PBKS Vs RR: వారిద్దరు ఓపెనర్స్‌గా వస్తే గెలుపు అవకాశాలు ఎక్కువ | IPL 2021: Aakash Chopra Picks His PBKS Playing XI Gayle And Rahul To Open | Sakshi
Sakshi News home page

PBKS Vs RR: వారిద్దరు ఓపెనర్స్‌గా వస్తే గెలుపు అవకాశాలు ఎక్కువ

Published Tue, Sep 21 2021 3:31 PM | Last Updated on Tue, Sep 21 2021 5:49 PM

IPL 2021: Aakash Chopra Picks His PBKS Playing XI Gayle And Rahul To Open - Sakshi

coutesy: Ipl.com

దుబాయ్‌: ఐపీఎల్‌ 2021 సెకండ్‌ ఫేజ్‌లో భాగంగా నేడు పంజాబ్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. పాయింట్ల పట్టికలో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా.. మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌  ఫెవరెట్‌గా కనిపిస్తుందని అభిప్రాయపడ్డాడు. దీంతో పాటు ఈరోజు మ్యాచ్‌ ఆడనున్న పంజాబ్‌ కింగ్స్‌ ప్లేయింగ్‌ ఎలెవెన్‌ను ప్రకటించాడు. 

చదవండి: Gautam Gambhir: అయ్యో ఏంటిది గంభీర్‌.. నీ అంచనా తప్పింది..

పంజాబ్‌ కింగ్స్‌ తన ఓపెనర్లను మార్చాల్సిన అవసరం ఉందని తెలిపాడు. ప్రస్తుతం పంజాబ్‌ కింగ్స్‌ తరపున కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాలు ఓపెనర్లుగా వస్తున్నారు. కొన్ని సీజన్ల నుంచి వీరిద్దరి కాంబినేషన్‌  మంచి ఆరంభాలు ఇస్తుంది. అయితే క్రిస్‌గేల్‌ను ఓపెనర్‌గా పంపి.. మయాంక్‌ను మూడోస్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తే పంజాబ్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక నాలుగో స్థానంలో నికోలస్‌ పూరన్‌కు అవకాశం ఇవ్వాలి. ఇక​ ఏడో స్థానంలో క్రిస్‌ జోర్డాన్‌ స్థానంలో మొయిసెస్‌ హెన్రిక్స్‌కు అవకాశం ఇవ్వాలి. అతను ఏడో స్థానంలో వస్తే బ్యాటింగ్‌లో మెరుపులతో పాటు బౌలింగ్‌లోనూ ఉపయోగపడుతాడు. ఇక స్పిన్నర్‌గా రవి బిష్ణొయి అయితే బాగుంటుంది. 

ఆకాశ్‌ చోప్రా ప్లేయింగ్‌ ఎలెవెన్‌: క్రిస్ గేల్, కేఎల్‌ రాహుల్ (కెప్టెన్‌), మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, షారుఖ్ ఖాన్, మొయిసెస్ హెన్రిక్స్, నాథన్ ఎల్లిస్, రవి బిష్ణోయ్, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్

చదవండి: RCB Vs KKR: కోహ్లి డబుల్‌ సెంచరీ.. ఆర్సీబీ కెప్టెన్‌ ఖాతాలో మరో రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement