Mishan Impossible Movie
-
‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి నటించిన తెలుగు మూవీ తెలుసా?
చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన లేటెస్ట్ మూవీ కాంతార. తొలుత కన్నడ ప్రాంతీయ సినిమాగా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళంలో సంచలన విజయం సాధించింది. అన్ని భాషల్లో ఈ సినిమాకు బ్రహ్మర్థం పడుతున్నారు. దీంతో ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక చిత్రంలో లీడ్ రోల్ పోషించిన రిషబ్ శెట్టి ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ మూవీ ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే ఎవరో తెలియదు. చదవండి: అరుదైన వ్యాధితో బాధపడుతున్న ‘జాతిరత్నాలు’ డైరెక్టర్ కానీ ఇప్పుడు ఈ పేరు వినగానే వెంటనే కాంతార హీరో, దర్శకుడని చెప్పేంతగా గుర్తింపు పొందాడు. ఇదిలా ఉంటే కాంతారకు ముందు రిషబ్ తెలుగులో నేరుగా ఓ సినిమా చేసిన విషయం మీకు తెలుసా? అది కూడా ఎలాంటి పారితోషికం లేకుండా? ఏంటి షాక్ అవుతున్నారా? అవును ఈ మూవీకి ముందు గతేడాది రిషబ్ శెట్టి తెలుగులో ఓ సినిమా చేశాడు. కానీ అందులో కనిపించింది ఓ రెండు, మూడు నిమిషాలు మాత్రమే. ఇంతకి ఈ సినిమా ఎంటంటే ఈ ఏడాది వచ్చిన ‘మిషన్ ఇంపాజిబుల్’. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ ఫేం స్వరూప్ దర్శకత్వంలో తాప్సీ కీలక పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన అతిథి పాత్రలో కనిపించాడు. చదవండి: హన్సిక కాబోయే భర్త ఎవరు, ఏం చేస్తుంటాడో తెలుసా? మూవీలో కీలక మలుపు తెచ్చే ఖలీల్ అనే దొంగ పాత్రలో కనిపించారు. అయితే అప్పటికి ఆయనకు ఈ స్థాయిలో గుర్తింపు లేకపోవడంతో రిషబ్ శెట్టిన ఎవరు గుర్తించలేదు. ఈ మూవీ డైరెక్టర్ స్వరూప్, రిషబ్‌కు మంచి స్నేహితుడట. ఆ స్నేహంతోనే ఇందులో ఖలీల్ పాత్ర చేయమని అడగ్గా రిషబ్ వెంటనే ఒకే చెప్పాడట. అంతేకాదు ఈ సినిమాకు ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సమాచారం. ఇక సినిమాలో ముగ్గురు పిల్లలు ముంబై వెళ్తున్నాము అనుకుని పొరపాటున బెంగళూరు వెళ్తారు. ఇక అక్కడ వాళ్లు ఎదుర్కొన్న సమస్యలు, వాటిని ఎలా అధికమించారు అనేదే ‘మిషన్ ఇంపాజిబుల్’ కథ. -
అత్యధికంగా వీక్షించిన టాప్ 10 సినిమాలు, సిరీస్‌లు ఇవే..
Netflix Top 10 Most Watched Movies Web Series May 1st Week: కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ అమలు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో థియేటర్లు మూతపడ్డాయి. వీటికి ప్రత్యామ్నాయంగా మారాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు. థియేటర్లకు అల్టర్నేట్గా మాత్రమే కాకుండా విభిన్నమైన కథాంశాలతో ఉన్న చిత్రాలను, వెబ్ సిరీస్‌లు చూడాలనుకునే సినీ ప్రియులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. అలాగే ఈ ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలు, సిరీస్‌లను రూపొందిస్తున్నాయి. ఇలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యేకంగా చెప్పుకోదగినది నెట్‌ఫ్లిక్స్. ఎప్పుడూ సరికొత్త హంగులతో ప్రేక్షకులను బోర్ కొట్టించకుండా కొత్తదనంతో ఆకట్టుకునేందుకు ముందుంటుంది ఈ దిగ్గజ సంస్థ. అయితే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం టాప్ 10లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్‌ను ట్విటర్ ద్వారా షేర్ చేసింది. ఇందులో అలియా భట్ 'గంగూబాయి కతియావాడి' మూవీ నుంచి రణ్వీర్ సింగ్ '83' వరకు పలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు, సిరీస్‌లు ఉన్నాయి. ఈ జాబితాలో చాలా కాలం తర్వాత తెలుగులో తాప్సీ నటించిన మిషన్ ఇంపాజిబుల్ కూడా ఉండటం విశేషం. మరీ ఈ లిస్ట్‌లో ఉన్న మూవీస్, సిరీస్‌లు చూశారో లేదో చెక్ చేసుకోండి. చదవండి: పగ, ప్రతీకారంతో రగిలిన కీర్తి సురేష్ 'చిన్ని' మూవీ రివ్యూ Nothing tops this week’s top 10 most watched titles 👇 Gangubai Kathiawadi Mai Bridgerton 365 Days: This Day The Marked Heart Dasvi Ozark Mishan Impossible Anatomy Of A Scandal ‘83 — Netflix India (@NetflixIndia) May 7, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘మిషన్ ఇంపాజిబుల్’ మూవీ రివ్యూ
టైటిల్ : మిషన్ ఇంపాజిబుల్ నటీనటులు : తాప్సీ, హరీశ్ పేరడీ, రోషన్, భానుప్రకాశ్, జై తీర్థ తదితరులు నిర్మాణ సంస్థ : మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మాత: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి దర్శకత్వం : స్వరూప్ ఆర్.ఎస్.జె సంగీతం : మార్క్ కె రాబిన్ సినిమాటోగ్రఫీ : దీపక్ యెరగరా విడుదల తేది : ఏప్రిల్ 01, 2022 టాలీవుడ్లో పెద్ద తరహా చిత్రాలే కాదు.. కాన్సెఫ్ట్ బాగుంటే చిన్న సినిమాలు కూడా భారీ విజయం సాధిస్తున్నాయి. కథలో కొత్తదనం ఉంటే చాలు చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో టాలీవుడ్లో చిన్న చిత్రాలు ధైర్యంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వాటిలో చాలా వరకు విజయం సాధించాయి కూడా. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో చిన్న చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. చాలాకాలం తర్వాత తాప్సీ పన్ను తెలుగులో ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె. ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఏప్రిల్ 1) రిలీజైన ‘మిషన్ ఇంపాజిబుల్’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేటంటే.. శైలజ అలియాస్ శైలు(తాప్సీ) ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియాపై పరిశోధనలు చేస్తుంటారు. రామ్శెట్టి(హరీశ్ పేరడీ) అనే మాఫియా డాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించాలని ఆమె ప్లాన్ వేస్తారు. బెంగళూరు నుంచి చిన్న పిల్లలను దుబాయ్‌కి తరలించేందుకు రామ్శెట్టి స్కెచ్ వేసినట్లు తెలుసుకున్న శైలు.. పక్కా ఆధారాలతో అతన్ని పోలీసులకు పట్టించి, పిల్లలను రక్షించాలని బయలుదేరుతుంది. కట్‌చేస్తే.. తిరుపతికి చెందిన రఘుపతి, రాఘవ, రాజారాం(ఆర్.ఆర్.ఆర్) అనే ముగ్గురు కుర్రాళ్లకు చదువు తప్ప అన్ని పనులు వస్తాయి. ఎలాగైనా డబ్బులు సంపాదించి, ఫేమస్ కావలనేదే వాళ్ల లక్ష్యం. డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్న క్రమంలో.. దావూద్‌ని పట్టిస్తే..రూ.50 లక్షల బహుమతి పొందొచ్చు అనే వార్త టీవీలో వస్తుంది. అది చూసి దావుద్‌ని పట్టించి, రూ.50 లక్షల బహుమతి దక్కించుకోవాలని ఆ ముగ్గురు.. ఇంట్లో చెప్పాపెట్టకుండా ముంబైకి బయలు దేరుతారు. మరి ఆ ముగ్గురు ముంబైకి వెళ్లి దావూద్‌ని పట్టుకున్నారా? మాఫియా డాన్ని పోలీసులకు పట్టించాలని చూస్తున్న శైలుకీ, దావూద్‌ని పట్టించి రూ.50 లక్షలు ప్రైజ్ మనీ పొందాలనుకున్న రఘుపతి, రాఘవ, రాజారాంలకు లింకు ఏంటి? అసలు వాళ్లు నిజంగానే ముంబై వెళ్లారా? మాఫియా డాన్ రామ్శెట్టిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంలో.. ఈ ముగ్గురు స్నేహితులు ఎలా సహాయపడ్డారు? శైలు మిషన్కి ఆర్.ఆర్.ఆర్ మిషన్ ఎలా ఉపయోగపడింది? ఈ మిషన్‌లో ఎవరు విజయం సాధించారు అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`అనే తొలి మూవీతో అందరి దృష్టి ఆకర్షించాడు దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె. ఆయన నుంచి మరో సినిమా వస్తుందంటే.. కచ్చితంగా ఓ మోస్తరు అంచనాలు ఉంటాయి. దానికి తోడు చాలా కాలం తర్వాత తాప్సీ టాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తుండడంతో ‘మిషన్ ఇంపాజిబుల్’పై సినీ ప్రేక్షకులు భారీ హోప్స్ పెంచుకున్నారు. కానీ వారి అంచనాలను రీచ్ కాలేకపోయాడు దర్శకుడు స్వరూప్. కథలో కొత్తదనం లోపించింది. చాలా చోట్ల లాజిక్ మిస్ అవుతుంది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ శైలుయే స్వయంగా ఓ పదిహేడేళ్ల కుర్రాడితో డాన్‌ను చంపించడం, దాన్ని సమర్థించేందుకు ఓ అంతుచిక్కని లాజిక్కుని చొప్పించడంతో ‘మిషన్ ఇంపాజిబుల్’ కథ మొదలవుతుంది. రఘుపతి, రాఘవ, రాజారాం పాత్రల కామెడీతో ఫస్టాఫ్ అంతా సరదాగా సాగుతుంది. డబ్బులు సంపాదించే క్రమంలో పిల్లలు చేసిన అమాయకపు పనులు నవ్వులు పూయిస్తాయి. త్రివిక్రమ్, రాజమౌళి, సుకుమార్, పూరి జగన్నాథ్‌లపై వేసిన జోకులు కూడా బాగా పేలాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో కథంతా ఇన్వెస్టిగేషన్ చుట్టే తిరుగుతుంది. అయితే చైల్డ్ ట్రాఫికింగ్, పిల్లలు పడే కష్టాలు.. ఇవన్నీ గత సినిమాల్లో చూసిన సీన్లలాగే అనిపిస్తాయి. కథలో ట్విస్టులు ఉండకపోవడమే కాకుండా.. లాజిక్ లేని సీన్స్ బోలెడు ఉన్నాయి. ఫస్టాఫ్‌లో ముంబై, బొంబాయి రెండూ ఒకటేనని కూడా తెలియని పిల్లలు.. సెకండాఫ్‌కు వచ్చేసరికి చాలా తెలివిగా వ్యవహరించడం సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు అయిన శైలజ.. ఓ ప్రమాదకరమైన మిషన్కి ముగ్గురు పిల్లలను అడ్డుపెట్టుకోవడం.. సగటు ప్రేక్షకుడికి మింగుడుపడదు. హరీశ్ పేరడీ విలనిజం కూడా అంతగా పేలలేదు. క్లైమాక్స్ కూడా చాలా రొటీన్‌గా ఉంది. ఎవరెలా చేశారంటే.. చాలా కాలం తర్వాత తాప్సీ నటించిన తెలుగు సినిమా ఇది. ఓ కొత్త పాత్రతో ఆమె రీఎంట్రీ ఇచ్చింది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు శైలు పాత్రకు తాప్సీ న్యాయం చేసింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువే అయినప్పటికీ.. ఉన్నంతలో బాగా నటించింది. ఇక సినిమాకు ప్రధాన బలం రోషన్, భానుప్రకాశ్, జై తీర్థ నటన అనే చెప్పాలి. రఘుపతి, రాఘవ, రాజారాం అనే కుర్రాళ్ల పాత్రల్లో ఈ ముగ్గురు ఒదిగిపోయారు. తమదైన కామెడీతో నవ్వించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. మార్క్ కె రాబిన్ సంగీతం బాగుంది. పాటలు తెచ్చిపెట్టినట్లు కాకుండా కథలో భాగంగానే సాగుతాయి. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. దీపక్ యెరగరా సినిమాటోగ్రఫీ బాగుంది. కథకు తగ్గట్టుగా ప్రతి సీన్ చాలా సహజంగా తెరపై చూపించాడు. డైలాగ్స్ ఓకే. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. చివరగా.. లాజిక్కులు వెతక్కుండా చూస్తే.. మిషన్ ఇంపాజిబుల్ అక్కడక్కడా నవ్విస్తుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
తెలుగు సినిమాలు ఎందుకు చేస్తున్నావ్ అంటున్నారు: తాప్సీ
Taapsee Open Up On Why She Take Long Gap To Telugu Movie: ‘ఝుమ్మంది నాదం’తో టాలీవుడ్‌కి పరిచయం అయిన సొట్టబుగ్గల బ్యూటీ తాప్సీ పన్ను.. తొలి సినిమాతోనే ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో తెలుగు వరస ఆఫర్లు, స్టార్ హీరో సరసన నటించిన ఆమె ఉన్నట్టుంటి బాలీవుడ్‌కు మాకాం మార్చింది. అక్కడ మహిళ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఈ భామ బాలీవుడ్లోనే సెటిలైపోయింది. ఈ నేపథ్యంలో గతంలో తాప్సీ ఘాజీ సినిమాలో మెరిరవగా.. చాలా కాలం తర్వాత తాజాగా తెలుగు సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్’ చేసింది. ఆర్ఎస్జే స్వరూప్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదల కాబోతోంది. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’పై కేఏ పాల్ అనుచిత వ్యాఖ్యలు, ఆర్జీవీ కౌంటర్ ఈ క్రమంలో రీసెంట్గా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జరుపుకుంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ.. చిరంజీవిగా ధన్యవాదాలు తెలిపింది. తన మొదటి చిత్రం ఝమ్మంది నాదంకు ఆయనే ముఖ్య అతిథిగా వచ్చారనీ, ఇప్పుడు ఈ మూవీకి కూడా స్పెషల్ గెస్ట్ రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. అందుకే ఈ రెండు సినిమాలు తనకు స్పెషల్ అని పేర్కొంది. ఆ తర్వాత ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్ ముగ్గురు చిన్నారులు భాను, జయ, రోషన్ అని, వీరికి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పింది. ఈ సినిమాలో మీరే హీరోలని, పెద్దవాళ్లు అయ్యి, స్టార్ హీరోలుగా మారితే తనకోక అవకాశం ఇవ్వాలంటూ చమత్కరించింది. చదవండి: సూర్య ఈటీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ ఈ సందర్భంగా తెలుగు సినిమాలకు గ్యాప్ ఇవ్వడంపై తాప్సీ స్పందించింది. ఈ మధ్య కొందరూ ఇప్పుడేందుకు తెలుగు సినిమాలు చేస్తున్నావని అడుగుతున్నారంది. ‘హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాను. ఇప్పుడెందుకు తెలుగు సినిమాలు చేస్తున్నారు? అని కొందరు అడుగుతున్నారు. దీనికి నా దగ్గర ఖచ్చితమైన సమాధానం లేదు. కానీ గత రెండేళ్లుగా నేను హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాను అందుకే తెలుగులో నటించే సమయం లేదు. ఇదే నా సమాధానం అంతే తప్ప లాజిక్‌గా చెప్పే కారణం లేదు. ఎందుకంటే మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైందో అది మరచిపోకూడదు. నా ప్రయాణం తెలుగు సినిమాలతోనే ప్రారంభమైంది.. అందుకే తెలుగు సినిమాలు చేస్తా.. చేస్తూనే ఉంటా’ అని చెప్పుకొచ్చింది. -
మిషన్ ఇంపాజిబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాల లిస్ట్!
కంటెంట్ బాగుంటే టికెట్ రేట్ ఎక్కువైనా సరే సినిమా చూసేందుకు ఏమాత్రం వెనుకాడరు జనాలు. అందుకు ఆర్ఆర్ఆర్ కలెక్షన్ల సునామీనే అతి పెద్ద నిదర్శనం. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ చూసేందుకు ఎగబడుతున్నారు సినీప్రియులు. ఈ పాన్ ఇండియా మూవీ దూకుడు చూస్తుంటే మరో వారం రోజులదాకా దీని ప్రభంజనం ఆగేట్లు కనిపించడం లేదు. ఈ కలెక్షన్ల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు కొత్త చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. మరి ఏప్రిల్ మొదటివారంలో అటు థియేటర్లో ఇటు ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ ఏంటో చూసేద్దాం.. మిషన్ ఇంపాజిబుల్ బాలీవుడ్లో పాగా వేసిన తాప్సీ చాలాకాలానికి తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మిషన్ ఇంపాజిబుల్. ఆర్ఎస్జె స్వరూప్ తెరకెక్కించిన ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దావూద్ ఇబ్రహీంని పట్టుకోవాలన్న ముగ్గురు పిల్లలకు తాప్సీ ఎలా సాయం చేసింది? ఈ మిషన్‌ను వారు పూర్తి చేశారా? లేదా? అన్నది కథ. రాధేశ్యామ్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రిలీజైన రాధేశ్యామ్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో కేవలం 20 రోజుల్లోనే ఓటీటీ బాట పడుతోందీ మూవీ. ఏప్రిల్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రవీన్ తాంబే ఎవరు? స్పోర్ట్స్‌లో ఎక్కువమంది ఇష్టపడే గేమ్ ఏంటి అంటే క్రికెట్ అని టపీమని సమాధానం వస్తుంది. క్రికెట్ అంటే జనాలకు పిచ్చి ఉంది కాబట్టే ఈ క్రీడా నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. తాజాగా భారత క్రికెటర్ ప్రవీన్ తాంబే జీవిత కథ ఆధారంగా ప్రవీన్ తాంబే ఎవరు? అనే సినిమా తెరకెక్కింది. శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానుంది. హలో జూన్ తెలుగువారికి కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది ఆహా. ఇతర భాషాచిత్రాలను తెలుగులోకి డబ్ చేస్తూ ప్రేక్షకుడికి కొత్త కథలను పరిచయం చేస్తోంది. తాజాగా మలయాళ మూవీ జూన్‌ను తెలుగులోకి తీసుకొస్తోంది ఆహా. రాజిష విజయన్ ప్రధాన పాత్రలో నటించిన జూన్ 2019లో విడుదలై హిట్ కొట్టింది. ఏప్రిల్ 1 నుంచి హలో జూన్ పేరుతో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. సోనీలివ్ ► ఆడవాళ్లు మీకు జోహార్లు - ఏప్రిల్ 2 హాట్‌స్టార్ ► మూన్ నైట్ - మార్చి 30 ► భీష్మపర్వం - ఏప్రిల్ 1 అమెజాన్ ప్రైమ్ ► శర్మాజీ నమ్కీన్ - మార్చి 31 నెట్‌ఫ్లిక్స్ ► హే సినామిక - మార్చి 31 ► స్టోరీస్ ఆఫ్ విట్ అండ్ మ్యాజిక్ అనే యానిమేషన్ టీవీ షో - మార్చి 31 ► ది లాజ్ బస్(వెబ్ సిరీస్) - ఏప్రిల్ 1 చదవండి: రూ.15 కోట్లు ఇస్తామని చెప్పి మోసం.. కోర్టునాశ్రయించిన హీరో -
దావూద్ ఇబ్రహీంకు, ఆర్జీవీకి చాలా పోలికలుంటాయి: డైరెక్టర్
'ఏ కథ రాసినా కామెడీ, థ్రిల్లర్, డ్రామా వుండేలా చూసుకుంటాను. తెలుగులో `చంటబ్బాయ్` తర్వాత డిటెక్టివ్ సినిమాలు పెద్దగా రాలేదు. లిటిల్ సోల్జర్స్ తర్వాత పిల్లలతో సినిమా రాలేదు. అందుకే వాటికి తగ్గట్టుగా రాసుకుని తీసిన సినిమానే మిషన్ ఇంపాజిబుల్' అని దర్శకుడు `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె. తెలియజేశారు. తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా శనివారంనాడు చిత్ర దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె మీడియా సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. ► మిషన్ ఇంపాజిబుల్ అనే కథ 2014లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రాసుకున్నా. దావూద్ ఇబ్రహం అనే వ్యక్తిని పట్టుకుంటే డబ్బులు ఇస్తామని పేపర్లో వచ్చిన ప్రకటన చూసిన పాట్నాకు చెందిన ముగ్గురు పిల్లలు ముంబై వెళ్ళిపోతారు. ఈ వార్తను కథగా రాసుకున్నాను. కానీ ఆ తర్వాత ఏజెంట్.. కథ డెవలప్ అవ్వడంతో ముందుగా దాన్ని ప్రారంభించా. ► రెండవ సినిమా ఇలాంటి కథతో రావడం రిస్క్ అనుకోలేదు. నిజాయితీగా కథ చెబితే ప్రేక్షకులు చూస్తారనే పూర్తి నమ్మకం నాకుంది. ఏజెంట్.. సినిమాతో అది నిజమైంది. నా స్నేహితులు కూడా మొదటి సినిమా లవ్, కామెడీ చేయమన్నారు. కానీ నా తరహాలో నిజాయితీగా చెబితే చూస్తారనే డిటెక్టివ్ సినిమా తీశా. ► మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో మొదట ఎవరైనా హీరోతో చేద్దామనుకున్నాం. కానీ అప్పటికే `ఏజెంట్..` సినిమా చేశాం కదా అని ఫిమేల్ పాత్ర పెట్టాం. తాప్సీ చేసిన `తప్పడ్`, `పింక్` సినిమాలు స్ట్రాంగ్ మహిళా పాత్రలు పోషించింది. అందులోనూ తెలుగులో తను నటించి చాలా కాలం అయింది. ఆమెకు కథ చెప్పాను. తన కేరెక్టర్ చిన్నదైనా కథ నచ్చిందని సినిమా చేయడానికి ఒప్పుకుంది. తను ప్రొఫెషనల్ యాక్టర్. ముందురోజే డైలాగులు తీసుకుని ప్రిపేర్ అయ్యేది. ఆరు గంటలకల్లా సెట్‌కు వచ్చే వారు. ► ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. పిల్లలో ఒకరు దావూద్ ఫొటో చూసి రామ్ గోపాల్ వర్మ అనుకుంటాడు. నేను చిన్నప్పుడు అలానే అనుకునేవాడిని. నాలాగే ఎంతోమంది అలా అనుకున్నారు. ఎందుకంటే ఇద్దరికీ చాలా పోలికలుంటాయి. అందుకే ట్రైలర్లో చూపించాను. ► టైటిల్ ఆంగ్లంలో `మిషన్..` అనేది పెట్టడానికి కారణం కూడా పిల్లలు స్పెల్లింగ్ తప్పుగా రాస్తారు. అందుకే అలా పెట్టాం. సినిమా చూస్తే అర్థమవుతుంది. ► షూటింగ్ ను మన నేటివిటీకి తగినట్లుగానే తీశాం. హైదరాబాద్ చుట్టుపక్కల ఎనిమిది గ్రామాలలో షూట్ చేశాం. ► కొత్తగా ఎటువంటి సినిమాలు కమిట్ కాలేదు. ఏజెంట్...కు సీక్వెల్ తీయాలనుకున్నాం. కాని దానికి మించి వుండాలి. అందుకే సమయం తీసుకుని చేయాలనుంది. ఏజెంట్.. ను హిందీలో తీయాల్సి వస్తే పూర్తి నేటివిటీ మార్చి తీయాలి. దానికి నేను దర్శకత్వం వహించను అని అన్నారు. చదవండి: తను చనిపోయినట్లు వచ్చిన వార్తలపై నటుడి ఆగ్రహం.. -
తాప్సీ 'మిషన్ ఇంపాజిబుల్' రిలీజ్ ఎప్పుడంటే?
దావూద్ ఇబ్రహీం అనే వ్యక్తిని పట్టుకోవాలనుకునే క్రమంలో ముగ్గురు పిల్లలు, ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చేసిన సాహసం ఏంటి? అనే కథాంశంతో రూపొందిన సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్’. ఆర్ఎస్జే స్వరూప్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. ఎన్ఎం పాషా నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదల కానుంది. ‘‘మా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇటీవల మహేశ్‌బాబుగారు విడుదల చేసిన మా సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు ఆర్ఎస్జే స్వరూప్ ఈ కథ రాసుకున్నారు. దావూద్ ఇబ్రహీం అనే వ్యక్తిని పట్టుకోవడానికి ముగ్గురు పిల్లలు ఎలా ప్లాన్ చేశారు? వీరికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఈ పిల్లలకు, ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుకు ఉన్న సంబంధం ఏంటి? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. చదవండి: ఆ కథ వేరేవాళ్లకు ఇవ్వడంతో రాజమౌళి కంట్లో నీళ్లు తిరిగాయి -
Mishan Impossible: యాభై లక్షలు ఇస్తారంట్రా?
‘అరెస్ట్.. ఇన్ఫ్లుయెన్స్.. బెయిల్.. ఈ సైకిల్ బాగా అలవాటు వీడికి’ అంటూ తాప్సీ చెప్పే డైలాగ్‌తో ‘మిషన్ ఇంపాజిబుల్’ ట్రైలర్ విడుదలయింది. తాప్సీ లీడ్ రోల్ చేసిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. స్వరూప్ ఆర్ఎస్జె దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 1న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో మహేశ్‌బాబు విడుదల చేసి, యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ‘దావూద్ ఇబ్రహీంని పట్టుకుంటే యాభై లక్షలు ఇస్తారంట్రా, యాభై లక్షలంటే ఎంత డబ్బులు?, చాలా డబ్బులు రా.. ఇవే డబ్బులు రాజమౌళికి ఇస్తే ‘బాహుబలి’పార్ట్ 3 తీస్తాడు..’ అంటూ ముగ్గురు బాలనటులు చెప్పే డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ‘‘యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన ఎంటర్టైనర్ చిత్రమిది. ఇందులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో తాప్సీ నటించారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.