IPL 2021
-
SL Vs Pak: పాక్‌తో ఫైనల్! అప్పుడు వాళ్లు అలా.. ఇప్పుడు మేమిలా: దసున్ షనక
ఆసియా కప్-2022 టీ20 టోర్నీ మొదటి మ్యాచ్‌లో పరాభవం.. అఫ్గనిస్తాన్ చేతిలో ఘోర ఓటమి.. కానీ ఆ తర్వాత శ్రీలంక జట్టు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు.. బంగ్లాదేశ్‌పై తొలి గెలుపు నమోదు చేసిన దసున్ షనక బృందం విజయాల బాట పట్టి టోర్నీ ఆసాంతం అజేయంగా నిలిచింది. సూపర్-4లో వరుసగా అఫ్గనిస్తాన్, ఇండియా, పాకిస్తాన్లను ఓడించి ఫైనల్ చేరి.. తుదిపోరులో మరోసారి పాక్‌ను మట్టికరిపించి ఆసియా కప్ 15వ ఎడిషన్ విజేతగా అవతరించింది. దేశ ఆర్థిక పరిస్థితులు, సంక్షోభం దృష్ట్యా.. సొంత ప్రేక్షకుల కేరింతల నడుమ అందుకోవాల్సిన ట్రోఫీని దుబాయ్ గడ్డపై ముద్దాడింది. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తమ దేశ ప్రజలకు.. ఈ మెగా టోర్నీలో విజయంతో ఉపశమనం కలిగించి.. వాళ్ల ముఖాలు విజయదరహాసంతో వెలిగిపోయేలా చేసింది యువ ఆటగాళ్లతో కూడిన లంక జట్టు. అసాధారణ.. అద్వితీయ గెలుపు కోటి రూపాయలకు పైగా ప్రైజ్‌మనీ సాధించి దేశానికి శుభవార్త అందించింది. క్లిష్ట పరిస్థితుల్లో వచ్చిన ఈ గెలుపు నిజంగా అసాధారణమైనది. వారు పంచిన ఆనంతం అనిర్వచనీయమైనది. ముఖ్యంగా దుబాయ్ పిచ్ మీద టాస్ గెలిస్తేనే విజయం అన్న అభిప్రాయాన్ని తలకిందులు చేస్తూ జయకేతనం ఎగురవేసి.. గెలుపులోని అసలైన మజాను రుచిచూసింది. మాకు సీఎస్కే ఆదర్శం! ఈ నేపథ్యంలో విజయానంతరం శ్రీలంక కెప్టెన్ దసున్ షనక తన ఆనందాన్ని పంచుకుంటూ.. ఈ మ్యాచ్‌లో.. ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తమకు స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నాడు. ఈ మేరకు షనక మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ 2021 చెన్నై ఫైనల్లో.. తొలుత బ్యాటింగ్ చేసి.. గెలిచింది. మేము మ్యాచ్ ఆడుతున్నపుడు నా మదిలో ఇదే విషయం మెదిలింది. మా జట్టులోని యువ ఆటగాళ్లు ఇక్కడి పరిస్థితులను చక్కగా అర్థం చేసుకున్నారు. ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న వేళ వనిందు నిజంగా తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ప్రభావం చూపాడు. చమిక, ధనుంజయ డి సిల్వా కూడా బాగా బ్యాటింగ్ చేశారు. చివరి బాల్‌ను సిక్స్‌గా మలచడం మాకు టర్నింగ్ పాయింట్. 160 పరుగుల స్కోరు అనేది ఛేదించదగ్గ లక్ష్యంగానే కనిపిస్తుంది. అయితే, 170 మార్కు మానసికంగా ప్రత్యర్థిపై కాస్త ఒత్తిడి పెట్టేందుకు ఉపకరిస్తుంది. ఇక మధుషంక గురించి చెప్పాల్సిన పనిలేదు. కెప్టెన్‌గా తనకు నేను ఎంత వరకు అండగా ఉండాలో అంత వరకు మద్దతుగా నిలిచాను’’ అని షనక చెప్పుకొచ్చాడు. కాగా కరోనా నేపథ్యంలో ఐపీఎల్-2021 రెండో దశ మ్యాచ్‌లో యూఏఈలో నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పుడు చెన్నై.. ఇప్పుడు శ్రీలంక ఈ క్రమంలో దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లలో దాదాపు అన్నింటిలోనూ సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. అయితే, ఫైనల్లో ధోని సేన టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసినప్పటికీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. 27 పరుగుల తేడాతో మోర్గాన్ బృందాన్ని మట్టికరిపించి చాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు అదే వేదికపై అదే తరహాలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. పాక్‌ను 23 పరుగులతో ఓడించి ఆసియా కప్-2022 చాంపియన్‌గా అవతరించింది. చదవండి: SL Vs Pak: అందుకే లంక చేతిలో ఓడిపోయాం.. ఓటమికి ప్రధాన కారణం అదే: బాబర్ ఆజం SL Vs Pak: అలా అయితే రాజపక్స ఇన్నింగ్స్‌కు విలువే ఉండేది కాదు! కానీ.. -
IPL 2022: గత సీజన్లో అదరగొట్టారు.. కోట్లు కొట్టేశారు.. ఈసారి అట్టర్ ఫ్లాఫ్!
IPL 2022: ఐపీఎల్ లాంటి టీ20 టోర్నమెంట్లో ఎప్పుడు ఎవరు అదరగొడుతారు? ఎప్పుడు ఎవరు డీలా పడతారు? ఏ జట్టు పైచేయి సాధిస్తుందన్న విషయాలను అంచనా వేయడం కాస్త కష్టమే! ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవగా.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. పొట్టి ఫార్మాట్లో ఫామ్‌ను కొనసాగిస్తూ ముందుకు సాగటం కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది. ఒక సీజన్లో అదరగొట్టిన వాళ్లు.. మరో ఎడిషన్‌లో ఏమాత్రం ప్రభావం చూపకపోవచ్చు. లేదంటే ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆసీస్ డేవిడ్ వార్నర్‌లా గతంలో ఫామ్‌లేమితో ఇబ్బంది పడిన వాళ్లు తిరిగి విజృంభించనూ వచ్చు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2021లో అదరగొట్టి.. 2022 ఎడిషన్‌లో చతికిలపడ్డ టాప్-5 ఆటగాళ్లు ఎవరో ఓసారి గమనిద్దాం. PC: IPL/BCCI మయాంక్ అగర్వాల్ పంజాబ్ కింగ్స్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ ఐపీఎల్-2021లో అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 12 ఇన్నింగ్స్‌లలో కలిపి 441 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధ శతకాలు ఉండటం విశేషం. ఇక పంజాబ్ తరఫున గత ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా మయాంక్ నిలిచాడు. అయితే, తాజా సీజన్లో పరిస్థితులు మారాయి. 12 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుని పంజాబ్ కెప్టెన్‌గా అతడిని నియమించింది ఫ్రాంఛైజీ. కానీ కెప్టెన్సీ భారం మోయలేక మయాంక్ చేతులెత్తేశాడు. బ్యాటర్‌గానూ విఫలమయ్యాడు. ఐపీఎల్-2022లో ఆడిన 12 మ్యాచ్‌లలో కలిపి 195 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మయాంక్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ పెద్దగా రాణించింది కూడా లేదు. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో కేవలం ఆరు గెలిచి ఏడో స్థానంలో ఉంది. PC: IPL/BCCI వెంకటేశ్ అయ్యర్ దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన మధ్యప్రదేశ్ యువ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గత సీజన్ రెండో అంచెలో వరుస అవకాశాలు దక్కించుకున్న వెంకటేశ్.. 10 ఇన్నింగ్స్‌లలో 370 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియాలోనూ చోటు దక్కించుకున్నాడు. హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయగల ఆల్‌రౌండర్‌గా ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఐపీఎల్-2022లో అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాడు. వరుస వైఫల్యాలతో ఒకానొక సమయంలో తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఇక మొత్తంగా ఈ సీజన్లో 12 ఇన్నింగ్స్ ఆడిన అతడు కేవలం 182 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 50 నాటౌట్. తనను రిటైన్ చేసుకునేందుకు ఫ్రాంఛైజీ ఖర్చు చేసిన 8 కోట్లకు న్యాయం చేయలేకపోయాడు. PC: IPL/BCCI కీరన్ పొలార్డ్ వెస్టిండీస్ బ్యాటర్, ముంబై ఇండియన్స్ హిట్టర్ కీరన్ పొలార్డ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2010 నుంచి ముంబై జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ విండీస్ మాజీ కెప్టెన్ గత సీజన్లో 245 పరుగులు చేశాడు. చెన్నైపై సంచలన ఇన్నింగ్స్(34 బంతుల్లో 87 పరుగులు నాటౌట్) ఆడాడు. కట్ చేస్తే ఐపీఎల్-2022లో పరిస్థితి తలకిందులైంది. 6 కోట్లకు ముంబై రిటైన్ చేసుకుంటే స్థాయికి తగ్గట్లు రాణించలేక అతడు డీలా పడ్డాడు. ఆడిన 11 మ్యాచ్‌లలో కలిపి పొలార్డ్ చేసిన స్కోరు 144. ఇక వరుసగా పొలార్డ్ నిరాశపరిచిన నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే తలంపుతో అతడిని తుది జట్టు నుంచి తప్పించారు. PC: IPL/BCCI హర్షల్ పటేల్ గత ఐపీఎల్ ఎడిషన్‌లో అదరగొట్టే ప్రదర్శనతో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్. ఆడిన 15 మ్యాచ్‌లలో 8.14 ఎకానమీతో 32 వికెట్లు పడగొట్టి ‘పర్పుల్’ పటేల్ అని కితాబులందుకున్నాడు. ఆర్సీబీని ప్లే ఆఫ్స్ చేర్చడంలో హర్షల్ కీలక పాత్ర పోషించాడు. అయితే, రిటెన్షన్‌లో వదిలేసిన్పటికీ మెగా వేలంలో ఆర్సీబీ అతడ కోసం 10.75 కోట్లు వెచ్చించింది. కానీ తాజా సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 12 మ్యాచ్‌లలో అతడు తీసినవి 18 వికెట్లు. గతేడాది పోలిస్తే ఈసారి పెద్దగా రాణించలేదనే చెప్పాలి. PC: IPL/BCCI వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత ఐపీఎల్ సీజన్లో 17 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ అద్భుత ప్రదర్శనతో యూఏఈ వేదికగా సాగిన రెండో అంచెలో కోల్‌కతా నైట్‌రైడర్స్ అదరగొట్టింది. ఏకంగా ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఐపీఎల్-2022 మెగా వేలం నేపథ్యంలో వరుణ్‌ను 8 కోట్లకు రిటైన్ చేసుకుంది కేకేఆర్. కానీ అతడు ధరకు తగ్గ న్యాయం చేయలేకపోయాడు. దీంతో తుదిజట్టు నుంచి తప్పించి హర్షిత్ రాణా వంటి కొత్త ఆటగాళ్లకు అవకాశమిచ్చారు. ఐపీఎల్-2022లో వరుణ్ చక్రవర్తి 11 ఇన్నింగ్స్‌లో కలిపి తీసిన వికెట్ల సంఖ్య- 6. చదవండి👉🏾IPL 2022: సన్‌రైజర్స్ చేసిన అతిపెద్ద తప్పిదం అదే.. అందుకే ఇలా: సెహ్వాగ్ చదవండి👉🏾IPL 2022: యార్కర్లతో అదరగొట్టాడు.. చివరి మ్యాచ్‌లోనైనా అవకాశమివ్వండి! -
9.25 కోట్లు వెచ్చించారు.. కానీ, ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు..!
IPL 2022 Auction: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన భారత అన్క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కిన కర్ణాటక ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్.. త్వరలో జరగనున్న 15వ ఐపీఎల్ మెగా వేలంలోనూ భారీ ధరను ఆశిస్తున్నాడు. గతేడాది కృష్ణప్ప గౌతమ్‌ను ఏకంగా రూ.9.25 కోట్లకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన చెన్నై సూపర్ కింగ్స్..ఈ ఏడాది ఆటగాళ్ల రిటెన్షన్‌లో భాగంగా అతన్ని వదులుకుంది. గత సీజన్ వేలంలో కృష్ణప్ప కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్‌లు తీవ్రంగా పోటీపడినప్పటికీ చివరికి సీఎస్కే అతన్ని సొంతం చేసుకుంది. అయితే, ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అన్ని కోట్లు వెచ్చించి, ప్రత్యర్ధి జట్లతో పోటీపడి మరీ చేజిక్కించుకున్న ఆటగాడిని సీఎస్కే ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. అయినప్పటికీ, కృష్ణప్పకు లక్కీగా శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. ఆ మ్యాచ్‌లో అతను ఓ వికెట్, 2 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో తదనంతర పరిణామాల్లో అతను కనుమరుగయ్యాడు. తాజాగా ఐపీఎల్ మెగా వేలం దగ్గర పడడటంతో అతని పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. కుడి చేతి వాటం స్పిన్ ఆల్‌రౌండర్ అయిన కృష్ణప్ప గౌతమ్.. తన ఐపీఎల్ కెరీర్లో 24 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు, 186 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే, గతేడాది ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన ఐదుగురు ఆటగాళ్లలో కృష్ణప్ప గౌతమ్ ఒకడు. రాజస్థాన్ రాయల్స్ క్రిస్ మోరిస్‌పై 16 కోట్లు వెచ్చించగా, కివీస్ ఆల్ రౌండర్ కైల్ జేమీసన్‌పై ఆర్సీబీ 15 కోట్లు, జే రిచర్డ్సన్పై పంజాబ్ 14 కోట్లు, గ్లెన్ మాక్స్‌వెల్‌పై ఆర్సీబీ 14.2 కోట్లు వెచ్చించాయి. వీరి తర్వాత అత్యంత భారీ ధర పలికిన అనామక క్రికెటర్ కృష్ణప్ప గౌతమ్ కావడం విశేషం. చదవండి: IND VS WI 2nd ODI: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు.. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు -
IPL 2022: ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకున్న లక్నో.. రాహుల్‌కు ఎన్ని కోట్లంటే!
ఐపీఎల్ మెగా వేలానికి ముందు కొత్త ఫ్రాంఛైజీ లక్నో బీసీసీఐ నిబంధనలను అనుసరించి తమ ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. టీమిండియా వన్డే జట్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్, భారత లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయిని తమ జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ముగ్గురి కోసం లక్నో ఫ్రాంఛైజీ 30 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక రాహుల్‌ను మొదటి ఆప్షన్‌గా ఎంచుకున్న యాజమాన్యం అతడి కోసం 15 కోట్ల రూపాయలు వెచ్చించగా... స్టొయినిస్‌ను 11 కోట్లు, రవి బిష్ణోయిని 4 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పర్సులో 60 కోట్ల రూపాయలతో లక్నో మెగా వేలంలో పాల్గొననుంది. కాగా రాజీవ్ ప్రతాప్ సంజీవ్ గోయెంకా వెంచర్స్ లిమిటెడ్ రికార్డు స్థాయిలో ఏకంగా రూ.7,090 కోట్లు వెచ్చించి లక్నో ఫ్రాంఛైజీని సొంతం చేసుకుంది. కాగా ఐపీఎల్-2021 సీజన్లో కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. రాహుల్ ఆ టీమ్‌తో కొనసాగేందుకు ఇష్టపడక అందరికీ అందుబాటులోకి వచ్చాడు. ఇప్పుడు భారీ మొత్తంతో లక్నోకు సారథ్యం వహించేందుకు రాహుల్‌కు అవకాశం వచ్చింది. ఇదిలా ఉండగా... ఇప్పటి వరకు పంజాబ్, బెంగళూరు, ఢిల్లీ జట్లకు ప్రాతినిధ్యం వహించిన స్టొయినిస్‌కు అతని తాజా ఫామ్ ప్రకారం చూస్తే భారీ మొత్తం దక్కినట్లే! ఇక భారత అండర్– 19 తరఫున సత్తా చాటడంతో పాటు రెండు ఐపీ ఎల్ సీజన్లలో కేవలం 6.95 ఎకానమీతో 24 వికెట్లు తీసిన బిష్ణోయ్‌కు ‘అన్క్యాప్డ్’ కారణంగా తక్కువ మొత్తానికే లక్నో దక్కించుకుంది. చదవండి: IPL 2022: ధోని ‘గుడ్ బై’.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!? రాహుల్ ఆడిన 13 ఇన్నింగ్స్‌లో 626 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 98 నాటౌట్. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉండగా మరో కొత్త ఫ్రాంఛైజీ అహ్మదాబాద్ హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. పాండ్యా, రషీద్ కోసం రూ. 15 కోట్లు.. గిల్‌కు రూ. 7 కోట్లు చెల్లించేందుకు యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం-2022 నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చదవండి: IPL: అతడికి 16 కోట్లు.. అయ్యర్‌కు ఇప్పటి వరకు 35 కోట్లు.. ఆర్సీబీ, పంజాబ్, కేకేఆర్ పోటీ... రికార్డు బద్దలవడం ఖాయం! చదవండి: IPL Auction: కోట్ల ఖర్చు.. మెగా వేలం.. ఆ ఫ్రాంఛైజీ పర్సులో 72 కోట్లు.. మరి మిగిలిన జట్ల వద్ద ఎంతంటే! -
Venkatesh Iyer: వేలంలో రెండు రౌండ్లపాటు నన్ను ఎవరూ పట్టించుకోలేదు.. ఆ తర్వాత
Venkatesh Iyer Comments: ‘‘గతేడాది ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించాను. ఏ జట్టుకు ఆడినా గెలుపునకై నా వంతు కృషి చేస్తాను. ఈ క్రమంలోనే కేకేఆర్ నన్ను వేలంలో కొనుగోలు చేసింది. నిజానికి రెండు రౌండ్ల పాటు నేను అన్‌సోల్డ్(కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపలేదు)గా మిగిలిపోయాను. చివరి రౌండ్లో కేకేఆర్ నన్ను కొనుగోలు చేసింది. వారికి నా ధన్యవాదాలు. ఒకవేళ కేకేఆర్ నన్ను ఎంచుకుని ఉండకపోతే.. నేను ఇక్కడ ఉండేవాడినే కాదు’’ అని టీమిండియా యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ గతాన్ని నెమరువేసుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ మినీ వేలం-2021లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ వెంకటేశ్‌ను కొన్న సంగతి తెలిసిందే. 20 లక్షల రూపాయలు వెచ్చింది అతడిని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో యూఏఈ వేదికగా జరిగిన రెండో అంచెలో వెంకటేశ్ అత్యద్భుతంగా రాణించాడు. 10 ఇన్నింగ్స్ ఆడిన ఈ ఓపెనర్ 370 పరుగులు సాధించాడు. అంతేకాదు కేకేఆర్ అనూహ్యంగా పుంజుకుని ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో దేశవాళీ టీ20 టోర్నీ, ఐపీఎల్లో ప్రదర్శన ఆధారంగా అతడు జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ సిరీస్‌తో టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టీమిండియా పర్యటన నేపథ్యంలో తొలిసారిగా వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇలా అతడి దశ తిరిగిపోయింది. ఈ నేపథ్యంలో జర్నలిస్టు బోరియా మజుందార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేశ్ తన కెరీర్‌లోని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘‘ఒక్కసారి కేకేఆర్ క్యాంపులో అడుగుపెట్టిన తర్వాత.. నాకంటూ ఓ గుర్తింపు వచ్చిందనుకున్నా. నా జీవితానికి సంబంధించి ఇదో కీలక మలుపు. మొదటి దశలో అవకాశం రాలేదు. అయినా కేకేఆర్ యాజమాన్యం నాపై నమ్మకం ఉంచింది. యూఏఈలో ఆడే అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 20- 30 ఏళ్ల తర్వాత కూడా చెప్పుకోదగ్గ స్టోరీ ఇది. నిజంగా నా జీవితంలో ఇదెంతో ప్రత్యేకమైనది’’ అని కేకేఆర్ ఫ్రాంఛైజీ పట్ల కృతజ్ఞతాభావం చాటుకున్నాడు. కాగా ఐపీఎల్-2022 మెగా వేలం నేపథ్యంలో భాగంగా కోల్‌కతా అయ్యర్‌ను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఏకంగా 8 కోట్లు ఖర్చు చేసింది. చదవండి: WTC Points Table: దక్షిణాఫ్రికా చేతిలో పరాభవాన్ని ఎదుర్కొన్న టీమిండియాకు మరో షాక్.. Virat Kohli: ఆ కారణంగానే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా..! Enjoyed speaking to @venkateshiyer Love his attitude. Wants to matches for India and isn't satisfied with just being there. That's what matters. @KKRiders YT link https://t.co/8p4DgbZckR Congrats to him on 50 over selection and wish you all a safe and healthy 2022. pic.twitter.com/8308liOBRE — Boria Majumdar (@BoriaMajumdar) January 1, 2022 -
MS Dhoni: పాక్ పేసర్‌కు ధోని స్పెషల్ గిఫ్ట్.. భావోద్వేగానికి గురైన క్రికెటర్
MS Dhoni: టీమిండియా కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని గొప్పదనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అత్యుత్తమ సారథిగా.. బ్యాటర్‌గా.. వికెట్ కీపర్‌గా.. బెస్ట్ ఫినిషర్‌గా.. క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేశాడు. కేవలం ఆటతోనే కాకుండా.. సహచర క్రికెటర్లు, ఇతర జట్ల ఆటగాళ్లతో తను వ్యవహరించే తీరుతో కూడా కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు ధోని భాయ్. తాజాగా మరోసారి ఈ విషయాన్ని నిరూపించుకున్నాడు. పాకిస్తాన్ పేసర్ హారిస్ రవూఫ్‌ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు ధోని. సంతకం చేసిన తన జెర్సీని అతడికి పంపించాడు. ఈ విషయాన్ని రవూఫ్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘‘దిగ్గజం.. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని ఈ అందమైన బహుమతిని నాకు పంపించాడు. తన షర్టు ఇది. తన మంచి మనసుతో నెంబర్ ‘7’ ఇంకా హృదయాలను కొల్లగొడుతూనే ఉన్నాడు’’ అంటూ రవూఫ్ ధోనిపై అభిమానం చాటుకున్నాడు. ఇందుకు స్పందించిన సీఎస్కే మేనేజర్ రసెల్ రాధాకృష్ణన్.. ‘‘మా కెప్టెన్ మాట ఇచ్చాడంటే.. తప్పక నెరవేరుస్తాడు’’ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా కొనసాగుతున్న ధోని 2021లో జట్టును చాంపియన్‌గా నిలిపిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సీఎస్కే నాలుగుసార్లు టైటిల్ గెలిచింది. ఇక టీ20 ప్రపంచకప్-2021 సందర్భంగా టీమిండియా మెంటార్‌గా వ్యవహరించిన ధోని... భారత్‌తో పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత దాయాది జట్టు ఆటగాళ్లతో కాసేపు ముచ్చటించిన సంగతి తెలిసిందే. చదవండి: Ind Vs Sa 2nd Test: నువ్వు తోపు అనుకోకు.. అలా చేశావో నిన్ను మించినోడు లేడని చెప్పాను.. అంతే.. ఇక ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలే! When our captain @msdhoni promises he delivers , glad you love it champ #whistlepodu @ChennaiIPL https://t.co/3qybd0oFEE — Russell (@russcsk) January 7, 2022 View this post on Instagram A post shared by ICC (@icc) -
IPL 2021: నన్ను ఎక్కువగా హర్ట్ చేసింది అదే: వార్నర్
David Warner: ‘‘కెప్టెన్సీ నుంచి తొలగించడం... కనీసం తుది జట్టులో చోటు కల్పించకపోవడం... జట్టులోని యువ ఆటగాళ్లపై ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇలా చేయడం ద్వారా వారికి మీరు ఏం సందేశం ఇస్తున్నారు. నన్ను తీవ్రంగా బాధించిన విషయం ఏదైనా ఉందంటే... జట్టులోని యువ క్రికెటర్ల గురించే. ‘‘మాకు కూడా ఏదో ఒకరోజు ఇలా జరుగుతుంది’’ అనే అభద్రతా భావాన్ని పెంచుకునే అవకాశం ఉంది’’- ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ భావోద్వేగంతో పలికిన మాటలు ఇవి. ఎస్ఆర్హెచ్కు తొలి ఐపీఎల్ కప్ సాధించి పెట్టిన వార్నర్‌కు గత సీజన్లో ఘోర అవమానం జరిగిన సంగతి తెలిసిందే. తొలుత సారథ్య బాధ్యతల నుంచి తొలగించిన యాజమాన్యం.. ఆ తర్వాత తుది జట్టులో కూడా చోటు ఇవ్వలేదు. రిటెన్షన్ సమయంలో కూడా అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో హైదరాబాద్ జట్టుతో వార్నర్ బంధానికి తెర పడినట్లయింది. అయితే, ఈ విషయాన్ని ఆరెంజ్ ఆర్మీ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. వార్నర్ అన్న మళ్లీ ఎస్ఆర్హెచ్కు ఆడితే చూడాలని ఉందంటూ సోషల్ మీడియా వేదికగా అతడికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై పలుమార్లు స్పందించిన వార్నర్ భాయ్... తాజాగా జర్నలిస్టు బోరియా మజుందార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని ఆవేదన పంచుకున్నాడు. ‘‘జరిగిందేదో జరిగిపోయింది. పక్కన పెట్టినంత మాత్రాన ఎవరినీ విమర్శించే తత్వం కాదు నాది. ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు. బాధ పడుతూ కూర్చోకుండా.. వాస్తవాన్ని అర్థం చేసుకుని.. అసలు నన్ను ఎందుకు తప్పించారోనన్న విషయం గురించే ఆలోచిస్తాను’’ అంటూ స్ఫూర్తిదాయకంగా మాట్లాడాడు. కాగా మెగా వేలం-2022లో భాగంగా వార్నర్‌కు భారీ ధర లభించే అవకాశం ఉంది. రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరుకు జట్టుకు అతడు కెప్టెన్ అవుతాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఐపీఎల్-2021లో వైఫల్యం తర్వాత టీ20 ప్రపంచకప్-2021 టోర్నీతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన వార్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు అందుకున్నాడు. చదవండి: Ind Vs Sa 2nd Test: నువ్వు తోపు అనుకోకు.. అలా చేశావో నిన్ను మించినోడు లేడని చెప్పాను.. అంతే.. ఇక ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలే! -
'ఐ లవ్ యూ ఏబీ'.. నా గుండె ముక్కలయ్యింది
Virat Kohli Emotional Tweet After AB De Villiers.. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు.. ఆర్సీబీ విధ్వంసకర ప్లేయర్ ఏబీ డివిలియర్స్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లుగా శుక్రవారం ట్విటర్లో ప్రకటించాడు. డివిలియర్స్ నిర్ణయంపై ఆర్సీబీ సహచర ఆటగాడు.. చిరకాల మిత్రుడు విరాట్ కోహ్లి ట్విటర్ వేదికగా ఎమోషనల్ అయ్యాడు. ''ఏబీ డివిలియర్స్.. నీ నిర్ణయం నా గుండెను ముక్కలు చేసింది. కానీ సరైన సమయంలోనే ఆటకు గుడ్‌బై చెప్పాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. ఇక మా కాలంలో నువ్వొక అత్యుత్తమ ఆటగాడివి. నేను కలుసుకున్న అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తివి. ఆర్సీబీకి నీతో కలిసి ఆడిన క్షణాలు ఎప్పటికి గుర్తుండిపోతాయి.. అంతేకాదు దానిని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఆటకు గుడ్‌బై చెప్పినప్పటికి మన బంధం బయట కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా.. చివరగా ఐ లవ్ యూ డివిలియర్స్.'' అంటూ ముగించాడు. కాగా కోహ్లి ట్వీట్‌పై స్పందించిన ఏబీ.. ''లవ్ యూ టూ బ్రదర్'' అంటూ రిప్లై ఇవ్వడం విశేషం. 2011లో ఆర్సీబీలోకి వచ్చిన ఏబీ డివిలియర్స్.. కోహ్లితో కలిసి ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇద్దరు కలిసి ఎన్నో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టును గెలిపించారు. ఐపీఎల్లో 5వేలకు పైగా పరుగులు చేసిన డివిలియర్స్ విదేశీ ఆటగాళ్లలో అత్యంత సక్సెస్ అయిన ఆటగాడిగా నిలిచాడు.ఓవరాల్‌గా ఐపీఎల్లో ఇప్పటివరకు 184 మ్యాచ్‌లాడిన ఏబీ 5162 పరుగులు చేశాడు. This hurts my heart but I know you've made the best decision for yourself and your family like you've always done. 💔I love you 💔 @ABdeVilliers17 — Virat Kohli (@imVkohli) November 19, 2021 -
#JusticeForSanjuSamson: మా గుండె పగిలింది.. అసలేంటి ఇదంతా?!
Sanju Samson posts a cryptic tweet after being left out of the T20I squad against New Zealand: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు సెలక్టర్లు మరోసారి మొండిచేయి చూపారు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో ఫిట్నెస్ కారణాల వల్లే ఈ కేరళ బ్యాటర్‌ను పక్కనపెట్టారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2021 టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సంజూ.. తనపై వస్తున్న వార్తలకు ట్విటర్ వేదికగా దీటుగా బదులిచ్చాడు. వివిధ సందర్భాల్లో బౌండరీ వద్ద అద్భుత క్యాచ్‌లు అందుకుంటున్న ఫొటోలు షేర్ చేసి తన సత్తా ఏమిటో చెప్పాడు. కాగా న్యూజిలాండ్‌తో టీ20, టెస్టు సిరీస్ నేపథ్యంలో బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది. ఐపీఎల్లో అద్భుతంగా ఆకట్టుకున్న వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్లకు టీ20 జట్టులో స్థానం కల్పించింది. రాజస్తాన్ కెప్టెన్ అయిన సంజూ సైతం ఐపీఎల్ 2021లో మంచి ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో 14 ఇన్నింగ్స్‌లో 484 పరుగులు చేసి ఆరోస్థానంలో నిలిచాడు. అయినప్పటికీ సంజూకి చోటు దక్కకపోవడంతో.. అతడికి న్యాయం చేయాలంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇంత మంచి ఆటగాడిని ఎందుకు సెలక్ట్ చేయడం లేదో అర్థం కావడం లేదు. మా గుండె పగిలింది. ఐపీఎల్లో అత్యుత్తమంగా రాణించినా, దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా ఆడుతున్నా ఎందుకు సెలక్ట్ చేయడం లేదు’’ అంటూ సెలక్టర్ల తీరును విమర్శిస్తున్నారు. భారత టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చహల్, అశ్విన్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్, దీపక్ చహర్, హర్షల్ పటేల్, మొహమ్మద్ సిరాజ్. భారత్, న్యూజిలాండ్ టి20 సిరీస్ షెడ్యూల్ నవంబర్ 17: తొలి మ్యాచ్ (జైపూర్‌లో) నవంబర్ 19: రెండో మ్యాచ్ (రాంచీలో) నవంబర్ 21: మూడో మ్యాచ్ (కోల్‌కతాలో) చదవండి: Harbhajan Singh: 62 నాటౌట్, 70, 79 నాటౌట్.. అతడేం పాపం చేశాడు.. ఇంకేం చేస్తే సెలక్ట్ చేస్తారు? So as usual Sanju is dropped🙂 Man literally had his best IPL season🥲 Sanju started playing IPL at the age of 18 also won the emerging player award. He is now 26! If groomed earlier he could hv been our no4. Don't want him to be a wasted talent🥺#JusticeForSanjuSamson pic.twitter.com/eRi3Vuvsll — RO45 ☀️ (@Maanvi_264) November 9, 2021 Kumar Sangakara could recognize but when will BCCI recognize Sanju Samson 💔 #JusticeForSanjuSamson pic.twitter.com/aqv2iHU6Dc — Just Butter (@JustButter07) November 9, 2021 Rohit sharma till 2013 He was also useless like sanju but dhoni backed him Now he should also back sanju in t20Is but he is biased towards mumbai players #JusticeForSanjuSamson pic.twitter.com/6Mw56gRa4W — FL1CK🇦🇺🇦🇺🇦🇺 (@55of37) November 9, 2021 pic.twitter.com/rUxkLvLBSV — Sanju Samson (@IamSanjuSamson) November 10, 2021 -
Shubman Gill: ‘‘దేవతలతో ప్రేమలో పడకూడదు’’.. ‘బ్రేకప్ అయ్యిందా బ్రో’
Shubman Gill Instagram Post Leaves Fans Guessing About His Breakup Goes Viral: టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం విశ్రాంతి సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. తనకు ఇష్టమైన వ్యాపకాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. కాగా ఐపీఎల్-2021లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన శుభ్‌మన్... 17 మ్యాచ్‌లలో 17 ఇన్నింగ్స్ ఆడి 478 పరుగులు చేశాడు. కేకేఆర్ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఇంతవరకు టీ20 మ్యాచ్‌లలో భారత్ తరఫున అరంగేట్రం చేయని శుభ్‌మన్ గిల్‌కు... టీ20 ప్రపంచకప్- 2021 ఆడే భారత జట్టులో చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. దీంతో... అతడికి బిజీ షెడ్యూల్ నుంచి కాస్త విరామం దొరికింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ షేర్ చేస్తున్న శుభ్‌మన్ గిల్... తాజాగా పంచుకున్న ఓ ఫొటో చర్చకు దారితీసింది. సిగ్మా రూల్ నెంబర్ 1 అంటూ అద్దంలో తనను తాను చూసుకుంటున్న ఫొటోను గిల్ షేర్ చేశాడు. ఇందులో గిల్ నల్లని టీ షర్టు ధరించినట్లుగా కనిపిస్తోంది. అంతేగాక షర్టు వెనుక భాగంలో... ‘‘దేవతలతో ప్రేమలో పడకూడదు’’ అన్న కొటేషన్ రాసి ఉంది. దీంతో గిల్‌కు తన ప్రేయసి గుడ్‌బై చెప్పిందేమో... బ్రేకప్ అయిపోయిందా అంటూ కొంతమంది నెటిజన్లు ఇష్టారీతిన కామెంట్లు చేస్తున్నారు. గిల్ షర్టుపై ఉన్న కోట్కు తమకు నచ్చిన భాష్యాలు చెబుతున్నారు. కాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్తో శుభ్‌మన్ గిల్ ప్రేమలో పడ్డాడనే వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఒకరి పోస్టులకు ఒకరు కామెంట్ చేస్తూ.. కాస్త స్నేహంగా ఉన్నట్లు కనిపించడంతో గాసిప్ రాయుళ్లు ఈ కథనాలు అల్లేశారు. అయితే... గిల్, సారాలు మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు. ఇక ఇప్పుడు శుభ్‌మన్ ఈ ఫొటో షేర్ చేయడంతో మరోసారి అతడి రిలేషన్షిప్ స్టేటస్‌కు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: T20 WC 2021: 'ప్రపంచకప్ మాదే' అన్న పాక్ అభిమాని.. స్టువర్ట్ బ్రాడ్ సూపర్ రిప్లై View this post on Instagram A post shared by Ꮪhubman Gill (@shubmangill) View this post on Instagram A post shared by Ꮪhubman Gill (@shubmangill) -
Shreyas Iyer: ఢిల్లీ జట్టును వీడనున్న మాజీ కెప్టెన్.. ఎందుకంటే!
Shreyas Iyer likely to leave Delhi Capitals to get leadership role in IPL 2022: టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అయ్యర్... త్వరలోనే ఆ జట్టును వీడనన్నట్లు తెలుస్తోంది. వచ్చే సీజన్లో అతడు ఢిల్లీ జెర్సీలో కనిపించకపోవచ్చనే సంకేతాలు వస్తున్నాయి. కాగా 2018లో భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అర్ధంతరంగా ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోగా.. శ్రేయస్ అయ్యర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2020 సీజన్లో ఢిల్లీని ఫైనల్‌కు చేర్చి కెప్టెన్‌గా తానేమిటో నిరూపించుకున్నాడు. అయితే, ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ గాయపడిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇంగ్లండ్‌తో సిరీస్‌తో పాటు ఐపీఎల్-2021 మొదటి దశకు కూడా అతడు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో టీమిండియా యువ ఆటగాడు రిషభ్ పంత్‌కు ఢిల్లీ ఫ్రాంఛైజీ సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. యూఏఈ అంచెకు శ్రేయస్ అందుబాటులోకి వచ్చినా పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించింది. ఈ క్రమంలో మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పంత్... ఢిల్లీని ఈ ఏడాది టేబుల్ టాపర్‌గా నిలబెట్టాడు. కానీ.. ఫైనల్‌కు మాత్రం చేర్చలేకపోయాడు. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ మాత్రం బ్యాటర్‌గా మెరుగ్గానే రాణించాడు. ఐపీఎల్-2021 రెండో దశలో భాగంగా 8 మ్యాచ్‌లలో 8 ఇన్నింగ్స్ ఆడిన అతడు 175 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2022లో రెండు కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్ వచ్చి చేరనున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీకి కెప్టెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు కాబట్టి... జట్టును వీడాలని అయ్యర్ భావిస్తున్నాడట. కొత్త జట్లు లేదంటే.. సారథి కోసం చూస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వంటి ఏదో ఒక జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశాలను పరిశీలిస్తున్నాడట. -
Marcus Stoinis: ధోని కాంప్లిమెంట్ ఇచ్చాడో.. సెటైర్ వేశాడో తెలియలేదు!
Marcus Stoinis Comments On MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. భారత జట్టుకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన సారథిగా.. ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌గా.. అనేకానేక ఘనతలు అతడి ఖాతాలో ఉన్నాయి. ఇక ఇలాంటి రికార్డులతోనే కాకుండా... ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లతో కూడా అతడు వ్యవహరించే తీరు కూడా కోట్లాది మంది అభిమానులను సంపాదించిపెట్టింది. టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా.. టీమిండియాతో మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ ఆటగాళ్లు వచ్చి ధోని వద్ద సలహాలు తీసుకోవడం అతడి వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ మార్కస్ స్టొయినిస్ సైతం ఇదే మాట అంటున్నాడు. ఐపీఎల్-2021లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సందర్భంగా ధోని తనతో మాట్లాడిన మాటలను స్టొయినిస్ గుర్తుచేసుకున్నాడు. ఈ మేరకు గ్రేడ్ క్రికెటర్స్ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ... ‘‘నిజానికి తను నాతో చాలా నిజాయితీగా మాట్లాడాడు. నా ఆట తీరు గురించి తనకు అవగాహన ఉంది. అందుకే నా కోసం సీఎస్కే ఎలాంటి ప్రణాళికలు రచించిందో.. ఫీల్డ్‌ను ఎలా సెట్ చేస్తారో కూడా చెప్పాడు. నిజానికి అది నాకు తను ఇచ్చిన కాంప్లిమెంటా లేదంటే... నీ గురించి మొత్తం తెలుసులేనన్న సెటైరో అర్థం కాలేదు(నవ్వులు)’’ అని స్టొయినిస్ వ్యాఖ్యానించాడు. ఇక క్రికెట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్‌గా పేరొందిన ధోని.. ఫినిషింగ్‌కు సంబంధించి తనకు ఆసక్తికర విషయాలు చెప్పాడని స్టొయినిస్ పేర్కొన్నాడు. ‘‘కొంతమంది బాధ్యతాయుతంగా ఆడుతూ చివరి వరకు క్రీజులో ఉంటారు. మరికొందరు మ్యాచ్ ఆరంభంలోనే రిస్క్ తీసుకోవడానికి కూడా వెనుకాడరు. ఇందులో ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి అని తను అన్నాడు. నిజమే కదా’’ అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా..‘‘ ఆటలో మన బలహీనతలను గుర్తించాలి.. అయితే అది మన బలాన్ని ప్రభావితం చేసేలా మాత్రం ఉండకూడదనే స్ఫూర్తిదాయక మాటలు చెప్పాడు’’ అని తెలిపాడు. కాగా స్టొయినిస్ ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్-2021లో ఆడుతుండగా... ధోని టీమిండియాకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. చదవండి: Gary Kirsten: పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా.. టీమిండియా మాజీ కోచ్! -
నేను ఇంకా ఎక్కడికీ వెళ్లడం లేదు: ధోని
ప్రతీ ఫైనల్ ప్రత్యేకమే. ఫైనల్లో ఎక్కువసార్లు ఓడిన జట్టు కూడా మాదే. అయితే పడ్డ ప్రతీసారి కోలుకొని పైకి లేవడం అన్నింటికంటే ముఖ్యం. మేం ఆటగాళ్లను మారుస్తూ వచ్చాం. ప్రతీసారి ఒక మ్యాచ్ విన్నర్ బయటకు వచ్చి అద్భుతాలు చేశారు. నిజాయితీగా చెప్పాలంటే జట్టు సమావేశాల్లో మేం పెద్దగా మాట్లాడుకోం. ఏమైనా ఉంటే ఒక్కొక్కరితో విడిగా చెప్పడమే. మేం ఎక్కడ ఆడినా మాకు అండగా నిలిచే చెన్నై అభిమానులకు కృతజ్ఞతలు. ఇప్పుడు కూడా చెన్నైలో ఆడుతున్నట్లే అనిపించింది. వచ్చేసారి రెండు కొత్త జట్లు వస్తున్నాయి కాబట్టి ఆటగాళ్లను కొనసాగించడం గురించి ఏమీ చెప్పలేను. నేను ఇదే జట్టుతో కొనసాగుతానా లేదా అనేది సమస్య కాదు. ఫ్రాంచైజీ కోసం ఒక పటిష్టమైన జట్టును తయారు చేయడం ముఖ్యం. సరిగ్గా చెప్పాలంటే వచ్చే 10 ఏళ్లు జట్టును నడిపించగల ప్రధాన బృందాన్ని ఎంచుకోవడం ముఖ్యం. నా వైపు నుంచి గొప్ప ఘనతలు ఇచ్చి వెళుతున్నానని అంటున్నారు. కానీ నేను ఇప్పుడే పోతే కదా. –ఎమ్మెస్ ధోని, (చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్) -
ధోని పక్కా వ్యూహం.. వారి వయసు 35 ఏళ్లకు పైనే..
సాక్షి క్రీడా విభాగం: ‘మేం వచ్చేసారి బలంగా తిరిగొస్తాం... అభిమానులకు ఇదే నా సందేశం’... గత ఏడాది ఐపీఎల్లో చెత్త ప్రదర్శనతో ఏడో స్థానంలో నిలిచిన తర్వాత ధోని చేసిన వ్యాఖ్య ఇది. జట్టుపై, తనపై ఎంత నమ్మకముంటే ధోని ఇలాంటి మాటలు చెప్పగలడు. ఎందుకంటే అతను ధోని కాబట్టి! చూస్తుంటే టీమ్ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. వయసు పెరిగిపోయి, ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న ఆటగాళ్లతో ఈసారే కాలేదు, వచ్చే ఏడాది ఏమవుతుంది అని అన్ని వైపుల నుంచి వ్యంగ్య స్పందనలు. కానీ ఇలాంటి స్థితి నుంచి టీమ్‌ను నిజంగా విజేతగా నిలపడం అంటే అసాధారణం. సీఎస్కేకు తొలి సీజన్ నుంచి కర్త, కర్మ, క్రియ అన్నీ ధోనినే. జట్టు గెలిచినా, ఓడినా, చాంపియన్‌షిప్‌లు సాధించినా అంతా అతని సారథ్యం అనడంలో సందేహం లేదు. టీమ్ మేనేజ్మెంట్ కూడా ఇదే నమ్మింది. ఇన్నేళ్ల విజయాల్లో భిన్న ఆటగాళ్లు తమదైన పాత్ర పోషించారు. కానీ మారనిది ధోని, అతని వ్యూహ చతురతే! సరిగ్గా చెప్పాలంటే ఈ సీజన్లో 40 ఏళ్ల ధోని బ్యాటింగ్ చూస్తే సూపర్ కింగ్స్ పది మంది ఆటగాళ్లు, ఒక కెప్టెన్‌తో ఆడినట్లు ఉంది. కేవలం నాయకత్వం కారణంగానే అతను టీమ్‌లో ఉన్నాడనేది వాస్తవమైతే అతను నాయకుడిగా ఉన్నాడు కాబట్టే టీమ్ ఇలా పురోగమించిందనేది కూడా అంతకంటే వాస్తవం! చెన్నై టీమ్‌లో ఐదుగురు ఆటగాళ్లు 35 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. టి20లు అనగానే ఈ విషయంలో కాస్త సంశయం కనిపిస్తుంది. అయితే బరిలోకి దిగి అద్భుతాలు చేసేందుకు వారికి వయసు అడ్డు రాలేదు. వీరంతా టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. 37 ఏళ్ల డు ప్లెసిస్ ఏకంగా 633 పరుగులతో సత్తా చాటి ఓపెనర్‌గా శుభారంభాలు అందించాడు. 38 ఏళ్ల బ్రావో 14 కీలక వికెట్లు తీసి తాను చెన్నై బృందంలో సుదీర్ఘ కాలంగా ఎందుకు కొనసాగుతున్నాడో చూపించాడు. 34 ఏళ్ల సీనియర్, అత్యంత విజయవంతమైన చెన్నై ఆటగాడు సురేశ్ రైనా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతుంటే మరో 35 ఏళ్ల రాబిన్ ఉతప్పను తుది జట్టులోకి తీసుకొని చేసిన వ్యూహం సూపర్‌గా పేలింది. తొలి క్వాలిఫయర్‌లో మెరుపు బ్యాటింగ్ చేసిన ఉతప్ప, ఫైనల్లో జట్టు ఒత్తిడిలోకి వెళుతున్న సమయంలో 3 సిక్సర్లతో ఆట మార్చేశాడు. 36 ఏళ్ల రాయుడు కూడా కీలక సమయంలో రెండు అర్ధ సెంచరీలతో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇక ఐపీఎల్ గెలిచిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా నిలిచిన 34 ఏళ్ల మొయిన్ అలీని కూడా ధోని సమర్థంగా వాడుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లతో పాటు అతని చక్కటి ఫీల్డింగ్ జట్టుకు ఎంతో పనికొచ్చాయి. ఎప్పటిలాగే రవీంద్ర జడేజా తనదైన శైలిలో అన్ని రంగాల్లో రాణించడం చెన్నై బలాన్ని పెంచింది. ఇక టీమ్ ప్రస్థానంలో చెప్పుకోదగ్గ పేరు రుతురాజ్ గైక్వాడ్. గత ఏడాది ఐపీఎల్ సమయంలో అనూహ్యంగా కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత ఆరంభంలో విఫలమైనా... చివరి మ్యాచ్‌లలో సత్తా చాటాడు. ఈసారి తనలోని పూర్తి స్థాయి ఆటను చూపిస్తూ సెంచరీ సహా 635 పరుగులు సాధించడం చెన్నై టైటిల్ విజయంలో కీలకంగా మారింది. వీరందరినీ సమర్థంగా వాడుకుంటూ ధోని నడిపించిన తీరు నాయకుడిగా అతని వన్నె ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. చివరగా... వచ్చేసారి ఐపీఎల్లో మెగా వేలం ఉన్న నేపథ్యంలో ఇంకా నియమ నిబంధనలు ఏమిటనేది బీసీసీఐ ఇంకా స్పష్టం చేయలేదు. అయితే విజేతలుగా నిలిచిన ఈ టీమ్‌లోని సభ్యుల్లో కూడా ఎంత మంది మళ్లీ ఐపీఎల్లో కనిపిస్తారనేది వేర్వేరు కారణాలతో సందేహమే. ఒకవేళ ఆడినా ఇదే సక్సెస్ఫుల్ టీమ్ ఒక్క చోటికి చేరడం సహజంగానే కష్టం. ఈ నేపథ్యంలో వీరు సాధించిన విజయపు ఘనత చిన్నదేమీ కాదు. చెన్నై ఫ్యాన్స్ మాత్రమే కాదు, సగటు క్రికెట్ అభిమాని కూడా... ఏం ఆడిందిరా ఈ టీమ్ అనేలా ఘనంగా చెన్నై ముగింపు పలికింది. -
నాలుగోసారి ‘కింగ్స్’
ఐపీఎల్లో మళ్లీ ‘విజిల్ పొడు’... పసుపు మయమైన దుబాయ్ మైదానంలో తమ ఆరాధ్య ఆటగాడు మాహి మళ్లీ ఐపీఎల్ ట్రోఫీతో చిరునవ్వులు చిందిస్తుంటే... దసరా రోజున చెన్నై క్రికెట్ అభిమానుల పండగ ఆనందం రెట్టింపైంది... అనుభవం, అద్భుత నాయకత్వం వెరసి చెన్నై మరోసారి ధనాధన్ లీగ్‌లో తమ విలువేంటో చూపించింది. తుది పోరులో అన్ని రంగాల్లో మెరిసి నాలుగోసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. మెరుపు బ్యాటింగ్‌తో మొదటి భాగంలోనే విజయానికి బాటలు వేసుకున్న జట్టు, బౌలింగ్‌లో కీలక సమయంలో సత్తా చాటి ప్రత్యర్థిని పడగొట్టింది. ఫైనల్ పోరులో తమదైన పాత్ర పోషించిన ప్రతీ ప్లేయర్ హీరోలుగా నిలిచారు. అటు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆరంభంలోనే భారీగా పరుగులు సమరి్పంచుకొని పట్టు కోల్పోయింది. నమ్ముకున్న బౌలర్లంతా విఫలం కాగా... బ్యాటింగ్‌లో టోర్నీ ఆసాంతం వెంటాడిన మిడిలార్డర్ వైఫల్యం అసలు సమయంలో పెద్ద దెబ్బ కొట్టింది. ఫలితంగా తమ మూడో ఫైనల్‌ను ఓటమితో ముగించాల్సి వచి్చంది. దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత నిలకడైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) నాలుగో టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్లో చెన్నై 27 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫాఫ్ డు ప్లెసిస్ (59 బంతుల్లో 86; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, మొయిన్ అలీ (20 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (27 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్), రాబిన్ ఉతప్ప (15 బంతుల్లో 31; 3 సిక్సర్లు) కీలక ప్రదర్శన చేశారు. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులే చేయగలిగింది. ఓపెనర్లు శుబ్‌మన్ గిల్ (43 బంతుల్లో 51; 6 ఫోర్లు), వెంకటేశ్ అయ్యర్ (32 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. ఒకదశలో 91/0తో లక్ష్యం దిశగా సాగిన జట్టు... 34 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది. విజేతగా నిలిచిన చెన్నై జట్టుకు రూ. 20 కోట్లు... రన్నరప్ కోల్‌కతా జట్టుకు రూ. 12 కోట్ల 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు... సీజన్ మొత్తంలో ఆడిన తరహాలోనే చెన్నైకి మరోసారి ఓపెనర్లు రుతురాజ్, డు ప్లెసిస్ శుభారంభం అందించారు. షకీబ్ ఓవర్లో రుతురాజ్ వరుసగా 4, 6 కొట్టగా, అదృష్టం కలిసొచ్చిన డు ప్లెసిస్ ఆ తర్వాత చెలరేగిపోయాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 56 పరుగులకు చేరింది. నరైన్ ఈ జోడీని విడదీసిన సమయంలో కోల్‌కతా స్పిన్నర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నట్లు అనిపించింది. అయితే మూడో స్థానంలో వచి్చన రాబిన్ ఉతప్ప ఉన్న కొద్దిసేపు మెరుపు బ్యాటింగ్‌తో ఆట గమనాన్ని మార్చేశాడు. మరోవైపు ఫెర్గూసన్ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన 35 బంతుల్లోనే డు ప్లెసిస్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నరైన్ బౌలింగ్‌లో ఉతప్ప వెనుదిరిగినా అలీ దూకుడుతో చెన్నై ఇన్నింగ్స్‌లో జోరు తగ్గలేదు. శివమ్ మావి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన అలీ, వరుణ్ చక్రవర్తి ఓవర్లోనూ మరో ఫోర్, సిక్స్ కొట్టాడు. ఫెర్గూసన్ ఓవర్లో 19 పరుగులు రాబట్టి కింగ్స్ పండగ చేసుకుంది. ఇన్నింగ్స్ చివరి బంతికి డు ప్లెసిస్ అవుటైనా... మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాల్లో (61, 63, 68) అతను తన పాత్రను సమర్థంగా పోషించాడు. ఓపెనర్లు మినహా... చెన్నైతో పోలిస్తే ఛేదనలో కోల్‌కతా మరింత దూకుడు కనబర్చింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ వరుస బౌండరీలతో జోరును ప్రదర్శించగా, గిల్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. చహర్, శార్దుల్ ఓవర్లలో వెంకటేశ్ రెండేసి ఫోర్లు కొట్టాడు. పవర్‌ప్లేలో 55 పరుగులు రాగా, జడేజా ఓవర్లో 16 పరుగులు రాబట్టడంతో సగం ఇన్నింగ్స్ ముగిసేసరికి స్కోరు 88 పరుగులకు చేరింది. అయితే ఈ దశలో శార్దుల్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అతని ఓవర్లో భారీ షాట్‌కు ప్రయతి్నంచిన వెంకటేశ్... జడేజా అద్భుత క్యాచ్‌కు వెనుదిరగడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడగా, అదే ఓవర్లో రాణా (0) అవుటయ్యాడు. నరైన్ (2), కార్తీక్ (9), షకీబ్ (0), గాయంతో బ్యాటింగ్‌కు దిగిన త్రిపాఠి (2), పేలవ ఫామ్‌లో ఉన్న కెపె్టన్ మోర్గాన్ (4) వరుసగా విఫలమయ్యారు. దాంతో కేకేఆర్ ఇన్నింగ్స్ వేగంగా పతనమైంది. చివర్లో 21 బంతుల్లో 68 పరుగులు చేయాల్సిన స్థితిలో జత కలిసిన శివమ్ మావి (13 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్సర్లు), ఫెర్గూసన్ (18 నాటౌట్) కొన్ని మెరుపు షాట్లు ఆడి 39 పరుగులు జోడించినా అది వృథా ప్రయాసే అయింది. డు ప్లెసిస్‌కు అవకాశం ఇచి్చ... సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్ చేసిన పెద్ద తప్పు చెన్నైకి ఊపిరి పోసింది. షకీబ్ బౌలింగ్‌లో డు ప్లెసిస్ ముందుకు దూసుకు రాగా, సునాయాస స్టంపింగ్ అవకాశాన్ని కార్తీక్ వదిలేశాడు. ఆ సమయంలో ప్లెసిస్ స్కోరు 4 మాత్రమే! ఆ తర్వాత అతనే భారీ స్కోరుకు కారణమయ్యాడు. కోల్‌కతా ఆటగాడు వెంకటేశ్ ‘0’ వచి్చన ఇచ్చిన క్యాచ్‌ను అనూహ్యంగా ధోని వదిలేసి అతని అర్ధ సెంచరీకి అవకాశం ఇచి్చనా... చివరకు అది నష్టం కలిగించలేదు. మరోవైపు 27 పరుగుల వద్ద గిల్ క్యాచ్‌ను రాయుడు అందుకున్నా... బంతి స్పైడర్ క్యామ్ వైర్‌కు తగిలి రావడంతో అంపైర్లు డెడ్‌బాల్‌గా ప్రకటించడం ధోనికి అసహనం తెప్పించింది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) మావి (బి) నరైన్ 32; డు ప్లెసిస్ (సి) వెంకటేశ్ (బి) మావి 86; ఉతప్ప (ఎల్బీ) (బి) నరైన్ 31; మొయిన్ అలీ (నాటౌట్) 37; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–61, 2–124, 3–192. బౌలింగ్: షకీబ్ 3–0–33–0, మావి 4–0–32–1, ఫెర్గూసన్ 4–0–56–0, వరుణ్ 4–0–38–0, నరైన్ 4–0–26–2, వెంకటేశ్ 1–0–5–0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (ఎల్బీ) (బి) దీపక్ చహర్ 51; వెంకటేశ్ (సి) జడేజా (బి) శార్దుల్ 50; రాణా (సి) డు ప్లెసిస్ (బి) శార్దుల్ 0; నరైన్ (సి) జడేజా (బి) హేజల్‌వుడ్ 2; మోర్గాన్ (సి) చహర్ (బి) హేజల్‌వుడ్ 4; దినేశ్ కార్తీక్ (సి) రాయుడు (బి) జడేజా 9; షకీబ్ (ఎల్బీ) (బి) జడేజా 0; త్రిపాఠి (సి) అలీ (బి) శార్దుల్ 2; ఫెర్గూసన్ (నాటౌట్) 18; మావి (సి) చహర్ (బి) బ్రేవో 20; వరుణ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–91, 2–93, 3–97, 4–108, 5–119, 6–120, 7–123, 8–125, 9–164. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–32–1, హేజల్‌వుడ్ 4–0–29–2, శార్దుల్ ఠాకూర్ 4–0–38–3, బ్రావో 4–0–29–1, జడేజా 4–0–37–2. ఐపీఎల్–2021 అవార్డులు ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్) రుతురాజ్ గైక్వాడ్ 635 పరుగులు చెన్నై సూపర్ కింగ్స్ ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ రుతురాజ్ గైక్వాడ్ –ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్) హర్షల్ పటేల్–32 వికెట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ హర్షల్ పటేల్ – ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు గేమ్ చేంజర్ ఆఫ్ ద సీజన్ హర్షల్ పటేల్ – ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ రవి బిష్ణోయ్ (పంజాబ్ కింగ్స్) ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్ హెట్‌మైర్ – ఢిల్లీ క్యాపిటల్స్ ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు పవర్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ వెంకటేశ్ అయ్యర్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్ కేఎల్ రాహుల్ (30 సిక్స్‌లు) పంజాగ్ కింగ్స్ ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు ఫెయిర్ ప్లే టీమ్ ఆఫ్ ద సీజన్: రాజస్తాన్ రాయల్స్ -
ధోని ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్.. ఐపీఎల్ ట్రోఫీతో పాటు..?
MS Dhoni And Sakshi Dhoni Expecting Their Second Child In 2022: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను నాలుగోసారి(2010, 2011, 2018, 2021) విజేతగా నిలిపి ఆ ఫ్రాంఛైజీ అభిమానులు గర్వపడేలా చేసిన మహేంద్ర సింగ్ ధోని.. తన ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పాడు. ధోని రెండోసారి తండ్రి కాబోతున్న విషయాన్ని అతని భార్య సాక్షి సింగ్ రావత్ స్నేహితురాలు, సురేశ్ రైనా భార్య ప్రియాంక రైనా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సాక్షి రావత్ ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి అని.. వచ్చే ఏడాదిలో ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వనుందని ప్రియాంక రైనా పేర్కొన్నట్లు సమాచారం. నిన్న సీఎస్కే ట్రోఫీ గెలిచిన అనంతరం సాక్షి, కుమార్తె జీవాతో కలిసి మైదానంలోకి వచ్చి సందడి చేశారు. ఆ సమయంలో సాక్షి బేబీ బంప్ స్పష్టంగా కనిపించడంతో ధోని అభిమానులు విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. దీంతో ధోని ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా లభించినట్లైంది. ఇదిలా ఉంటే, శుక్రవారం జరిగిన ఐపీఎల్-2021 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 27 పరుగుల తేడాతో ఓడించి, నాలుగోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. డుప్లెసిస్ (86), రుతురాజ్ గైక్వాడ్ (32), రాబిన్ ఉతప్ప (31), మొయిన్ అలీ (37) రాణించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్‌కు ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (50), శుభ్‌మన్ గిల్ (51) శుభారంభాన్ని అందించినప్పటికీ.. మిగతా బ్యాటర్లంతా తేలిపోవడంతో మోర్గాన్ సేన ఓటమిపాలై, మూడోసారి కప్‌కు గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. చదవండి: తీవ్ర విషాదం... గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి -
IPL2021: సీఎస్కే విన్నింగ్ మూమెంట్స్ (ఫోటోలు)
-
గోల్డెన్ డక్ విషయంలో నితీష్ రాణా చెత్త రికార్డు
Nitish Rana Golden Duck.. గోల్డెన్ డక్ విషయంలో కేకేఆర్ బ్యాటర్ నితీష్ రాణా చెత్త రికార్డు నమోదు చేశాడు. 2020 ఏడాది ఆరంభం మొదలైనప్పటి నుంచి నితీష్ రాణా ఐదుసార్లు గోల్డెన్‌డక్‌గా వెనుదిరగడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సీఎస్కేతో జరుగుతున్న ఐపీఎల్ 2021 సీజన్ ఫైనల్లో కేకేఆర్ ఓటమి దిశగా పయనిస్తుంది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే కేకేఆర్‌కు 193 పరుగుల భారీ లక్ష్యం విధించింది. సీఎస్కే ఓపెనర్ డుప్లెసిస్ (59 బంతుల్లో 86;7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. రుతురాజ్ 32, ఊతప్ప 31 పరుగులు చేశారు. ఆఖర్లో మొయిన్ అలీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేయడంతో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2, శివమ్ మావి 1 వికెట్ తీశాడు. -
IPL 2021 Final: తెలుగులో మాట్లాడిన కేకేఆర్ ఆటగాడు.. ఫ్యాన్స్ ఫిదా
Dinesh Karthik Speaking Telugu In IPL 2021 Final: 2021 ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్‌కీపర్ దినేశ్ కార్తీక్ తెలుగులో మాట్లాడి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మెగా ఫైనల్ ప్రారంభానికి ముందు స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానెల్ కోసం మాట్లాడిన డీకే.. ఎలాంటి తడబాటు లేకుండా స్పష్టమైన ఉచ్చారణతో తెలుగు మాట్లాడి ఆకట్టుకున్నాడు. ప్రముఖ వాఖ్యాత, తెలుగువాడైన హర్షా భోగ్లే అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. డీకే అనర్గలంగా తెలుగులో మాట్లాడాడు. Wow. @DineshKarthik is killing it in Telugu. As fluent as his on field conversations in Tamil with Varun Chakravarthy. #IPLFinal pic.twitter.com/pLABDPES4U — PK - VJ (@msd21888) October 15, 2021 మెగా ఫైనల్ అని ఏమైనా ఒత్తిడి ఉందా అని హర్షా ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని, సాధారణ మ్యాచ్‌లానే ఈ మ్యాచ్‌నూ పరిగణిస్తున్నామని తెలిపాడు. అయితే ఫైనల్ మ్యాచ్ అంటే సహజంగా ఎవరికైన కాస్తో కూస్తో ఒత్తిడి ఉంటుందని, దాన్ని అధిగమించేందుకు ప్రాక్టీస్ చేశామని, సరైన ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. తమ జట్టు సెకండాఫ్‌లో అద్భుతంగా రాణించిందని, ఫైనల్‌కు చేరేందుకు ఆటగాళ్లు ఎంతో శ్రమించారని అన్నాడు. ఈ సందర్భంగా డీకే.. కేకేఆర్ ఆటగాళ్లందరిపై ప్రశంసల వర్షం కురిపించాడు. Ha! Never thought I would do a pre-game interview in Telugu with @DineshKarthik. Bagane Telugulo mataladtaadu mana DK! — Harsha Bhogle (@bhogleharsha) October 15, 2021 కాగా, దినేశ్ కార్తీక్ తెలుగులో మాట్లాడటం పట్ల తెలుగు అభిమానులు ఫిదా అవుతున్నారు. డీకే అచ్చం తెలుగువాడిలా అద్భుతంగా మాట్లాడుతున్నాడంటూ సోషల్‌మీడియాలో వీడియోని షేర్ చేస్తూ ముచ్చటపడిపోతున్నారు. హర్షా భోగ్లే సైతం డీకేను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. తెలుగు ఇంటర్వ్యూ చేస్తానని కలలో కూడా ఊహించలేదని అన్నాడు. ఇదిలా ఉంటే, డీకే.. 2020 ఐపీఎల్ సందర్భంగా కూడా తెలుగులో మాట్లాడి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చదవండి: IPL 2021 Final: ఐపీఎల్ చరిత్రలో అద్భుత రికార్డు -
IPL 2021 Final: ఐపీఎల్ చరిత్రలో అద్భుత రికార్డు
CSK Opener Ruturaj Gaikwad Became Youngest Orange Cap Holder In IPL History: ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో శుక్రవారం జరిగిన ఐపీఎల్-2021 తుది సమరంలో 24 పరుగుల వద్ద పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్(626 పరుగులు) నుంచి ఆరెంజ్ క్యాప్‌ను చేజిక్కించుకున్న రుతురాజ్(24 ఏళ్లు).. లీగ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు పంజాబ్ మాజీ ఓపెనర్ షాన్ మార్ష్ పేరిట ఉండేది. 2008లో 25 సంవత్సరాల వయసులో షాన్ మార్ష్ 616 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. ఇదిలా ఉంటే, నేటి మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే 14 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. రుతురాజ్ 32 పరుగుల వద్ద సునీల్ నరైన్ బౌలింగ్‌లో శివమ్ మావికి క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. రాబిన్ ఊతప్ప(31) నరైన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. క్రీజ్‌లో డుప్లెసిస్(57), మొయిన్ అలీ(1) ఉన్నారు. చదవండి: T20 World Cup 2021: టీమిండియాతో మెగా పోరుకు ముందు పాక్ జట్టుకు భారీ షాక్.. -
ఏడుసార్లలో మూడు కేకేఆర్‌పైనే.. అన్ని గెలుపే
Ruturaj Gaikwad And Faf Du Plesis.. కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే ఒక అరుదైన రికార్డు సాధించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్‌లు ఈ సీజన్లో తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ఇది ఏడోసారి. కాగా ఇందులో మూడుసార్లు కేకేఆర్‌పైనే నమోదు చేశారు. ఇంకో విశేషమేమిటంటే.. సీఎస్కే ఓపెనర్లు అర్థసెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన ఆరు మ్యాచ్‌ల్లోనూ సీఎస్కే విజయం సాధించడం విశేషం. ఇక సీఎస్కే ఓపెనర్లుగా రుతురాజ్- డుప్లెసిస్ జోడి ఈ సీజన్లో 756 పరుగులు జోడించి ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో మూడో స్థానంలో నిలిచారు. కోహ్లి- డివిలియర్స్(ఆర్సీబీ) జోడి 2016 ఐపీఎల్ సీజన్లో 939 పరుగులతో తొలి స్థానంలో ఉన్నారు. డేవిడ్ వార్నర్- బెయిర్ స్టో జోడి(ఎస్ఆర్హెచ్) 2019 ఐపీఎల్ సీజన్లో 791 పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు. -
CSK Vs KKR Final: ఐపీఎల్ 2021 టైటిల్ విజేత సీఎస్కే
ఐపీఎల్ 2021 టైటిల్ విజేత సీఎస్కే ఐపీఎల్లో సీఎస్కే నాలుగోసారి చాంపియన్‌గా నిలిచింది. కేకేఆర్‌తో జరిగిన ఫైనల్లో సీఎస్కే 27 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించి ఐపీఎల్ 2021 విజేతగా నిలిచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఆరంభంలో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ దూకుడుతో ఇన్నింగ్స్‌ను ఘనంగానే ఆరంభించింది. అయితే అయ్యర్, గిల్ ఔటైన తర్వాత మ్యాచ్ మొత్తం మారిపోయింది. ఆ తర్వాత జడేజా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో మ్యాచ్ టర్న్ అయింది. ఆ తర్వాత వరుస విరామాల్లో కేకేఆర్ వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా అడుగులేసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. సీఎస్కే ఓపెనర్ డుప్లెసిస్ (59 బంతుల్లో 86;7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. రుతురాజ్ 32, ఊతప్ప 31 పరుగులు చేశారు. ఆఖర్లో మొయిన్ అలీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేయడంతో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2, శివమ్ మావి 1 వికెట్ తీశాడు. ఎనిమిదో వికెట్ వికెట్ డౌన్.. ఓటమి దిశగా కేకేఆర్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ వరుసగా వికెట్లు కోల్పోతూ వస్తుంది. షకీబుల్ హసన్ జడేజా బౌలింగ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో కేకేఆర్ 15 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. అంతకముందు9 పరుగులు చేసిన కార్తీక్ జడేజా బౌలింగ్‌లో రాయుడుకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగ్గా.. 51 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ దీపక్ చహర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. . వెంకటేశ్ అయ్యర్ ఔట్.. కేకేఆర్ 93/2 సీఎస్కే జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. నితీష్ రాణా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అంతకముందు వెంకటేశ్ అయ్యర్(50) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. దాటిగా ఆడుతున్న అయ్యార్ శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 11 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. గిల్ 40, నితీష్ రాణా పరుగులతో క్రీజులో ఉన్నారు. చుక్కలు చూపిస్తున్న వెంకటేశ్ అయ్యర్.. కేకేఆర్ 72/0 కేకేఆర్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ సీఎస్కే బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. 25 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులతో ఆడుతున్న అయ్యర్‌కు మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(27) సహకరిస్తున్నాడు. ప్రస్తుతం కేకేఆర్ 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. ధీటుగా బదులిస్తున్న కేకేఆర్ 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ధీటుగానే బదులిస్తుంది. కేకేఆర్ ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, శుబ్‌మన్ గిల్లు దాటిగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులెత్తిస్తున్నారు. ప్రస్తుతం 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 21, గిల్ 15 పరుగులతో ఆడుతున్నారు. Photo Courtesy: IPL సీఎస్కే 192/3 .. కేకేఆర్ ముందు భారీ టార్గెట్ ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్‌లో సీఎస్కే కేకేఆర్‌కు 193 పరుగుల భారీ లక్ష్యం విధించింది. సీఎస్కే ఓపెనర్ డుప్లెసిస్ (59 బంతుల్లో 86;7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. రుతురాజ్ 32, ఊతప్ప 31 పరుగులు చేశారు. ఆఖర్లో మొయిన్ అలీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేయడంతో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2, శివమ్ మావి 1 వికెట్ తీశాడు. 17 ఓవర్లలో సీఎస్కే 153/2 17 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఓపెనర్ డుప్లెసిస్ 69 పరుగులతో ఆడుతుండగా.. మొయిన్ అలీ 16 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. రెండో వికెట్ కోల్పోయిన సీఎస్కే.. 124/2 రాబిన్ ఊతప్ప(31) రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. నరైన్ బౌలింగ్‌లో ఊతప్ప ఎల్బీగా ఔట్ అయ్యాడు. ప్రస్తుతం సీఎస్కే 14 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. డుప్లెసిస్ 57 పరుగులతో ఆడుతున్నారు. 13 ఓవర్లలో సీఎస్కే స్కోరు 116/1 13 ఓవర్ల ఆట ముగిసేసరికి సీఎస్కే వికెట్ నష్టానికి 116 పరుగులు చేసింది. డుప్లెసిస్ 56,రాబిన్ ఊతప్ప 25 పరుగులతో ఆడుతున్నారు. Photo Courtesy: IPL తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే.. రుతురాజ్(32) ఔట్ రుతురాజ్ గైక్వాడ్(32)రూపంలో సీఎస్కే తొలి వికెట్‌ను కోల్పోయింది. కేకేఆర్ స్పిన్నర్ నరైన్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ తొలి బంతిని రుతురాజ్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. శివమ్ మావి క్యాచ్ అందుకున్నాడు. ప్రస్తుతం సీఎస్కే 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. 6 ఓవర్లలో సీఎస్కే 50/0 సీఎస్కే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్‌లు ఇన్నింగ్స్ ధాటిగా ఆడుతున్నారు. కేకేఆర్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. రుతురాజ్ 26, డుప్లెసిస్ 23 పరుగులతో ఆడుతున్నారు. 3 ఓవర్లలో సీఎస్కే 22/0 కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. రుతురాజ్ 18, డుప్లెసిస్ 3 పరుగులతో ఆడుతున్నారు. Photo Courtesy: IPL దుబాయ్: ఐపీఎల్ 2021లో భాగంగా సీఎస్కే, కేకేఆర్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక మ్యాచ్‌లో సీఎస్కే ఫెవరెట్‌గా కనిపిస్తుండగా.. కేకేఆర్ కూడా పటిష్టంగానే కనిపిస్తుంది. లీగ్ దశలో సీఎస్కే 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు.. 5 ఓటములతో రెండో స్థానంలో నిలిచింది. ఇక కేకేఆర్ 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు.. ఏడు ఓటములతో నాలుగో స్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 1లో సీఎస్కే ఘన విజయం సాధించి నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఆర్సీబీని ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడించిన కేకేఆర్ క్వాలిఫయర్ 2లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్ దశలో రెండుసార్లు తలపడగా.. సీఎస్కేనే విజయం వరించింది. ముఖాముఖి పోరులో 24 సార్లు తలపడగా.. 16 మ్యాచ్‌ల్లో సీఎస్కే విజయం సాధించగా.. కేకేఆర్ 8సార్లు గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్ కోల్‌కతా నైట్ రైడర్స్: శుబ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లోకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి -
IPL 2021 Final: పలు అరుదైన రికార్డులపై కన్నేసిన సీఎస్కే ఆటగాళ్లు
CSK Players Set To Reach Milestones In IPL 2021 Final Match Against KKR: చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్‌లో పలు అరుదైన రికార్డులు బద్దలయ్యే ఆస్కారముంది. ఆ రికార్డులు ఏంటో, వాటిని ఏ సీఎస్కే ఆటగాడు బద్దలు కొట్టనున్నాడో ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. * నేటి మ్యాచ్‌తో సీఎస్కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్లో 200వ మ్యాచ్ ఆడనున్నాడు. * ఇవాళ మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటర్ రాబిన్ ఊతప్ప మరో 55 పరుగులు సాధిస్తే, పొట్టి ఫార్మాట్ మొత్తంలో 7000 పరుగులను పూర్తి చేసుకుంటాడు. అలాగే మరో 5 బౌండరీలు సాధిస్తే టీ20 ఫార్మాట్ మొత్తంలో 700 ఫోర్లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. * సీఎస్కే మిడిలార్డర్ ఆటగాడు అంబటి రాయుడు మరో 84 పరుగులు చేస్తే ఐపీఎల్లో 4000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. అలాగే మరో సిక్సర్ బాదితే ఐపీఎల్లో 150, టీ20 ఫార్మాట్ మొత్తంలో 200 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు. * నేటి మ్యాచ్‌లో సీఎస్కే ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో మరో 5 వికెట్లు తీస్తే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన లసిత్ మలింగ(170) రికార్డును అధిగమిస్తాడు. * సీఎస్కే సారధి ధోని నేటి మ్యాచ్‌లో మరో 65 పరుగులు చేస్తే.. టీ20 ఫార్మాట్ మొత్తంలో 7000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. * ఇవాళ మ్యాచ్‌లో సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మరో 24 పరుగులు చేస్తే పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ నుంచి ఆరెంజ్ క్యాప్ చేజిక్కించుకోవడంతో పాటు ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించనున్నాడు. * నేటి మ్యాచ్‌తో సీఎస్కే ఓపెనర్ డుప్లెసిస్ 100వ ఐపీఎల్ మ్యాచ్ ఆడనున్నాడు. అలాగే మరో 7 సిక్సర్లు బాదితే ఐపీఎల్లో 100 సిక్సర్ల ఘనతను, మరో 3 ఫోర్లు కొడితే టీ20 ఫార్మాట్ మొత్తంలో 600 ఫోర్ల మైలురాయిని చేరుకుంటాడు. చదవండి: సీఎస్కే జెర్సీలో వార్నర్.. అసలేం జరిగింది..? -
బయోబబూల్‌లో మా పరిస్థితి ఇలాగే ఉంది..
Virat Kohli Shows Life In Bio Bubble.. ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లి ఐపీఎల్ 2021 టైటిల్ అందుకోవడంలో మరోసారి విఫలమయ్యాడు. తనకు కెప్టెన్‌గా ఇదే చివరి సీజన్ అని విరాట్ కోహ్లి ఇప్పటికే ప్రకటించడంతో ఈసారి ఎలాగైనా ఆర్సీబీ కప్ కొడుతుందని అంతా భావించారు. కానీ కేకేఆర్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ అనూహ్యంగా ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఇక తర్వాతి సీజన్ నుంచి కోహ్లి ఆర్సీబీకి ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు. చదవండి: Virat Kohli Crying: కన్నీరు పెట్టుకున్న కోహ్లి.. ఆ వెంటే డివిలియర్స్ కూడా ఇక తాజాగా విరాట్ కోహ్లి టి20 ప్రపంచకప్ ఉండడంతో టీమిండియా బయోబబూల్లోకి వెళ్లిపోయాడు. అయితే కరోనా వైరస్ తర్వాత బయోబబూల్ ప్రతీ ఒక్కరికి సర్వసాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో బయోబబూల్ అనేది ఎంత కష్టంగా ఉందో కోహ్లి ఒక్క ఫోటోతో చూపించాడు. తనను తాను కుర్చీకి కట్టేసుకొని.. బయోబబూల్‌లో మా పరిస్థితి అచ్చం ఇలాగే ఉందని పేర్కొన్నాడు. బయోబబూల్ వల్ల చాలా మంది ఆటగాళ్లు మానసిక ఒత్తిడి గురయ్యారు. పంజాబ్ కింగ్స్ ఆటగాడు క్రిస్ గేల్ బయోబబూల్ కారణంగానే ఐపీఎల్ వీడిన సంగతి తెలిసిందే. తాజాగా కోహ్లి కూడా బయోబబూల్ అనేది నచ్చలేదంటే పరోక్షంగా ఒక్క ఫోటోలోనే చెప్పడం అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం కోహ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2021: టి20 కెప్టెన్‌గా ఎంఎస్ ధోని అరుదైన రికార్డు View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
టి20 కెప్టెన్‌గా ఎంఎస్ ధోని అరుదైన రికార్డు
MS Dhoni As First Captain As 300 T20 Matches.. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ముందు అరుదైన రికార్డు ఎదురుచూస్తుంది. కేకేఆర్‌తో జరగనున్న ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ ద్వారా 300 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఘనతను ధోని అందుకోనున్నాడు. కాగా ధోని సారధ్యంలోనే సీఎస్కే మూడుసార్లు(2010, 2011, 2018)లో చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అంతేగాక ఇప్పటివరకు సీఎస్కే తరపున తొమ్మిదిసార్లు ఫైనల్ చేర్చిన ధోని.. 2017లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌ను ఫైనల్ చేర్చాడు. దీంతోపాటు టి20ల్లో కెప్టెన్‌గా ఎక్కువ విజయాలు అందుకున్న కెప్టెన్‌గా ధోని అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో 213 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించిన ధోని 130 విజయాలు అందుకున్నాడు. ధోని తర్వాత ఐపీఎల్లో కెప్టెన్‌గా ఎక్కువ విజయాలు అందుకున్న వారిలో రోహిత్ శర్మ 75 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్‌ల పరంగా కోహ్లి 140 మ్యచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. చదవండి: MS Dhoni: హెలికాప్టర్ షాట్ ప్రాక్టీస్ చేస్తున్న ధోని.. వీడియో వైరల్ కాగా వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ధోని సీఎస్కేలో కొనసాగుతాడా లేదా అనేది స్పష్టంగా తెలియదు. అయితే ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ అనంతరం ధోని సీఎస్కేకు ఆడడంపై క్లారిటీ ఇచ్చాడు. తనను వచ్చే సీజన్లో ఎల్లో డ్రెస్‌లో కనిపిస్తానని.. అయితే జట్టులో ఆటగాడిగా.. లేక ఇతర స్థానంలో కొనసాగే అవకాశం ఉందని తెలిపాడు. ఇక టి20 ప్రపంచకప్ సందర్భంగా ధోని టీమిండియాకు మెంటార్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2021: అందరూ ధోనిలు కాలేరు.. పంత్‌కు కాస్త సమయం ఇవ్వండి