వైరల్‌.. భయపెట్టాలని ట్రై చేస్తే... | Prankster try to Scare Passing Drivers goes horribly wrong | Sakshi
Sakshi News home page

భయపెట్టాలని ప్రాంక్‌ వీడియో తీస్తుండగా...

Published Tue, Oct 3 2017 12:09 PM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

Prankster try to Scare Passing Drivers goes horribly wrong - Sakshi

సాక్షి : దారిన పోయే ప్రయాణికులను భయపెడదామనుకున్న అతని ప్రయత్నం బెడసి కొట్టింది. కాస్తుంటే ప్రాణాలు పోయి ఉండేవే. కానీ, అతని ఆయుష్షు గట్టిది కావటంతో చిన్న గాయం కూడా కాకుండా తప్పించుకున్నాడు. అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది.

హలోవీన్ పేరిట తరచూ అక్కడ పార్టీలు సాధారణంగా జరుగుతుంటాయి. వాటిల్లో దెయ్యాల వేషధారణలో తిరుగుతూ వేడుకలు చేసుకుంటుంటారు. అయితే అదే గెటప్‌ లో ఫ్రాంక్‌ వీడియో చేయాలని ఓ వ్యక్తి భావించాడు.  ఘౌలీష్‌ బందీ మాదిరి వేషం వేసుకుని కాళ్లు, చేతులు కట్టేసుకుని ముందుకు వెళ్తుంటే..  జాంబీ నర్స్‌ గెటప్‌ లో ఉన్న ఓ మహిళ వెనకాల అతన్ని పట్టుకుని లాగుతుంటుంది. 

ఇలా దారిన కార్లలో వెళ్లే వారిని భయపెట్టడం అతను చేస్తున్నాడు.  ఇంతలో ఓ కారు రావటం.. ఆ తాడు తెగిపోవటం.. అతను కింద పడిపోవటం జరిగిపోయాయి.  కాస్తుంటే అతని తలపై కారు వెనకాల చక్రం ఎక్కేదే. కానీ, అతని టైం బాగుండి అది జరగలేదు. ఏ ప్రాంతంలో ఏ తేదీలో జరిగిందో స్పష్టత లేకపోయినా ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement