IPL 2021 KKR Vs DC: Rishabh Pant Funny Prank On Umpire Anil Chaudhary - Sakshi
Sakshi News home page

IPL 2021 KKR Vs DC: అంపైర్‌ను ఫ్రాంక్‌ చేసిన రిషబ్‌ పంత్‌.. వీడియో వైరల్‌

Published Thu, Oct 14 2021 10:18 AM | Last Updated on Thu, Oct 14 2021 1:04 PM

IPL 2021: Rishabh Pant Hilarious Prank Umpire Anil Chaudhary KKR Vs DC - Sakshi

Rishab Pant Prank On Umpire Anil Chaudary.. ఐపీఎల్‌ 2021లో కేకేఆర్‌తో జరిగిన క్వాలిఫయర్‌ 2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ అంపైర్‌ అనిల్‌ చౌదరీని ఫ్రాంక్‌ చేయడం వైరల్‌గా మారింది. కేకేఆర్‌ బ్యాటింగ్‌ సమయంలో అశ్విన్‌ బంతిని పరిశీలిస్తుండగా.. అనిల్‌ చౌదరీ బాల్‌ బాక్స్‌ను పట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన పంత్‌ అనిల్‌ చౌదరీ వెనక్కి వెళ్లి.. అతనికి తెలియకుండా కుడి మోచేతిని టికిల్‌ చేశాడు. వెంటనే అనిల్‌ తిరిగి చూడగా అక్కడ ఎవరు కనిపించలేదు. దీంతో పంత్‌ నేనే అంటూ అంపైర్‌కు చెప్పడంతో మైదానంలో నవ్వులు విరపూశాయి. ఈ వీడియోపై అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు.

చదవండి: Rahul Tripathi: ' సిక్స్‌ కొడతానని ఊహించలేదు'

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) ఐపీఎల్‌లో మూడోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం ఉత్కంఠభరితంగా జరిగిన క్వాలిఫయర్‌–2 మ్యాచ్‌లో కేకేఆర్‌ 3 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (39 బంతుల్లో 36; 1 ఫోర్, 2 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (27 బంతుల్లో 30 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. అనంతరం కోల్‌కతా 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 136 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వెంకటేశ్‌ అయ్యర్‌ (41 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శుబ్‌మన్‌ గిల్‌ (46 బంతుల్లో 46; 1 ఫోర్, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 74 బంతుల్లో 96 పరుగులు జోడించారు.

చదవండి: Rishab Pant Emotioanl: ఓటమి జీర్ణించుకోలేకపోతున్నా..  పంత్‌ భావోద్వేగం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement