Supreme Court Releases Handbook Combating Gender Stereotypes - Sakshi
Sakshi News home page

మహిళలపై మూసపదాల వాడకానికి చెక్‌.. సుప్రీం కొత్త హ్యాండ్ బుక్..

Published Wed, Aug 16 2023 5:04 PM | Last Updated on Thu, Aug 17 2023 3:39 AM

Supreme Court Releases Handbook Combating Gender Stereotypes - Sakshi

ఢిల్లీ: న్యాయస్థానాల్లో కేసుల విచారణ, తీర్పులు వెల్లడించే సమయంలో మహిళలపై వివక్షకు తావు లేకుండా కీలక ముందడుగు పడింది, వేశ్య, పతిత, ఎఫైర్, హౌస్‌వైఫ్, ట్రాన్‌సెక్సువల్, వ్యభిచారం వంటి పదాలు ఇక ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు నిర్దేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ బుధవారం ఒక హ్యాండ్‌బుక్‌ను విడుదల చేశారు.

‘‘హ్యాండ్‌బుక్‌ ఆన్‌ కంబాటింగ్‌ జెండర్‌ స్టీరియో టైప్స్‌’’ పేరుతో ఉన్న ఈ హ్యాండ్‌బుక్‌లో న్యాయస్థానాలు గతంలో ఇచి్చన తీర్పుల సమయంలో మహిళల పట్ల అనుచితంగా ఉండే 100కి పైగా పదాలు అందులో ఉన్నాయి. ఆ పదాలకు బదులుగా ఏం వాడాలో కూడా అందులో వివరంగా రాశారు. రెచ్చగొట్టే దుస్తులు, పెళ్లి కాకుండానే తల్లి, ఎఫైర్, వేశ్య వంటి పదప్రయోగాలకు చేయకూడదని, వాటికి బదులుగా దుస్తులు, తల్లి, వివాహేతరం సంబంధం, సెక్స్‌ వర్కర్‌ అని మాత్రమే రాయాలని ఆ హ్యాండ్‌బుక్‌ స్పష్టంగా చెబుతోంది. ఈవ్‌టీజింగ్‌ బదులుగా స్ట్రీట్‌ సెక్యువల్‌ హెరాజ్‌మెంట్, హౌస్‌వైఫ్‌ బదులుగా హోమ్‌మేకర్‌ అన్న పదాలు వాడాలని నిర్దేశించింది.  

మూస పదాలు వద్దు  
ఈ హ్యాండ్‌బుక్‌ విడుదల చేసిన సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ మాట్లాడుతూ న్యాయ ప్రక్రియల్లో మహిళలపై మూస పద్ధతుల్లో ఎలాంటి పదాలు ఉపయోగిస్తారో ఈ పుస్తం చెబుతుందని అన్నారు. ‘‘తీర్పులు రాసే సమయంలో  న్యాయమూర్తులు మహిళల పట్ల అనాలోచితంగా అనుచిత పదాలు వాడుతున్నారు. మూసపద్ధతుల్లో ఉండే పద ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో వచ్చిన తీర్పుల్ని విమర్శించడం ఉద్దేశం కాదు. భవిష్యత్‌లో న్యాయమూర్తులు ఆ పదాలు ఉపయోగించకుండా ఈ హ్యాండ్‌బుక్‌ ఉపయోగపడుతుంది. ఏ పదాలకు గుర్తింపు ఉందో స్పష్టంగా తెలుస్తుంది. భవిష్యత్‌లు ఇచ్చే తీర్పుల్లో న్యాయమూర్తులు సరైన పదాలు వాడితే వారిచ్చే తీర్పులపై అపోహలకు కూడా తావుండదు’’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ వివరించారు.

ఇదీ చదవండి: ఢిల్లీ చట్టంపై అసెంబ్లీ స్పెషల్‌ సెషన్‌..ఎల్జీ అభ్యంతరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement