Combat spirit
-
తీర్పుల్లో మహిళల పట్ల అనుచిత పదాలు వాడొద్దు
ఢిల్లీ: న్యాయస్థానాల్లో కేసుల విచారణ, తీర్పులు వెల్లడించే సమయంలో మహిళలపై వివక్షకు తావు లేకుండా కీలక ముందడుగు పడింది, వేశ్య, పతిత, ఎఫైర్, హౌస్‌వైఫ్, ట్రాన్సెక్సువల్, వ్యభిచారం వంటి పదాలు ఇక ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు నిర్దేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ బుధవారం ఒక హ్యాండ్‌బుక్‌ను విడుదల చేశారు. ‘‘హ్యాండ్‌బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియో టైప్స్’’ పేరుతో ఉన్న ఈ హ్యాండ్‌బుక్‌లో న్యాయస్థానాలు గతంలో ఇచి్చన తీర్పుల సమయంలో మహిళల పట్ల అనుచితంగా ఉండే 100కి పైగా పదాలు అందులో ఉన్నాయి. ఆ పదాలకు బదులుగా ఏం వాడాలో కూడా అందులో వివరంగా రాశారు. రెచ్చగొట్టే దుస్తులు, పెళ్లి కాకుండానే తల్లి, ఎఫైర్, వేశ్య వంటి పదప్రయోగాలకు చేయకూడదని, వాటికి బదులుగా దుస్తులు, తల్లి, వివాహేతరం సంబంధం, సెక్స్ వర్కర్ అని మాత్రమే రాయాలని ఆ హ్యాండ్‌బుక్ స్పష్టంగా చెబుతోంది. ఈవ్‌టీజింగ్ బదులుగా స్ట్రీట్ సెక్యువల్ హెరాజ్‌మెంట్, హౌస్‌వైఫ్ బదులుగా హోమ్‌మేకర్ అన్న పదాలు వాడాలని నిర్దేశించింది. మూస పదాలు వద్దు ఈ హ్యాండ్‌బుక్ విడుదల చేసిన సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ మాట్లాడుతూ న్యాయ ప్రక్రియల్లో మహిళలపై మూస పద్ధతుల్లో ఎలాంటి పదాలు ఉపయోగిస్తారో ఈ పుస్తం చెబుతుందని అన్నారు. ‘‘తీర్పులు రాసే సమయంలో న్యాయమూర్తులు మహిళల పట్ల అనాలోచితంగా అనుచిత పదాలు వాడుతున్నారు. మూసపద్ధతుల్లో ఉండే పద ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో వచ్చిన తీర్పుల్ని విమర్శించడం ఉద్దేశం కాదు. భవిష్యత్‌లో న్యాయమూర్తులు ఆ పదాలు ఉపయోగించకుండా ఈ హ్యాండ్‌బుక్ ఉపయోగపడుతుంది. ఏ పదాలకు గుర్తింపు ఉందో స్పష్టంగా తెలుస్తుంది. భవిష్యత్లు ఇచ్చే తీర్పుల్లో న్యాయమూర్తులు సరైన పదాలు వాడితే వారిచ్చే తీర్పులపై అపోహలకు కూడా తావుండదు’’ అని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు. ఇదీ చదవండి: ఢిల్లీ చట్టంపై అసెంబ్లీ స్పెషల్ సెషన్..ఎల్జీ అభ్యంతరం -
యూఎస్పీసీ పోరాటాల్లో భాగస్వాములు కావాలి
ఎదులాపురం(ఆదిలాబాద్): ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) పోరాటాల్లో అన్ని సంఘాలు భాగస్వాములు కావాలని ఆ సంఘం జిల్లా నాయకులు వెంకట్, వృకోధర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీఎస్‌యూటీఎఫ్ సంఘ భవనంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న కొన్ని సంఘాలు వారి ఇమేజ్ను చూపించుకోవడానికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి సహాయ నిధికి ఉద్యోగుల ఒక రోజు వేతనాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఉద్యోగుల ఒకరోజు వేతనాన్ని మినహాయిస్తున్నట్లు 127 జీవో విడుదల చేసిందన్నారు. ఈ జీవోను యూఎస్‌పీసీలోని 10 విభాగాలు సమ్మితించడం లేదని స్పష్టం చేశారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్) విధానం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చట్టసభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్దపు ప్రకటన చేసి, ఉద్యోగులను మోసం చేశారని విమర్శించారు. సీపీఎస్‌ను రద్దు చేసే వరకు నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యూఎస్ పీసీ నాయకులు నాగేందర్, శ్రీనివాస్, లక్ష్మణ్‌రావు, దిలీప్, విఠల్‌గౌడ్, సేవాసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
సమ్మె స్ఫూర్తితో హక్కుల సాధన
- రౌండ్ టేబుల్ సమావేశంలో వ క్తలు - హాజరైన ఎమ్మెల్యే దివాకర్‌రావు, టీబీజీకేఎస్, జేఏసీ నేతలు శ్రీరాంపూర్ : తెలంగాణ ఏర్పాటుకోసం చేసిన సకల జనుల సమ్మె పోరాట స్ఫూర్తితో సింగరేణి కార్మికుల హక్కులను సాధించుకుందామని వక్తలు పిలుపునిచ్చారు. సకల జనుల సమ్మె జరిగి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్‌లోని ప్రగతి మైదానం సీఈఆర్ క్లబ్లో ఆదివారం రౌండ్ టేబుల్ సమావే శం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మె ల్యే దివాకర్‌రావు, టీబీజీకేఎస్ మాజీ అధ్యక్షుడు కెంగర్ల మ ల్లయ్య, సింగరేణి జేఏసీ చైర్మన్ ఎండీ.మునీర్, ఎంపీపీ బేర సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. తొలుత తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. అనంతరం వక్తలు సకల జనుల సమ్మెలో కార్మికుల పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఈ మేరకు నాటి సమ్మె స్ఫూర్తితో.. ప్రస్తుతం హక్కుల సాధన, సదుపాలు, ఉద్యోగాల కోసం పోరాడాలని వారు కార్మికులకు పిలుపునిచ్చారు. సమావేశంలో నూనె మల్లయ్య, దమ్మాల శ్రీనివాస్‌తో పాటు పలువురు కళాకారులు తమ పాటలతో ఆకట్టుకున్నారు. సీఎం దృష్టికి సింగరేణి సమస్యలు.. సింగరేణి కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్.దివాకర్‌రావు తెలిపా రు. అలాగే, శ్రీరాంపూర్‌లో సకల జనుల సమ్మె స్మృతి చిహ్నం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కాగా, కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని పేర్కొన్నా రు. పలు తీర్మానాలను ఆమోదించిన ఈ సమావేశంలో శ్రీరాంపూర్ జేఏసీ కన్వీనర్ గోషిక మల్లేష్, సర్పంచ్ ఎం.రాజేంద్రపాణి, టీబీజీకేఎస్ నాయకులు పెద్దపల్లి కోటిలింగం, బంటు సారయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంగ తిరుపతి, జిల్లా కార్యదర్శి వేల్పుల రవీందర్, నాయకులు కానుగంటి చంద్రయ్య, ముస్కె సమ్మయ్య, చిలువేరు సదానందం, జావేద్, ఏ.కిషన్ తదితరులు పాల్గొన్నారు.