OTT Movies: Upcoming Movies In Theatre And OTT From April 1st Week, Full Details Inside - Sakshi
Sakshi News home page

OTT And Theatre: ఏప్రిల్‌ మొదటి వారంలో రిలీజవుతున్న సినిమాలివే!

Published Wed, Mar 30 2022 9:25 AM | Last Updated on Wed, Mar 30 2022 3:56 PM

Upcoming Movies In Theatre And OTT From April 1st Week - Sakshi

కంటెంట్‌ బాగుంటే టికెట్‌ రేట్‌ ఎక్కువైనా సరే సినిమా చూసేందుకు ఏమాత్రం వెనుకాడరు జనాలు. అందుకు ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల సునామీనే అతి పెద్ద నిదర్శనం. జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటించిన ఈ మల్టీస్టారర్‌ మూవీ చూసేందుకు ఎగబడుతున్నారు సినీప్రియులు. ఈ పాన్‌ ఇండియా మూవీ దూకుడు చూస్తుంటే మరో వారం రోజులదాకా దీని ప్రభంజనం ఆగేట్లు కనిపించడం లేదు. ఈ కలెక్షన్ల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు కొత్త చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. మరి ఏప్రిల్‌ మొదటివారంలో అటు థియేటర్‌లో ఇటు ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ ఏంటో చూసేద్దాం..

మిషన్‌ ఇంపాజిబుల్‌
బాలీవుడ్‌లో పాగా వేసిన తాప్సీ చాలాకాలానికి తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మిషన్‌ ఇంపాజిబుల్‌. ఆర్‌ఎస్‌జె స్వరూప్‌ తెరకెక్కించిన ఈ సినిమాను నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించారు. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దావూద్‌ ఇబ్రహీంని పట్టుకోవాలన్న ముగ్గురు పిల్లలకు తాప్సీ ఎలా సాయం చేసింది? ఈ మిషన్‌ను వారు పూర్తి చేశారా? లేదా? అన్నది కథ.

రాధేశ్యామ్‌
ప్రభాస్‌, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం రాధేశ్యామ్‌. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రిలీజైన రాధేశ్యామ్‌ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో కేవలం 20 రోజుల్లోనే ఓటీటీ బాట పడుతోందీ మూవీ. ఏప్రిల్‌ 1 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

ప్రవీన్‌ తాంబే ఎవరు?
స్పోర్ట్స్‌లో ఎక్కువమంది ఇష్టపడే గేమ్‌ ఏంటి అంటే క్రికెట్‌ అని టపీమని సమాధానం వస్తుంది. క్రికెట్‌ అంటే జనాలకు పిచ్చి ఉంది కాబట్టే ఈ క్రీడా నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. తాజాగా భారత క్రికెటర్‌ ప్రవీన్‌ తాంబే జీవిత కథ ఆధారంగా ప్రవీన్‌ తాంబే ఎవరు? అనే సినిమా తెరకెక్కింది. శ్రేయాస్‌ తల్పడే ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం హాట్‌స్టార్‌లో ఏప్రిల్‌ 1 నుంచి అందుబాటులోకి రానుంది.

హలో జూన్‌
తెలుగువారికి కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది ఆహా. ఇతర భాషాచిత్రాలను తెలుగులోకి డబ్‌ చేస్తూ ప్రేక్షకుడికి కొత్త కథలను పరిచయం చేస్తోంది. తాజాగా మలయాళ మూవీ జూన్‌ను తెలుగులోకి తీసుకొస్తోంది ఆహా. రాజిష విజయన్‌ ప్రధాన పాత్రలో నటించిన జూన్‌ 2019లో విడుదలై హిట్‌ కొట్టింది. ఏప్రిల్‌ 1 నుంచి హలో జూన్‌ పేరుతో ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది.

సోనీలివ్‌
► ఆడవాళ్లు మీకు జోహార్లు - ఏప్రిల్‌ 2

హాట్‌స్టార్‌
► మూన్‌ నైట్‌ - మార్చి 30
► భీష్మపర్వం - ఏప్రిల్‌ 1

అమెజాన్‌ ప్రైమ్‌
► శర్మాజీ నమ్కీన్‌ - మార్చి 31

నెట్‌ఫ్లిక్స్‌
► హే సినామిక - మార్చి 31
► స్టోరీస్ ఆఫ్ విట్ అండ్ మ్యాజిక్ అనే యానిమేషన్ టీవీ షో - మార్చి 31
► ది లాజ్‌ బస్‌(వెబ్‌ సిరీస్‌) - ఏప్రిల్‌ 1

చదవండి: రూ.15 కోట్లు ఇస్తామని చెప్పి మోసం.. కోర్టునాశ్రయించిన హీరో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement