
Courtesy: IPL Twitter
Virat Kohli Runs In 7-15 Overs IPL 2021.. మెషిన్ గన్ విరాట్ కోహ్లి ఫామ్‌లో ఉంటే పరుగులు వస్తూనే ఉంటాయి. కానీ ఈ ఆర్‌సీబీ కెప్టెన్‌కు ఐపీఎల్ 2021 సీజన్‌లో 7 నుంచి 15 ఓవర్ల మధ్యలో బ్యాడ్ రికార్డు నమోదు చేశాడు. మధ్య ఓవర్లలో ఎక్కువగా పరుగులు రాబట్టలేకపోయాడు. 8 ఓవర్లలో(7 నుంచి 15 ఓవర్లు) చూసుకుంటే 8 ఇన్నింగ్స్‌ల్లో 145 పరుగులు చేసిన కోహ్లి ఏకంగా ఆరుసార్లు ఔట్ కావడం విశేషం. బ్యాటింగ్ యావరేజ్ 24.17 ఉండగా.. స్ట్రైక్‌రేట్ 110.70 గా ఉంది.
కాగా మ్యాచ్‌లో కేఎస్ భరత్(9) రూపంలో ఆర్‌సీబీ రెండో వికెట్ కోల్పోయింది. నరైన్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ నాలుగో బంతిని భరత్ లాంగాఫ్ మీదుగా భారీ షాట్ యత్నించినప్పటికీ బౌండరీ లైన్ వద్ద ఉన్న వెంకటేశ్ అయ్యర్ క్యాచ అందుకున్నాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. కోహ్లి 32, మ్యాక్స్‌వెల్ 1 పరుగుతో ఆడుతున్నారు. అంతకముందు 21 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన పడిక్కల్ ఫెర్గూసన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment