ప్రస్తుతం సినీ ప్రేక్షకులు థియేటర్ల కంటే ఓటీటీలపైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. రిలీజ్ చిత్రాలు సైతం నెల రోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమవుతుండగా.. సినీ ప్రియులు ఎంచక్కా ఇంట్లోనే చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. తాజాగా మడాక్ ఫిల్మ్స్ సంస్థ ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన ఇండియన్ సినిమాల జాబితాను పోస్ట్ చేసింది. అందులో హాలీవుడ్ కాకుండా.. అత్యధిక గంటలు వ్యూస్ సాధించిన ఇండియన్ సినిమాలు ఉన్నాయి.
(ఇది చదవండి: రాహుల్ గాంధీపై మనసు పారేసుకున్న బోల్డ్ బ్యూటీ!)
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల జాబితాను ప్రకటించింది. మడాక్ ఫిల్మ్స్ రిలీజ్ చేసిన లిస్ట్‌లో ఆర్ఆర్ఆర్(హిందీ) తొలిస్థానంలో ఉండగా.. మిమి చిత్రం పదో స్థానంలో నిలిచింది. రెండు స్థానంలో ఆలియాభట్ మూవీ గంగుభాయ్ కతియావాడి, మూడోస్థానంలో 'చోర్ నికల్ కే భాగా' నిలిచాయి. ఆ తర్వాత స్థానాల్లో డార్లింగ్స్, మిన్నల్ మురళి, హసీన్ దిల్‌రుబా, సూర్యవంశి, మిషన్ మజ్ను, భూల్ భూలయ్యా-2 చిత్రాలు ఉన్నాయి. హిందీలోనూ రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ మొదటిస్థానంలో నిలవడం టాలీవుడ్ సినిమాకే గర్వకారణం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియాభట్ నటించిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' వివాదం.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బొమ్మన్ !)
Comments
Please login to add a commentAdd a comment