Netflix Released List Of Top 10 Most Watched Movies And Web Series In May 1st Week, Deets Inside - Sakshi
Sakshi News home page

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించిన టాప్‌ 10 మోస్ట్‌ వాచ్‌డ్‌ సినిమాలు, సిరీస్‌లు..

Published Sat, May 7 2022 4:23 PM | Last Updated on Sat, May 7 2022 7:16 PM

Netflix Top 10 Most Watched Movies Web Series May 1st Week - Sakshi

Netflix Top 10 Most Watched Movies Web Series May 1st Week: కరోనా  మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ అమలు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో థియేటర్లు మూతపడ్డాయి. వీటికి ప్రత్యామ్నాయంగా మారాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు. థియేటర్లకు అల్టర్‌నేట్‌గా మాత్రమే కాకుండా విభిన్నమైన కథాంశాలతో ఉన్న చిత్రాలను, వెబ్‌ సిరీస్‌లు చూడాలనుకునే సినీ ప్రియులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. అలాగే ఈ ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌లతో సినిమాలు, సిరీస్‌లను రూపొందిస్తున్నాయి. 

ఇలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యేకంగా చెప్పుకోదగినది నెట్‌ఫ్లిక్స్‌. ఎ‍ప్పుడూ సరికొత్త హంగులతో ప్రేక్షకులను బోర్ కొట్టించకుండా కొత్తదనంతో ఆకట్టుకునేందుకు ముందుంటుంది ఈ దిగ్గజ సంస్థ. అయితే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం టాప్‌ 10లో స్ట్రీమింగ్‌ అవుతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల లిస్ట్‌ను ట్విటర్‌ ద్వారా షేర్‌ చేసింది. ఇందులో అలియా భట్‌ 'గంగూబాయి కతియావాడి' మూవీ నుంచి రణ్‌వీర్‌ సింగ్‌ '83' వరకు పలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు, సిరీస్‌లు ఉన్నాయి. ఈ జాబితాలో చాలా కాలం తర్వాత తెలుగులో తాప్సీ నటించిన మిషన్‌ ఇంపాజిబుల్‌ కూడా ఉండటం విశేషం. మరీ ఈ లిస్ట్‌లో ఉన్న మూవీస్‌, సిరీస్‌లు చూశారో లేదో చెక్‌ చేసుకోండి. 

చదవండి: పగ, ప్రతీకారంతో రగిలిన కీర్తి సురేష్ 'చిన్ని' మూవీ రివ్యూ


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement