తెలుగు సినిమాలు ఎందుకు చేస్తున్నావ్‌ అంటు‍న్నారు: తాప్సీ | Taapsee Pannu Talks In Mishan Impossible Movie Event Over Telugu Movies | Sakshi
Sakshi News home page

Taapsee Pannu: తెలుగులో ఎందుకు నటిస్తున్నావ్‌ అంటున్నారు

Published Thu, Mar 31 2022 8:04 PM | Last Updated on Thu, Mar 31 2022 8:10 PM

Taapsee Pannu Talks In Mishan Impossible Movie Event Over Telugu Movies - Sakshi

Taapsee Open Up On Why She Take Long Gap To Telugu Movie: ‘ఝుమ్మంది నాదం’తో టాలీవుడ్‌కి పరిచయం అయిన సొట్టబుగ్గల బ్యూటీ తాప్సీ పన్ను.. తొలి సినిమాతోనే ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో తెలుగు వరస ఆఫర్లు, స్టార్‌ హీరో సరసన నటించిన ఆమె ఉన్నట్టుంటి బాలీవుడ్‌కు మాకాం మార్చింది. అక్కడ మహిళ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఈ భామ బాలీవుడ్‌లోనే సెటిలైపోయింది. ఈ నేపథ్యంలో గతంలో తాప్సీ ఘాజీ సినిమాలో మెరిరవగా.. చాలా కాలం తర్వాత తాజాగా తెలుగు సినిమా ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ చేసింది. ఆర్‌ఎస్‌జే స్వరూప్‌ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 1న విడుదల కాబోతోంది. 

చదవండి: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై కేఏ పాల్‌ అనుచిత వ్యాఖ్యలు, ఆర్జీవీ కౌంటర్‌

ఈ క్రమంలో రీసెంట్‌గా ఈ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను జరుపుకుంది. దీనికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ.. చిరంజీవిగా ధన్యవాదాలు తెలిపింది. తన మొదటి చిత్రం ఝమ్మంది నాదంకు ఆయనే ముఖ్య అతిథిగా వచ్చారనీ, ఇప్పుడు ఈ మూవీకి కూడా స్పెషల్‌ గెస్ట్‌ రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. అందుకే ఈ రెండు సినిమాలు తనకు స్పెషల్‌ అని పేర్కొంది. ఆ తర్వాత ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్ ముగ్గురు చిన్నారులు భాను, జయ, రోషన్ అని, వీరికి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పింది. ఈ సినిమాలో మీరే హీరోలని, పెద్దవాళ్లు అయ్యి, స్టార్ హీరోలుగా మారితే తనకోక అవకాశం ఇవ్వాలంటూ చమత్కరించింది.

చదవండి: సూర్య ఈటీ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌

ఈ సందర్భంగా తెలుగు సినిమాలకు గ్యాప్‌ ఇవ్వడంపై తాప్సీ స్పందించింది. ఈ మధ్య కొందరూ ఇప్పుడేందుకు తెలుగు సినిమాలు చేస్తున్నావని అడుగుతున్నారంది. ‘హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాను. ఇప్పుడెందుకు తెలుగు సినిమాలు చేస్తున్నారు? అని కొందరు అడుగుతున్నారు. దీనికి నా దగ్గర ఖచ్చితమైన సమాధానం లేదు. కానీ గత రెండేళ్లుగా నేను హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాను అందుకే తెలుగులో నటించే సమయం లేదు. ఇదే నా సమాధానం అంతే తప్ప లాజిక్‌గా చెప్పే కారణం లేదు. ఎందుకంటే మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైందో అది మరచిపోకూడదు. నా ప్రయాణం తెలుగు సినిమాలతోనే ప్రారంభమైంది.. అందుకే తెలుగు సినిమాలు చేస్తా.. చేస్తూనే ఉంటా’ అని చెప్పుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement