List Of Upcoming Movies And Web Series Theatres And OTT June 3rd Week - Sakshi
Sakshi News home page

Upcoming Movies Web Series: ఈ వారం రిలీజవనున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..

Published Tue, Jun 14 2022 5:16 PM | Last Updated on Wed, Jun 15 2022 3:39 PM

Upcoming Theatre OTT Movies Web Series June 3rd Week 2022 - Sakshi

థియేటర్లలో సినిమాల సందడి జోరుగా కొనసాగుతోంది. జూన్ మొదటి వారంలో విడుదలైన మేజర్​, విక్రమ్ చిత్రాలు సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతుండగా, సెకండ్‌ వీక్‌లో రిలీజైన నాని 'అంటే.. సుందరానికీ', '777 చార్లీ' సినిమాలు మంచి టాక్‌ తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు జూన్‌ మూడో వారంలో ఇటు థియేటర్‌, అటు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు ఏంటో చూసేద్దాం. 

1. విరాట పర్వం
దగ్గుబాటి రానా, సాయిపల్లవి, ప్రియమణి, నవీన్‌ చంద్ర కీలక పాత్రల్లో నటించిన చిత్రం విరాట పర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే అనేకామార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జూన్‌ 17 ప్రేక్షకులను అలరించేందుకు రానుంది. 1990 దశకంలో జరిగిన యాదార్థ సంఘటనల స్ఫూర్తిగా ఈ సినిమాను తెరకెక్కించారు. నక్సలిజం, ప్రేమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కామ్రేడ్‌ రవన్నగా రానా, వెన్నెలగా సాయిపల్లవి నటించారు. 

2. గాడ్సే
విభిన్నకథలతో, మంచి పాత్రలతో ముందుకు వెళ్తున్నాడు సత్యదేవ్‌. ఆయన హీరోగా నటించిన చిత్రం గాడ్సే. గోపీ గణేష్‌ పట్టాభి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సి. కల్యాణ్‌ నిర్మాత. సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందించిన ఈ మూవీ పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

3. కిరోసిన్‌
మిస్టరీ నేపథ్యంలో వస్తున్న చిత్రం కిరోసిన్‌. ధృవ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి దిప్తీ కొండవీటి, పృథ్వీ యాదవ్‌ నిర్మించారు. ఈ సినిమా జూన్‌ 17న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. వీటితోపాటు హీరో, మొనగాడు తదితర చిత్రాలు సైతం థియేటర్లలో విడుదల కానున్నాయి. 

ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీస్‌లు

1. జయమ్మ పంచాయితీ
యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో అలరించిన సినిమా జయమ్మ పంచాయితీ. మే 6న విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో జూన్‌ 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. 

2. O2
లేడీ సూపర్‌స్టార్‌ నయన తార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం O2 (ఆక్సిజన్‌). జీఎస్‌ విఘ్నేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేరుగా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. జూన్‌ 17 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. 

3. రెక్కీ
శ్రీరామ్‌, శివబాలాజీ, ధన్య బాలకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించిన వెబ్‌ సిరీస్‌ రెక్కీ. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ జీ5లో జూన్‌ 17 నుంచి ప్రదర్శించబడనుంది. 1990లో తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ హత్యకు సంబంధించిన కథాంశంతో ఈ సిరీస్‌ రానుంది. 

అమెజాన్ ప్రైమ్ వీడియో
అవతార పురుషా-1 (కన్నడ), జూన్‌ 14
సుడల్‌ (వెబ్‌ సిరీస్‌), జూన్‌ 17

నెట్‌ఫ్లిక్స్‌
గాడ్స్‌ ఫేవరెట్‌ ఇడియట్‌ (వెబ్‌ సిరీస్‌), జూన్‌ 15
ది రాత్‌ ఆఫ్‌ గాడ్‌ (హాలీవుడ్), జూన్‌ 15
షి (హిందీ వెబ్‌ సిరీస్‌ 2), జూన్‌ 17
ఆపరేషన్‌ రోమియో (హిందీ), జూన్ 18

జీ5
ఇన్ఫినిటీ స్టోర్మ్‌ (హాలీవుడ్), జూన్‌ 14
ఫింగర్‌ టిప్‌ (హిందీ, తమిళ వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 2), జూన్‌ 17

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్
మసూమ్‌ (హిందీ వెబ్‌ సిరీస్‌), జూన్ 17

సోనీలివ్‌
సాల్ట్ సిటీ (హిందీ వెబ్‌ సిరీస్‌), జూన్ 16

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement