
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఏడుగురు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. కర్హల్ సీటులో లాలూ యాదవ్ అల్లుడు, అఖిలేష్ మేనల్లుడు అయిన తేజ్ ప్రతాప్ యాదవ్(ఎస్‌పీ)పై పోటీకి బీజేపీ అనుజేష్ యాదవ్‌ను నిలబెట్టింది. కాన్పూర్‌లోని సిస్మౌ, మిర్జాపూర్ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.
బీజేపీ ప్రకటించి అభ్యర్థుల జాబితా ప్రకారం కుందర్కి నుంచి రాంవీర్ సింగ్ ఠాకూర్, ఘజియాబాద్ నుంచి సంజీవ్ శర్మ, ఖైర్ (ఎస్‌సీ) నుండి సురేంద్ర దిలేర్, కర్హల్ నుంచి అనుజేష్ యాదవ్, ఫుల్‌పూర్ నుంచి దీపక్ పటేల్, కాటేహరి నుండి ధర్మరాజ్ నిషాద్, మజ్వాన్ నుండి సుచిస్మిత మౌర్య పోటీ చేస్తున్నారు.
నవంబర్ 13న ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి. యూపీలోని 10 స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కారణంగా మిల్కీపూర్ ఉప ఎన్నికల తేదీని ప్రకటించలేదు.
ఇది కూడా చదవండి: అదే జరిగితే.. రష్యా బలహీతకు సంకేతం: అమెరికా
Comments
Please login to add a commentAdd a comment