million
-
అమెరికా నుంచి భారత్ తిరిగొచ్చిన... 1,400 పై చిలుకు కళాకృతులు
భారత్ నుంచి స్మగ్లర్లు అక్రమంగా తరలించిన 1,400కు పైగా పురాతన కళాకృతులను అమెరికా తాజాగా తిరిగి అప్పగించింది. వీటి విలువ కోటి డాలర్ల పై చిలుకే. దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలకు చెందిన కళాకృతులను మాతృదేశాలకు స్వాదీనం చేసే చర్యల్లో ఇది భాగమని మన్హాటన్ జిల్లా అటార్నీ కార్యాలయంలోని యాంటిక్విటీ స్మగ్లింగ్ విభాగం తెలిపింది. భారత్ నుంచి లండన్‌కు తరలించిన దేవ నర్తకి శిల్పం వంటి అపురూప కళాకృతులు వీటిలో ఉన్నాయి. దీన్ని శాండ్‌స్టోన్‌లో అత్యంత సుందరంగా మలిచారు. వీటిని న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ తదితర చోట్ల భద్రపరిచి ఉంచారు. నాన్సీ వెయినర్ వంటి అమెరికా స్మగ్లర్లతో పాటు భారత్‌కు చెందిన పలువురు గ్యాంగ్ లీడర్లను ఇప్పటికే అరెస్టు చేశారు. యాంటిక్విటీ విభాగం ఇప్పటిదాకా 46 కోట్ల డాలర్ల విలువైన 5,800కు పైగా కళాకృతులను స్మగ్లర్ల నుంచి స్వా«దీనం చేసుకుంది. 16 మందికి పైగా స్మగ్లర్లకు శిక్షలు పడేలా చూసింది. -
టెక్ మిలియనీర్ హెల్తీ స్కిన్ చిట్కాలు..!
అమెరికన్ ఎంటర్ప్రెన్యూర్ బ్రయాన్ జాన్సన్ గురించి ప్రత్యేకంగ చెప్పాల్సిన పనిలేదు. నిత్య యవ్వనంగా ఉండేందుకు కోట్లు ఖర్చుపెడుతున్న వ్యక్తిగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. 46ఏళ్ల ఈ టెక్ మిలియనీర్ తన జీవ సంబంధ వయసును తిప్పికొట్టి 18 ఏళ్ల కుర్రాడిలా యవ్వనంగా కనిపించాలని సప్లిమెంట్లతో కూడిన కఠిన ఆహార నియమావళిని అనుసరించేవాడు. దీన్ని తన బ్లూప్రింట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎప్పటికీ యవ్వనంగా ఉండేలా ప్రయోగానికి పూనకున్నాడు. అందుకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్లతో షేర్ చేసుకునేవారు. తాజగా ఆయన తన వయసు రీత్యా చర్మంలో వచ్చే మార్పులను అందుకు తీసుకోవాల్సిన చిట్కాలను గురించి వివరించాడు. అందుకోసం తాను ఏం చేస్తున్నాడో కూడా వివరించాడు. అవేంటంటే..బ్రయాన్ జాన్సన్ 46 ఏళ్ల వయసులో చర్మ సంరక్షణ గురించి అంతగా పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. అందువల్ల వృధాప్య లక్షణాలు వచ్చి తన చర్మం ఎలా ముడతలు పడినట్లయ్యిందో తెలిపారు. అంతేగాదు తన జీవ సంబంధమైన వయసుని తిప్పికొట్టి చర్మం కాంతిగా కనిపించేందుకు ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టిపెట్టడం అత్యంత అవసరమని అన్నారు. వడదెబ్బ, సరైన ఆహారం తీసుకోకపోవడం, తగిన బాడీ క్రీమ్‌లు వాడకపోవడం తదితర కారణాల వల్ల చర్మం తొందరగా ఆకర్షణీయతో కోల్పోతుందన్నారు. ఫలితంగా వయసు పెద్దగా కనిపించేలా చేస్తుందని అన్నారు. ప్రస్తుతం తన చర్మం మెరుగుపడి 37 ఏళ్ల వయసు వారిలా కనిపిస్తుందని కూడా చెప్పారు. అలాగే ఆరోగ్యకరమైన చర్మం కోసం కొన్ని చిట్కాలు కూడా షేర్ చేశారు. వ్యాయామం, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం తదితరాలే చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయని అన్నారు. అలాగే సన్‌స్క్రీన్ లోషన్లు వంటి ఉపయోగించి చర్మ దెబ్బతినకుండా కాపాడుకోవాలని చెప్పారు. అందుకోసం తాను అనుసరిస్తున్న కఠిన ఆహార నియమావళి గురించి తెలిపారు. అలాగే ఉదయం, రాత్రి వేళలు తప్పనిసరిగా ముఖం కడగడం, మినరల్ సన్‌స్క్రీన్‌ను పూయడం, మాయిశ్చరైజర్లను వాడటం వంటివి చేస్తానని అన్నారు. చర్మం ఆరోగ్యం కోసం నియాసినామైడ్, విటమిన్ సి, హైలురోనిక్ యాసిడ్, ప్రిస్క్రిప్షన్ ట్రెటినోయిన్ వంటి నిర్దిష్ట క్రీముల వినియోగాన్ని కూడా వివరించారు. ప్రతి ఒక్కటి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచి, నష్టాన్ని నివారిస్తాయని చెప్పారు. అలాగే చర్మసంరక్షణ ఉత్పత్తులో తరుచుగా కనిపించే ఎండోక్రైన్ డిస్రప్టర్లు మంచివి కావని, ఇది వన్యప్రాణులు, మానవుల ఆరోగ్యానికి హానికరమైనవని చెప్పుకొచ్చారు. తన చర్మం నిత్య యవ్వనంగా కనిపించేలా టిక్సెల్, సోఫ్వేవ్, యు స్కల్ప్ట్రా వంటి చికిత్సలను ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించి చర్మ దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయని అన్నారు. దీంతోపాటు రెడ్‌లైట్ థెరపీ, మచ్చలు లేని చర్మం కోసం అక్యుటేన్ మైక్రోడోసింగ్ వంటి వాడకం గురించి కూడా చెప్పారు జాన్సన్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.My daily protocol:Face wash morning & night.+ Sunscreen (mineral)+ Moisturize (Body and Face)+ Creams - can start with the basics such as niacinamide (morning and night), vitamin C (morning), hyaluronic acid (as desired), and tretinoin (at night, an Rx). pic.twitter.com/Qpl6hd7yc2— Bryan Johnson /dd (@bryan_johnson) September 26, 2024 (చదవండి: పంజాబ్ సీఎంకి లెప్టోస్పిరోసిస్ నిర్ధారణ! అంటే ఏంటీ? ఎందువల్ల వస్తుంది?) -
వాట్సాప్ చానెల్: ప్రధాని మోదీ రికార్డ్..షాకింగ్ ఫాలోవర్లు
PM Modi WhatsApp Channelప్రధానమంత్రి నరేంద్రమోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మరోసారి తన హవాను చాటుకున్నారు. తాజాగా వాట్సాప్ చానెల్లో కూడా సత్తాచాటారు. ప్రధాని మోదీ తన వాట్సాప్ ఛానెల్ ప్రారంభించిన ఒక్క రోజులోనే మిలియన్ సబ్స్క్రైబర్లను దాటేసి మరో రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పటికే ఎక్స్(ట్విటర్) ఫేస్బుక్ ,ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డ్ - సెట్టింగ్ ఫాలోవర్లను సంపాదించారు. తాజాగా వాట్సాప్ ఛానెల్లో మరో కీలక మైలురాయిని సాధించడం విశేషం 91 మిలియన్ల మంది ఫాలోవర్లతో Xలో అత్యధికంగా ఫాలో అవుతున్న ఇండియన్స్‌లో టాప్ ప్రధాని మోదీ. కాగా, ఫేస్బుక్లో, పీఎం మదీకి 48 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 78 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వాట్సాప్ ఛానెల్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. వాట్సాప్ చానెల్లో చేరడం ఆనందంగా ఉంది అంటూ కొత్త పార్లమెంటు భవనం ఫోటోను పోస్ట్ చేశారు మోదీ. సెప్టెంబర్ 13న భారతదేశంతో పాటు, 150కి పైగా దేశాలలో WhatsApp ఛానెల్స్‌ను ప్రారంభించింది. -
64 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్.. కారణం ఏంటంటే?
ఆధునిక కాలంలో యూట్యూబ్ గురించి పెద్దగా పరిచయమే అవసరం లేదు. దీని ద్వారా ఎంతోమంది బాగా సంపాదిస్తున్నారు. అయితే ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇటీవల ఏకంగా ఇండియాలో 19 లక్షల వీడియోలను తొలగించినట్లు వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు భారతదేశంలో 2023 జనవరి నుంచి మార్చి వరకు సుమారు 1.9 మిలియన్లకంటే ఎక్కువ వీడియోలను తొలగించినట్లు తెలిసింది. కాగా ప్రపంచ వ్యాప్తంగా 6.48 మిలియన్ల (64 లక్షల కంటే ఎక్కువ) వీడియోలను తీసివేసింది. ఇదీ చదవండి: ఆడియో, వీడియో కాల్ సదుపాయం ఎక్స్(ట్విటర్)లో కూడా - ఎలాన్ మస్క్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ యూట్యూబ్ పొందే ఫ్లాగ్‌లు అండ్ యూట్యూబ్ పాలసీలను ఎలా అమలు చేస్తుంది అనే దానిపై గ్లోబల్ డేటాను విడుదల చేసింది. ఇందులో తొలగించిన వీడియోల వివరాలు వెల్లడించింది. ఒక్క భారతదేశంలో (1.9 మిలియన్స్) మాత్రమే కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్ తీసివేసింది. అగ్రరాజ్యమైన అమెరికాలో 654968, రష్యాలో 491933, బ్రెజిల్లో 449759 వీడియోలను తొలగించినట్లు సమాచారం. -
16 ఏళ్లకే చదువుకు టాటా.. నేడు ఏటా రూ.100 కోట్లు సంపాదిస్తూ..
ఫొటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేసేందుకు తన కారును అమ్ముకోవాల్సివచ్చింది. అయినా అతను బాధపడలేదు. ఎందుకంటే తన కల నెరవేర్చుకునేందుకు కారు అమ్మడం అతనికి తప్పనిసరి అయ్యింది. ఇప్పుడతను తన బిజినెస్ కారణంగా ఏటా 10 మిలియన్ పౌండ్లు(సుమారు రూ.103 కోట్లు) సంపాదిస్తున్నాడు. ఐటీ సొల్యూషన్ బిజినెస్ ప్రారంభించి.. బ్రిటన్‌కు చెందిన 40 ఏళ్ల రాబ్డెన్స్ జీసీఎస్సీ పూర్తి చేసిన తరువాత స్కూలుకు వెళ్లడం మానివేశాడు. బిజినెస్ చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నాడు. డైలీ స్టార్ రిపోర్టులో తెలిపిన వివరాల ప్రకారం తన తల్లిదండ్రుల గ్యారేజీలో ఐటీ సొల్యూషన్ బిజినెస్ ప్రారంభించాడు. ఇందుకోసం రాబ్డెన్స్ 2008లో తన కారును వెయ్యి పౌండ్లకు అమ్మేశాడు. ఇప్పుడతను పెద్ద ఐటీ కన్సల్టెన్సీ కంపెనీకి సీఈఓ. ‘ఇన్నోవేటివ్‌గా ఉండేవాడిని’ ఈ కంపెనీలో వందమందికిపైగా సిబ్బంది ఉన్నారు. ఈ కంపెనీని నెలకొల్పి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం రాబ్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాబ్ మీడియాతో మాట్లాడుతూ ‘నేను స్కూలు చదువులో ప్రతిభ చూపలేకపోయేవాడిని. అయితే ఇన్నోవేటివ్‌గా ఉండేవాడిని. ఏ పరికరం ఎలా పనిచేస్తోందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపేవాడిని. నేను వ్యాపారం ప్రారంభించినప్పుడు నాతో పాటు ఒకరు ఉండేవారు. అతను అడ్మిన్‌తోపాటు అకౌంట్స్ చూసుకునేవాడు. 18 నెలలకే మా సంస్థలో 10 మంది సిబ్బంది ఉండేవారు. కరోనా మహమ్మారి సమయంలోనూ మా వ్యాపారం అభివృద్ధిదాయకంగా ముందుకుసాగింది. ప్రస్తుతం మేము 10 మిలియన్ పౌండ్లకు పైగా బిజినెస్ చేస్తున్నాం. వ్యాపారరంగంలో మేము ఇంతలా రాణించిన నేపధ్యంలో పలు పురస్కారాలు అందుకున్నాం’ అని అన్నారు. -
పేరుకే కుక్క కానీ కోట్ల లో సంపాదన .
-
ఆసియాలోనే ఒకే ఒక్కడు కోహ్లీ దరిదాపుల్లో కూడా ఎవరు లేరు ..
-
ఆర్ఆర్ఆర్ రికార్డ్ బద్దలు.. విడుదలైన రెండు వారాల్లోనే!
దర్శకధీరుడు తెరకెక్కించిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని నాటునాటు సాంగ్‌కు సైతం ఆస్కార్ అవార్డ్ కూడా దక్కింది. అయితే తాజాగా ఈ మూవీ రికార్డ్ బద్దలైంది. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ ఇప్పటి వరకు 2 5మిలియన్ అవర్స్‌తో తొలిస్థానంలో ఉండగా ఆ రికార్డ్ తుడిచిపెట్టుకుపోయింది. ఇటీవల రిలీజైన హైజాకింగ్ థ్రిలింగ్ డ్రామా ‘చోర్ నికల్ కే భాగా’ ఆర్ఆర్ఆర్ను అధిగమించింది. యామీ గౌతమ్, సన్నీ కౌశల్, శరద్ ఖేల్కర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ 29 మిలియన్ల అవర్స్ వీక్షించనట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. విడుదలైన రెండు వారాల్లోనే అత్యధికమంది వీక్షించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. కాగా.. మూడో స్థానంలో 22 మిలియన్ అవర్స్‌తో అలియాభట్ ప్రధానపాత్రలో నటించిన గంగూబాయి కతియావాడి నిలిచింది. -
ఎయిర్టెల్ 5జీ హవా: నెల రోజుల్లోనే రికార్డు
న్యూఢిల్లీ: వేగవంతమైన 5జీ టెలికం సర్వీసులను ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే 10 లక్షల మంది పైగా కస్టమర్ల మైలురాయిని దాటినట్లు భారతి ఎయిర్టెల్ వెల్లడించింది. నెట్‌వర్క్‌ను నిర్మించుకునే ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తుండగానే ఇది సాధించగలిగామని సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణ్‌దీప్ సెఖోన్ తెలిపారు. యాపిల్ ఐఫోన్లు మినహా 5జీ ఆధారిత స్మార్ట్ఫోన్లు అన్నీ ఈ నెల మధ్య నాటికి తమ సేవలను అందుకోగలవని ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ ఇప్పటికే తెలిపారు. ఐఫోన్ల కోసం యాపిల్ నవంబర్ తొలినాళ్లలో సాఫ్ట్వేర్ అప్డేట్లను విడుదల చేస్తుందని, డిసెంబర్ మధ్య నుంచి అవి కూడా 5జీని సపోర్ట్ చేయవచ్చని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి 4జీ రేట్లకే 5జీ సేవలు అందిస్తున్నామని, వచ్చే 6-9 నెలల్లో ధరలపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. 2024 మార్చి ఆఖరు నాటికి కీలకమైన గ్రామీణ ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ 5జీ సేవలు అందుబాటులోకి తేగలమని పేర్కొన్నారు. భారతి ఎయిర్టెల్ ప్రస్తుతం దశలవారీగా హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో 5జీ సర్వీసులను విస్తరిస్తోంది. -
ఏదో చిన్న బహుమతి వస్తుందనుకుంటే... ఏకంగా రూ. 7 కోట్లు....
యూఎస్‌లోని అన్నాడేల్కు చెందిన జోస్ ఫ్లోర్స్ వెలాస్క్వెజ్ సోడా డ్రింక్ కోసం షాపింగ్ చేస్తున్నప్పుడూ సేఫ్వేలో 'ట్వంటీ ఎక్స్ ది మనీ స్క్రాచ్ ఆఫ్ లాటరీ' టికెట్‌ని కొనుగోలు చేశాడు. కానీ అతను లాటరీ తగులుతుందన్నకోలేదు. అకస్మాత్తుగా ఒకరోజు వెలాస్క్వెజ్కి లాటరీ తగిలినట్లు వర్జీనియా లాటరీ అధికారులు చెప్పడంతో కలెక్ట్ చేసుకోవడానికి లాటరీ కార్యాలయాలనికి వెళ్లాడు. ఐతే అతను మాత్రం సుమారు రూ. 40 వేల ఖరీదు చేసే ఏ చిన్న బహుమతినో గెలుచుకుని ఉండొచ్చు అనుకున్నాడు. కానీ కార్యాలయానికి వెళ్లినవెంటను వారు దాదాపు రూ. 7 కోట్లు ఫ్రైజ్‌మనీ సొంతం చేసుకున్నట్లు చెప్పడంతో ఒక్కసారిగా వెలాస్క్వెజ్ షాక్‌కి గురయ్యాడు. వర్జీనియా లాటరీ అధికారులు లాటరీ టికెట్‌ని విక్రయించిన సూపర్ మార్కెట్ స్టోర్‌కి కూడా దాదాపు రూ. 7 లక్షల ఫ్రైజ్ మనీని అందజేసింది. అతను ఆ డబ్బును తన కుటుంబం కోసం, వ్యాపారం కోసం వినయోగించనున్నట్లు చెప్పాడు. చాలావరకు అమెరికన్లు ఇలాంటి లాటరీ టికెట్లను సూపర్ మార్కెట్లలోనూ, గ్యాస్స్టేషన్లలోనూ కొనుగోలు చేస్తుంటారు. గతంలో కూడా ఇలానే చాలామంది కనివినీ ఎరుగని రీతిలో ఊహించనంత పెద్ద మొత్తంలో డబ్బును సొంతం చేసుకున్నారు. (చదవండి: బ్రిటన్ రాణి వాడిపడేసిన టీబ్యాగ్ ఎంతకు అమ్ముడుపోయిందంటే....) -
జైలును ఆర్ట్ సెంటర్‌గా మార్చడం కోసం... కోట్లు సేకరిస్తున్నాడు!!
జైలును కళలకు కేంద్రంగా మార్చడం ఏమిటి? అని సందేహంగా చూడకండి. నిజానికి ఇది చాలా ప్రసిద్ధిగాంచిన జైలు. ఈ జైలులోంచి ఎందరో గొప్ప గొప్ప కవులు పుట్టుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఆ జైలు అధికారులు ఆ జైలుని వేలం వేయాలని చూస్తున్నారు. అయితే ఒక వీధి కళాకారుడు తన కళలతో వేలం ద్వారా వచ్చేంత డబ్బను ఇస్తానంటూ ఆ జైలుని భవనాలు అభివృద్ధి చేసే వాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా చేయాలని తపిస్తున్నాడు. (చదవండి: అమెరికా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ) అసలు విషయంలోకెళ్లితే... ఇంగ్లాండ్‌కి చెందిన అజ్ఞాత వీధి కళాకారుడు బ్యాంక్సీ జైలును ఆర్ట్ సెంటర్‌గా మార్చడానికి మిలియన్లు సేకరిస్తున్నాడు. అయితే ఈ జైలు రీడింగ్ జైలుగాప్రసిద్ధి చెందింది. అంతేకాదు ప్రసిద్ధ ఐరిష్ కవి నాటక రచయిత అయిన ఆస్కార్ వైల్డ్‌ను కలిగి ఉంది. అంతేకాదు జైలు అంటే ఒక నరకకూపంగా భావిస్తాం. అలాంటి ప్రదేశాన్ని కళకు కేంద్రంగా మార్చి పరిపూర్ణమైనదిగా చేయాలని తపిస్తున్నట్లు చెబుతాడు. ఈ మేరకు బ్యాక్సీ "క్రియేట్ ఎస్కేప్" పేరుతో గోడ చిత్రాలను వేస్తాడు. దీంతో అక్కడ ఉన్న ప్రజల ఆ జైలు గోడల పై వేసిన చిత్రాల పట్ల ఆకర్షితులవుతారు. అంతేకాదు ఈ చిత్రాలను విక్రయించిన సోమ్ము జైలు అధికారులు వేలంలో ఆర్జించాలనకున్న దాదాపు రూ 100 కోట్లుకి సరిపోతుందని హామీ కూడా ఇస్తాడు. అయితే ఈ చిత్రం ఈ నెల ప్రారంభంలో బ్రిస్టల్ మ్యూజియం మరియు ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించబడుతుందని, పైగా రూ 130 లక్షల వరకు సేకరించిగలనని ధీమా వ్యక్తం చేస్తాడు. ఈ మేరకు బ్యాంక్సీ ఈ జైలుని ఆర్ట్ సెంటర్‌గా మార్చేలా ప్రచారం కూడా చేస్తాడు. జైలును ఆర్ట్ సెంటర్‌గా మార్చాలనే ప్రచారానికి ఇప్పటికే నటులు డేమ్ జూడి డెంచ్, సర్ కెన్నెత్ బ్రనాగ్, కేట్ విన్స్లెట్, నటాలీ డోర్మెర్ నుండి మద్దతు లభించింది. అంతేకాదు బ్యాంక్సీ దీనికి సంబంధించిన ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: దేనికైనా రెడీ అంటూ!... సింహానికి సవాలు విసురుతూ... ఠీవిగా నుంచుంది కుక్క!!) View this post on Instagram A post shared by Banksy (@banksy) -
నిలువునా ముంచావు.. ఇక దిగిపో బాబూ
సాక్షి, విజయవాడ సిటీ : ఇంటికొక ఉద్యోగం.. లేదంటే రూ.2 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానంటూ యువతను నిలువునా ముంచేసిన చంద్రబాబూ.. ఇక సీఎం పదవి నుంచి దిగిపో అంటూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగులు సోమవారం విజయవాడలోని యూత్ సర్వీసు కమిషనర్ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే సలాం బాబు, జిల్లా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. ‘నిరుద్యోగ భృతిపై ఆశ కల్పించావు.. నిలువునా ముంచావు’, ‘ఇక చాలు.. దిగిపో బాబు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్కే సలాం బాబు మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తుండటంతో యువతను మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు.. కొత్తనాటకానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 30 లక్షల మంది నిరుద్యోగులుంటే.. కేవలం 10 లక్షల మందికే నిరుద్యోగ భృతి ఇస్తామని, అది కూడా రూ.వెయ్యి మాత్రమే ఇస్తామని ప్రకటించడం ద్వారా యువతను నట్టేట ముంచేశారని మండిపడ్డారు. జిల్లా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఎలాంటి షరతులు లేకుండా రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం యూత్ సర్వీస్ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని పక్కాగా అమలు చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటరీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, నగర కార్యదర్శులు అశోక్, అర్జున్, నరసింహ, శ్యామ్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఒక్క పాటలో పది లక్షల గొంతులు
రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కబాలి ఫేం పా రంజిత్ దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 7న రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ వెల్లడించారు. ఈ సినిమాలోని ఒక పాటను ఏకంగా పది లక్షల మందితో రికార్డ్ చేసినట్టుగా తన సోషల్ మీడియా పేజ్ ద్వారా వెల్లడించారు సంతోష్. ‘నాకు ఎప్పటి నుంచో ఒక పాటు పది లక్షల గొంతులను రికార్డ్ చేయాలన్న కల ఉంది. కాలా సినిమాలోని పాటకు ఆ అవకాశం దక్కింది. అన్ని వర్గాలకు చెందిన ప్రజలతో రికార్డింగ్ చేయడం గౌరవంగా భావిస్తున్నా. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం.’ అంటూ ట్వీట్ చేశారు సంతోష్ నారాయణన్. రజనీకాంత్ డాన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నానా పటేకర్, ఈశ్వరీ రావు, హుమా ఖురేషీ, సముద్రఖనిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. I have always had this dream of recording a million voices in a song & have the perfect opportunity in a song from #kaala. It would be a great honour recording people from all walks of life. We are so excited and will update details very shortly.Peace! #kaala1million — Santhosh Narayanan (@Music_Santhosh) 29 April 2018 -
స్మార్ట్ఫోన్లే టార్గెట్‌గా...
వాషింగ్టన్ : ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా గూగుల్ ఖాతాదారులను టార్గెట్ చేస్తున్న షాకింగ్ న్యూస్ ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. హ్యాకర్లు తమ రూటు మార్చి మొబైల్ ఫోన్ల ను తమ టార్గెట్ గా ఎంచుకున్నట్టు టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించబడిన గూలిగ్యాన్ అనే హానికరమైన సాఫ్ట్ వేర్ ద్వారా పదిలక్షల (మిలియన్)కు పైగా గూగుల్ వినియోగదారుల ఖాతాలను హ్యాక్ చేసినట్టు భద్రతా పరిశోధకులు బుధవారం చెప్పారు. చెక్ పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ నివేదిక ప్రకారం గూలిగాన్ అనే మాల్వేర్ తో గూగుల్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించే ఆండ్రాయిడ్ 4.0 , 5.0 స్మార్ట్ ఫోన్ల ద్వారా హ్యాకర్లు దాడికి దిగుతున్నారు. తద్వారా లక్షలమంది వినియోగాదారుల జీమెయిల్స్ ఖాతాలు హ్యాక్ అయ్యాయని బాంబు పేల్చింది. సాధారణంగా యాప్ లు డౌన్ లోడ్ చేసుకుంటున్న సందర్భంలోనూ, లేదా ఫిషింగ్ మేసెజెస్, హానికరమైన లింక్ లు, మెసేజ్ లను క్లిక్ చేయడం ద్వారా ఈ దాడి ప్రారంభమవుతోందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2016 ఆగస్టులో ప్రవేశపెట్టిన గూలిగ్యాన్ అప్లికేషన్ ద్వారా రోజుకు 37 వేల డివైస్ లు హ్యాక్ అవుతున్నట్టు తెలిపింది. వీటిల్లో 57 శాతం స్మార్ట్ ఫోన్లు ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో, సుమారు తొమ్మిది శాతం యూరోప్ లో ఉన్నట్టు తమ పరిశోధకులు గుర్తించారని పేర్కొంది. ఇలా ఈ మెయిల్స్, ఫోటోలు సహా, డాక్యుమెంట్లు, ఇతర సెన్సిటివ్ డ్యాటాను తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతోపాటు గూగుల్ ప్లే ద్వారా కూడా వినియోగదారుల డాటాను తస్కరించే అవకాశంఉందని తెలిపింది. యాప్ లను డౌన్ లోడ్ సందర్భంగా ఖాతాదారుడు రేటింగ్ పై క్లిక్ చేసినపుడు ఎటాక్ చేస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి మొత్తం సమాచారాన్ని గూగుల్ సంస్థకి రిపోర్ట్ చేశామన్నారు. ఈ మాల్వేర్ పై విచారించి. వినియోగదారుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. అయితే ఈ తాజా హ్యాకింగ్ అలజడిపై టెక్ దిగ్గజం గూగుల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
25 లక్షల ఉద్యోగాలకు కేరళ ప్రభుత్వం హామీ...
కేరళః తమ రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా మార్చేందుకు కేరళ ప్రభుత్వం తీవ్రంగా కృష్టి చేస్తోంది. అందులో భాగంగా ఐటీ, బయోటెక్నాలజీ, టూరిజం తోపాటు వివిధ రంగాల్లో కొత్తగా 25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఐదేళ్ళలో వివిధ రంగాల్లో 25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేరళ గవర్నర్ పి. సదాశివం ఓ సందర్భంలో ప్రస్తావించారు. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం విధానాన్ని కూడ మార్చే ఉద్దేశ్యంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. కేరళ రాష్ట్ర కొత్త ప్రతిపాదనలో భాగంగా ఐటీ, బయోటెక్నాలజీ, టూరిజం రంగాల్లో మొత్తం 10 లక్షల ఉద్యోగాలు, వ్యవసాయ రంగంలో మిగతా 15 లక్షల ఉద్యోగాలు ఐదేళ్ళలోగా భర్తీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. -
దుబాయ్ లో ఆకట్టుకుంటున్న బంగారు కారు!
దుబాబ్ః బంగారు పూతతో, సుమారు పది లక్షల డాలర్ల ఖర్చుతో తయారైన ప్రత్యేక కారు ఇప్పుడు దుబాయ్ ఆటో షోలో అందర్నీ ఆకట్టుకుంటోంది. ప్రత్యేక ప్రమాణాలు, ఆధునిక సౌకర్యాలతో రూపొందిన విభిన్న డిజైన్.. కారు ప్రియులను కట్టి పడేస్తోంది. దుబాయ్ ఆటో మెకానికా 2016 ప్రదర్శనలో భాగంగా దుబాయ్ లో కొనసాగున్న ఆటో షోలో బంగారు ప్లేటెడ్ కారు అందర్నీ అమితంగా ఆకర్షిస్తోంది. నిస్సాన్ ఆర్35 జిటి-ఆర్ కారును ట్యూనర్లు, స్పోర్ట్స్ కార్లు తయారీదారులైన కెయు హెచ్ ఎల్ రేసింగ్... గాడ్జిల్లా పేరున ఆటో షోలో ప్రదర్శనకు ఉంచారు. ఆర్టిస్, కేయుహెచ్ ఎల్ రేసింగ్ సంయుక్తంగా మాస్టర్ నిపుణుడు తకైకో ఇజావా సహకారంతో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా రూపొందించి, ఆటోమెకానికా లో ప్రదర్శించారు. ప్రత్యేక బంగారు రంగు, 3.8 లీటర్ల వి6 ట్విన్ టర్బో, 545 హెచ్ పీ ఇంజిన్లకు తోడు అదనపు హార్స్ పవర్ తో... ఆ కొత్తకారు ఆటో షో సందర్శకులకు కనువిందు చేస్తోంది. రీ ఇన్ఫోర్డ్స్ బాడీ, ఏరో డైనమిక్ లక్షణాలు కలిగిన బంగారు కారు... కచ్చితమైన హ్యాండ్లింగ్ వ్యవస్థను కూడ కలిగి ఉంది. ఈకారులో ఉండే ఆధునిక ఇంజన్... 6 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ తో ఉండటమే కాక, కారును నడిపే డ్రైవర్.. రేసు కారు వేగాన్ని ఎంపిక చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. ప్రత్యేక ట్రాన్స్ ఎక్సిల్ లక్షణాలతో సరి బేసి గేర్లు కలిగి, అత్యంత త్వరగా గేర్లు మార్చుకునేందుకు వీలుగా ఉంటుంది. జీటీఆర్ మోటార్ పోటీల్లో ఉపయోగించేందుకు కావలసిన ప్రమాణాలతో, 20 స్పోక్ వీల్స్ తో ఈ కొత్త బంగారు కారు... మార్కెట్లో తన స్థానాన్ని కాపాడుకుంటుందని తయారీదారులు ఆశిస్తున్నారు. -
ఎన్ఏబీ అధికారుల వలలో అవినీతి చేప!
నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో అధికారుల వలలో ఓ పాకిస్తానీ అవినీతి చేప చిక్కింది. కోట్లకొద్దీ అవినీతి సొమ్మును కూడబెట్టిన బలూచిస్తాన్ లోని ఆర్థిక శాఖ కార్యదర్శిని.. అరెస్టు చేసిన అధికారులు ఆయన ఇంట్లోని 730 మిలియన్ల విలువైన అంటే.. సుమారు 46 కోట్ల రూపాయల విలువైన బంగారం, డబ్బుతోపాటు అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ అభివృద్ధి నిధులనుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేశాడన్న ఆరోపణలతో ఆర్థిక శాఖ కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ రైజాని ఇంటిపై దాడులు నిర్వహించిన ఎన్ఏబీ అధికారులు భారీగా ఆస్తులను, డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అధికారుల వలలో చిక్కిన అవినీతి తిమింగలం ముస్తాక్ అహ్మద్ రైజానీ ఇంటినుంచీ స్థానిక మరియు విదేశీ కరెన్సీతోపాటు బంగారం నింపిన సంచులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఏబీ అధికారులు వెల్లడించారు. ముస్తాక్ ఇంట్లోని అన్ని గదుల్లోనూ జల్లెడ పట్టామని, తదుపరి దర్యాప్తుకోసం ఫైనాన్స్ శాఖ.. రికార్డులు కూడ స్వాధీనం చేసుకుట్లు తెలిపారు. బలూచిస్తాన్ లో ఓ ప్రభుత్వాధికారిగా పనిచేస్తున్న రైజాని గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. పిపిపి ప్రభుత్వ పాలనా కాలంనుంచీ కూడ ఆయన అదే పదవిలో కొనసాగుతున్నారు. దాడుల అనంతరం రైజానీ ఇంట్లో భారీ మొత్తంలో అవినీతి సొమ్ము చిక్కిన నేపథ్యంలో బలూచిస్తాన్ ప్రభుత్వం రైజానీని సస్పెండ్ చేస్తున్నట్లుగా అర్థరాత్రి ప్రకటించింది. అంతేకాక ఓ బాధ్యతగల ప్రభుత్వాధికారిగా ఆయన ఎన్ ఏ బీ విచారణకు పూర్తిగా సహకరించాలని కూడ సూచించింది. రైజానీ అరెస్టు నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారు మిర్ ఖలిద్ తన పదవికి రాజీనామా చేశారు. తమ శాఖలో ఓ వ్యక్తి అవినీతికి పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటున్నందుకు గాను.. తాను స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేసినట్లు మిర్ ఖలిద్ తెలిపారు. సింథ్ ప్రాంతంలో అరెస్టుల తర్వాత, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పాలక ప్రభుత్వంలోని ఆర్థిక శాఖలో అభివృద్ధి నిధులనుంచి కోట్లాది రూపాయల విలువచేసే సొమ్మును దోచుకొన్న అధిక ప్రొఫైల్ అధికారిని అరెస్టు చేయడం ఇదే మొదటిసారి. -
పట్టించుకోకుంటే పని కోల్పోయినట్లే!
మానసిక అనారోగ్యంతో కొన్ని వేల సంవత్సరాల పని శక్తిని కోల్పోతాం అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. ప్రతి సంవత్సరం పెరుగుతున్న మానసిక అనారోగ్యం వల్ల వచ్చే 2030 సంవత్సరం నాటికి సుమారు 12 బిలియన్ల పనిరోజులు లేదా 50 మిలియన్ సంవత్సరాల పని వృధా అయిపోతుందని డబ్ల్యూహెచ్ ఓ తాజా నివేదిక ప్రకారం తెలుస్తోంది. మానసిక ఒత్తిడి, ఆత్రుత వంటి లక్షణాలకు చికిత్స అందించడంలో వైఫల్యం చెందితే సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక ఉత్పాదకతలో 925 బిలియన్ డాలర్ల ఖరీదైన నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని వరల్డ్ హెల్గ్ ఆర్గనైజేషన్ కొత్త అధ్యయనాల ప్రకారం తెలుస్తోంది. సాధారణ మానసిక అనారోగ్య చికిత్సకోసం పెట్టుబడి, ఆరోగ్య ఆర్థిక ప్రయోజనాలు పై ప్రపంచంలోనే మొదటిసారి విశ్లేషణ జరిపిన సంస్థ తన పరిశోధనా వివరాలను ల్యాన్సెట్ సైకియాట్రీ లో ప్రచురించింది. మానసిక ఒత్తిడి అనారోగ్యాల చికిత్సకు వెచ్చించే ఒక డాలర్... ఆరోగ్యంతోపాటు తిరిగి 4 డాలర్ల ఖరీదైన ఉత్పాదకతను పెంచే అవకాశం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. మానసిక ఒత్తిడి, అనారోగ్యాలకు చికిత్స అందించడం పై దృష్టి పెట్టకపోవడం, ఓ మానవ తప్పిదంగానూ, పిసినారితనంగానూ కనిపిస్తోందని, అన్ని దేశాలు మానసిక ఆరోగ్య సేవలపై పెట్టుబడికి అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు సిఫార్సు చేయాలని, ప్రస్తుత ప్రభుత్వాలు తమ ఆరోగ్య బడ్జెట్ లో కేవలం సగటున మూడు శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నాయని నివేదిక ద్వారా వెల్లడైంది. వచ్చే 15 సంవత్సరాల్లో కౌన్సెలింగ్, యాంటీ డిప్రెషన్ మందులకోసం 147 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తే... 399 బిలియన్ డాలర్ల ఖరీదైన కార్మిక శక్తి పెరుగుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. ప్రపంచ జనాభాలో దాదాపు పదిశాతం మంది అంటే సుమారు 740 మిలియన్లమంది ఇప్పుడు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని, అందులోనూ సాధారణ మానసిక అనారోగ్యం క్రమంగా పెరుగుతోందని తాజా అధ్యయనాల్లో తేలింది. 1990 నుంచి 2013 మధ్య కాలంలో ప్రజల్లో మానసిక ఆందోళన, వ్యాకులత దాదాపు సగం పెరిగింది. అత్యవసర పరిస్థితులు, యుద్ధాలు వల్ల వ్యక్తుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు వెల్లువెత్తుతున్నాయని, 20 శాతం ప్రజలు అటువంటి సంఘటనలవల్లే ఒత్తిడికి గురౌతున్నారని డబ్ల్యూ హెచ్ ఓ అంచనా వేసింది. ఇది ఓ ప్రజారోగ్య సమస్య కాదని, అభివృద్ధి సమస్యగా గుర్తించాలని, నిరాశ, ఆత్రుత వంటి వాటికి చికిత్సను అందిస్తే... అది ఆర్థిక అభివృద్ధికి మంచి అర్థాన్ని తెస్తుందని తమ పరిశోధనల్లో తేలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మార్గరెట్ చాన్ తెలిపారు. ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
నదులను కాలుష్యం చేసిన కంపెనీలకు జరిమానా
నదులను కలుషితం చేస్తున్న పరిశ్రమలకు తూర్పు చైనా కోర్టు భారీ జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా నదుల్లో సుమారు 26,000 టన్నుల ప్రమాదకర వ్యర్థాలను పారేసినందుకు మూడు రసాయన పరిశ్రమలకు దాదాపు 12 మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. చైనా డౌ జియండే సిటీ రెండో కెమికల్ ప్లాంట్, హాంగాన్ కార్గో సంస్థ, రోంగ్ షెంగ్ కెమికల్ కంపెనీలపై లోయర్ డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పును పరిశీలించిన జెజియాంగ్ ప్రావిన్స్ హాంగ్జూ ఇంటర్ మీడియట్ న్యాయస్థానం తాజా నిర్ణయం తీసుకుంది. డౌజియండే నగరంలోని రెండో కెమికల్ ప్లాంట్ ప్రధానంగా కిల్లర్ గ్లైఫోసేట్ను ఉత్పత్తి చేస్తుంది. 2012-2013 మొదలుకొని ఇది జైజియాంగ్ ప్రావిన్స్ రాజధాని హ్యాంగ్జూ... ప్రొవిన్షియల్ క్జుహౌ నగరాలతోపాటు జియాంగ్జి, శాందొంగ్ లోని నదుల్లో వ్యర్థాలు పోసేందుకు హాంగాన్ కార్గో కంపెనీ, రాంగ్ షెంగ్ కెమికల్ కంపెనీల సహాయం తీసుకుంది. అయితే ఆయా కంపెనీలు ప్రమాదకర వ్యర్థాలను పారేసేందుకు లైసెన్స్ ను పొందాయి. కాగా వ్యర్థాలతో పాడైన నదులను శుభ్రపరిచేందుకు, రిపేర్లు చేసేందుకు సుమారు 12.3 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని జైజియాంగ్ పర్యావరణ రక్షణ పరిశోధన సంస్థ అంచనా వేయడంతో కోర్టు తాజా నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా అధికంగా వ్యర్థాలను నింపేసిన మూడు కంపెనీల యాజమాన్యాలతో కలపి మొత్తం పదిమందికి తొమ్మిదేళ్ళనుంచి ఒక సంవత్సరం పది నెలల వరకూ జైలు శిక్షతో పాటు, 8.5 మిలియన్ యువాన్ల జరిమానా వేసినట్లు ప్రభుత్వ రంగ జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. -
విశాల్ సిక్కా వేతనం 75 కోట్లు
భారత ఐటీ రంగంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారి సరసన ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా నిలిచారు. ఏడాదికి 11 మిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ. 75 కోట్ల జీతాన్నిసిక్కా అందుకుంటున్నారు. గత కొన్నాళ్లుగా త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో ఇన్ఫోసిస్ దూసుకుపోతోంది. దీంతో మొదట్లో సుమారు రూ. 54 కోట్లు ( 7.8 మిలియన్ డాలర్లు) ఉండే సిక్కా పారితోషికం ఒక్కసారిగా పెరిగిపోయింది. సిక్కాకు సంవత్సరానికి 11 మిలియన్ డాలర్లు (సుమారు 75 కోట్లు) ప్యాకేజ్ ఉండగా... అందులో ఓ మిలియన్ డాలర్ బేసిక్ శాలరీ, 3 మిలియన్ డాలర్ల వేరియబుల్ పే, 2 మిలియన్ డాలర్ల స్టాక్ ఆప్షన్లు, మరో 5 మిలియన్ డాలర్లు స్టాక్ ఆప్షన్స్ కలిపి మొత్తం 11 మిలియన్ డాలర్ల వేతనాన్ని సిక్కా పొందుతున్నారు. దీంతో ఐటీ దిగ్గజాల్లోని కాగ్నిజెంట్ సీఈవో ఫ్రాన్సిస్కో డిసౌజా 2014-15 ప్యాకేజ్ (11.3 మిలియన్ డాలర్లు) కు దగ్గరగా చేరుకుంది. 2013-14 లో టీసీఎస్ సీఈవో ఎన్ చంద్రశేఖరన్ ప్యాకేజ్ 3.15 మిలియన్ డాలర్లు, అదే సంవత్సరం షేర్లు మినహా మాజీ విప్రో చీఫ్ టి.కె. కురియన్ ప్యాకేజీ 1.5 మిలియన్ డాలర్లు ఉన్నట్లు తాజా లెక్కల ప్రకారం తెలుస్తోంది. -
ఆనందం ఆయుష్షునివ్వదు!
నవ్వడం భోగం నవ్వలేకపోవడం రోగం.. ఇంకా చెప్పాలంటే సంతోషం సగం బలం. ఇలా ఆనందంగా, హాయిగా ఉంటే అనారోగ్యం దరిచేరదని చాలామంది భావిస్తారు. ఆనందం ఆరోగ్యంపై అద్భుత ప్రభావం చూపుతుందని, మానసికోల్లాసాన్ని కలిగించి, మనసుకు ప్రశాంతతనిస్తుందని నమ్మేవారంతా ఏకంగా నవ్వుల దినోత్సవాలను జరపడమేకాక, లాఫింగ్ క్లబ్బుల వంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే అవన్నీ వట్టి నమ్మకాలేనంటున్నారు లండన్ అధ్యయనకారులు. అనారోగ్యం, ప్రాణభయం వంటివి అసంతృప్తిని కలిగించి ఆయుక్షీణం కలిగిస్తాయేమో కానీ, ఆనందం వల్ల ఆరోగ్యం చేకూరే అవకాశం లేదంటున్నారు. లండన్‌లో నిర్వహించిన మిలియన్ ఉమెన్ స్టడీలో మహిళలను పరిశోధకుల బృదం.. ఒత్తిడి, సంతోషం, అసంతృప్తి, నియంత్రణ, విశ్రాంతి వంటి వాటి ప్రభావం ఆరోగ్యంపై ఎలా ఉంటుందో తెలుపాలని ఓ ప్రశ్నావళిని అందించారు. సమాధానం ఇచ్చినవారిలో ఆరుగురిలో ఐదుగురు సాధారణంగా సంతోషానికే తమ ఓటేశారు. దీన్నిబట్టి చూస్తే అసంతృప్తితో ఉన్నవారిలో ధూమపానం, బద్ధకం, భాగస్వామితో సరిగా లేకపోవడం వంటి అలవాట్లు ఉండాలని, వారంతా సంతోషంగా, ఆరోగ్యంగానే ఉన్నారని అధ్యయనకారులు చెప్తున్నారు. మరోవైపు అప్పటికే అనారోగ్యంతో ఉన్న మహిళలు మాత్రం విచారంగానూ, ఒత్తిడితోనూ, నియంత్రణాశక్తిని కోల్పోయి, విశ్రాంతి లేకుండా ఉన్నట్లు ఇలా పలు భావాలను ప్రకటించినట్లు అధ్యయనంలో తేలింది. పది సంవత్సరాల కాలంలో మొత్తం ఏడు లక్షలమంది మహిళలను పరిశీలించగా సగటున 59 సంవత్సరాల వయసు పైబడినవారు సుమారుగా 30 వేలమంది మరణించినట్లుగా అధ్యయనాల ద్వారా వెల్లడైంది. అలాగే వారి జీవన శైలి, అలవాట్ల ఆధారంగా చూసినపుడు మరణాల సంఖ్య సంతోషంగా ఉన్నవారికి, విచారంగా ఉన్నవారికీ మధ్య పెద్దగా తేడా లేనట్లు తేలింది. అందుకే ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ రచయిత డాక్టర్ బెట్టె లియు.. అనారోగ్యం వల్ల అసంతృప్తి చోటుచేసుకుంటుందే తప్ప... అసంతృప్తి వల్ల అనారోగ్యం దరిచేరదంటున్నారు. అసంతృప్తి, ఒత్తిడి వంటివి మృత్యువుపై ప్రత్యక్ష ప్రభావం చూపినట్లు ఎక్కడా నిరూపితం కాలేదని ఆయన అంటున్నారు. -
ఫోర్డ్ చెన్నై ప్లాంట్ నుంచి పది లక్షల కార్లు
న్యూఢిల్లీ: ఫోర్డ్ ఇండియా కంపెనీ చెన్నై ప్లాంట్ నుంచి పదిలక్షలవ కారును, ఇంజిన్‌ను ఉత్పత్తి చేసింది. ఈ పదిలక్షలవ కారుగా ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ను తయారు చేశామని ఫోర్డ్ ఇండియా ఈడీ(మాన్యుఫాక్చరింగ్ ఫోర్డ్ చెన్నై వెహికల్ అసెంబ్లీ, ఇంజిన్ ప్లాంట్) బాలసుందరం రాధాకృష్ణన్ చెప్పారు. ఈ చెన్నై ప్లాంట్ తమకు అంతర్జాతీయ తయారీ కేంద్రంగా కూడా ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. ఈ చెన్నై ప్లాంట్‌లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్, ఫోర్డ్ ఫియస్టా, ఫోర్డ్ ఎండీవర్ వంటి కార్లను ఫోర్డ్ ఇండియా తయారు చేస్తోంది. -
కొనసాగుతున్న ఉత్పత్తి లోటు
మిగిలింది 75 రోజులే లక్ష్యం 18 మిలియన్ టన్నులు ఇప్పటివరకు 37 మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉత్పత్తి వేగం పెంచేందుకు అధికారుల కసరత్తులు కొత్తగూడెం : సింగరేణి సంస్థ నిర్ధేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో లోటు కొనసాగుతోం ది. ప్రతి ఏటా వర్షాకాలంలో ఓసీల్లో ఉత్పత్తికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడేది. ఈ ఏడాది అ లాంటి ఇబ్బందులు పెద్దగా లేకున్నా ఉత్పత్తి మందగించింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి రెండున్నర నెలలు మాత్రమే ఉంది. దీంతో ఉత్పత్తి వేగం పెంచడానికి యాజమా న్యం అవసరమైన చర్యలు చేపట్టింది. ఫలితం గా కార్మికులపై పనిభారం పెరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. సింగరేణి సంస్థ 2014-15 ఆర్థిక సంవత్సరానికి 55 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్ధేశించుకుం ది. కంపెనీ వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఉన్న 15 ఓపెన్‌కాస్టు, 34 భూగర్భ గనుల ద్వారా గడిచి న తొమ్మిదిన్నర నెలల కాలంలో 41 మిలియన్ ట న్నులకు 37 మిలియన్ టన్నుల ఉత్పత్తి నమోదైంది. మరో రెండున్నర నెలల కాలంలో సుమారు 18 మిలియన్ టన్నులు సాధించాల్సి ఉంది. ఈ ఏడాది జనవరి 13 నాటికి 4,17, 21,644 టన్నుల ఉత్పత్తి చేపట్టాల్సి ఉండగా 3,73,40,418 టన్నుల(89 శాతం) ఉత్పాదక త నమోదైంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఉత్పత్తి కొంచెం ఎక్కువగానే ఉన్నప్పటికీ 2012-13 ఏడాదితో పోల్చుకుంటే మాత్రం 2 మిలియన్ టన్నులు వెనుకంజలో ఉంది. వెనుకబడిన ఓపెన్‌కాస్టులు ప్రతి ఏటా ఓపెన్‌కాస్టుల్లో నూరు శాతానికి పైగా చేసిన ఉత్పత్తితో భూగర్భగనుల లోటు భర్తీ అయ్యేది. భూగర్భగనుల ద్వారా ఇప్పటివరకు 1,13,30,949 టన్నులకు 76,09,400 టన్నులు, ఓపెన్‌కాస్టు గనుల్లో 3,03,90,695 టన్నులకు 2,97,31,003 టన్నుల ఉత్పత్తి జరి గింది. మొత్తం 11 ఏరియాల్లో 4 ఏరియాలు మాత్రమే నూరుశాతం ఉత్పత్తి సాధించాయి. కొత్తగూడెం ఏరియా 126 శాతంతో ప్రథమ స్థానంలో, అడ్రియాల ప్రాజెక్టు ఏరియా చివరి స్థానంలో, మందమర్రి ఏరియా 65 శాతంతో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. -
9999 ఈ నంబరు చాలా రేటు
రూ. ఆరు లక్షలు పలికిన సంఖ్య సొంతం చేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇదే రికార్డు స్థాయి ధర సాక్షి, విజయవాడ : రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్లు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. వీటికోసం ఔత్సాహికులు పోటీపడుతూ భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నారు. కొందరైతే లక్షలు గుమ్మరించడానికి కూడా వెనకాడడం లేదు. వాహనదారుల నమ్మకమో లేక ఫ్యాన్సీ నంబర్లు వాడడం సోషల్ స్టేటస్‌గా భావిస్తున్నారో ఏమోగానీ పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. రవాణా శాఖ కార్యాలయంలో నెలకు సగటున 200 ఫ్యాన్సీ నంబర్లకు బహిరంగ వేలం జరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. ఏటా ఫ్యాన్సీ నంబర్ల విక్రయం ద్వారా కోట్ల రూపాయల్లో ఆదాయం సమకూరుతుంది. ముఖ్యంగా జిల్లాలో 9999 నంబర్ చాలా క్రేజీగా మారింది. దీన్ని దక్కించుకోవడానికి వాహనదారులు ఎంత ధర చెల్లించడానికైనా వెనుకాడడం లేదు. గత వారంలో ఏపీ-16 సిరీస్‌లో 9999 నంబర్‌ను నగరానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వేలంలో ఆరు లక్షల ఒక్క రూపాయికి దక్కించుకున్నారు. ఇప్పటివరకు ఇదే అత్యధిక ధరకు కొనుగోలు చేసిన నంబరు కావడం విశేషం. గతంలో లభించిన ధర రూ 4.5 లక్షలు. ఇదే నంబరు కోసం పోటిపడిన పలువురు వాహనదారులు రూ.5 లక్షల వరకు వేలంలో పాల్గొన్నారు. ఏటా ఫ్యాన్సీ నంబర్ల ద్వారా సుమారు రూ. 2 కోట్ల ఆదాయం రవాణా శాఖకు సమకూరుతుంది. నంబర్ల కేటగిరీని బట్టి వెయ్యి నుంచి యాభై వేల వరకు ధర నిర్ణయించి ఆన్లైన్లో ఉంచుతారు. ఇదిలా ఉంటే.. జిల్లాలో వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. విజయవాడ రాజధాని అయిన తరువాత వాహన కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు అత్యధికంగా జరిగాయి. గడిచిన మూడు నెలల్లో నాలుగు వేలకు పైగా వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ క్రమంలో ఖరీదైన ద్విచక్ర వాహనాలు, కార్లతోపాటు సాధారణ వాహనాలకు కూడా వేలకు వేలు చెల్లించి ఫ్యాన్సీ నంబర్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో కార్ల యజమానులు అధికంగా రూ. 50 వేల కేటగిరీలో ఉన్న 9999, 5555, 7777 లాంటి నంబర్ల కొనుగోలుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అలాగే రూ. 10 వేల కేటగిరీలో ఉన్న 3, 111, 6336 లాంటి నంబర్లు అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు కొనుగోలు చేస్తున్నారు. విజయవాడ రాజధాని అయిన క్రమంలో భూముల ధరలు కోట్లకు చేరాయి. దీంతో రియల్టర్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆదాయం బాగా వస్తుండడంతో ఎంత ఖరీదైనా వెనుకాడకుండా ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకుంటున్నారు. 9999 నంబర్ కోసం ప్రతి పర్యాయం 10 నుంచి 15 మంది పోటీపడుతుంటారు. అంతా ఆన్లైన్లోనే.. నంబర్ల రిజిస్ట్రేషన్ల ప్రకియ అంతా ఆన్లైన్లోనే సాగుతుంది. నిత్యం ప్రతి జిల్లాకు 1000 నంబర్లు కేటాయిస్తారు. వాటిలో ఫ్యాన్సీ నంబర్లను రిజర్వ్ చేస్తారు. ఫ్యాన్సీ నంబర్ కోసం అయితే ఉదయం ముందుగా రిజిస్ట్రేషన్ కోసం నిర్దేశించిన ఫీజును చెల్లించి ఆ తర్వాత వేలంలో పాల్గొనడానికి సదరు కేటగిరీ ధరను ముందుగా చెల్లించి మధ్నాహ్నం ఒంటిగంట నుంచి 3 గంటల వరకు టెండర్ స్వీకరణ సమయంలో ధరను కోడ్ చేసి టెండర్ దాఖలు చేయాలి. అత్యధిక ధర కోడ్ చేసిన వ్యక్తికి నంబర్‌ను కేటాయించి మిగిలిన వారికి ముందుగా చెల్లించిన నగదును తిరిగి ఇచ్చేస్తారు. ప్రస్తుతం ఏపీ 16 సీడబ్ల్యూ సిరీస్ నడుస్తోంది. రూ .30 వేల కేటగిరిలో 99, 333, 555, 666, 777, 888, 2222, 3333, 4444, 5555, 6666, 7777, 8888 లాంటి నంబర్లు ఉన్నాయి. అలాగే రూ. 20 వేల కేటగిరీలో 123, 222, 369, 444, 567,786 లాంటి నంబర్లు ఉన్నాయి. -
అందరికీ స్కిల్ డెవలప్మెంట్..
గెస్ట్ కాలమ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్.. విద్యార్థులు, ఉద్యోగార్థులకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ అందించేందుకు ఏర్పాటైన సంస్థ. 2022 నాటికి 150 మిలియన్ల మందికి స్కిల్ డెవలప్మెంట్ లక్ష్యంగా నిర్దేశించుకున్న ఎన్ఎస్డీసీ.. ఆ దిశగా శరవేగంగా కదులుతోందంటున్నారు.. సంస్థ మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓ దిలీప్ చెనాయ్. కేవలం శిక్షణకే పరిమితం కాకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించేందుకు కూడా కృషి చేస్తున్నామని చెబుతున్న దిలీప్ చెనాయ్‌తో ఇంటర్వ్యూ.. అన్ని రంగాలు, విభాగాల్లో స్కిల్ గ్యాప్ వాస్తవానికి మనం స్కిల్ గ్యాప్ అంటే ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ కోర్సుల పట్టభద్రుల కోణంలోనే ఎక్కువగా ఆలోచిస్తున్నాం. కానీ కింది స్థాయిలో ఐటీఐ, డిప్లొమా కోర్సులు అర్హతగా విధులు నిర్వర్తించేవారు కూడా స్కిల్ గ్యాప్ సమస్యతో బాధపడుతున్నారు. ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పొందుతున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు 24 శాతం ఉంటే.. సాధారణ బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణుల్లో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పొందుతున్న విద్యార్థుల శాతం 8. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే అన్ని స్థాయిల్లో, అన్ని కోర్సులకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రధానాంశంగా గుర్తించాలి. పరిశ్రమ వర్గాలతో కలిసి స్కిల్ డెవలప్మెంట్ కోసం పరిశ్రమ వర్గాలతో కలిసి పని చేస్తున్నాం. ఆయా రంగాలకు సంబంధించి వేర్వేరు శిక్షణ సదుపాయాలు అందించే విధంగా సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్‌ను ఏర్పాటు చేశాం. మొత్తం 139 సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్‌కు ఆమోదం లభించగా ఇప్పటివరకు31 సర్వీస్ సెక్టార్ స్కిల్స్ కార్యరూపం దాల్చాయి. శిక్షణ.. సర్టిఫికేషన్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్‌లో ఆయా రంగాలకు చెందిన సంస్థలు, పరిశ్రమలను భాగస్వాములను చేశాం. ఉదాహరణకు ఐటీ రంగానికి సంబంధించి నాస్కామ్, అదే విధంగా రిటైల్ రంగానికి సంబంధించి రిటైల్ అసోసియేషన్లతో ఒప్పందాలు చేసుకున్నాం. దీని ద్వారా వారికి అవసరమైన స్కిల్స్‌ను గుర్తించి వాటిని పొందే విధంగా విద్యార్థులకు నిర్ణీత కాల వ్యవధిలో శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు కూడా అందిస్తున్నాం. దీంతో విద్యార్థులు ఉద్యోగ సాధనలో ఇతరులకంటే ముందుంటున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో పది లక్షల మంది ఎన్ఎస్డీసీ ద్వారా శిక్షణ పొందితే వారిలో 63 శాతం మందికి ఉద్యోగాలు లభించాయి. ఆర్థిక ఒడిదుడుకులు, ఇతర కారణాల వల్ల అందరికీ ఉపాధి లభించకపోయినా.. వారంతా జాబ్ రెడీ స్కిల్స్ సొంతం చేసుకున్నారు. 2014-15 సంవత్సరంలో 33 లక్షల మందిని లక్ష్యంగా పెట్టుకున్నాం. 70 శాతం లక్ష్యాన్ని చేరుకుంటామని భావిస్తున్నాం. అవకాశాలకు కొదవ లేదు దేశంలో ఉద్యోగ అవకాశాలకు కొదవ లేదు. ఎంఎస్ఎంఈ (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రెజైస్) రంగాన్నే పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం దేశంలో 44 మిలియన్ల చిన్న, మధ్య తరహా సంస్థలున్నాయి. ఒక్కో సంస్థ 12 మంది చొప్పున నియమించుకున్నా.. 2022 నాటికి లక్ష్యంగా నిర్దేశించుకున్న 150 మిలియన్ల మంది కంటే ఎన్నో ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. ఎంఎస్ఎంఈలను ప్రత్యేకించి ప్రస్తావించడానికి కారణం.. వీటన్నింటికీ నిపుణులైన మానవ వనరులు లభించకపోవడమే. ఆసక్తి ఉంటే.. వేదిక స్టార్ పథకం స్కిల్ డెవలప్మెంట్ దిశగా ఔత్సాహిక విద్యార్థులు, ఉద్యోగులు నేరుగా ఎన్ఎస్డీసీ శిక్షణ పొందొచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా స్టార్ అనే పథకానికి రూపకల్పన చేశాం. ఔత్సాహికులు స్టార్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి తమకు ఆసక్తి, అభిరుచి, అర్హతల ఆధారంగా తమకు సరితూగే రంగాన్ని ఎంపిక చేసుకుంటే సంబంధిత సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్‌లో శిక్షణనందిస్తాం. శిక్షణ పొందినవారికి ఆర్థిక ప్రోత్సాహకాలూ ఉంటాయి. అకడమిక్ స్థాయి నుంచే మార్పుతో దేశ జనాభాలో అధిక శాతం యువతే. వీరంతా వేర్వేరు కోర్సులు అభ్యసిస్తున్నారు. కానీ సమస్య అంతా వృత్తి నైపుణ్యాలు సొంతం చేసుకోవడంలోనే ఉంది. ఆర్ట్స్ నుంచి ఆటోమొబైల్స్ వరకు అన్ని కోర్సులకు క్షేత్ర స్థాయిలో వృత్తి నైపుణ్యాలు ఎంతో అవసరమవుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైస్కూల్, ఇంటర్మీడియెట్ స్థాయిలోనే అకడమిక్స్‌తోపాటు ఒకేషనల్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ మేరకు సిలబస్‌లో మార్పులు చేయాలి. కోర్సులు, కాలేజీలు ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయి నైపుణ్యాలు అందించే క్రమంలో ప్రభుత్వ పరిధిలో పలు వృత్తి విద్యా కళాశాలలు ఏర్పాటయ్యాయి. కానీ వాటిలో అధ్యాపకుల కొరత ప్రధాన సమస్యగా మారింది. దీంతో ఇంటర్మీడియెట్ స్థాయిలోని ఒకేషనల్ కోర్సులు, ఐటీఐలలో లభించే కోర్సుల పట్ల ఆదరణ తగ్గుతోంది. చివరకు పాలిటెక్నిక్స్లోనూ ఇదే సమస్య. వీటికి పరిష్కారంగా నేషనల్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేంవర్క్ వంటి కొన్ని పథకాలకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. వీటిని సమర్థంగా ఆచరణలో పెడితే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కోర్సు ఏదైనా.. ఇవి తప్పనిసరి నేటి పోటీ ప్రపంచంలో భవిష్యత్తుకు మార్గం వేసేవి క్షేత్ర నైపుణ్యాలే. ఏ కోర్సు ఎంచుకున్నా.. ఏ కెరీర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నా.. ప్రాక్టికల్ స్కిల్స్‌ను అకడమిక్ స్థాయి నుంచే అలవర్చుకోవాలి. ఉదాహరణకు బీకాం విద్యార్థులు అకౌంటింగ్‌కు సంబంధించి అందుబాటులోకి వచ్చిన ఈఆర్పీ సొల్యూషన్స్ గురించి, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్‌లో కెరీర్ కోరుకునే విద్యార్థులు కంప్యూటర్ ఆపరేటింగ్, ఆఫీస్ టూల్స్ వంటి టెక్నికల్ అంశాల్లో రాణించే దిశగా కృషి చేయాలి. అప్పుడు ఏ కోర్సయినా కెరీర్ విషయంలో ఆందోళన చెందక్కర్లేదు.