడిన టీమిండియా.. రెండో మ్యాచ్‌పై దృష్టిసారిస్తోంది. గాలె టెస్టులో అజేయ సెంచరీ చేసి మ్యాచ్ మలుపు తిప్పిన లంక బ్యాట్స్‌మన్ దినేశ్ చండీమల్‌ను కట్టడి చేయడానికి వ్యూహం రచిస్తోంది. రెండో టెస్టులో చండీమల్‌ను ఎదుర్కొనేందుకు భారత లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను బరిలో దింపాలని భావిస్తోంది. చండీమల్కు ఎలా బౌలింగ్ చేయాలన్న విషయంపై చర్చిస్తామని అమిత్ మిశ్రా చెప్పాడు. వీలైనంత తొందరగా అతన్ని అవుట్ చేయడానికి ప్రయత్నిస్తామని, అతనిపై బౌలింగ్ దాడి చేస్తామని అమిత్ అన్నాడు. తొలి టెస్టులో లంకకు ఇన్నింగ్స్ ఓటమి ప్రమాదం ఎదురైనపుడు చండీమల్ (162 నాటౌట్) సూపర్ సెంచరీ చేసి ఆదుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత లంక బౌలర్ హెరాత్ (7/48) చెలరేగడంతో టీమిండియా ఓటమి చవిచూసింది. గురువారం నుంచి భారత్, శ్రీలంకల మధ్య రెండో టెస్టు జరుగుతుంది. -
నాలుగేళ్ల తర్వాత...
భారత జట్టులో అమిత్ మిశ్రా శ్రీలంక పర్యటనకు 15 మందితో జట్టు ఎంపిక న్యూఢిల్లీ: ముందే ఊహించినట్లుగా మార్పులేమీ లేకుండానే శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. మూడో స్పిన్నర్‌గా అమిత్ మిశ్రా జట్టులోకి వచ్చాడు. నాలుగేళ్ల క్రితం చివరిసారిగా భారత్ తరఫున టెస్టు ఆడిన 32 ఏళ్ల ఈ లెగ్ స్పిన్నర్ సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చాడు. బంగ్లాదేశ్‌లో పర్యటించిన 14 మందిలో లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మ గాయం కారణంగా అందుబాటులో లేడు. దీంతో మిశ్రాకు లైన్ క్లియర్ అయింది. గాయం కారణంగానే బంగ్లా పర్యటన నుంచి తప్పుకున్న ఓపెనర్ లోకేశ్ రాహుల్ జట్టులోకి వచ్చాడు. హర్భజన్ సింగ్ స్థానాన్ని నిలబెట్టుకోగా... నలుగురు పేసర్లపై సెలక్టర్లు నమ్మకముంచారు. ‘శ్రీలంకలో పరిస్థితుల దృష్ట్యా లెగ్ స్పిన్నర్ అవసరం ఉంది. మాకు మిశ్రాపై ఎప్పుడూ నమ్మకం ఉంది. ఓజా పేరు కూడా చర్చకు వచ్చినా లెగ్ స్పిన్నర్ కావాలని భావించాం’ అని సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ చెప్పారు. న్యూఢిల్లీలోని ఓ హోటల్లో జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో జట్టు ఎంపిక కేవలం 30 నిమిషాల్లోనే పూర్తయింది. జింబాబ్వే పర్యటనలో వన్డేల్లో రాణించిన అక్షర్ పటేల్‌ను జట్టులోకి ఎంపిక చేయలేదు. అలాగే గాయం నుంచి కోలుకోకపోవడం వల్ల షమీ కూడా జట్టులోకి రాలేదు. జట్టులో రిజర్వ్ వికెట్ కీపర్ కూడా లేడు. ఒకవేళ అవసరమైతే ఎవరిని పంపించాలో తమకు స్పష్టత ఉందని పాటిల్ చెప్పారు. యువ స్పిన్నర్లు లేరా? సాధారణంగా ఏ జట్టయినా భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుంది. భార త సెలక్టర్లు మాత్రం ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. బంగ్లాదేశ్‌తో పర్యటనకు వెట రన్ హర్భజన్‌ను జట్టులోకి తీసుకోవడం ఆశ్చర్యకర నిర్ణయమైతే... శ్రీలం క పర్యటనకు హర్భజన్‌తో పాటు మరో వెటరన్ అమిత్ మిశ్రానూ తెచ్చారు. ఈ ఇద్దరి ఎంపికను బట్టి చూస్తే దేశంలో యువ స్పిన్నర్లు లేరా అనే సందేహం వస్తోంది. సందీప్ పాటిల్ చెబుతున్న ప్రకారం ఆటగాళ్ల వయసు కంటే ఫిట్నెస్ ముఖ్యం. హర్భజన్, అమిత్ మిశ్రా ఇద్దరూ మంచి ఫిట్నెస్తో ఉన్నందున వయసు గురిం చి ఆందోళన వద్దనేది ఆయన అభిప్రాయం. దేశంలో లక్షలాది మంది క్రికెట్ ఆడుతున్నారు. వందలాది మంది స్పిన్నర్లు రకరకాల ఫార్మాట్ల లో, టోర్నీలలో సత్తా చాటుతున్నారు. అయినా వీరెవరినీ లెక్కలోకి తీసుకోకుండా మళ్లీ పాతత రం వైపే చూడటం అంత మంచి సంకేతం కాదు. ఒక విధానం లేకుండా... గత ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో భారత జట్టు టెస్టు పర్యటన సమయంలో సెలక్టర్లు చెప్పిన మాటలు మరోలా ఉన్నాయి. కరణ్‌శర్మ, జడేజా, అశ్విన్ అప్పుడు జట్టులో ఉన్న స్పిన్నర్లు. ‘భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ స్పిన్నర్లను ఎంపిక చేశాం. ఆస్ట్రేలియా లాంటి కఠినమైన పర్యటనకు వెళ్లడం వల్ల వీళ్లు రాటుదేలతారు’ అనేది నాటి సెలక్టర్ల మాట. మరి ఇప్పుడు ఆ భవిష్యత్తు ఏమయింది? మళ్లీ ఎందుకు పాత బాట పట్టారనేదానికి సమాధానాలు లేవు. ధోని రిటైర్ కాగానే హర్భజన్‌ను ఏ ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని జట్టులోకి తెచ్చారో తెలియదు. అలాగే బంగ్లాదేశ్ తో టెస్టుల్లో అశ్విన్‌తో పోలిస్తే హర్భజన్ తేలిపోయాడు. స్పిన్ విభాగంలో వైవిధ్యం కావాలనుకుంటే ఒక ఆఫ్ స్పిన్నర్‌తో పాటు లెగ్ స్పిన్నర్, లెఫ్టార్మ్ స్పిన్నర్ ఉండాలి. మరి ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు ఎందుకు? అలాగే అమిత్ మిశ్రాకు కుంబ్లే రిటైరైన తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. కానీ వినియోగించుకోలేకపోయాడు. అలాంటప్పుడు దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న 21 ఏళ్ల శ్రేయస్ గోపాల్ లాంటి యువ లెగ్ స్పిన్నర్ ఎందుకు కనిపించలేదో మరి..? టెస్టు జట్టు: కోహ్లి( కెప్టెన్), ధావన్, విజయ్, లోకేశ్ రాహుల్, పుజారా, రహానే, రోహిత్, సాహా, హర్భజన్, అశ్విన్, అమిత్ మిశ్రా, ఉమేశ్ యాదవ్, ఇషాంత్, భువనేశ్వర్, వరుణ్ ఆరోన్. శ్రీలంకతో టెస్టు సిరీస్ షెడ్యూల్ ఆగస్టు 12-16: తొలి టెస్టు (గాలె) ఆగస్టు 20-24: రెండో టెస్టు (కొలంబో) ఆగస్టు 28-సెప్టెంబరు 2: మూడో టెస్టు (కొలంబో) -
శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక
-
శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: శ్రీలంక టూర్‌కు భారత జట్టు సభ్యులను బిసిసిఐ గురువారం ప్రకటించింది. శ్రీలంకతో అగస్టులో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మలకు చోటు లభించింది. కోహ్లీ నాయకత్వంలో టీం ఇండియా శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది. ఈ సిరీస్‌కు రవిశాస్త్రి టీం ఇండియా డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. నాలుగేళ్ల తర్వాత అమిత్ మిశ్రాకి టెస్ట్ జట్టులో చోటు లభించింది. ఆగస్టు 12 నుంచి లంక పర్యటనలో మనజట్టు మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఆడనుంది. సెలక్షన్ కమిటీ సందీప్ పాటిల్ ఆధ్యక్షతన సమావేశమై తుది జట్టును ప్రకటించారు. భారత జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), ధావన్, మురళి విజయ్, కేఎల్ రాహుల్, పుజారా, రహానే, రోహిత్ శర్మ, వృద్దిమాన్ సాహా(వికెట్ కీపర్), అశ్విన్, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, హర్భజన్ సింగ్, వరుణ్ అరోన్, అమిత్ మిశ్రా, ఉమేష్ యాదవ్ -
ఆత్మవిశ్వాసమే ఆయుధం
‘దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ప్రతి మ్యాచ్‌లోనూ తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. నేను బెంచ్ మీద ఉన్నప్పుడు కూడా మొత్తం జట్టు సహచరులంతా నాకు ప్రతి విషయంలోనూ అండగా నిలిచారు. నా మీద నమ్మకం ఉంచినందుకు బీసీసీఐకి కృతజ్ఞతలు’ - అమిత్ మిశ్రా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టి20 ప్రపంచకప్‌లో భారత్ తొలి రెండు మ్యాచ్‌ల్లో దుమ్మురేపింది. అప్పటికీ ఇప్పటికీ జట్టులో ఒకే ఒక్క ప్రధాన తేడా... అమిత్ మిశ్రా. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం గెలిచిన మిశ్రా... ఎంతో కష్టం, బాధ తర్వాత ఈ గౌరవాన్ని పొందాడు. ఐదు వన్డేల్లో రికార్డు స్థాయిలో 18 వికెట్లు తీసిన బౌలర్‌కి... తర్వాత నాలుగు నెలల పాటు మళ్లీ మ్యాచ్ ఆడే అవకాశం రాకపోతే ఏమైపోతాడు? వేరే ఎవరైనా అయితే ఏమో... అమిత్ మిశ్రా మాత్రం మరింత రాటుదేలుతాడు. ఇది తన బౌలింగ్‌తోనే చూపించాడు ఈ లెగ్ స్పిన్నర్. నిజానికి ఈ ప్రపంచకప్ ఆరంభంలో భారత్ బలహీనత బౌలింగ్ అనే భావించారు. ఆ బలహీనతే ఇప్పుడు బలంగా మారింది. దీనికి కారణం మిశ్రా. బంతుల్లో వైవిధ్యం... పాకిస్థాన్ మీద 22 పరుగులకు రెండు వికెట్లు... వెస్టిండీస్‌పై 18 పరుగులకే రెండు వికెట్లు... ఈ రెండు మ్యాచ్‌ల్లో వికెట్లతో పాటు మిశ్రా పొదుపుగా కూడా బౌలింగ్ చేశాడు. దీంతో భారత బ్యాట్స్‌మెన్ పని సులభమైంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ చాలా వైవిధ్యం చూపించాడు. స్లైడర్, గూగ్లీ, లెగ్ స్పిన్నర్... ఇలా ఓ లెగ్‌స్పిన్నర్ దగ్గర ఉండే అస్త్రాలన్నీ ప్రయోగించాడు. బంతి వేగంలో మార్పుతో పాటు... బంతిని ఫ్లయిట్ చేసి బ్యాట్స్‌మెన్‌ను ఊరించి వికెట్లు కొల్లగొట్టాడు. సాధారణంగా లెగ్ స్పిన్నర్‌కు టి20 కష్టమైన ఫార్మాట్. భారీగా పరుగులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ మిశ్రా మాత్రం ఏనాడూ ఇబ్బంది పడలేదు. ఐపీఎల్లో తొలి సీజన్ నుంచీ అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకూ కెరీర్లో 118 ఫస్ట్‌క్లాస్ టి20లు ఆడిన ఈ లెగ్ స్పిన్నర్... 118 వికెట్లు తీశాడు. పుష్కరకాలం తర్వాత... మిత్ మిశ్రా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసి 13 సంవత్సరాలయింది. తన వయసు ఇప్పుడు 31 సంవత్సరాలు. 2003లో తొలిసారి భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అప్పటికి ధోని ఎవరో కూడా ప్రపంచానికి తెలియదు. 2003 నుంచి 11 సంవత్సరాల్లో మిశ్రా ఆడిన వన్డేలు కేవలం 23 మాత్రమే. నిజానికి 2008 వరకు మిశ్రా పెద్దగా వెలుగులోకి రాలేదు. అనిల్ కుంబ్లే ఉన్నంతకాలం భారత్‌లో మరో లెగ్ స్పిన్నర్ గురించి ఆలోచించాల్సిన అవసరం రాలేదు. 2008లో ఆస్ట్రేలియాపై మొహాలీ టెస్టు ద్వారా మిశ్రా ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి దాదాపు ప్రతి పర్యటనకూ భారత జట్టులో ఉంటున్నాడు. కానీ తుది జట్టులో ఆడే అవకాశం మాత్రం రావడం లేదు. ముగ్గురికి చాన్స్ ఉంటేనే... గత ఐదేళ్లుగా జట్టుతో పాటే తిరుగుతున్నా... మిశ్రాకు ఆడే అవకాశం పెద్దగా రాలేదు. కారణం... జట్టులో అశ్విన్, రవీంద్ర జడేజాల స్థానం సుస్థిరం కావడమే. ఈ ఇద్దరిలో ఒకరిని ఆపి మిశ్రాను ఆడించే పరిస్థితి లేదు. కాబట్టి ముగ్గురు స్పిన్నర్లు ఆడే అవకాశం వస్తే తప్ప మిశ్రాను తుది జట్టులోకి తీసుకోలేదు. నిజానికి ఇంత మంచి రికార్డు ఉండి, జట్టులో భాగంగా తిరుగుతూ తుది జట్టులో లేకపోతే ఎవరికైనా సహజంగానే నిరాశ కలుగుతుంది. కానీ అమిత్ మిశ్రా మాత్రం దీనిని అధిగమించాడు. ఇక్కడే తన మానసిక ధృఢత్వం బయటపడింది. సహనంతో తనకు అవకాశం లభించేవరకూ వేచి చూశాడు. మిశ్రా తుది జట్టులోకి రాకపోవడానికి ధోనియే కారణమంటూ కెప్టెన్‌పై తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. కానీ మిశ్రా మాత్రం అలా భావించడం లేదు. ‘జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తుది జట్టును ఎంపిక చేస్తారు. ఆ రోజు మ్యాచ్ ఆడే 11 మంది ఎవరనే విషయం మ్యాచ్ ప్రారంభానికి కొద్దిగా ముందు మాత్రమే నిర్ణయిస్తారు. మహీ భాయ్ నుంచి నాకు చాలా ప్రోత్సాహం ఉంది’ అని మిశ్రా చెప్పాడు.