
అమెరికన్ ఎంటర్‌ప్రెన్యూర్ బ్రయాన్ జాన్సన్ గురించి ప్రత్యేకంగ చెప్పాల్సిన పనిలేదు. నిత్య యవ్వనంగా ఉండేందుకు కోట్లు ఖర్చుపెడుతున్న వ్యక్తిగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. 46ఏళ్ల ఈ టెక్ మిలియనీర్ తన జీవ సంబంధ వయసును తిప్పికొట్టి 18 ఏళ్ల కుర్రాడిలా యవ్వనంగా కనిపించాలని సప్లిమెంట్లతో కూడిన కఠిన ఆహార నియమావళిని అనుసరించేవాడు.
దీన్ని తన బ్లూప్రింట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎప్పటికీ యవ్వనంగా ఉండేలా ప్రయోగానికి పూనకున్నాడు. అందుకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్లతో షేర్ చేసుకునేవారు. తాజగా ఆయన తన వయసు రీత్యా చర్మంలో వచ్చే మార్పులను అందుకు తీసుకోవాల్సిన చిట్కాలను గురించి వివరించాడు. అందుకోసం తాను ఏం చేస్తున్నాడో కూడా వివరించాడు.
అవేంటంటే..బ్రయాన్ జాన్సన్ 46 ఏళ్ల వయసులో చర్మ సంరక్షణ గురించి అంతగా పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. అందువల్ల వృధాప్య లక్షణాలు వచ్చి తన చర్మం ఎలా ముడతలు పడినట్లయ్యిందో తెలిపారు. అంతేగాదు తన జీవ సంబంధమైన వయసుని తిప్పికొట్టి చర్మం కాంతిగా కనిపించేందుకు ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టిపెట్టడం అత్యంత అవసరమని అన్నారు.
వడదెబ్బ, సరైన ఆహారం తీసుకోకపోవడం, తగిన బాడీ క్రీమ్‌లు వాడకపోవడం తదితర కారణాల వల్ల చర్మం తొందరగా ఆకర్షణీయతో కోల్పోతుందన్నారు. ఫలితంగా వయసు పెద్దగా కనిపించేలా చేస్తుందని అన్నారు. ప్రస్తుతం తన చర్మం మెరుగుపడి 37 ఏళ్ల వయసు వారిలా కనిపిస్తుందని కూడా చెప్పారు. అలాగే ఆరోగ్యకరమైన చర్మం కోసం కొన్ని చిట్కాలు కూడా షేర్ చేశారు. వ్యాయామం, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం తదితరాలే చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయని అన్నారు. అలాగే సన్‌స్క్రీన్ లోషన్‌లు వంటి ఉపయోగించి చర్మ దెబ్బతినకుండా కాపాడుకోవాలని చెప్పారు.
అందుకోసం తాను అనుసరిస్తున్న కఠిన ఆహార నియమావళి గురించి తెలిపారు. అలాగే ఉదయం, రాత్రి వేళలు తప్పనిసరిగా ముఖం కడగడం, మినరల్ సన్‌స్క్రీన్‌ను పూయడం, మాయిశ్చరైజర్లను వాడటం వంటివి చేస్తానని అన్నారు. చర్మం ఆరోగ్యం కోసం నియాసినామైడ్, విటమిన్ సి, హైలురోనిక్ యాసిడ్, ప్రిస్క్రిప్షన్ ట్రెటినోయిన్ వంటి నిర్దిష్ట క్రీముల వినియోగాన్ని కూడా వివరించారు. ప్రతి ఒక్కటి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచి, నష్టాన్ని నివారిస్తాయని చెప్పారు. అలాగే చర్మసంరక్షణ ఉత్పత్తులో తరుచుగా కనిపించే ఎండోక్రైన్ డిస్‌రప్టర్‌లు మంచివి కావని, ఇది వన్యప్రాణులు, మానవుల ఆరోగ్యానికి హానికరమైనవని చెప్పుకొచ్చారు.
తన చర్మం నిత్య యవ్వనంగా కనిపించేలా టిక్సెల్, సోఫ్‌వేవ్, యు స్కల్ప్ట్రా వంటి చికిత్సలను ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించి చర్మ దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయని అన్నారు. దీంతోపాటు రెడ్‌లైట్ థెరపీ, మచ్చలు లేని చర్మం కోసం అక్యుటేన్ మైక్రోడోసింగ్ వంటి వాడకం గురించి కూడా చెప్పారు జాన్సన్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
My daily protocol:
Face wash morning & night.
+ Sunscreen (mineral)
+ Moisturize (Body and Face)
+ Creams - can start with the basics such as niacinamide (morning and night), vitamin C (morning), hyaluronic acid (as desired), and tretinoin (at night, an Rx). pic.twitter.com/Qpl6hd7yc2— Bryan Johnson /dd (@bryan_johnson) September 26, 2024
(చదవండి: పంజాబ్ సీఎంకి లెప్టోస్పిరోసిస్ నిర్ధారణ! అంటే ఏంటీ? ఎందువల్ల వస్తుంది?)