
Courtesy : IPL Twitter
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అదరగొట్టాడు. మిశ్రా ఈ మ్యాచ్‌లో 4-0-24-4 తో రాణించాడు. తద్వారా ముంబై ఇండియన్స్‌పై ఐపీఎల్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న మిశ్రా ముంబైతో మ్యాచ్‌కు తుది జట్టులోకి వచ్చాడు.ఐపీఎల్‌లో తనకున్న రికార్డును నిలబెట్టుకుంటూ రోహిత్, హార్దిక్, పోలార్డ్ సహా ఇషాన్ కిషన్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్ ఎలా ఉన్నా ఐపీఎల్‌లో మాత్రం అమిత్ మిశ్రా మంచి రికార్డులు ఉన్నాయి. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 152 మ్యాచ్‌లాడిన అమిత్ మిశ్రా 164 వికెట్లు తీశాడు.
చదవండి: 'నా జట్టు అంత స్టైల్‌గా ఉండడానికి కారణం తనే'
Comments
Please login to add a commentAdd a comment