దావూద్ ఇబ్రహీం అనే వ్యక్తిని పట్టుకోవాలనుకునే క్రమంలో ముగ్గురు పిల్లలు, ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చేసిన సాహసం ఏంటి? అనే కథాంశంతో రూపొందిన సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్’. ఆర్‌ఎస్‌జే స్వరూప్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. ఎన్‌ఎం పాషా నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదల కానుంది. ‘‘మా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇటీవల మహేశ్‌బాబుగారు విడుదల చేసిన మా సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది.
వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు ఆర్‌ఎస్‌జే స్వరూప్ ఈ కథ రాసుకున్నారు. దావూద్ ఇబ్రహీం అనే వ్యక్తిని పట్టుకోవడానికి ముగ్గురు పిల్లలు ఎలా ప్లాన్ చేశారు? వీరికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఈ పిల్లలకు, ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుకు ఉన్న సంబంధం ఏంటి? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
చదవండి: ఆ కథ వేరేవాళ్లకు ఇవ్వడంతో రాజమౌళి కంట్లో నీళ్లు తిరిగాయి
Comments
Please login to add a commentAdd a comment