releases
-
యూపీ ఉపఎన్నికల బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఏడుగురు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. కర్హల్ సీటులో లాలూ యాదవ్ అల్లుడు, అఖిలేష్ మేనల్లుడు అయిన తేజ్ ప్రతాప్ యాదవ్(ఎస్పీ)పై పోటీకి బీజేపీ అనుజేష్ యాదవ్‌ను నిలబెట్టింది. కాన్పూర్‌లోని సిస్మౌ, మిర్జాపూర్ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.బీజేపీ ప్రకటించి అభ్యర్థుల జాబితా ప్రకారం కుందర్కి నుంచి రాంవీర్ సింగ్ ఠాకూర్, ఘజియాబాద్ నుంచి సంజీవ్ శర్మ, ఖైర్ (ఎస్సీ) నుండి సురేంద్ర దిలేర్, కర్హల్ నుంచి అనుజేష్ యాదవ్, ఫుల్పూర్ నుంచి దీపక్ పటేల్, కాటేహరి నుండి ధర్మరాజ్ నిషాద్, మజ్వాన్ నుండి సుచిస్మిత మౌర్య పోటీ చేస్తున్నారు.నవంబర్ 13న ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి. యూపీలోని 10 స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కారణంగా మిల్కీపూర్ ఉప ఎన్నికల తేదీని ప్రకటించలేదు. ఇది కూడా చదవండి: అదే జరిగితే.. రష్యా బలహీతకు సంకేతం: అమెరికా -
WikiLeaks: అసాంజ్‌కు విముక్తి
సైపన్/కాన్బెర్రా: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్‌కు పూర్తి విముక్తి దొరికింది. అమెరికా పసిఫిక్ ద్వీప భూభాగంలో ఉత్తర మరియానా దీవుల రాజధాని సైపన్లోని ఫెడరల్ కోర్టు అసాంజ్‌ను బుధవారం విడుదల చేసింది. అంతకుముందు మూడు గంటలపాటు విచారణ సాగింది. గూఢచర్య చట్టానికి విరుద్ధంగా అమెరికా జాతీయ రక్షణ పత్రాలను పొందడం, వాటిని బయట పెట్టడం వంటి నేరాలను అసాంజ్ అంగీకరించారు. అయితే, ‘‘రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛపై నాకు నమ్మకముంది. అందులో భాగంగానే ఓ జర్నలిస్టుగా రహస్య పత్రాలను సేకరించి బయట పెట్టా. అమెరికా రాజ్యాంగానికి చేసిన తొలి సవరణ ప్రకారం నా చర్యలకు రక్షణ ఉంది’’ అని చెప్పుకొచ్చారు. ఆయన నేరాంగీకార వాంగ్మూలాన్ని అనుమతిస్తున్నట్టు చీఫ్ యూఎస్ డి్రస్టిక్ట్ జడ్జి రమొనా వి.మంగ్లోనా ప్రకటించారు. అసాంజ్‌కు ఐదేళ్ల రెండు నెలల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఇప్పటికే బ్రిటిష్ జైల్లో ఐదేళ్లు శిక్ష అనుభవించిన కారణంగా ఆయన్ను విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. ‘‘మీరు ఈ న్యాయస్థానం నుంచి స్వేచ్ఛా వ్యక్తిగా బయటకు వెళ్లవచ్చు’’ అని ప్రకటించారు. అనంతరం అసాంజ్ కోర్టు నుంచి బయటికొచ్చారు. ఈ పరిణామం పట్ల ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మీడియా ఎదురుచూపులువిచారణను కవర్ చేయడానికి ప్రపంచవ్యాప్త మీడియా సైపన్లోని కోర్టు దగ్గరికి చేరుకుంది. గంటలపాటు బయట వేచి చూసినా విచారణను చిత్రీకరించేందుకు మీడియాను కోర్టు హాల్లోకి అనుమతించలేదు. అసాంజ్ కోర్టు హాలు నుంచి బయటకు వస్తున్న ఫొటోను ఆయన భార్య స్టెల్లా ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘భావోద్వేగంతో కంటతడి పెట్టకుండా ఉండలేకపోతున్నా’ అన్నారు. అసాంజ్ విడుదల స్వాగతించదగ్గ పరిణామమని ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ అన్నారు. అసాంజ్ విడుదలకు ఆ్రస్టేలియా సకల ప్రయత్నాలు చేసిందన్నారు. ఇది చరిత్రాత్మకమైన రోజని అసాంజ్ న్యాయవాది జెన్నిఫర్ రాబిన్సన్ అన్నారు. ఆయన విడుదలకు సాయం చేసినందుకు అల్బనీస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వందేళ్లలో అమెరికా ఎవరిపైనా గూఢచర్య చట్టం ప్రయోగించలేదని, జర్నలిస్టు అయిన అసాంజ్పైనే మోపిందని ఆయన తరఫున వాదించిన మరో న్యాయవాది బారీ పొలాక్ తన క్లయింట్ అన్యాయానికి గురయ్యారన్నారు. శుభాకాంక్షలు చెప్పిన న్యాయమూర్తి విచారణ సందర్భంగా అసాంజ్‌కు న్యాయమూర్తి రమోనా ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం విశేషం. ‘‘వచ్చే వారం మీ పుట్టిన రోజని తెలిసింది. మీరు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. జూలై 3న అసాంజ్ 54వ ఏట అడుగుపెట్టనున్నారు. భార్యను, తండ్రిని హత్తుకుని..ఆస్ట్రేలియా రాయబారులతో కలిసి అసాంజ్ ప్రైవేట్ విమానంలో సైపన్ దీవుల నుంచి బయల్దేరి బుధవారం రాత్రి ఆ్రస్టేలియా రాజధాని కాన్బెర్రా చేరుకున్నారు. కుడిచేయి పైకెత్తి పిడికిలి బిగించి విమానం నుంచి బయటికొస్తున్న ఆయన్ను చూసి మద్దతుదారులంతా పెద్దగా నినాదాలు చేశారు. విమానాశ్రయంలో తనకోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భార్య స్టెల్లా, తండ్రి జాన్ షిప్టన్లను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. వారు అసాంజ్‌ను హత్తుకుని కన్నీటిపర్యంతమయ్యారు. -
ఈ సినిమా నాకో పెద్ద వేడుక
‘సత్యం’ రాజేష్, కామాక్షీ భాస్కర్ల ప్రధాన తారాగణంగా, రాకేందు మౌళి, బాలాదిత్య, కరుణకుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పోలిమేర 2’. 2021లో వీక్షకుల ముందుకు వచ్చిన ‘మా ఊరి పోలిమేర’కు ఇది సీక్వెల్ చిత్రం. గౌరీకృష్ణ నిర్మించిన ఈ చితాన్ని పంపిణీదారుడు వంశీ నందిపాటి నేడు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ‘సత్యం’ రాజేశ్ మాట్లాడుతూ– ‘‘మా ఊరి పోలిమేర’కు వీక్షకుల నుంచి వచ్చిన స్పందనను బట్టి ‘మా ఊరి పోలిమేర 2’ చేద్దామని అనుకున్నాం. తొలి భాగం ముగిసిన దగ్గర్నుంచే మలి భాగం ఆరంభమవుతుంది. కొమరయ్య (సినిమాలో ‘సత్యం’ రాజేశ్ పాత్ర) గురించి నిజాలు తెలుసుకున్న లక్ష్మి (కామాక్షీ పాత్ర) ఏం చేసింది? ఏ విధంగా పగ తీర్చుకోవాలనుకుంది? కవిత ఎలా జీవించి ఉంది? ఇలాంటి ఆసక్తికరమైన కథనంతో మంచి ట్విస్ట్‌లతో సాగుతుంది. నా కెరీర్లో ఓ పెద్ద వేడుకలా ఈ సినిమాను భావిస్తున్నాను. ప్రస్తుతం ‘గీతాంజలి’ సీక్వెల్, వరుణ్‌తేజ్ ‘మట్కా’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నాను. హీరోగా ‘టెనెంట్’ చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. -
'ఇక్కడి నుంచి తీసుకెళ్లండి..' హమాస్ బందీలో యువతి ఆవేదన
గాజా: ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర పోరు నడుస్తోంది. పండగవేళ ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన హమాస్ దళాలు 199 మంది ఇజ్రాయెలీలను బందీలుగా పట్టుకున్నారు. అకస్మాత్తుగా హమాస్ దళాలు జరిపిన తీరుకు విస్తుపోయిన ఇజ్రాయెల్.. తేరుకుని ధీటుగా బదులిచ్చింది. హమాస్‌ను తుదముట్టించేంతవరకు విశ్రమించబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలోనే దాడుల్లో గాయపడి తమ వద్ద బందీగా ఉన్న ఇజ్రాయెలీ యువతికి సంబంధించిన ఓ వీడియోను హమాస్ విడుదల చేసింది. భుజం గాయంతో బాధపడుతున్న ఆ యువతి శస్త్రచికిత్స తీసుకుంటున్న వీడియోను హమాస్ టెలిగ్రామ్‌లో బహిర్గతం చేసింది. బందీగా ఉన్న షోహమ్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల మియా షెమ్ వీడియోలో మాట్లాడుతోంది. ఆమె హమాస్ సంరక్షణలోనే ఉన్నట్లు హామీ ఇచ్చింది. దాడుల్లో విరిగిన చేతికి గాజాలో శస్త్రచికిత్స చేయించుకున్నానని వెల్లడించిన మియా.. వీలైనంత త్వరగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేసింది. 'హాయ్, నేను మియా షేమ్. నాకు 21 ఏళ్ల వయస్సు. ప్రస్తుతం నేను గాజాలో ఉన్నాను. దాడి జరిగే క్రమంలో నేను పార్టీలో ఉన్నాను. నా చేతికి తీవ్ర గాయమైంది. గాజాలోని ఓ ఆసుపత్రిలో నా చేతికి 3 గంటలపాటు శస్త్రచికిత్స జరిగింది. ఇక్కడ నుంచి వీలైనంత త్వరగా నన్ను తల్లిదండ్రుల వద్దకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను' అని మియా షెమ్ పేర్కొంది. అక్టోబర్ 7న మ్యూజికల్ ఫెస్టివల్లో హమాస్ దళాల దాడులు దిగ్భ్రాంతిని గురిచేశాయి. రాకెట్ దాడులతో విరుచుకుపడిన హమాస్.. ఇజ్రాయెల్‌లో పండవేళ మారణహోమాన్ని సృష్టించింది. 199 మందిని బందీలుగా పట్టుకుని గాజాలో బందించింది. ఇజ్రాయెల్‌లో 75 ఏళ్ల చరిత్రలో ఇంతటి స్థాయిలో ఒకేరోజు మరణాలు సంభవించింది ఇదే ప్రథమం. ఇదీ చదవండి: మోహరించిన ఇజ్రాయెల్ సేనలు -
తీర్పుల్లో మహిళల పట్ల అనుచిత పదాలు వాడొద్దు
ఢిల్లీ: న్యాయస్థానాల్లో కేసుల విచారణ, తీర్పులు వెల్లడించే సమయంలో మహిళలపై వివక్షకు తావు లేకుండా కీలక ముందడుగు పడింది, వేశ్య, పతిత, ఎఫైర్, హౌస్‌వైఫ్, ట్రాన్సెక్సువల్, వ్యభిచారం వంటి పదాలు ఇక ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు నిర్దేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ బుధవారం ఒక హ్యాండ్‌బుక్‌ను విడుదల చేశారు. ‘‘హ్యాండ్‌బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియో టైప్స్’’ పేరుతో ఉన్న ఈ హ్యాండ్‌బుక్‌లో న్యాయస్థానాలు గతంలో ఇచి్చన తీర్పుల సమయంలో మహిళల పట్ల అనుచితంగా ఉండే 100కి పైగా పదాలు అందులో ఉన్నాయి. ఆ పదాలకు బదులుగా ఏం వాడాలో కూడా అందులో వివరంగా రాశారు. రెచ్చగొట్టే దుస్తులు, పెళ్లి కాకుండానే తల్లి, ఎఫైర్, వేశ్య వంటి పదప్రయోగాలకు చేయకూడదని, వాటికి బదులుగా దుస్తులు, తల్లి, వివాహేతరం సంబంధం, సెక్స్ వర్కర్ అని మాత్రమే రాయాలని ఆ హ్యాండ్‌బుక్ స్పష్టంగా చెబుతోంది. ఈవ్‌టీజింగ్ బదులుగా స్ట్రీట్ సెక్యువల్ హెరాజ్‌మెంట్, హౌస్‌వైఫ్ బదులుగా హోమ్‌మేకర్ అన్న పదాలు వాడాలని నిర్దేశించింది. మూస పదాలు వద్దు ఈ హ్యాండ్‌బుక్ విడుదల చేసిన సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ మాట్లాడుతూ న్యాయ ప్రక్రియల్లో మహిళలపై మూస పద్ధతుల్లో ఎలాంటి పదాలు ఉపయోగిస్తారో ఈ పుస్తం చెబుతుందని అన్నారు. ‘‘తీర్పులు రాసే సమయంలో న్యాయమూర్తులు మహిళల పట్ల అనాలోచితంగా అనుచిత పదాలు వాడుతున్నారు. మూసపద్ధతుల్లో ఉండే పద ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో వచ్చిన తీర్పుల్ని విమర్శించడం ఉద్దేశం కాదు. భవిష్యత్‌లో న్యాయమూర్తులు ఆ పదాలు ఉపయోగించకుండా ఈ హ్యాండ్‌బుక్ ఉపయోగపడుతుంది. ఏ పదాలకు గుర్తింపు ఉందో స్పష్టంగా తెలుస్తుంది. భవిష్యత్లు ఇచ్చే తీర్పుల్లో న్యాయమూర్తులు సరైన పదాలు వాడితే వారిచ్చే తీర్పులపై అపోహలకు కూడా తావుండదు’’ అని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు. ఇదీ చదవండి: ఢిల్లీ చట్టంపై అసెంబ్లీ స్పెషల్ సెషన్..ఎల్జీ అభ్యంతరం -
ఈ వారం ఓటీటీ/ థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలివే
ప్రస్తుతం సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీలపైనే ఆధారపడుతున్నారు. థియేటర్లతో పాటు ఓటీటీల్లో చిత్రాలు చూసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎప్పటిలాగే సినీ ప్రియులను అలరించేందుకు ఈ వారం కూడా వరుస చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. టాలీవుడ్‌తో పాటు మిమ్మల్ని అలరించే వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం. ‘అన్నీ మంచి శకునములే’ సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అన్నీ మంచి శకునములే'. యువ నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంకదత్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బిచ్చగాడు-2’ ‘బిచ్చగాడు’ సినిమాతో తన కెరీర్లోనే భారీ విజయాన్ని అందుకున్నారు తమిళ హీరో, దర్శకుడు విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్‌గా బిచ్చగాడు-2 అలరించేందుకు వస్తున్నారు. స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా మే 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫాస్ట్ ఎక్స్ ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులకు పరిచయమున్న సిరీస్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’. ఆ సిరీస్‌లో రాబోతున్న తర్వాతి చిత్రం ఫాస్ట్ ఎక్స్. జస్టిన్ లిన్ దర్శకుడు. ఈ చిత్రంలో జాసన్ మొమోవా ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇది రెండు భాగాలుగా రానుంది. వీటిలో మొదటి భాగమైన ఫాస్ట్ ఎక్స్ మే 19న రిలీజ్ కానుంది. ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు అఖిల్ ఏజెంట్ అక్కినేని హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’. ఇటీవలే భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను నిరాశపరిచింది. ప్రస్తుతం సోనీలివ్ వేదికగా మే 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో సాక్షి వైద్య కథానాయికగా నటించగా.. ప్రముఖ కథానాయకుడు మమ్ముట్టి ప్రత్యేక పాత్రలో కనిపించారు. నిహారిక 'డెడ్ పిక్సెల్స్' మెగా డాటర్ నిహారిక కొణిదెల డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. వైవా హర్ష, అక్షయ్ లింగుస్వామి, సాయి రోణక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదిత్య మండల దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ నెల 19న రిలీజ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ అయాలవాషి -మలయాళం-మే 19 కథల్ - హిందీ - మే 19 బయీ అజైబి -ఇంగ్లీష్ - మే 19 మ్యూటెడ్- ఇంగ్లీష్- మే 19 నామ్- సీజన్-2- మే 1 సోనీ లివ్ కడిన కదోరమీ అంద కదహం -మలయాళం- మే 19 అమెజాన్ ప్రైమ్ వీడియో మోడ్రన్ లవ్ చెన్నై -తమిళ్- మే 18 -
ఈవారం థియేటర్లో రిలీజయ్యే సినిమాలు ఇవే..
ఓటీటీలు వచ్చాక సినీ లవర్స్ పెరిగిపోయారు. మొన్నటి దాకా థియేటర్లలో ఆదరించిన సినిమాలను ఓటీటీలో కూడా రిపీటెడ్‌గా చూస్తూ ఆదరిస్తున్నారు. ఇందుకు ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్ 2, విక్రమ్ సినిమాలే ఉదాహరణ. అయితే విక్రమ్, మేజర్ తర్వాత అంత పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేయలేదు. ఈ వారం ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితోపాటు పలు సినిమాలు థియేటర్లో అలరించేందుకు సిద్ధమయ్యాయి. ది వారియర్ రామ్ పోతినేని హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో వస్తున్న సినిమా ది వారియర్. ఈ సినిమాలో మరో హీరో ఆది పినిశెట్టి విలన్‌గా నటించనుండగా, హీరోయిన్గా కృతిశెట్టి అలరించనుంది. అక్షరా గౌడ, నదియ తదితరులు మరో కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. గార్గి ఇటీవల 'విరాట పర్వం'తో సూపర్ హిట్ అందుకున్న సాయి పల్లవి మరోసారి తన నటనతో ఆకట్టుకునేందుకు 'గార్గి' చిత్రంతో రానుంది. యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ మూవీ తెరకెక్కినట్లు సమాచారం. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాళీ వెంకట్, ఐశ్వర్య లక్ష్మి తదితరులు నటించారు. జులై 15న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. అమ్మాయి: డ్రాగన్ గర్ల్ సంచలనాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'అమ్మాయి: డ్రాగన్ గర్ల్'. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ మార్షల్ ఆర్ట్స్, లవ్ నేపథ్యంలో రూపొందినట్లు తెలుస్తోంది. ఇందులో అభిమన్యు సింగ్, మియా ముఖి తదితరులు నటించగా, పాల్ ప్రవీణ్ కుమార్ సంగీతం అందించారు. జులై 15న విడుదల కానుంది. మై డియర్ భూతం ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్ర్ ప్రభుదేవా భూతంగా అలరించేందుకు సిద్ధంగా ఉన్న మూవీ 'మై డియర్ భూతం'. ప్రభుదేవా, రమ్య నంబీశన్, మాస్టర్ సాత్విక్ నటించిన ఈ చిత్రానికి ఎస్. రాఘవన్ దర్శకత్వం వహించారు. డి. ఇమ్మాన్ సంగీతం అందించగా, ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు జులై 15న రిలీజ్ కానుంది. హిట్: ది ఫస్ట్ కేస్ విశ్వక్ సేన్ పోలీస్ ఆఫీసర్‌గా నటించి హిట్టు కొట్టిన చిత్రం 'హిట్: ది ఫస్ట్ కేస్'. ఈ సినిమాను ఇదే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేశారు. తెలుగులో దర్శకత్వం వహించిన శైలేష్ కొలను హిందీలో కూడా డైరెక్ట్ చేశాడు. రాజ్ కుమార్ రావు, సాన్య మల్హోత్ర, దలిప్ తహిల్, శిల్ప శుక్ల నటించిన ఈ మూవీ ఈ నెల 15న విడుదలకు సిద్ధంగా ఉంది. హైవేపై మిస్ అయిన ఓ అమ్మాయి ఏమైంది ? అనే కథతో సినిమా రూపొందింది. ఇక ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం స్పీడు మీదున్న ఓటీటీలు, ఈ వారం కొత్త సినిమాలివే! క్లిక్ చేయండి. -
ఈవారం అలరించే సినిమాలు / సిరీస్‌లు..
Upcoming Theatre OTT Movies Web Series July 1st Week 2022: థియేటర్లలో సినిమా రీల్ తిరిగినట్లుగా సమయం గిర్రున తిరుగుతోంది. అలా చూస్తుండగానే 2022 అర్ధభాగం పూర్తయింది. ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన పాన్ ఇండియా, మల్టీ స్టారర్ సినిమాలు ఈ సంవత్సరం బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఈ సందడితోనే 2022 సగభాగం ముగిసింది. ఇక ఇంకోభాగం మిగిలి ఉంది. ఈ క్రమంలోనే జులై మొదటి వారంలో అలరించేందుకు సిద్ధమవుతున్న ఓటీటీ, థియేటర్ సినిమాలు, సిరీస్‌లేంటో చూసేద్దామా ! 1. గోపీచంద్ 'పక్కా కమర్షియల్'- జులై 1 2. మాధవన్ 'రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్'- జులై 1 3. సందీప్ మాధవ్ 'గంధర్వ'- జులై 1 4. అరుణ్ విజయ్ 'ఏనుగు'- జులై 1 5. అవికా గోర్, శ్రీరామ్ '10 క్లాస్ డైరీస్'- జులై 1 ఈ వారం ఓటీటీకి సిద్ధమైన సినిమాలు, సిరీస్‌లు 1. ధాకడ్- జులై 1 (జీ5) 2. సామ్రాట్ పృథ్వీరాజ్- జులై 1 (అమెజాన్ ప్రైమ్ వీడియో) 3. అన్యాస్ ట్యుటోరియల్- జులై 1 (ఆహా) 4. ది టెర్మినల్ లిస్ట్- జులై 1 (అమెజాన్ ప్రైమ్ వీడియో) 5. స్ట్రేంజర్ థింగ్స్ 4 (వెబ్ సిరీస్)- జులై 1 (నెట్‌ఫ్లిక్స్) 6. షటప్ సోనా (వెబ్ సిరీస్)- జులై 1 (జీ5) 7. మియా బీవీ ఔర్ మర్డర్- జులై 1 (ఎంఎక్స్ ప్లేయర్) 8. ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్ 2 (వెబ్ సిరీస్)- జూన్ 28 9. బ్లాస్టెడ్- జూన్ 28 (నెట్‌ఫ్లిక్స్) 10. డియర్ విక్రమ్- జున్ 30 (వూట్) -
ఈ వారం సందడి చేసే సినిమాలు, సిరీస్‌లు ఇవే..
థియేటర్లలో సినిమాల సందడి జోరుగా కొనసాగుతోంది. జూన్ మొదటి వారంలో విడుదలైన మేజర్, విక్రమ్ చిత్రాలు సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతుండగా, సెకండ్ వీక్‌లో రిలీజైన నాని 'అంటే.. సుందరానికీ', '777 చార్లీ' సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు జూన్ మూడో వారంలో ఇటు థియేటర్, అటు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో చూసేద్దాం. 1. విరాట పర్వం దగ్గుబాటి రానా, సాయిపల్లవి, ప్రియమణి, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించిన చిత్రం విరాట పర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే అనేకామార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జూన్ 17 ప్రేక్షకులను అలరించేందుకు రానుంది. 1990 దశకంలో జరిగిన యాదార్థ సంఘటనల స్ఫూర్తిగా ఈ సినిమాను తెరకెక్కించారు. నక్సలిజం, ప్రేమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కామ్రేడ్ రవన్నగా రానా, వెన్నెలగా సాయిపల్లవి నటించారు. 2. గాడ్సే విభిన్నకథలతో, మంచి పాత్రలతో ముందుకు వెళ్తున్నాడు సత్యదేవ్. ఆయన హీరోగా నటించిన చిత్రం గాడ్సే. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సి. కల్యాణ్ నిర్మాత. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ మూవీ పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. 3. కిరోసిన్ మిస్టరీ నేపథ్యంలో వస్తున్న చిత్రం కిరోసిన్. ధృవ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి దిప్తీ కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించారు. ఈ సినిమా జూన్ 17న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. వీటితోపాటు హీరో, మొనగాడు తదితర చిత్రాలు సైతం థియేటర్లలో విడుదల కానున్నాయి. ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీస్‌లు 1. జయమ్మ పంచాయితీ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో అలరించిన సినిమా జయమ్మ పంచాయితీ. మే 6న విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 2. O2 లేడీ సూపర్‌స్టార్ నయన తార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం O2 (ఆక్సిజన్). జీఎస్ విఘ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 3. రెక్కీ శ్రీరామ్, శివబాలాజీ, ధన్య బాలకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ రెక్కీ. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జీ5లో జూన్ 17 నుంచి ప్రదర్శించబడనుంది. 1990లో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ హత్యకు సంబంధించిన కథాంశంతో ఈ సిరీస్ రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో అవతార పురుషా-1 (కన్నడ), జూన్ 14 సుడల్ (వెబ్ సిరీస్), జూన్ 17 నెట్‌ఫ్లిక్స్ గాడ్స్ ఫేవరెట్ ఇడియట్ (వెబ్ సిరీస్), జూన్ 15 ది రాత్ ఆఫ్ గాడ్ (హాలీవుడ్), జూన్ 15 షి (హిందీ వెబ్ సిరీస్ 2), జూన్ 17 ఆపరేషన్ రోమియో (హిందీ), జూన్ 18 జీ5 ఇన్ఫినిటీ స్టోర్మ్ (హాలీవుడ్), జూన్ 14 ఫింగర్ టిప్ (హిందీ, తమిళ వెబ్ సిరీస్ సీజన్ 2), జూన్ 17 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మసూమ్ (హిందీ వెబ్ సిరీస్), జూన్ 17 సోనీలివ్ సాల్ట్ సిటీ (హిందీ వెబ్ సిరీస్), జూన్ 16 -
ఈవారం సినిమా జాతర.. ఏకంగా 22 చిత్రాలు, సిరీస్‌లు
Theatres OTT Releases: 22 Movies Web Series In June 2nd Week 2022: మొన్నటివరకు పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. మే చివరి వారం, జూన్ మొదటి వారంలో పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకుపోయాయి. మొన్న విడుదలైన మేజర్, విక్రమ్, పృథ్వీరాజ్ మూవీస్ మంచి టాక్ తెచ్చుకుంటున్నాయి. ఇక ఇప్పుడు చిన్న సినిమాల హవా కొనసాగనుంది. థియేటర్, ఓటీటీలతో కలుపుకుని ఏకంగా 22 సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో నేచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటించిన 'అంటే.. సుందరానికీ'తోపాటు మరో 12 చిత్రాలు ఉన్నాయి. అలాగే 10 వెబ్ సిరీస్‌లు కూడా అలరించేందుకు సిద్ధమయ్యాయి. అవేంటో ఓ లుక్కేద్దామా ! 1. అంటే సుందరానికీ- జూన్ 10 2. సురాపానం- జూన్ 10 3. చార్లీ 777-జూన్ 10 4. జరిగిన కథ- జూన్ 10 5. డియర్ ఫ్రెండ్ (మలయాళం)-జూన్ 10 6. జన్హిత్ మే జారీ (హిందీ)- జూన్ 10 7. జురాసిక్ వరల్డ్ డొమినియన్- జూన్ 10 8. హసెల్ (Hustle)(నెట్‌ఫ్లిక్స్)- జూన్ 8 9. ఇన్నలే వార్ (సోనీ లివ్)- జూన్ 9 10. డాన్ (నెట్‌ఫ్లిక్స్)- జూన్ 10 11. కిన్నెరసాని (జీ5)- జూన్ 10 12. సీబీఐ5: ది బ్రెయిన్ (నెట్‌ఫ్లిక్స్)- జూన్ 12 వెబ్ సిరీస్‌లు.. 1. మిస్ మార్వెల్ (వెబ్ సిరీస్-డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)- జూన్ 8 2. కోడ్ ఎమ్ (సీజన్ 2-ఊట్, జీ5)- జూన్ 8 3. బేబీ ఫీవర్ (వెబ్ సిరీస్-నెట్‌ఫ్లిక్స్)- జూన్ 8 4. ది బ్రోకెన్ న్యూస్ (వెబ్ సిరీస్-జీ5)- జూన్ 10 5. అర్థ్ (వెబ్ సిరీస్-జీ5)- జూన్ 10 6. ఉడాన్ పటోలాస్ (వెబ్ సిరీస్-అమెజాన్ మినీ టీవీ)- జూన్ 10 7. ఫస్ట్ కిల్ (వెబ్ సిరీస్-నెట్‌ఫ్లిక్స్)- జూన్ 10 8. ఇంటిమసీ (స్పానిష్ సిరీస్-నెట్‌ఫ్లిక్స్)- జూన్ 10 9. పీకీ బ్లైండర్స్ (వెబ్ సిరీస్-నెట్‌ఫ్లిక్స్)- జూన్ 10 10. సైబర్ వార్ (వెబ్ సిరీస్-ఊట్)- జూన్ 10 -
ఈ వారం థియేటర్లలో సందడి చేసే సినిమాలు..
Upcoming Movies Web Series Release Theatre OTT May 2nd Week: థియేటర్లలో పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు చేసిన రచ్చను 'సర్కారు వారి పాట' కొనసాగిస్తోంది. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు సందడి చేశాయి. ఈ క్రమంలో ఈ వారం ఏ సినిమాలు అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయా అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి మాత్రం పెద్ద సినిమాలు ఏవి థియేటర్లలో అడుగుపెట్టట్లేదు. చిన్న సినిమాలు మాత్రం ఈ వారం సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అవేంటో లుక్కేద్దామా ! 1. శేఖర్ యాంగ్రీ ఎంగ్ మ్యాన్ రాజశేఖర్ చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం 'శేఖర్'. జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మే 20న థియేటర్లలో సందడి చేయనుంది. మలయాళంలో విజయం సాధించిన 'జోసేఫ్' సినిమాకు రీమేక్‌గా రానుంది. మనసున్న ప్రతి ఒక్కరికీ 'శేఖర్' నచ్చుతాడని, ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారని డైరెక్టర్ జీవిత ఆదివారం ప్రెస్ మీట్లో తెలిపారు. 2. ధగడ్ సాంబ నవ్వులు పంచేందుకు రెడీ అయ్యాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. సంపూ, సోనాక్షి జంటగా నటించిన చిత్రం ధగడ్ సాంబ. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు ఎన్ఆర్ రెడ్డి డైరెక్టర్. 'సంపూర్ణేష్ బాబును ఇప్పటివరకు చూడని కొత్త పాత్రలో చూస్తారు. అసభ్యత లేకుండా కుటుంబమంతా కలిసి చూసేలా మూవీ ఉంది.' అని చిత్ర యూనిట్ పేర్కొంది. 3. ధాకడ్ బాలీవుడ్ బ్యూటీ, కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఏజెంట్ అగ్నిగా 'ధాకడ్' మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి రజనీష్ ఘయ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ అయితే యాక్షన్ సీన్స్‌తో అదరిపోయింది. మరీ ఏజెంట్ అగ్నిగా కంగనా రనౌత్ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలంటే మే 20 వరకు ఆగాల్సిందే. 4. భూల్ భులయా 2 హారర్, కామెడీ నేపథ్యంలో వస్తున్న హిందీ చిత్రం 'భూల్ భులయా 2'. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, బ్యూటీఫుల్ హీరోయిన్ కియరా అడ్వాణీ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అనీస్ బాజ్మీ డైరెక్షన్ చేశారు. టబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా మే 20న ప్రేక్షకులను భయంతో నవ్వించనుంది. ఓటీటీలో.. మే 20న ఓటీటీలో ఆర్ఆర్ఆర్, ఆచార్య, భళా తందనాన, 12th మ్యాన్, ఎస్కేప్ లైవ్, జాంబీవ్లీ చిత్రాలు, పంచాయత్ సీజన్ 2, నైట్ స్కై సీజన్ 1 వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి. 1. ది ఇన్విజబుల్ మ్యాన్- మే 16 (నెట్‌ఫ్లిక్స్) 2. ది హంట్- మే 16 (నెట్‌ఫ్లిక్స్) 3. వూ కిల్డ్ సారా సీజన్ 3- మే 18 (నెట్‌ఫ్లిక్స్) 4. హనీమూన్- మే 20 (వూట్) చదవండి: 'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్‌కు జీ5 షాక్.. సినిమాకు డబ్బులు చెల్లించాల్సిందే ! రెండో వివాహం చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ఫొటోలు వైరల్ -
ఓటీటీలో సినిమాల జాతర.. ఈ శుక్రవారం 13 చిత్రాలు
OTT Releases: 13 Upcoming Movies Web Series On May 20 2022: మొన్నటిదాకా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు థియేటర్లలో సందడి చేయగా, ప్రస్తుతం సర్కారు వారి పాట అలరిస్తోంది. ఇదిలా ఉంటే థియేటర్లలో ప్రతి వారం ఏదో ఒక సినిమా సందడి చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. కరోనా, లాక్డౌన్ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సినిమాల సందడి నెలకొంది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం థియేటర్లతోపాటు ఓటీటీల్లోనూ చిత్రాలు అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే శుక్రవారం (మే 20) ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో థియేటర్లలో విడుదలైన మూవీస్తోపాటు నేరుగా ఓటీటీల్లోకి రిలీజ్ అవుతున్నాయి. మరీ ఆ సినిమాలేంటో చూద్దామా ! 1. 12th మ్యాన్- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 2. ఎస్కేప్ లైవ్- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 3. ఆర్ఆర్ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం..)- జీ5 4. ఆచార్య- అమెజాన్ ప్రైమ్ వీడియో 5. భళా తందనాన- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 6. జాంబీవ్లి- జీ5 7. చిప్ అండ్ డేల్: రెస్క్యూ రేంజర్స్- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 8. పంచాయత్ (సీజన్ 2)- అమెజాన్ ప్రైమ్ వీడియో 9. మై నెక్స్ట్ గెస్ట్- నెట్‌ఫ్లిక్స్ 10. లవ్ డెత్ రోబోట్స్- నెట్‌ఫ్లిక్స్ 11. ది లాడ్జ్- నెట్‌ఫ్లిక్స్ 12. జాకస్ 4.5- నెట్‌ఫ్లిక్స్ 13. నైట్ స్కై సీజన్ 1- అమెజాన్ ప్రైమ్ వీడియో చదవండి: OTT: ఈ హారర్ మూవీస్ చూస్తే భయపడకుండా ఉండలేరు.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4491455922.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Jagananna Thodu: లబ్ధి దారుల ఖాతాల్లో వడ్డీ జమచేయనున్న సీఎం జగన్
-
హైదరాబాద్ పోలీసుల చొరవతో ఎట్టకేలకు నగరానికి..
-
పాకిస్తాన్లో ఇరుక్కున్న తెలుగు యువకుడు ప్రశాంత్ విడుదల
-
పాకిస్తాన్లో ఇరుక్కున్న తెలుగు యువకుడు విడుదల
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్లో చిక్కుకుపోయిన తెలుగు యువకుడు ప్రశాంత్ విడుదలయ్యాడు. అతను సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. 2017 ఏప్రిల్‌లో హైదరాబాద్ నుంచి ప్రశాంత్ అదృశ్యమయ్యాడు. తన ప్రియురాలి కోసం పాకిస్తాన్ మీదుగా స్విట్జర్లాండ్ వెళ్లే క్రమంలో ప్రశాంత్ పాక్ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో ఇంత కాలం ప్రశాంత్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడు. తాజాగా వాఘా సరిహద్దులో పాక్ అధికారులు ఆ యువకుడిని భారత్‌కు అప్పగించారు. ప్రశాంత్ హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పని చేశాడు. 2019లో తన కొడుకును రప్పించే ప్రయత్నం చేయాలని ప్రశాంత్ తండ్రి బాబూరావు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రశాంత్ విడుదలతో అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాక్ నుంచి ప్రశాంత్ తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉందని అతని సోదరుడు శ్రీకాంత్ తెలిపాడు. ప్రశాంత్ తిరిగి వచ్చేందుకు నాలుగేళ్లుగా పోలీసుల కృషి ఎంతో ఉందని గుర్తుచేశాడు. ప్రశాంత్ తిరిగి వచ్చేందుకు మీడియా పాత్ర కూడా ఎంతో ఉందని తెలిపాడు. చదవండి: ఎంత చెప్పిన వినరే.. ఏం.. తమాషా చేస్తున్నారా..? -
జపాన్ వెళ్లిన స్త్రీ
రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ ముఖ్య పాత్రల్లో అమర్ కౌశిక్ తెరకెక్కించిన హారర్ కామెడీ చిత్రం ‘స్త్రీ’. రాజ్, డీకే ఈ చిత్రకథను అందించారు. 2018లో బాలీవుడ్లో వచ్చిన పెద్ద హిట్స్‌లో ఈ సినిమా కూడా ఉంది. 100 కోట్ల పైగా కలెక్షన్లను సాధించింది. తాజాగా ‘స్త్రీ’ జపాన్ వరకూ వెళ్లింది. ఈ సినిమా సోమవారం జపాన్‌లో విడుదలయింది. ‘జపాన్‌లోనూ స్త్రీ అందరి మనసుల్ని దోచేస్తుంది’ అని పేర్కొన్నారు శ్రద్ధా కపూర్. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని సమాచారం. -
ఉద్యోగాల్లో మహిళలకు 33% కోటా
చండీగఢ్: హరియాణా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మహిళలపైనే దృష్టి సారించింది. శుక్రవారం విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే మహిళలకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు, రైతులకు రుణ మాఫీ హామీలను ప్రకటించింది. ఈ మేనిఫెస్టోను సంకల్పయాత్రగా అభివర్ణించిన ఆ పార్టీ హరియాణా రోడ్‌వే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం కోటా అమలు చేస్తామంది. రైతులకు రుణమాఫీ, ఎస్సీ విద్యార్థులు, అత్యంత వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఏడాదికి 12 వేల రూపాయల స్కాలర్ షిప్, పదకొండు, పన్నెండు తరగతులకు ఏడాదికి 15 వేల రూపాయలు స్కాలర్ షిప్ ఇస్తామని హరియాణా కాంగ్రెస్ చీఫ్ కుమారి సెల్జా వెల్లడించారు. షెడ్యూల్డ్ కులాల కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
ముకేశ్, అరుంధతిలకు ‘టైమ్’
న్యూయార్క్: రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ప్రజా ప్రయో జన వ్యాజ్యాలతో మానవ హక్కుల కోసం పోరాడుతున్న మహిళలు అరుంధతి కట్జూ, మేనక గురుస్వామిలకు అరుదైన గుర్తింపు లభించింది. టైమ్స్ మ్యాగజైన్ ప్రతీ ఏడాది రూపొందించే ప్రపంచంలో అత్యంత ప్రభావం చూపించిన 100 మంది జాబితాలో భారత్ నుంచి వారికి చోటు లభించింది. మార్గదర్శకులు, నాయకులు, కళాకారులు, వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలతో 2019 సంవత్సరానికి టైమ్స్ మ్యాగజైన్ బుధవారం ఈ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ఇండో అమెరికన్ కమేడియన్, టీవీ హోస్ట్ హసన్ మిన్హాజ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పోప్ ఫ్రాన్సిస్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాక్ ప్రధాని ఇమ్రాన్, గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్‌వుడ్స్, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ ఉన్నారు. వీరంతా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ముద్ర వేశారో టైమ్స్ వారి ప్రొఫైల్స్‌లో వివరించింది. అరచేతిలో ప్రపంచం ముకేశ్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ భారత వాణిజ్య రంగంలో అద్భుతమైన దార్శనికుడని, రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచ దేశాలకు విస్తరింపజేయడంలో ఆయన పాత్రను మరువలేమని ముకేశ్ ప్రొఫైల్‌ని రాసిన మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహేంద్ర అన్నారు. అరచేతిలో∙ప్రపంచమంటూ ముఖేశ్ చేసిన రిలయన్స్ జియో ఆవిష్కరణతో ఆయన ప్రతిష్ట పెరిగిందన్నారు. స్వలింగ సంపర్కులు హక్కుల కోసం, సెక్షన్ 377ను (దీని ప్రకారం స్వలింగ సంపర్కం శిక్షార్హమైన నేరం. ఈ సెక్షన్‌ను 2018 సెప్టెంబర్‌లో సుప్రీం రద్దు చేసింది) రద్దు కోసం పోరాడి సుప్రీంకోర్టులో విజయం సాధించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న పిటిషన్‌దారులు అరుంధతి కట్జూ, మేనక గురుస్వామి. ‘ఎల్జీబీటీక్యూ హక్కుల కోసం అరుంధతి, మేనక చిత్తశుద్ధితో చేసిన న్యాయపోరాటం మరువలేనిది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ ఎలుగెత్తి చాటి భారత్ సామాజిక పురోగతికి ముందడుగు వేశారు’ అని నటి ప్రియాంక అన్నారు. -
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
-
డెమొక్రాట్ల వ్యక్తిగత వివరాలు బహిర్గతం
వాషింగ్టన్ : ఓ వైపు ఎన్నికల సీజన్ హడావుడి.. మరోవైపు హ్యకర్ల తెగింపు.. 200 మంది ప్రస్తుత, మాజీ కాంగ్రెస్ డెమొక్రాట్ల వ్యక్తిగత వివరాలు బహిర్గతమయ్యాయి. డెమొక్రాట్ నేతల సెల్‌ఫోన్ నంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని హాకర్లు బయటపెట్టారు. గుసిఫర్ 2.0 హ్యాకర్ల గ్రూపు ఈ సెన్సిటివ్ రికార్డులను పబ్లిక్ గా తీసుకొచ్చింది. డెమొక్రాటిక్ కాంగ్రెషనల్ క్యాంపెయిన్ కమిటీ నుంచి ఈ ఫైల్స్‌ను దొంగతనం చేసినట్టు ఆ హ్యాకర్ల గ్రూపు వెల్లడించింది. తమ హ్యాకర్ల వెబ్సైట్లో డెమొక్రటిక్ నేతల ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ అడ్రస్‌లను పొందుపరిచినట్టు తెలిపింది. ఈ హ్యాకర్ల పోస్టు చేసిన సమాచారంలో అమెరికా ప్రతినిధుల సభకు మైనారిటీ లీడర్‌గా వ్యవహరిస్తున్న నాన్సీ పెలోసీ, హౌస్ డెమొక్రాటిక్ విప్ స్టెనీ హోయర్ల సెల్‌ఫోన్ వివరాలు కూడా ఉన్నాయి. అయితే తన వ్యక్తిగత సమాచారం దొంగతనం చేసినట్టు కానీ, ఆన్లైన్లో పోస్టు చేసినట్టు కానీ తనకు తెలియదని హోయర్ తెలిపారు. వైట్ హౌస్ అధికార ప్రతినిధి దీనిపై స్పందించడానికి తిరస్కరించారు. హ్యాకర్లు పోస్టు చేసిన సమాచారమంతా సరియైనది కాదని డెమొక్రాట్లు చెబుతున్నారు. ఈ వివరాలు బయటపెట్టడం జాతీయ భద్రతా పరమైన చిక్కులకు తెరతీస్తోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే రష్యన్ మిలటరీ ఇంటిలిజెన్స్ ఏజెన్సీతో కలిసి, హ్యకర్ గ్రూపు ఈ కుట్రపూరిత చర్యకు పాల్పడినట్టు రీసెర్చర్లు విశ్వసిస్తున్నారు. -
విద్యార్థులకు ఫ్రీ వై-ఫై!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గురువారం తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మే 16 న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలను ఆకర్షించే పలు పధకాలను ఈ మేనిఫెస్టోలో ఏఐఏడీఎంకే పొందుపరచింది. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు.. ► ఇంటికో ఉద్యోగం ► రూ. 10 లక్షల వరకు గృహరుణాలు ► ఉద్యోగం చేస్తున్న మహిళలకు స్కూటీల కొనుగోలుకు 50 శాతం సబ్సిడీ ► 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ► అమ్మ బ్యాంకింగ్స్ కార్డు ► రేషన్ కార్డు ఉన్న ప్రతి గృహానికి ఉచిత మొబైల్ ► విద్యార్థులకు ఫ్రీ వై-ఫై ►గర్భిణీ స్త్రీలకు ఇచ్చే మొత్తం 12 వేల నుంచి 18 వేలకు పెంపు ► రైతులకు రుణమాఫీ ► సంక్రాంతికి రూ. 500 గిఫ్ట్ ► ప్రతి ఇంటికి ఉచిత సెటప్ బాక్స్ ► అన్ని బస్ స్టేషన్లు, వాణిజ్య సముదాయాల్లో ఉచిత వై-ఫైవయోవృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణం అన్ని జిల్లాలకు విస్తరణ ► పెళ్లి సమయంలో ఇచ్చే బంగారం 4 గ్రాముల నుంచి 8 గ్రాములకు పెంపు ► పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం టిఫిన్ ► లోకాయుక్త ఏర్పాటు ► మహిళల ప్రసూతి సెలవు 9 నెలలకు పెంపు -
నేరచరిత్ర కలిగిన అభ్యర్ధుల జాబితా విడుదల
-
సెక్స్ బానిసల వినియోగంపై ఐఎస్ఐఎస్ ఫత్వా!
-
బెంగాల్లో ISIS ఆడియో మెసేజ్