దర్శకధీరుడు తెరకెక్కించిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని నాటునాటు సాంగ్‌కు సైతం ఆస్కార్ అవార్డ్ కూడా దక్కింది. అయితే తాజాగా ఈ మూవీ రికార్డ్ బద్దలైంది. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ ఇప్పటి వరకు 2 5మిలియన్ అవర్స్‌తో తొలిస్థానంలో ఉండగా ఆ రికార్డ్ తుడిచిపెట్టుకుపోయింది.
ఇటీవల రిలీజైన హైజాకింగ్ థ్రిలింగ్ డ్రామా ‘చోర్ నికల్ కే భాగా’ ఆర్ఆర్ఆర్‌ను అధిగమించింది. యామీ గౌతమ్, సన్నీ కౌశల్, శరద్ ఖేల్కర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ 29 మిలియన్ల అవర్స్ వీక్షించనట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. విడుదలైన రెండు వారాల్లోనే అత్యధికమంది వీక్షించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. కాగా.. మూడో స్థానంలో 22 మిలియన్ అవర్స్‌తో అలియాభట్ ప్రధానపాత్రలో నటించిన గంగూబాయి కతియావాడి నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment