Prank video
-
ప్రాంక్ అని చెప్పి నిజమైన పెళ్లి..
రీల్స్, ఇన్‌స్ట్రాగామ్ ప్రపంచాన్ని ఏలుతున్న కాలంలో ఏది నిజమో? ఏది అబద్ధమో? తెలియడం లేదు. ఆ్రస్టేలియాలోని ఓ మహిళకు ఇలాంటి సమస్యే ఎదురైంది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ను పెంచుకోవడానికి అతను ఏర్పాటు చేసిన ‘ఫేక్ వెడ్డింగ్’నిజమని తేలడంతో ఆమె కోర్టుకెక్కాల్సి వచ్చింది. చివరకు జడ్జి ఆ పెళ్లిని రద్దు చేశారు. వివరాల్లోకి వెళ్తే... మెల్బోర్న్లో ఉంటున్న ఓ మహిళకు 2023 సెప్టెంబర్‌లో ఆన్లైన్ డేటింగ్ వేదికపై ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారింది. అదే ఏడాది డిసెంబర్లో ఆమెకు అతను ప్రపోజ్ చేశాడు. ఆమె అంగీకరించింది. రెండు రోజుల తర్వాత సిడ్నీలో ఓ వైట్పార్టీ ఉందని, అక్కడికి అందరూ తెలుపు రంగు దుస్తుల్లో వస్తారని చెప్పారు. ఆమె కూడా అలాగే రెడీ అయి వెళ్లింది. తీరా అక్కడికెళ్లి చూస్తే.. ఫోటోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ స్నేహితుడు తప్ప మరెవరూ లేరు. ఇదేంటని ప్రశ్నిస్తే... తన ఇన్‌స్ట్రాగామ్‌లో ఫాలోవర్స్ పెరగడం కోసం ప్రాంక్ వెడ్డింగ్ నిర్వహిస్తున్నానని, అందుకు సహకరించాలని ఆమెను కోరాడు. అప్పటికే అతనికి 17,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అతని వివరణ ఆమెకు సబబుగానే తోచింది. సాయం చేసినట్లవుతుందని ఫేక్ పెళ్లికి అంగీకరించింది. సివిల్ మ్యారేజ్ కోర్టులో జరిగితేనే పెళ్లి చెల్లుబాటవుతుందని నమ్మింది. అదే విషయాన్ని తన స్నేహితురాలితో పంచుకుంది. అదే నిజమైతే వారు ముందుగా వివాహం నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని స్నేహితురాలు కూడా చెప్పడంతో.. ఇది ఉత్తుత్తి పెళ్లే అని నమ్మింది. కట్ చేస్తే.. రెండు నెలల తరువాత, ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం కోసం ఆమె చేసిన దరఖాస్తులో తనను డిపెండెంట్‌గా చేర్చాలని అతను కోరాడు. పెళ్లి కానిది ఎలా కుదురుతుందని ఆమె ప్రశ్నించగా.. సిడ్నీలో జరిగిన వివాహ వేడుక నిజమైనదని బాంబు పేల్చాడు. వివాహ ధృవీకరణ పత్రాన్ని కూడా చూపించాడు. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి.. వివాహానికి నెలముందే అతను నోటీసులు ఇచ్చాడని అర్థమైంది. అతను మొదటినుంచి అబద్ధం చెప్పాడని, తనను మోసం చేశాడని ఆమె కోర్టుకెక్కింది. పెళ్లి వేడుకలో తాను నటించానే తప్ప.. అది నిజం కాదని కోర్టుకు తెలిపింది. మహిళ వాంగ్మూలాన్ని నమ్మిన మెల్బోర్న్ జడ్జి 2024 అక్టోబర్‌లో వీరి వివాహాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తిరుమల ప్రాంక్ వీడియోపై స్పందించిన ప్రియాంక, శివ
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ క్షమాపణలు చెప్పింది. కొద్దిరోజుల క్రితం బుల్లితెర నటుడు శివకుమార్, ప్రయాంక ఇద్దరూ తిరుమలకు వెళ్లారు. అలిపిరి నడక మార్గం ద్వారా కొండపైకి వెళ్లే క్రమంలో ఏడో మైలురాయి వద్ద చిరుతపులి కనిపించింటూ ఇద్దరూ కలిసి ఒక ప్రాంక్ వీడియో తీయడం ఆపై తమ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. శ్రీవారి దర్శనం కోసం నడక మార్గంలో వెళ్తుండగా చిరుత పులి దాడి అంటూ వీడియో అప్లోడ్ చేశారు. అయితే, అది భక్తులను భయాందోళలకు గురి చేసేలా ఉండటంతో చాలామంది నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వారిద్దరిపై చర్యలు తీసుకునేందుకు కూడా టీటీడీ సిద్ధమైంది. ఈ క్రమంలో వారిద్దరూ క్షమాపణలు చెప్పారు.'మేము షేర్ చేసిన వీడియోపై చాలామంది శ్రీవారి భక్తులు అభ్యంతరం తెలిపారు. మేము తెలియకనే ఈ తప్పు చేశాం. మీ మనోభావాలను గాయపరిచినట్లయితే మీలో ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నాము. ఉద్దేశపూర్వకంగా అయితే వీడియో చేయలేదు. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేశాం. అయితే, ఇలా అవుతుంది అని మేము ఏమాత్రం ఊహించలేదు. ఇంతమందిని ఈ వీడియో హర్ట్ చేస్తుంది అంటే అసలు చేసేవాళ్లమే కాదు. తిరుమల దేవస్థానం ప్రతిష్టను మేము తక్కువ చేయాలని అనుకోలేదు. భక్తులలో భయం కలగేలా చేసి వారి మనోభావాలను కించపరిచేలా వంటి పొరపాట్లు మేము చేయం. తెలియకుండా జరిగిన ఈ తప్పును మీరందరూ క్షమిస్తారని ఆశిస్తున్నాం. మమ్మల్ని విశ్వసించండి. మరోసారి ఈ తప్పు జరగదు.' అని వారు ఒక వీడియోతో పంచుకున్నారు. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
తిరుమల మెట్ల మార్గంలో ప్రాంక్ వీడియో
-
తిరుమల కొండ మీద ప్రాంక్ వీడియోలు..
-
శ్రీవారి భక్తులపై ప్రాంక్ వీడియో..
-
తిరుమల క్యూలైన్లో ప్రాంక్ వీడియో.. టీటీడీ సీరియస్
సాక్షి, తిరుపతి: తిరుమలలో కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా ప్రాంక్ వీడియోలు తీయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇక, వీడియో అంశాన్ని భక్తులు టీటీడీ దృష్టికి తీసుకెళ్లడంతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.కాగా, వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. తమిళనాడుకు చెందిన ముగ్గురు యువకులు శ్రీవారి దర్శనానికి వచ్చారు. తిరుమల లోపల ప్రాంక్ వీడియో కోసం.. నారాయణగిరి షెడ్స్‌లోని క్యూలో వెళ్తూ మరో కంపార్టుమెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా కలరింగ్ ఇచ్చారు. ఈ సందర్బంగా కంపార్ట్మెంట్లో నిరీక్షిస్తున్న భక్తులు ఆ తాళాలు తీసే వ్యక్తిని టీటీడీ ఉద్యోగిగా భావించి ఒక్కసారిగా పైకి లేచారు. దీంతో, వెంటనే సదరు యూట్యూబర్ కంపార్టుమెంట్ నుంచి వెకిలిగా నవ్వుతూ పరుగులు తీశాడు. ఇదంతా మరో యువకుడు వీడియో తీశాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు నెటిజన్లు టీటీడీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వీడియోలపై టీటీడీ తీవ్రంగా ఖండించింది. భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా ప్రాంక్ వీడియోలు తీయడం హేయ మైన చర్య .. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. • తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రాంక్ వీడియోలు ! #TTFVasan @APPOLICE100 @TTDevasthanams pic.twitter.com/vxJxCwmqMm— YS Jagan Fans Campaign™ (@YSJFansCampaign) July 11, 2024 ఇదిలా ఉండగా.. తిరుమల ఆలయంలో క్యూ లైన్లలోకి వెళ్లాలంటే సిబ్బంది ఎన్నో రకాలుగా చెకింగ్స్ చేసి పంపిస్తారు. భక్తుల వద్ద మొబైల్ ఫోన్లు ఉంటే వాటిని స్వాధీనం చేసుకుంటారు. కాగా, ఈ వీడియో చేసిన యువకులు ఆలయంలోకి ఫోన్ ఎలా తీసుకెళ్లారు? అనేది తెలియాల్సి ఉంది. -
ప్రాణాలు తీసిన ప్రాంక్.. ఫ్రెండ్‌ను ఫూల్ చేయబోయి విద్యార్ధి మృతి
సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ప్రాంక్‌ల హవా బాగా నడుస్తోంది. కుటుంబ సభ్యులు, తెలిసిన వారికి ఏదైనా విషయం గురించి చెప్పి భయపెట్టడం.. తరువాత అదంతా ప్రాంక్ అని చెప్పడం ఫ్యాషన్‌గా మారింది. అయితే కొన్ని సార్లు ఈ చర్యలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ప్రాంక్ మోజులో పడి అనేక మంది యువత తమ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఏప్రిల్ ఫూల్స్ డే రోజు చేసిన తన స్నేహితుడిని ప్రాంక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఇండోర్‌లోని మల్హర్గంజ్లో 11వ తరగతి చదువుతున్న అభిషేక్ అనే విద్యార్ధి సోమవారం ఏప్రిల్స్ ఫూల్స్డే రోజు తన స్నేహితుడిని ప్రాంక్ చేయాలని ప్రయత్నించాడు. ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు నటించాడు. స్టూల్‌పై నిల్చొని మెడకు తాడు బిగించి తను చనిపోతున్నట్లు స్నేహితుడిని నమ్మించాడు. ఈ క్రమంలో అనుకోకుండా స్టూల్ జారిపోవడంతో మెడకు తాడు బిగుసుకుపోయి మృతి చెందాడు. ఈ సంఘటనను చూసిన వెంటనే స్నేహితుడు.. అభిషేక్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అదనపు డీసీపీ రాజేష్ దండోటియా తెలిపారు. చదవండి: విషాదం: ఫార్చ్యూనర్ కోసం ‘కరిష్మా’కు భవిష్యత్తే లేకుండా చేశారు గమనిక: దయచేసి ఎవరూ ఇలాంటి ప్రాంక్‌లు ప్రయత్నించవద్దు. చిన్న చిన్న సరదాలకు పోయి.. నిండు ప్రాణాలను బలితీసుకోవద్దు -
Holi 2024 యాంకర్ సుమ వీడియో: చెప్పులు కూడా మారిస్తే ఇంకా బావుండేదట!
యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకరింగ్, యాక్టింగ్, స్టేజ్ షోలు,సినిమాలు.. ఇలా ప్రతీ అంశంలోనూ నా స్టయిలే వేరు అన్నట్టు దూసుకుపోవడం సుమకు వెన్నతో పెట్టిన విద్య. దాదాపు ప్రతీ పండుగకు ఒక సందేశంతో ప్రాంక్ వీడియోలను చేయడం అలవాటు. ఫన్నీగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం ఆమె స్టయిల్. తాజాగా హోలీ సందర్భంగా కూడా ఒక వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) ముఖ్యంగా నీటిని వేస్ట్ చేయొద్దు అనే సందేశంలో ఈ వీడియోను షేర్ చేయడం విశేషం. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. మీకు తప్ప ఎవరికి ఇలాంటి ఐడియాస్ రావు సుమ గారు ఒకరు కామెంట్ చేయగా, ఇలాంటి వీడియోలు చేయడం మీకే సాధ్యం మేడమ్.. హ్యాపీ హోలీ శుభాకాంక్షలు అందించారు ఇంకొందరు. అయితే చెప్పులు కూడా మారిస్తే ఇంకా బావుండు మరొకరు ఫన్నీగా కామెంట్ చేయడం గమనార్హం. -
అమ్మాయిగా మారి షాకిచ్చిన సీరియల్ హీరో.. ప్రియురాలి కోసమే!
బిగ్‌బాస్ రియాల్టీ షో ఏడో సీజన్ ప్రారంభమైంది. 14 మంది హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే వీరిలో ఎక్కువ వరకు సీరియల్ నటీనటులే ఉండడం గమనార్హం. వాళ్లంతా పక్కా ప్లాన్‌తో హౌస్‌లోకి వచ్చారు. హౌస్‌లో వాళ్లు ఆడే ఆటకు తగ్గట్లు బయట ప్రమోషన్స్ కూడా ఉండాలని ముందే ఫిక్సయినట్లు తెలుస్తుంది. ఇది ప్రతీ సీజన్లో కంటెస్టెంట్స్ చేసే పనే. అయితే ఈ సారి మాత్రం ప్రమోషన్స్ కాస్త వెరైటీగా అనిపిస్తున్నాయి. బిగ్‌బాస్‌లోకి వెళ్లే ముందే వైరల్ అయ్యే వీడియోలను కొన్నింటిని షూట్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా బయటకు వదులుతున్నారు. తాజాగా బిగ్‌బాస్-7 తొలి కంటెస్టెంట్ ప్రియాంక జైన్ సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ప్రియుడితో కలిసి ఫ్రాంక్ వీడియో 'జానకి కలగనలేదు'సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ప్రియాంక జైన్. అంతకు ముందు పలు సినిమాలలో నటించింది. కానీ ఆమెకు తగిన గుర్తింపు రాలేదు. బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన తర్వాతే తను కెరీర్ గాడిన పడింది. వరుసగా సీరియల్స్‌తో స్టార్ నటిగా గుర్తుంపు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వడం కోసమే బిగ్‌బాస్‌లోకి వెళ్లింది. అంతకు ముందు ఆమె ప్రియుడు, మౌనరాగం సీరియల్ హీరో శివ కుమార్‌తో కలిసి ఓ ప్రాంక్ వీడియో చేసింది. అందులో శివకుమార్ లేడి గెటప్‌లో కనిపించడం గమనార్హం. ప్రియాంక కోసమే తన గెడ్డం తీసేసి అమ్మాయి గెటప్ వేశానని శివకుమార్ చెప్పారు. (చదవండి: నాగార్జునకు రైతు బిడ్డ గిఫ్ట్.. అదేంటో తెలుసా?) వీడియోలో ఏం ఉంది? ప్రియాంకకు తెలియకుండా ఓ మేకప్ ఆర్టిస్టును పిలుచుకొని అమ్మాయిగా గెటప్ వేసుకున్నాడు శివకుమార్. అనంతరం జానకి కలగనలేదు సీరియల్ నటుడితో కలిసి ప్రియాంక ఇంటికి వెళ్లాడు. తనని తాను ఇందుమతిగా పరిచయం చేసుకొని ఇంట్లోకి వెళ్లాడు. అయితే గెటప్ అయితే మారింది కానీ.. గొంతు మాత్రం అలానే ఉండడంతో ప్రియాంక ముందుగానే అతన్ని పసిగట్టింది. అయినప్పటికీ అతనికి ఆ విషయం చెప్పలేదు. కాసేపయ్యాక నేను ఎప్పుడో గుర్తుపట్టానని చెప్పడంతో శివ కుమార్ తెల్లముఖం వేశాడు. తాను ఫ్రాంక్ చేద్దామనుకుంటే.. ప్రియాంకనే తనను ఫ్రాంక్ చేసిందని శివ చెప్పుకొచ్చాడు. ఎలా గుర్తుపట్టింది? శివ కుమార్ లేడీ గెటప్ అయితే వేసుకున్నాడు కానీ.. చేతికి ఉన్న ఉంగరాలు, రాఖీ తీసేయ్యలేదు. అలాగే గొంతు మార్చి మాట్లాడడంలోనూ విఫలం అయ్యాడు. దీంతో పరిచయం చేసుకున్న కాసేపటికే ప్రియాంక గుర్తుపట్టేసింది. అయితే ఆ విషయం అతనికి చెప్పకుండా.. చివర్లో చెప్పి షాకిచ్చింది. ప్రియాంక బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తర్వాత ఈ వీడియోని వదిలారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది. -
ప్రాంక్ వీడియో.. తెలియక గర్ల్‌ఫ్రెండ్ ఎంత పని చేసిందంటే!
కరోనా మహమ్మారి అడ్డుకట్టకు కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలు దైనిక జీవితంలో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఇళ్లలో గడపడంతో అందరూ టీవీలు, స్మార్ట్ఫోన్లకు అత్తుకుపోయారు. ఈ క్రమంలో సోషల్‌మీడియాలో చూసే వారి సంఖ్య ఒక్కసారిగా ఎగబాకింది. దీంతో టిక్‌టాక్ వీడియోలు, షార్ట్ ఫిలింలు, ప్రాంక్ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తూ కొందరిని ఓవర్‌నైట్ సెలబ్రిటీలను చేసిన ఘటనలు ఉన్నాయి. ఒక్కోసారి ప్రాంక్ వీడియోలు చేస్తున్న క్రమంలో ప్లాన్ బెడిసి కొట్టి ఇబ్బందలు పడ్డ సందర్భాలు ఉన్నాయి. తాజాగా ప్రాంక్ వీడియోకు ప్లాన్ చేసిన ఓ బాయ్‌ఫ్రెండ్‌కు అలాంటి చేదు అనుభవమే ఎదరైంది. అయ్యో.. అక్కడ తగిలిందే ఇటీవల నెట్టింట ప్రాంక్ వీడియోల హవా పెరుగుతోంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల, సన్నిహితుల మీద వీటిని చేస్తున్నారు. అయితే ఈ వీడియోలు ప్లాన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ సరిగ్గా జరిగితే, ఫన్ వస్తుంది కానీ అది ఏ చిన్న తప్పు జరిగినా మర్చిపోలేని ఘటనగా మారుతుంది. ప్రస్తుతం నెట్టింట్లో దర్శనమిస్తున్న ఓ వీడియోలో.. అందులో ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌పై ఫ్రాంక్ వీడియో ప్లాన్ చేస్తాడు. అందుకోసం అతను తన హుడిని రెగ్యులర్‌గా కాకుండా ఛాతీ వైపు నుంచి ధరిస్తాడు. అతను గోడకు ఆనుకుని నిలబడి తన ముఖాన్ని హూడీతో కప్పుకుని గోడవైపు మొహం పెట్టుకుని నిలబడి ఉంటాడు. ఇంతలో అక్కడి వచ్చిన అతని గర్ల్‌ఫ్రెండ్ అతని వెనుక నుంచి గట్టిగా కొడుతుంది. అయితే అది వాస్తవానికి అతని ప్రైవేట్ భాగం కావడంతో నొప్పికి అక్కడే కిందపడిపోతాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పాపం మనోడు అనుకున్నది ఒకటైతే, అక్కడి జరిగింది మరొకటి అని ఓ యూజర్ కామెంట్ చేయగా.. ఇలాంటివి చేసేటప్పుడు జాగ్రత్త అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Reels Parivaar (@reels_parivaar) -
నాకెవ్వరూ లేరు.. చచ్చిపోతానంటూ నటి మేఘన! వీడియో వైరల్
ప్రస్తుతం బుల్లితెర, టీవీ స్టార్స్ సీరియల్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ అలరిస్తున్నారు. సొంతంగా యూట్యూబ్ చానల్ పెట్టి రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇప్పటికే నటి అంజలి, మహేశ్వరి, శ్రీవాణి, బిగ్‌బాస్ నటి హిమజ, అషురెడ్డితో పాటు పలువురు నటీనటులు సొంతంగా యూట్యూబ్ చానల్ రన్ చేస్తున్నారు. తరచూ హోంటూర్, డైలీ రోటిన్ వీడియోస్‌తోపాటు డిఫరెంట్ కంటెంట్‌తో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు తమ కో-స్టార్స్‌కి ప్రాంక్ చేసి ఆటపట్టించి ఏడిపిస్తుంటారు. చదవండి: ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్మెంట్స్ చూస్తే షాకవ్వాల్సిందే తాజాగా టీవీ నటి మేఘన లోకేశ్ కూడా తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. రీసెంట్గా యూట్యూబ్ చానల్‌ను ఓపెన్ చేసిన ఆమె తాజాగా తన కో-స్టార్స్, ఫ్రెండ్‌ని ప్రాంక్కాల్తో చెమటలు పెట్టించింది. నాకు ఎవ్వరూ లేరు అంటూ మేఘన ఈ వీడియో షేర్ చేసింది. ఇక సీరియల్ షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉండే మేఘనా ఖాళీగా ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చింది. బోర్ కొట్టడంతో ఫ్రెండ్స్‌కి ప్రాంక్ కాల్ చేద్దామని ఫిక్స్ అయిపోయింది. చదవండి: పెళ్లి చేసుకోబోతున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్ నేహా చౌదరి.. వరుడు అతనే ఈ క్రమంలో తన ఫ్రెండ్స్, నటి స్వర్ణకి కాల్ చేసి ‘ఇంట్లో ఎవరూ లేరు. నీరసంగా అనిపిస్తోంది. చచ్చిపోతానేమో’ అని అమాయకంగా మాట్లాడింది. దీంతో నటి స్వర్ణ తెగ కంగారు పడిపోయింది. ఇప్పుడే వచ్చేస్తా.. కాల్ కట్ చేయొద్దని భయపడిపోయింది. చివర్లో.. ఇది ప్రాంక్ అని మేఘన చెప్పడంతో ఆమె రిలాక్స్ అయ్యింది. అయినప్పటికీ మేఘన చేసిన పనికి ఆమెకు భయంతో చెమటలు పట్టాయి. అంతేకాదు ఒక్కసారిగా ఆమె కన్నీరు పెట్టుకుంది. చివరికి నేను బాగానే ఉన్నాను అంటూ వీడియో కాల్ చేసి మాట్లాడింది మేఘన. -
ప్రాంక్ పేరిట వెకిలి పని.. పోలీసుల రియాక్షన్
నలుగురికి ఇబ్బంది కలిగించకుండా.. నవ్వించేదే ప్రాంక్ అంటే. అలాంటిది.. ప్రాంక్ పేరుతో పిచ్చి పిచ్చి చేష్టలకు పాల్పడే వాళ్లనే ఎక్కువగా ఇప్పుడు చూస్తున్నాం. అభ్యంతకరంగా ఉండే కంటెంట్‌తోనూ పాపులారిటీని సంపాదించుకుంటున్నారు కొందరు. ఈ క్రమంలో వాళ్లను అనుసరించే వాళ్ల సంఖ్య సైతం పెరిగిపోతోంది. తాజాగా కేరళలో ప్రాంక్ పేరిట ఇద్దరు యువకులు వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. బైక్ మీద వెళ్తునే.. జోరువానలో అర్థనగ్నంగా స్నానం చేశారు. పైగా స్నానానికి సోప్‌ను సైతం ఉపయోగించారు. సిగ్నల్స్ దగ్గర కూడా వాళ్ల వెకిలి చేష్టలు కొనసాగాయి. అయితే.. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. యువకులను భరణిక్కవుకు చెందిన అజ్మల్, బాదుషాలుగా గుర్తించి.. కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించిన నేరానికి కేసు నమోదు చేసి.. ఐదువేల రూపాయల జరిమానా విధించారు. తాము నవంబర్ 1న సాయంత్రం ఓ స్పోర్ట్స్ ఈవెంట్‌కు హాజరై వస్తున్నామని, వాన కురుస్తుండడంతో సరదా కోసం అలా ప్రాంక్ వీడియో చేశామని ఇద్దరు యువకులు వెల్లడించారు. -
నాతోనే ప్రాంకా.. ఐస్‌క్రీం వ్యాపారికి షాక్ ఇచ్చిన బుడ్డోడు.. వీడియో వైరల్
టర్కీలో ఐస్‌క్రీం వ్యాపారస్థులు కస్టమర్లను భలే ఆటపట్టిస్తుంటారు. కోను చేతిలో పెట్టినట్టే పెట్టి టక్కున వెనక్కి లాగేసుకుంటారు. నోరూరించే ఐస్‌క్రీం తిందామని వెళ్లిన వారికి ఫ్రస్టేషన్ వచ్చే వరకు ప్రాంక్ చేస్తూనే ఉంటారు. చివరకు కస్టమర్లకు నీరసం వచ్చే టైంలో ఐస్‌క్రీం చేతిలో పెడతారు. ఇందుకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చూశాం. కానీ ఓ బుడ్డోడు ఇలానే ప్రాంక్ చేద్దామనుకున్న ఓ టర్కీ ఐస్‌క్రీం వ్యాపారస్థుడికి షాక్ ఇచ్చాడు. ప్రాంక్ చేద్దామనుకుంటే చుక్కలు చూపించాడు. ఐస్‌క్రీం కోను చేతిలో పెట్టి వెనక్కి లాగేసుకుందాం అనే లోపే.. ఈ బుడ్డోడు ఐస్‌క్రీం ఇచ్చే కర్రను చేతితో బిగ్గరగా పట్టుకున్నాడు. అంతేకాదు ఐస్‌క్రీం వెండర్ చేతిపై కొట్టాడు. బాల భీముడిలా ఉన్న పిల్లాడి బలం ముందు ఆ వెండర్ నిలబడలేకపోయాడు. ఐస్‌క్రీం స్టిక్ వెనక్కి తీసుకునేందుకు వంగి వంగి ప్రయత్నించినా సఫలం కాలేకపోయాడు. చివరకు బుడ్డోడు హీరోలా తన ఐస్‌క్రీం తీసుకొని హాయిగా తినుకుంటూ వెళ్లాడు. అక్కడున్న వారంతా బుడ్డోడి చర్యను చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. View this post on Instagram A post shared by Dinesh Kumar (@black_dancer_dinesh) ఓ వ్యక్తి ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్ల నుంచి విశేష స్పందన లభించింది. బుడ్డోడిని అనేక మంది మెచ్చుకుంటున్నారు. ప్రాంక్ చేద్దామనుకుంటే షాక్ ఇచ్చాడు.. చిన్నోడు మామూలోడు కాదు అని కొనియాడారు. చదవండి: ఏడుస్తున్న చిన్నారిని కౌగిలించుకున్న మేఘన్.. వీడియో వైరల్ -
బౌలింగ్ మరిచి ప్యాంటు లాగి.. అంపైర్ పరువు తీశాడు
క్రికెట్లో ఫన్నీ ఘటనలు చోటుచేసుకోవడం సహజం. తోటి ఆటగాళ్లను, కోచ్‌ను ఫ్రాంక్ చేస్తే పర్లేదు. కానీ మైదానంలో గంభీరంగా నిలబడే అంపైర్‌ను కూడా ఫ్రాంక్ చేయడం ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ చేయాల్సింది మరిచి అంపైర్ ప్యాంట్‌ను లాగడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన లంకాషైర్ క్రికెట్ లీగ్‌లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. రిస్టన్ క్రికెట్ క్లబ్లో లంకాషైర్ లీగ్, ఈస్ట్ లంకాషైర్ క్రికెట్ క్లబ్ మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. బౌలింగ్ వేయడానికి సిద్ధమైన బౌలర్ రన్అప్కు వెళ్లాడు. బంతిని చేతిలో ఉంచుకొని రన్అప్ తీసుకోకుండా నేరుగా అంపైర్ వద్దకు వెళ్లి అతన్ని ప్యాంట్ లాగాడు. ఇదంతా గమినించిన తోటి ఆటగాళ్లు అక్కడేం జరుగుతుందో ఒక్కక్షణం అర్థం కాలేదు. ఆ తర్వాత బౌలర్ నవ్వుతూ అంపైర్‌కు క్షమాపణ చెబుతూ.. ''ఇట్స్ ప్రాంక్'' అని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోపై ఒకసారి లుక్కేయండి. కాగా ఈ వీడియోపై అభిమానులు ఫన్నీగా స్పందించారు. ''ఆ బౌలర్ ప్రాంక్ చేయడం ఏమో గాని అంపైర్ ప్యాంటు లాగి పరువు మొత్తం తీశాడు''.. ''ఇంకా నయం ప్యాంటు ఒక్కటే లాగాడు.. దాంతో పాటు చెడ్డీ కూడా వచ్చి ఉంటే''.. ''ఎంత ఘోరం జరిగిపోయింది'' అంటూ కామెంట్స్ చేశారు. @ThatsSoVillage the funniest/most village thing to happen at @Rishtoncc Lancashire this weekend. 😂😂😂 pic.twitter.com/oF2qWeZbXk — Tino Hallerenko (@tinohalleron) August 27, 2022 చదవండి: నల్ల బ్యాండ్లతో బరిలోకి దిగనున్న పాకిస్తాన్.. కారణం ఏంటంటే? Asia Cup IND Vs PAK: ప్రపంచ రికార్డుకు 10 పరుగుల దూరంలో హిట్‌మ్యాన్ -
ఇంటర్వ్యూలో యాంకర్ గొడవ.. ఏడ్చేసిన కృతి శెట్టి
Heroine Krithi Shetty Crying In Live Interview: 'ఉప్పెన' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ భామ ఆ తర్వాత 'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ప్రస్తుతం కృతి శెట్టి రామ్‌తో నటించిన 'ది వారియర్' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే కాకుండా సుధీర్ బాబుతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', నితిన్ సరసన 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలు చేస్తోంది. కాగా తాజాగా తమిళనాట జరిగిన ఓ ఇంటర్వ్యూలో కృతిశెట్టి కన్నీళ్లు పెట్టుకుంది. యాంకర్ల ప్రవర్తన చూసి ఇంటర్వ్యూలో ఏడ్చేసింది బేబమ్మ. చదవండి: బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇంటర్వ్యూ జరుగుతుండగా ఇద్దరు యాంకర్లు కృతిశెట్టిని ప్రశ్నలు అడిగేందుకు ఒకరికొకరు పోటీ పడ్డారు. తర్వాత ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటూ కృతిశెట్టి ఎదుటే గొడవకు దిగారు. అంతేకాకుండా ఒక యాంకర్ మరో యాంకర్‌ను కొట్టాడు. దీంతో ఏం జరుగుతుందో తెలియని బేబమ్మ భయపడిపోయింది. అయితే ఆ తర్వాత అది ప్రాంక్ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకుని నవ్వింది కృతిశెట్టి. పైకి నవ్వినా ఆపై దుఃఖం ఆపుకోలేక లైవ్‌లోనే ఏడ్చేసింది. కొద్దిసేపు తర్వాత ఆమెకు సర్దిచెప్పిన యాంకర్లు.. ఎందుకు ఏడ్చారు, ఏమైంది అని ప్రశ్నించారు. దానికి ఎవరైన హార్డ్‌గా మాట్లాడితే తట్టుకోలేను, భయం వేస్తుంది అని చెప్పుకొచ్చింది 18 ఏళ్ల కృతిశెట్టి. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు, అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. View this post on Instagram A post shared by 𝗞𝗿𝗶𝘁𝗵𝗶 𝗦𝗵𝗲𝘁𝘁𝘆 🔵 (@krithi.shetty_shines) -
20 యూట్యూబ్ ఛానెల్స్‌పై ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి
-
20 యూట్యూబ్ ఛానళ్లపై కరాటే కల్యాణి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: అసభ్యకర ప్రాంక్ వీడియోలు చేస్తున్న యూట్యూబర్స్‌పై కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుమారు ఇరవై యూట్యూబ్ ఛానెళ్లపై సాక్ష్యాలతో సహా సీసీఎస్ పోలీసులకు కళ్యాణి ఫిర్యాదు చేయగా.. ఐటీ యాక్ట్‌లోని 67A, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆయా యూట్యూబ్ ఛానెళ్లపై నిఘా పెట్టడంతో పాటు కేసు విచారణకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. త్వరలోనే సదరు యూట్యూబ్ ఛానెళ్లకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రాంక్ పేరుతో ఆసభ్యవీడియోలు చేస్తున్నాడంటూ యూట్యూబర్ శ్రీకాంత్‌పై కరాటే కల్యాణి దాడి చేసిన సంగతి తెలిసిందే. నడిరోడ్డుపై అర్థరాత్రి వీరిద్దరు కొట్టుకోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్లో ఇద్దరిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆమె అక్రమంగా చిన్నారి దత్తత తీసుకుందంటూ ఆరోపణలు సైతం వచ్చాయి. చదవండి: పార్టీలో మెరిసిన రష్మిక, ఎందుకలా ఫీలవుతోందని ట్రోలింగ్ Rakul Preet Singh: సౌత్, నార్త్ రెండూ కలిస్తే అద్భుతాలే.. -
వీడియోలు చేయి డబ్బులిస్తా అన్నాడు, చెంప పగలకొట్టాను : కరాటే కల్యాణి
యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి, నటి కరాటే కల్యాణి మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్య వీడియోలు చేయిస్తున్నారంటూ కరాటే కల్యాణి అతడిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకోవడంతో ఈ ఘర్షణ మరింత ముదిరింది. ఈ క్రమంలో ఇరువురు ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. తాజాగా ఈ వివాదంపై నటి కరాటే కల్యాణి స్పందించింది. వీడియోల పేరుతో శ్రీకాంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని, గతంలోనూ అమ్మాయిలను వేధించాడని ఆరోపించింది. 'బిగ్‌బాస్‌లో ఛాన్స్ ఇప్పిస్తా, యూట్యూబ్ స్టార్స్‌ని చేస్తా అని అమ్మాయిలను ట్రాప్ చేస్తాడు. ఈ విషయంపై మాట్లాడేందుకు వెళ్తే నాతోనూ అసభ్యంగా ప్రవర్తించాడు. డబ్బులిస్తాను.. నాతో కలిసి అడల్ట్ కంటెంట్ చేస్తావా? అని అడిగాడు. ఆ మాటకి కోపం వచ్చి చెంప పగలకొట్టాను. మహిళలతో ఇంత చీప్‌గా బిహేవ్ చేస్తున్న శ్రీకాంత్ రెడ్డి ఛానెల్‌ను యూట్యూబ్ నుంచి తక్షణమే తొలగించాలి' అని కరాటే కల్యాణి డిమాండ్ చేసింది. -
కరాటే కల్యాణిపై యూట్యూబర్ శ్రీకాంత్ సంచలన ఆరోపణలు
యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి, నటి కరాటే కల్యాణి మధ్య జరిగిన వాగ్వాదం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్య వీడియోలు చేస్తున్నారంటూ కరాటే కల్యాణి అతడిపై దాడి చేశారు. యూసుఫ్‌గూడలోని ఓ బస్తీ జరిగిన గొడవల ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో ఈ వివాదం మరింత ముదరింది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇస్తూ శ్రీకాంత్ ఫేస్బుక్లో ఓ వీడియో వదిలాడు. ఈ సందర్భంగా అతడు కరాటే కల్యాణిపై సంచలన ఆరోపణలు చేశాడు. చదవండి: యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి ఈ వీడియోలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘నా పేరు శ్రీకాంత్‌రెడ్డి. మీకు తెలుసు కదా నేను వీడియోలు చేస్తుంటాను. కరాటే కల్యాణితో జరిగిన గొడవ మీకు తెలిసిందే. నిన్న రాత్రి 9 గంటల మధ్య కరాటే కల్యాణి గారు మా ఇంటికి వచ్చారు. ఆమెతో పాటు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వచ్చి రాగానే సమాజం చెడిపోయే వీడియోలు చేస్తున్నావు అన్నారు. దీనికి నేను నువ్వు బాబీ అంటూ సినిమాలు చేస్తావు కదా? అలాంటప్పుడు నేను వీడియోలు చేసుకోవడంలో తప్పు ఏంటి? అని ప్రశ్నించాను’ అని అన్నాడు. చదవండి: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి డేట్ ఫిక్స్ ఆ తర్వాత ‘నా వీడియోల్లో చేసే ఆడవాళ్లు ఆర్టిస్టులు, వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తారని అని చెప్పాను. దీంతో కల్యాణి నన్ను లక్ష రూపాయలు అడిగింది. ఇవ్వకపోతే పోలీసులకి కంప్లైంట్ చేస్తానని బెదిరించింది. పక్కన ఉన్న అబ్బాయి గొడవ ఎందుకు 70 వేలకి సెట్ చేస్తాను అన్నాడు. నేను మీకు ఎందుకు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వను అనడంతో నాపై దాడి చేశారు, షర్ట్ చింపేసారు. కళ్యాణి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది. మీరంతా నాకు సపోర్ట్ ఇవ్వండి’ అంటూ చెప్పుకొచ్చాడు. చివరగా తాను ఏ తప్పు చేయలేదని, కేవలం వినోదం కోసమే వీడియోలు చేస్తుంటున్నానని శ్రీకాంత్ పేర్కొన్నాడు. అలాగే కరాటే కల్యాణిపై ఎస్ఆర్ నగర్ పోలీసుల స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశానన్నాడు. -
యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి
సాక్షి, అమీర్‌పేట: యూ ట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిపై నటి కల్యాణి పడాల (కరాటే కల్యాణి) దాడికి పాల్పడింది. యూసుఫ్‌గూడ బస్తీలో ఉంటున్న శ్రీకాంత్‌రెడ్డి ఇంటివద్దకు అనుచరులతో కలిసి వచ్చిన కల్యాణి డబ్బులు డిమాండ్ చేయగా నిరాకరించడంతో నలుగురు కలిసి కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఫ్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ యువతను చెడుదోవ పట్టిస్తున్నాడని, దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన తనతో పాటు నాలుగు నెలల చిన్నారిపై శ్రీకాంత్‌రెడ్డి దాడి చేశాడని కల్యాణి కూడా ఫిర్యాదు చేశారు. పరస్పరం ఫిర్యాదులు చేయడంతో ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. యూ ట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి ఇంటి వద్దకు అర్ధరాత్రి కరాటే కల్యాణి మరో నలుగురితో కలిసి వచ్చింది. ఇంట్లో భోజనం చేస్తుండగా గట్టిగా అరుస్తూ కిందకు రావాలని గొడవ చేయడంతో శ్రీకాంత్‌రెడ్డి కిందకు వచ్చాడు. ఫ్రాంక్ సాకుతో అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించి మహిళల గౌరవాన్ని దిబ్బ తీస్తున్నావని తలుచుకుంటే నిన్ను మూసివేస్తానని బెదిరించింది. రూ.లక్ష ఇస్తే వెళ్లిపోతామంది. ఆమె వెంట వచ్చిన ఒకరు తనను పక్కకు తీసుకుకెళ్లి రూ.70 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా అందుకు నిరాకరించడంతో కల్యాణి అసభ్యకరంగా మాట్లాడుతూ అనుచరులతో తనపై దాడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. ఫ్రాంక్ పేరుతో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని కొందరు మహిళలు చెప్పడంతో శ్రీకాంత్‌రెడ్డిని ప్రశ్నించేందుకు వెళ్తే శ్రీకాంత్‌రెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తూ నాలుగు నెలల చిన్నారితో పాటు తనపై దాడి చేశాడని కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: (చికెన్ 312 నాటౌట్.. చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు) -
డోంట్ బీ ప్రాంక్..సరదా కాస్త సీరియస్ ఇష్యూగా..
సాక్షి, హైదరాబాద్, హిమాయత్‌నగర్: అది జడ్చర్ల బస్టాండ్. గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా కొందరు యువకులు ప్రత్యక్షమై భిక్షాటన పేరిట ప్రయాణికులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ప్రారంభించారు. డబ్బులు అడుక్కుంటూ మహిళల పాదాల మీద పడ్డారు. వీరి ప్రవర్తన శృతి మించడంతో ప్రయాణికుల్లో సహనం నశించి వారిని పట్టుకుని చితకబాదారు. దాంతో యువకులు ఇదంతా ప్రాంక్ అని రహస్యంగా వీడియో చిత్రీకరణ చేస్తున్నామని వివరించారు. దీంతో మరింత అసహనానికి గురైన ప్రయాణికులు వారిని పోలీసులకు అప్పగించబోయారు. అయితే వారు కాళ్లావేళ్లా పడి బతిమాలాడడంతో వదిలేశారు. ఒకటి కాదు రెండూ కాదు ప్రాంక్ వీడియోల పేరిట పలువురు చెలరేగిపోతున్న సంఘటనలు నగరం చుట్టుపక్కల తరచు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరో ప్రాంక్ వీడియో సృష్టించిన వివాదంతో మరోసారి ఈ ప్రాంక్ వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. . ప్రాంక్...యాక్... ఇలాంటి వీడియోలకు మంచి వ్యూస్ వస్తుండడంతో అనేక మంది యూ ట్యూబర్స్ ప్రాంక్ బాట పడుతున్నారు. వీరిలో కొందరు పరిధిలో ఉండి పెద్దగా ఇబ్బంది పెట్టని ప్రాంక్ వీడియోలు చేస్తుండగా మరికొందరు మాత్రం మరీ బరి తెగిస్తున్నారు. ఓ లేడీ యూట్యూబర్ తాను చేసే ఓ గేమ్‌షో కోసం జనాల మధ్య వీడియోస్ చేస్తుంది. మెట్రో రైలులో కింద కూర్చుని కర్చీఫ్ వేసుకుని అడుక్కోవడం మొదలుకుని మెట్రో రైలులో వీరి టీమ్‌కు చెందిన అమ్మాయి అబ్బాయి ముద్దు పెట్టుకోవడం, ఇతరులను ముద్దు అడగడం వంటివీ చేయిస్తోంది. ఫిర్యాదు చేస్తే చర్యలు... ప్రాంక్ వీడియోల పేరుతో పబ్లిక్ ప్రదేశాలు సహా ఎక్కడా అశ్లీలం, అభ్యంతరకరమైన కార్యకలాపాలకు పాల్పడకూడదు. ఇటీవల ఇలాంటి వీడియోలు యూట్యూబ్‌లోనూ పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. ప్రాంక్స్ వల్ల ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. వీటి ఆధారంగా కేసులు నమోదు చేసుకుని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రై మ్ ఏసీపీ -
హీరో విశ్వక్ సేన్‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
Complaint Of Hero Vishwak Sen: ప్రమోషన్స్ పేరుతో న్యూసెన్స్ చేస్తున్నారంటూ హీరో విశ్వక్ సేన్‌పై అడ్వకేట్ అరుణ్ కుమార్ హ్యుమర్ రైట్ కౌన్సిల్(హెచ్ఆర్సీ)కి ఫిర్యాదు చేశారు. తన తాజా చిత్రం ‘ఆశోకవనంలో అర్జుణ కల్యాణం’ త్వరలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ అభిమాని చేత పెట్రోల్‌తో సూసైడ్ ప్రయత్నం చేసుకునే విధంగా ప్రాంక్ వీడియో చేయించింది చిత్ర బృందం. చదవండి: ప్రమోషన్స్ కోసం ఇంత దిగజారాలా? విశ్వక్సేన్పై ఫైర్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్వకేట్ అరుణ్ కుమార్ హీరో విశ్వక్ సేన్, మూవీ టీంపై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. సినిమా ప్రమోషన్స్ పేరుతో రోడ్లపై న్యూసెన్స్ చేస్తూ పబ్లిక్కు అంతరాయం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. పబ్లిక్ ప్లేస్‌లో సినిమా ప్రమోషన్స్ చేయకుండా చూసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని ఆయన కోరారు. అడ్వకేట్ అరుణ్ కుమార్ ఫిర్యాదును హెచ్ఆర్సీ స్వీకరించింది. చదవండి: ‘హిట్ 2’ రిలీజ్ డేట్ వచ్చేసింది, ఆ రోజే థియేటర్లో సందడి విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా మే 6న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ అభిమానితో అల్లం అర్జున్ కుమార్ (అశోక వనంలో అర్జున కళ్యాణంలో విశ్వక్ సేన్ పేరు)కి 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు కదా సార్. నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకుంటా అంటూ డ్రామాలాడాడు. విశ్వక్సేన్ కూడా ఇదంతా తనకేం తెలియనట్లు ఆ డ్రామాను రక్తి కట్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడతుంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు సైతం సటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. -
ప్రమోషన్స్ కోసం ఇంత దిగజారాలా? విశ్వక్సేన్పై ఫైర్
హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’.విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే6న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన చిత్ర బృందం తాజాగా తమ సినిమా ప్రమోషన్స్ కోసం చేయించిన ప్రాంక్ వీడియోపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. విశ్వక్ సేన్ ఫిలింనగర్ రోడ్డులో వెళుతుంటే ఓ యువకుడు కారుకు అడ్డంగా పడుకొని నడిరోడ్డుపై హల్చల్ చేశాడు. అల్లం అర్జున్ కుమార్ (అశోక వనంలో అర్జున కళ్యాణంలో విశ్వక్ సేన్ పేరు)కి 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు కదా సార్. నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకుంటా అంటూ డ్రామాలాడాడు. విశ్వక్సేన్ కూడా ఇదంతా తనకేం తెలియనట్లు ఆ డ్రామాను రక్తి కట్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడతుంది. సినిమా ప్రమోషన్స్ కోసం ఇంత దిగజారి ఆలోచించాలా అంటూ చిత్ర యూనిట్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సినిమా బాగుంటే ఆడుతుంది. లేకపోతే ఆడియెన్స్ చూడరు. ఇలాంటి జిమ్మిక్కులు వర్కవుట్ కావని ఎప్పుడు తెలుసుకుంటారు? ప్రాంక్ పేరుతో పబ్లిక్ ప్లేస్‌లో న్యూసెన్స్ చేయడం ఏంటి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. https://t.co/VXk5VSKO4y#VishwakSen and His Fan Hulchal On #Road | #AshokaVanamLoArjunaKalyanam | Filmylooks #Tollywood — MrB Celeb News (@mrbcelebnews) May 1, 2022 -
హీరోయిన్ బాత్రూమ్లోకి చొరబడ్డ ఫ్యాన్.. పెళ్లి చేసుకోకుంటే చస్తానని బెదిరింపు
Sonakshi Sinha Fan Threatens Her In The Khatra Khatra Show: సల్మాన్ ఖాన్ 'దబాంగ్' సినిమాతో వెండితెరకు పరిచయమైంది బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగి అశేష అభిమానులన్ని సంపాదించుకుంది. అయితే తాజాగా తన అభిమాని నుంచి వింత అనుభవాన్ని చవిచూసింది సోనాక్షి. 'ది ఖత్రా ఖత్రా' షోలో పాల్గొనేందుకు వెళ్లిన సోనాక్షి సిన్హాకు తన ఫ్యాన్ ఒకరు తనను పెళ్లి చేసుకోమ్మని, లేకుంటే తన గొంతు కోసుకుంటానని బెదిరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వెరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. సోనాక్షి సిన్హా తన వ్యానిటీ వ్యాన్‌లో ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో వాష్ రూమ్ నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి 'మేడమ్ నేను మీకు పెద్ద అభిమానని. మీకోసమే రాత్రి నుంచి ఇక్కడ ఎదురుచూస్తున్నా' అని చెబుతాడు. చదవండి: నాలుగో తరగతిలో లైంగిక వేధింపులు.. ఆ దెబ్బతో మళ్లీ చూడలేదు తర్వాత సోనాక్షి సిన్హా అని పచ్చబొట్టు వేసుకున్న తన చేతిని చూపిస్తాడు. అనంతరం సోఫాలో కూర్చుని 'నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. దయచేసి నన్ను పెళ్లి చేసుకోండి.' అని అంటాడు. తర్వాత అక్కడ పరిస్థితులు అంతాగా బాగాలేనట్లు కనిపించింది. అద్దంపై లిపిస్ట్క్తో 'ఐ లవ్ యూ సోనా' అని రాశాడు. అంతేకాకుండా 'ఇది నా రక్తంతో కూడా రాయగలను' అని సోనాక్షితో ఆ అభిమాని చెబుతాడు. ఇదంతా అర్థంకానీ సోనాక్షి అదేం వద్దూ అని చేతులతో సైగ చేస్తూ చెబుతుంది. దీంతో ఆవేశానికి లైనైనా ఆ అభిమాని అక్కడున్న వస్తువులను విసిరేయడం వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా తన జేబులో నుంచి కత్తి తీసి 'నువ్ నన్ను పెళ్లి చేసుకోకుంటే నా గొంతు కోసుకుంటాను' అని సోనాక్షిని బెదిరిస్తాడు. దీంతో షాక్‌కు గురైన సోనాక్షి కేకలు వేయడంతో వీడియో ముగుస్తుంది. చదవండి: జిమ్ ఫొటో షేర్ చేసిన హీరో.. భార్య రియాక్షన్ ఏంటో తెలుసా ? అయితే ఈ వీడియో అంతా 'ది ఖత్రా ఖత్రా' షో ప్రచారంలో భాగంగా సోనాక్షికి తెలియకుండా తనపై ప్రాంక్ చేశారని తెలుస్తోంది. ఈ షోలో భారతీ సింగ్, హర్ష్ లింబాచియా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ శుక్రవారం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్ స్పెషల్ హోస్ట్‌గా కనువిందు చేయనున్నారు. ఇదిలా ఉంటే సోనాక్షి సిన్హా.. హ్యూమా ఖురేషీ, జహీర్ ఇక్బాల్‌తో కలిసి డబుల్ ఎక్స్ఎల్ సినిమాలో నటించనుంది. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) చదవండి: నా నటన చూసి నా భార్య నన్ను వదిలేస్తానంది: షాహిద్ కపూర్ -
ప్రాంక్ వీడియో.. చితకబాదిన ప్రయాణికులు
జడ్చర్ల: ప్రాంక్ వీడియోకోసం భిక్షాటన చేస్తూ.. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి యువకులు దెబ్బలు తిన్న ఘటన జడ్చర్ల కొత్త బస్టాండ్‌లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ప్రయాణికుల కథనం ప్రకారం.. జడ్చర్ల కొత్త బస్టాండ్‌లో మధ్యాహ్నం సమయంలో ఆకస్మికంగా కొందరు యువకులు ప్రయాణికుల దగ్గరకు వచ్చి భిక్షాటనతో హడావుడి చేశాడు. డబ్బులు ఇవ్వని వారి పాదాలను పట్టుకున్నారు. మహిళల పట్ల కొంత అసభ్యకరంగా ప్రవర్తించారు. ప్రవర్తన హద్దు మీరడంతో అక్కడున్న ప్రయాణికులు వారిని పట్టుకుని చితక బాదారు. దీంతో తాము ప్రాంక్ వీడియోలు చేస్తున్నామని, ఈ సన్నివేశాలను తమ మిత్రులు రహస్యంగా చిత్రీకరిస్తున్నారని చెప్పడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామనడంతో సదరు యువకులు ప్రయాణికులకు క్షమాపణ చెప్పి వెళ్లిపోయారు. (చదవండి: యాప్స్‌తోనే లక్ష్మీపతి నెట్వర్క్)