Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన విజయం సాధించింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఒక దశలో 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. అప్పటికి క్రీజులో ఉన్న లలిత్ యాదవ్ కాస్త నెమ్మదిగా ఆడాడు. కానీ ఆ నెమ్మదైన ఆటే ఢిల్లీ క్యాపిటల్స్‌కు విజయం కట్టబెట్టిందంటే అతిశయోక్తి కాదు. మ్యాచ్‌లో అక్షర్ పటేల్(17 బంతుల్లో 38, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించి మ్యాచ్ హీరోగా నిలిచినప్పటికి.. పరోక్షంగా లలిత్ యాదవ్ ప్రధాన పాత్ర పోషించాడు.
పంత్ సహా టాపార్డర్ విఫలమైన దశలో క్రీజులోకి వచ్చిన లలిత్ యాదవ్ అసమాన పోరాటం కనబరిచాడు. పరుగుల కంటే క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చాడు. ఓవరాల్‌గా లలిత్ యాదవ్ ( 38 బంతుల్లో 48, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ దశలో లలిత్‌కు అక్షర్ పటేల్ జత కలిశాడు. అక్షర్ వచ్చి ఆట గేర్‌ను పూర్తిగా మార్చేశాడు. ముంబై బౌలర్లను బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న అక్షర్ వారికి ఏమాత్రం అవకాశమివ్వకుండా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా లలిత్ యాదవ్ ఆటతీరును క్రికెట్ ఫ్యాన్స్ అభినందించారు. ఏం ఆడుతున్నావు అని విమర్శించినోళ్లే లలిత్ యాదవ్ ఆటపై ప్రశంసలు కురిపించారు.
లలిత్ యాదవ్ ఇన్నింగ్స్ కోసం క్లిక్ చేయండి
చదవండి: IPL 2022: అక్కడ ఉంది రోహిత్.. ట్రాప్‌లో పడకుండా ఉంటాడా!
Comments
Please login to add a commentAdd a comment