RCB Vs CSK: ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో సీఎస్‌కే విజయం | IPL 2021: Second Phase CSK Vs RCB Match Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

RCB Vs CSK IPL 2021 2nd Phase: ఆర్‌సీబీపై 6 వికెట్ల తేడాతో సీఎస్‌కే విజయం

Published Fri, Sep 24 2021 7:02 PM | Last Updated on Fri, Sep 24 2021 11:16 PM

IPL 2021: Second Phase CSK Vs RCB Match Live Updates And Highlights - Sakshi

Photo Courtesy: IPL

ఆర్‌సీబీపై 6 వికెట్ల తేడాతో సీఎస్‌కే విజయం
ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే 18.1 ఓవర్లలో చేధించింది. సీఎస్‌కే ఓపెనర్స్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(38), డుప్లెసిస్‌ (31) పరుగులతో రాణించి రన్‌రేట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. వీరిద్దరు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మొయిన్‌ అలీ(23), అంబటి రాయుడు(32) ఇన్నింగ్స్‌ను నిర్మించారు. చివర్లో వీరిద్దరు ఔటైన మిగతాపనిని రైనా(16), ధోని(11) పూర్తి చేశారు.  ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ 2, చహల్‌, మ్యాక్స్‌వెల్‌ చెరో వికెట్‌ తీశారు. ఈ విజయంతో సీఎస్‌కే 9 మ్యాచ్‌ల్లో 7 విజయాలు.. రెండు ఓటములతో 14 పాయింట్ల సాధించి టేబుల్‌ టాపర్‌గా నిలవగా.. ఆర్‌సీబీ 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. నాలుగు ఓటములతో 10 పాయింట్లతో మూడో స్థానంలోనే ఉంది.

అంతకముందు ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్లు కోహ్లి(53, 41 బంతులు; 6 ఫోర్లు, 1 సిక్సర్‌), పడిక్కల్‌(70, 50 బంతులు; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) శుభారంభం అందించినప్పటికి తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్‌ పూర్తిగా విఫలం కావడంతో ఆర్‌సీబీ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కాగా కోహ్లి, పడిక్కల్‌ మధ్య 111 పరుగుల భాగస్వామ్యం నమోదు కావడం విశేషం. ఇక సీఎస్‌కే బౌలర్లలో బ్రావో 3, శార్దూల్‌ ఠాకూర్‌ 2, దీపక్‌ చహర్‌ 1 వికెట్‌ తీశాడు. 

రాయుడు ఔట్‌.. సీఎస్‌కే 133/4
157 పరుగుల లక్ష్య చేధనలో సీఎస్‌కే నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఉన్నంతసేపు చక్కని షాట్లతో అలరించిన రాయుడు(32, 3 ఫోర్లు, 1 సిక్స్‌) హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో డివిలియర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్‌కే 16 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. రైనా 5, ధోని 1 పరుగుతో క్రీజులో ఉ‍న్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే.. 9 ఓవర్లలో 71/2
157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే రెండు వికెట్లు కోల్పోయింది. మొదట 38 పరుగులు చేసిన రుతురాజ్‌ చహల్‌ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత మరో ఓపెనర్‌ డుప్లెసిస్‌ 31 పరుగుల వద్ద మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో నవదీప్‌ సైనీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్‌కే 11 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. మొయిన్‌ అలీ 9, అంబటి రాయుడు 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

నాలుగు ఓవర్లలో సీఎస్‌కే 35/0
157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 35 పరుగులు చేసింది. రుతురాజ్‌ 16, డుప్లెసిస్‌ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఆర్‌సీబీ 20 ఓవర్లలో 156 పరుగులు చేసింది.

సీఎస్‌కే టార్గెట్‌ 157 పరుగులు
సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్లు కోహ్లి(53, 41 బంతులు; 6 ఫోర్లు, 1 సిక్సర్‌), పడిక్కల్‌(70, 50 బంతులు; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) శుభారంభం అందించినప్పటికి తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్‌ పూర్తిగా విఫలం కావడంతో ఆర్‌సీబీ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కాగా కోహ్లి, పడిక్కల్‌ మధ్య 111 పరుగుల భాగస్వామ్యం నమోదు కావడం విశేషం. ఇక సీఎస్‌కే బౌలర్లలో బ్రావో 3, శార్దూల్‌ ఠాకూర్‌ 2, దీపక్‌ చహర్‌ 1 వికెట్‌ తీశాడు. 

వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీ
దూకుడు మీద  బెంగళూరు వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. శార్ధల్‌ ఠాకుర్‌  వరుస బంతుల్లో డివిలియర్స్‌ (12) పడిక్కల్‌(70) పెవిలియన్‌కు పంపాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్‌సీబీ ..కోహ్లి(53) ఔట్‌
112 పరుగుల వద్ద బెంగళూరు తొలి వికెట్‌ కోల్పోయింది. బ్రావో బౌలింగ్‌లో మంచి ఊపు మీద ఉన్న కెప్టెన్‌ కోహ్లి(53) జడేజా క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆర్‌సీబీ 14 ఓవర్లో ఒక వికెట్‌ నష్టానికి 114 పరుగులు చేసింది. పడిక్కల్‌ (54) డివిలియర్స్‌ (2) పరుగులతో క్రీజులో ఉన్నారు.

కోహ్లి సూపర్‌ ఫిప్టి
ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆకాశమే హద్దుగా ఆర్ధసెంచరీతో చేలరేగాడు. కేవలం 38 బంతుల్లో  6 ఫోర్లు, 1 సిక్స్‌తో 53 పరుగులు సాధించాడు.  ఆర్‌సీబీ 13 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 111 పరుగులు చేసింది. కోహ్లి 53, పడిక్కల్‌ 555పరుగులతో క్రీజులో ఉన్నారు

పడిక్కల్‌ ఆర్ధసెంచరీ
ఆర్‌సీబీ ఓపెనర్‌ ఆర్ధసెంచరీతో చెలరేగాడు. కేవలం 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లుతో 52 పరుగులు సాధించాడు. ఆర్‌సీబీ 12 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 104 పరుగులు చేసింది. కోహ్లి 47, పడిక్కల్‌ 54పరుగులతో క్రీజులో ఉన్నారు


Photo Courtesy: IPL

కోహ్లి జోరు.. ఏడు ఓవర్లలో 61/0
ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి దూకుడుగా ఆడుతున్నాడు. ఆరంభం నుంచి కోహ్లి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. అతనికి మరో ఓపెనర్‌ పడిక్కల్‌ చక్కగా సహకరిస్తున్నాడు. పవర్‌ ప్లే ముగిసిన అనంతరం ఆర్‌సీబీ ఏడు ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 61 పరుగులు చేసింది.  కోహ్లి 34, పడిక్కల్‌ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఆర్‌సీబీ ఓపెనర్ల జోరు.. 4 ఓవర్లలో 36/0
ఆర్‌సీబీ తన ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్లు కోహ్లి, పడిక్కల్‌లు బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ స్కోరు బోర్డును పరిగెత్తిస్తున్నారు. ప్రస్తుతం 4 ఓవర్ల ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. కోహ్లి 19, పడిక్కల్‌ 17 పరుగులతో క్రీజులో ఉ‍న్నా

3 ఓవర్లలో ఆర్‌సీబీ స్కోర్‌ 18/0
సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ను నిలకడగా ఆరంభించింది. 2 ఓవర్ల ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి13, దేవదత్‌ పడిక్కల్‌ 5 పరుగులతో ఆడుతున్నారు.


Photo Courtesy: IPL

షార్జా: ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న సీఎస్‌కే, ఆర్‌సీబీ తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన సీఎస్‌కే బౌలింగ్‌ ఎంచుకుంది. ఇక తొలి అంచె పోటీల్లో  ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే 191 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆర్‌సీబీ 122 పరుగులకే పరిమితమై 69 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కాగా ఆ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా వన్‌మ్యాన్‌ షోతో అలరించాడు. ముందు బ్యాటింగ్‌లో 28 బంతుల్లోనే 62 పరుగులు..  ఆ తర్వాత బౌలింగ్‌లో 13 పరుగులకే 3 వికెట్లు తీసి మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

ఇక ముఖాముఖి పోరులో ఇరు జట్లు 27 సార్లు తలపడ్డాయి. వీటిలో 17 సార్లు సీఎస్‌కే విజయం సాధించగా.. 9 మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ విజయాలు దక్కించుకుంది. గత ఐదు మ్యాచ్‌లు పరిశీలిస్తే.. ఆర్‌సీబీ 2.. సీఎస్‌కే మూడు విజయాలు సాధించింది. ఇక రెండో అంచె పోటీల్లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే విజయం సాధించి జోష్‌లో ఉంది. మ్యాచ్‌లో తక్కువ స్కోరు నమోదు చేసినప్పటికీ బౌలర్ల సాయంతో మ్యాచ్‌ను కాపాడుకుంది. ఇక కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ మాత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 94 పరుగులకే ఆర్‌సీబీ ఆలౌట్‌ కాగా.. కేకేఆర్‌ 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది.

సీఎస్‌కే జట్టు: ఎంఎస్ ధోని (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మోయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

ఆర్‌సీబీ జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భరత్ (వికెట్‌ కీపర్‌), గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, టిమ్ డేవిడ్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, యజ్వేంద్ర చాహల్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement