ఓటీటీలు వచ్చాక సినీ లవర్స్ పెరిగిపోయారు. మొన్నటి దాకా థియేటర్లలో ఆదరించిన సినిమాలను ఓటీటీలో కూడా రిపీటెడ్‌గా చూస్తూ ఆదరిస్తున్నారు. ఇందుకు ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప, కేజీఎఫ్ 2, విక్రమ్ సినిమాలే ఉదాహరణ. అయితే విక్రమ్, మేజర్ తర్వాత అంత పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేయలేదు. ఈ వారం ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితోపాటు పలు సినిమాలు థియేటర్‌లో అలరించేందుకు సిద్ధమయ్యాయి.
ది వారియర్
రామ్ పోతినేని హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో వస్తున్న సినిమా ది వారియర్. ఈ సినిమాలో మరో హీరో ఆది పినిశెట్టి విలన్‌గా నటించనుండగా, హీరోయిన్‌గా కృతిశెట్టి అలరించనుంది. అక్షరా గౌడ, నదియ తదితరులు మరో కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
గార్గి
ఇటీవల 'విరాట పర్వం'తో సూపర్ హిట్ అందుకున్న సాయి పల్లవి మరోసారి తన నటనతో ఆకట్టుకునేందుకు 'గార్గి' చిత్రంతో రానుంది. యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ మూవీ తెరకెక్కినట్లు సమాచారం. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాళీ వెంకట్, ఐశ్వర్య లక్ష్మి తదితరులు నటించారు. జులై 15న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.
అమ్మాయి: డ్రాగన్ గర్ల్
సంచలనాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'అమ్మాయి: డ్రాగన్ గర్ల్'. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ మార్షల్ ఆర్ట్స్, లవ్ నేపథ్యంలో రూపొందినట్లు తెలుస్తోంది. ఇందులో అభిమన్యు సింగ్, మియా ముఖి తదితరులు నటించగా, పాల్ ప్రవీణ్ కుమార్ సంగీతం అందించారు. జులై 15న విడుదల కానుంది.
మై డియర్ భూతం
ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్ర్ ప్రభుదేవా భూతంగా అలరించేందుకు సిద్ధంగా ఉన్న మూవీ 'మై డియర్ భూతం'. ప్రభుదేవా, రమ్య నంబీశన్, మాస్టర్ సాత్విక్ నటించిన ఈ చిత్రానికి ఎస్. రాఘవన్ దర్శకత్వం వహించారు. డి. ఇమ్మాన్ సంగీతం అందించగా, ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు జులై 15న రిలీజ్ కానుంది.
హిట్: ది ఫస్ట్ కేస్
విశ్వక్ సేన్ పోలీస్ ఆఫీసర్‌గా నటించి హిట్టు కొట్టిన చిత్రం 'హిట్: ది ఫస్ట్ కేస్'. ఈ సినిమాను ఇదే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేశారు. తెలుగులో దర్శకత్వం వహించిన శైలేష్ కొలను హిందీలో కూడా డైరెక్ట్ చేశాడు. రాజ్ కుమార్ రావు, సాన్య మల్హోత్ర, దలిప్ తహిల్, శిల్ప శుక్ల నటించిన ఈ మూవీ ఈ నెల 15న విడుదలకు సిద్ధంగా ఉంది. హైవేపై మిస్ అయిన ఓ అమ్మాయి ఏమైంది ? అనే కథతో సినిమా రూపొందింది.
ఇక ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం స్పీడు మీదున్న ఓటీటీలు, ఈ వారం కొత్త సినిమాలివే! క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment