Gargi Movie
-
సాయి పల్లవికి అవార్డ్స్ తెచ్చిపెట్టిన సినిమాలు ఎన్నో తెలుసా..?
మలయాళీ బ్యూటీ సాయి పల్లవి టాలెంట్‌కు సినీ అభిమానులు ఫిదా అవుతారు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే ఆమె స్టార్‌గా ఎదిగింది. మర్ పాత్రల కన్నా కథలో బలం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంటూ సత్తా చాటింది. తొమ్మిదేళ్ల కెరీర్లో ఆమె 19 సినిమాల్లో నటించింది. అయితే, ప్రతి చిత్రం కూడా ఒక ప్రత్యేకమనే చెప్పాలి. అలా మలయాళం, తెలుగు, తమిళంలోనూ ఆమెకు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు.తాజాగా సౌత్ ఫిలిం ఇండస్ట్రీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2023లో సాయిపల్లవికి అవార్డ్ దక్కింది. అయితే, సాయి పల్లవి అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. 68 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో గార్గి చిత్రానికి తమిళంలో ఉత్తమ నటిగా అవార్డు దక్కితే.. తెలుగులో విరాటపర్వం చిత్రానికి గాను క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా అవార్డ్ దక్కించుకుంది. ఇలా రెండు భాషల్లోనూ ఒకే ఏడాదిలో ఈ ఘనత సాధించిన హీరోయిన్గా ఆమె గుర్తింపు పొందింది.ప్రేమమ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. ఆ తర్వాత తెలుగులో ఫిదాలో భానుమతిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తాజాగా ఫిలింఫేర్ అవార్డ్స్‌లో ఓ అరుదైన ఘనతను కూడా ఆమె అందుకుంది. సౌత్ ఇండియాలో అతి తక్కువ కాలంలోనే ఆరు ఫిలిం ఫేర్ అవార్డులు దక్కించుకున్న హీరోయిన్గా సాయి పల్లవి నిలిచింది.సాయి పల్లవి అవార్డులు అందుకున్న సినిమాలుప్రేమమ్ (2015) – ఉత్తమ నటి (డెబ్యూ)ఫిదా (2017) – ఉత్తమ నటిలవ్ స్టోరీ (2021) – ఉత్తమ నటిశ్యామ్ సింగరాయ్ (2021) – ఉత్తమ నటి (క్రిటిక్స్)గార్గి (2022) – ఉత్తమ నటివిరాటపర్వం (2022) – ఉత్తమ నటి (క్రిటిక్స్) -
ఓటీటీలోకి సాయి పల్లవి ‘గార్గి’.. ఎప్పుడు?.. ఎక్కడ?
సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గార్గి’. జులై 15న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం విమర్శల ప్రశంసలు అందుకుంది. కోర్టు డ్రామా నేపథ్యంలో సాగే ఈ కథను దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ అద్భుతంగా తెరకెక్కించాడు. అయితే దర్శకుడి టేకింగ్కి, , సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయినప్పటికీ.. కమర్షియల్‌గా మాత్రం ఈ చిత్రం నిర్మాతలకు నిరాశే మిగిల్చింది. దీంతో ఈ చిత్రం విడుదలై నెల రోజులు కూడా పూర్తి కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆగస్ట్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ‘సోనీలీవ్’లో గార్గి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోని విడుదల చేసింది. (చదవండి: వరుస ఫ్లాపులు.. సాయిపల్లవి షాకింగ్ నిర్ణయం!) ‘గార్గి’ కథేంటంటే.. గార్గి(సాయి పల్లవి) ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్. ఆమె తండ్రి బ్రహ్మానందం(ఆర్.ఎస్ శివాజీ) హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటాడు. ఓ రోజు బ్రహానందం పనిచేసే అపార్ట్మెంట్లో ఓ చిన్నారిపై అత్యాచారం జరుగుతుంది. ఈ గ్యాంగ్ రేప్ కేసులో బ్రహ్మానందం అరెస్ట్ అవుతారు. తన తండ్రి ఎలాంటి తప్పు చేయడని బలంగా నమ్మిన గార్గి..అతన్ని నిర్ధోషిగా బయటకు తీసుకొచ్చేందుకు న్యాయ పోరాటానికి దిగుతుంది. తండ్రి తరపున వాదించడానికి ఏ లాయర్ ముందుకు రాని సమక్షంలో జునియర్ లాయర్ గిరీశం(కాళీ వెంకట్) గార్గికి మద్దతుగా నిలుస్తాడు. బ్రహ్మానందం తరపున వాదించడానికి ముందుకొస్తాడు. ఆ సమయంలో గార్గి ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? సమాజం ఆమెను, ఆమె కుటుంబాన్ని ఎలా చూసింది? బ్రహ్మానందాన్ని బయటకు తీసుకొచ్చేందుకు లాయర్ గిరీశం చేసిన ప్రయత్నం ఏంటి? చివరకు తన తండ్రిని గార్గి నిర్ధొషిగా బయటకు తీసుకొచ్చిందా? లేదా? అనేదే మిగతా కథ. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎవరు ఊహించని క్లైమాక్స్ తో అందరిని ఆకట్టుకున్న "గార్గి" ఈ నెల 12 నుండి సోనీLIV లో స్ట్రీమ్ అవుతుంది.#GargiOnSonyLIV #SonyLIV #Gargi pic.twitter.com/82SXDYezGH — SonyLIV (@SonyLIV) August 3, 2022 -
వరుస ఫ్లాపులు.. సాయిపల్లవి షాకింగ్ నిర్ణయం!
వైవిధ్యమైన కథలు, పాత్రల్లో నటిస్తూ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చున్నారు నేచురల్ బ్యూటీ సాయిపల్లవి. మలయాళం చిత్రం ‘ప్రేమమ్’ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ..తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ కేవలం తన నటనతోనే లక్షలాది మంది అభిమానులను సంపాధించుకుంది. కోట్ల రూపాయలను వస్తాయని ఆలోచించకుండా.. తనకు సంతృప్తినిచ్చే పాత్రలు మాత్రమే చేస్తానంటోంది సాయి పల్లవి. అందుకే సాయి పల్లవి అంటే సినీ ప్రియుల్లో ఎనలేని గౌరవం పెరిగిపోయింది. ఇక ఇటీవల కాలంలో సాయి పల్లవి లేడీ ఓరియెంటెండ్ చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయింది. అందుకే సాయి పల్లవిని అభిమానులు లేడీ సూపర్ స్టార్ అంటూ పిలవడం మొదలు పెట్టారు. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం సాయి పల్లకి బ్యాడ్ టైం నడుస్తోంది. ఇటీవల ఈ నేచురల్ బ్యూటీ నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ఆ మధ్య భారీ అంచనాల మధ్య వచ్చిన ‘విరాటపర్వం’ బాక్సాఫీస్ వద్ద దారణంగా బోల్తా పడింది. ఇటీవల వచ్చిన గార్గి సినిమా కూడా ప్లాప్‌గానే మిగిలిపోయింది. ఇలా వరుసగా ఫ్లాపులు రావడానికి కారణం సాయి పల్లవి ఎంచుకున్న కథలనే తెలుస్తోంది. కేవలం సందేశాత్మక చిత్రాలను మాత్రమే ఎంచుకుంటూ వెళ్తోంది. అయితే సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయినప్పటికీ.. కమర్షియల్‌గా నిర్మాతలకు మాత్రం నిరాశే మిగులుతోంది. దీంతో కొన్ని విషయాల్లో మారాలని సాయి పల్లవికి నిర్మాతలు సలహా ఇచ్చారట. గ్లామర్‌కు ప్రాధన్యత ఉన్న కమర్షియల్ చిత్రాలను కూడా చేయాలని చెప్పారట. అయితే ఆఫర్స్ రాకపోతే క్లినిక్ అయినా పెట్టుకుంటా లేదా ఉద్యోగం అయినా చేసుకుంటా కానీ నా స్థాయిని తగ్గించుకొని ఇష్టంలేని సినిమాల్లో నటించలేనని చెప్పిందట సాయి పల్లవి. ఈ లెక్కన చూసుకుంటే సాయి పల్లవి కెరీర్ క్లోజ్ అయినట్లేననే టాక్ వినిప్తోంది. మరి తన పంథాల్లోనే వెళ్తూ సాయి పల్లవి హిట్ కొడుతుందా లేదా మనసు మార్చుకొని గ్లామర్ పాత్రలు ఒప్పుకుంటుందా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. -
ఆ అనుభూతి అద్భుతం : సాయి పల్లవి
ప్రేక్షకులతో కలిసి సినిమా చూసే అనుభూతి అద్భుతంగా ఉంటుందని హీరోయిన్ సాయిపల్లవి అన్నారు. ఈ బ్యూటీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గార్గి. బ్లాకీ జానీ, మై లెఫ్ట్ ఫుట్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి గౌతమ్ రామచంద్రన్ దర్శకుడు. కాళీ వెంకట్, శరవణన్, ఎస్ ఆర్ శివాజీ తదితరులు ముఖ్యపాత్ర పోషించిన ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను సూర్య, జ్యోతికకు చెందిన 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ పొందటం విశేషం. గత వారం తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందుతోంది. (చదవండి: నెంబర్ వన్ స్థానం కోసం భారీ మొత్తంలో డబ్బులిచ్చా: సమంత) తమిళంలో ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం చెన్నైలో థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయిపల్లవి మాట్లాడుతూ.. చిత్రాన్ని చూసిన పాత్రికేయులు గార్గిని మాత్రమే కాకుండా ఇందులో నటించిన నటీనటుల నటనలోనూ, సాంకేతిక వర్గ పనితనాన్ని ఎంతగానో ప్రశంసిస్తూ రాశారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. గార్గి చిత్ర యూనిట్ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లిన నటుడు సూర్యకు, ఈ చిత్రాన్ని ఆయన వద్దకు తీసుకెళ్లిన నిర్మాత, పంపిణీదారుడు శక్తివేల్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిత్రాన్ని తాను థియేటర్లో ప్రేక్షకుల మధ్య సినిమా చూశానని తెలిపారు. ప్రేక్షకులు భావోద్రేకాల గురించి మాట్లాడుకున్నారని, అది తనకు ఎంతో ఆనందం కలిగిందన్నారు. -
సర్ప్రైజ్ విజిట్.. థియేటర్స్‌లో సాయిపల్లవి సందడి
న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేడీ పవర్ స్టార్‌గా సాయిపల్లవికి క్రేజ్ ఉంది. రీసెంట్గా ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'గార్గి' సినిమా ఈనెల 15న విడుదలైన సంగతి తెలిసిందే. గౌతమ్ రామచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం థియేటర్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా రెస్పాన్స్‌ను స్వయంగా చూసేందుకు సాయిపల్లవి థియేటర్స్‌లో సందడి చేసింది. చెన్నై, హైదరాబాద్‌లోని పలు థియేటర్లకు వెళ్లిన ఆమె ఫ్యాన్స్‌తో కలిసి సినిమాను చూడటమే కాకుండా, వారితో కాసేపు సరదాగా ముచ్చటించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. Good to see @Sai_Pallavi92 owning and promoting #Gargi She is doing theatre visits, not only in Chennai but also in Hyderabad.. Presented by @2D_ENTPVTLTD Release by @SakthiFilmFctry Produced by @blacky_genie@Suriya_offl #Jyotika @prgautham83 pic.twitter.com/ZI2BJBKAdq — Ramesh Bala (@rameshlaus) July 17, 2022 -
మేకింగ్ ఆఫ్ మూవీ - గార్గి
-
గార్గి ఓటీటీ పార్ట్నర్ ఏదో తెలుసా?
స్టార్ హీరోయిన్ సాయిపల్లవి నటించిన తాజా చిత్రం గార్గి. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో జూలై 15న థియేటర్లలో విడుదలైంది. సినిమా చూసిన ప్రేక్షకులు సాయిపల్లవి నటనకు మరోసారి ఫిదా అవుతున్నారు. చరిత్రలో ఎన్నో సినిమాలు వస్తాయి, కానీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేవిగా నిలిచిపోతాయి. అందులో గార్గి ఒకటని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పాజిటివ్ టాక్ అందుకున్న గార్గి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఖరారైనట్లు తెలుస్తోంది. గార్గి ఓటీటీ హక్కులను సోనీ లివ్ భారీ మొత్తానికి కొనుగోలు చేసిందట. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాతే గార్గిని ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తోందట సోని లివ్. అయితే గార్గి ఆగస్టు మొదటి వారానికే ఓటీటీ ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉందంటున్నారు సినీపండితులు. మరి గార్గి నిజంగానే వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచే అందుబాటులోకి వస్తుందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే! There are few films that need to be viewed as a community experience and we’re grateful that this has reached the big screens. I’d like for you all to watch #Gargi in THEATRES along ur friends and family! My love to all those ppl who’ve sent your wishes and blessings 🙏🏻❤️ pic.twitter.com/iAiKlvxOHw — Sai Pallavi (@Sai_Pallavi92) July 15, 2022 చదవండి: సూర్యను చూశాకే డిప్రెషన్ నుంచి బయటపడ్డా -
సాయిపల్లవి రెమ్యునరేషన్ ఎందుకు పెంచట్లేదు
-
Gargi Movie Review: సాయిపల్లవి ‘గార్గి’ మూవీ రివ్యూ
టైటిల్: గార్గి నటీనటులు : సాయి పల్లవి, కాళి వెంకట్, కలైమామణి శరవణన్, ఆర్.ఎస్ ఐశ్వర్యలక్ష్మి, జయప్రకాశ్ తదితరులు నిర్మాత: రవిచంద్రన్, రామచంద్రన్, థామస్ జార్జ్, ఐశ్వర్య లక్ష్మి, గౌతమ్ రామచంద్రన్ రచన,దర్శకత్వం: గౌతమ్ రామచంద్రన్ సంగీతం : గోవింద్ వసంత సమర్పణ: రానా దగ్గుబాటి(తెలుగులో) విడుదల తేది: జులై 15, 2022 వైవిధ్యమైన కథలు, పాత్రల్లో నటిస్తూ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చున్నారు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఇటీవల విరాట పర్వం చిత్రంతో అలరించిన ఆమె తాజాగా ‘గార్గి’ అనే చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచన మధ్య ఈ శుక్రవారం (జులై 15) విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. గార్గి(సాయి పల్లవి) ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్. ఆమె తండ్రి బ్రహ్మానందం(ఆర్.ఎస్ శివాజీ) హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటాడు. ఓ రోజు బ్రహానందం పనిచేసే అపార్ట్మెంట్లో ఓ చిన్నారిపై అత్యాచారం జరుగుతుంది. ఈ గ్యాంగ్ రేప్ కేసులో బ్రహ్మానందం అరెస్ట్ అవుతారు. తన తండ్రి ఎలాంటి తప్పు చేయడని బలంగా నమ్మిన గార్గి..అతన్ని నిర్ధోషిగా బయటకు తీసుకొచ్చేందుకు న్యాయ పోరాటానికి దిగుతుంది. తండ్రి తరపున వాదించడానికి ఏ లాయర్ ముందుకు రాని సమక్షంలో జునియర్ లాయర్ గిరీశం(కాళీ వెంకట్) గార్గికి మద్దతుగా నిలుస్తాడు. బ్రహ్మానందం తరపున వాదించడానికి ముందుకొస్తాడు. ఆ సమయంలో గార్గి ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? సమాజం ఆమెను, ఆమె కుటుంబాన్ని ఎలా చూసింది? బ్రహ్మానందాన్ని బయటకు తీసుకొచ్చేందుకు లాయర్ గిరీశం చేసిన ప్రయత్నం ఏంటి? చివరకు తన తండ్రిని గార్గి నిర్ధొషిగా బయటకు తీసుకొచ్చిందా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉదంటంటే.. ‘ఆడ పిల్లగా పుట్టావు కదా..ప్రతి రోజు యుద్దమే’ గార్గి సినిమా ఎండింగ్లో ఓ యువతి చిన్నారికి చెప్పే మాట ఇది. ఇది అక్షర సత్యం. ఆడపిల్ల ప్రతి రోజు తన ఉనికి కోసం సమాజంతో యుద్దం చేయాల్సిందే. సొంతింట్లో సోదరుడు, మామ, చిన్నాన, పెదనాన్న చివరకు కన్న తండ్రిని కూడా అనుమానించాల్సిన దుస్థుతి. ఇక స్కూళ్లు, ఆఫీసులు.. ఇతర పని ప్రదేశాల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలీదు. ఒక్కోసారి.. మంచి వాళ్లు అనుకుంటే వారే తమ వికృత చేష్టలతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కేవలం మహిళలు, యువతుల పైనే కాదు వృద్ధులు, చిన్న పిల్లలపై కూడా అత్యాచారానికి ఒడిగడుతున్నారు. అలాంటి ఘటనల్లో బాధిత కుటుంబంతో పాటు నిందితుల కుటుంబ సభ్యులు కూడా పడే మానసిక క్షోభ ఎలా ఉంటుందనేది ‘గార్గి’ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు గౌతమ్ రామచంద్రన్. ఇలాంటి కేసుల్లో బాధితులు మాత్రమే కాదు నిందితుల కుటుంబ సభ్యులు కూడా సమాజం నుంచి ఎలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొంటారు? ఇలాంటి వారి పట్ల మీడియా ఎలా వ్యవహరిస్తుంది? అనే అంశాన్ని తెరపై చూపించడం ‘గార్గి’స్పెషల్. ఎటువంటి అశ్లీలత లేకుండా సున్నితమైన అంశాలను అతి సున్నినితంగా డీల్ చేస్తూ.. మంచి సందేశాన్ని అందించాడు దర్శకుడు గౌతమ్ రామచంద్రన్. అత్యాచార కేసులో అరెస్ట్ అయిన తండ్రిని నిర్ధొషిగా బయటకు తీసుకొచ్చేందకు ఓ కూతురు పడుతున్న కష్టాన్ని చూపిస్తూనే..మరో పక్క అత్యాచారినికి గురైన చిన్నారి తండ్రి పడే బాధ, మానసిక క్షోభని ప్రేక్షకులను హృదయాలను హత్తుకునేలా తెరపై చూపించాడు. అలాగే కోర్టుకు కావల్సినవి ఆధారాలు..వాటిని కూడా లాజిక్ మిస్ కాకుండా చూపించాడు. అనవసరపు సన్నివేశాలను జోడించకుండా...సినిమా స్టార్టింగ్‌లోనే నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లాడు. స్కూల్ టీచర్‌గా సాయి పల్లవిని పరిచయం చేసి.. వెంటనే అత్యాచారం.. తండ్రి అరెస్ట్.. కోర్టు సీన్స్..ఇలా కథను పరుగులు పెట్టించాడు. అయితే ఇదే స్పీడ్‌ని సినిమా ఎండింగ్ వరకు కొనసాగించలేకపోయాడు. కోర్టు సీన్స్ కూడా అంతగా రక్తి కట్టించవు. అయితే జడ్జిగా ట్రాన్స్జెండర్ని తీసుకోవడం.. ఆమెతో ‘ఆడవాళ్లకు నొప్పి ఎక్కడ ఉంటుందో.. మగాళ్లకు ఎక్కడ పొగరు ఉంటుందో నాకే బాగా తెలుసు’లాంటి డైలాగ్స్ చెప్పించడం ఆకట్టుకుంటుంది. ఇక ఇలాంటి సంఘటనలో మీడియా చూపించే అత్యూత్సాహం, దాని వల్ల బాధితులు, నిందితుల కుటుంబాలకు ఎదురయ్యే సమస్యలను కూడా తెరపై అద్భుతంగా చూపించాడు. ‘ఇష్టమొచ్చింది చెప్పడం న్యూస్ కాదు.. జరిగింది చెప్పడం న్యూస్’అని సాయిపల్లవి చెప్పే డైలాగ్ ఆలోచింపజేస్తుంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ అయితే ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. సాయి పల్లవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటి మాదిరే గార్గి పాత్రలో ఒదిగిపోయింది. గార్గిగా సాయి పల్లవిని తప్ప మరొకరిని ఊహించకోని రీతిలో ఆమె నటన ఉంటుంది. అయితే ఇలాంటి పాత్రల్లో నటించడం సాయి పల్లవికి కొత్తేమి కాదు. తెలుగులో వచ్చిన చాలా సినిమాల్లో ఆమె ఈ తరహా పాత్రలను పోషించారు. అయితే తమిళ్లో ఆమె ఇలాంటి పాత్రలో నటించడం ఇదే తొలిసారి. తమిళ ప్రేక్షకులు కొత్త సాయిపల్లవిని తెరపై చూస్తారు. గార్గి తండ్రి బ్రహ్మానందంగా ఆర్.ఎస్ శివాజీ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. లాయర్ గిరీశం పాత్రలో కాళీ వెంకట్ బాగా నటించాడు. తన అమాయకత్వంతో అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశాడు. అత్యాచారినికి గురైన బాలిక తండ్రిగా కలైమామణి శరవణన్ తనదైన నటనతో కంటతడి పెట్టించాడు. జయప్రకాశ్, ఐశ్యర్యలక్ష్మీలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం గోవింద్ వసంత నేపథ్య సంగీతం. సినిమా భావాన్ని ప్రేక్షకులను చేరవేయడంతో నేపథ్య సంగీతం బాగా ఉపయోగపడింది. కొన్ని సన్నివేశాలకు తనదైన బీజీఎంతో ప్రాణం పోశాడు. ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫి పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. గార్గి చిన్న చిత్రమే అయినా.. సందేశం మాత్రం చాలా పెద్దది. చరిత్రలో ఎన్నో సినిమాలు వస్తాయి. కానీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను స్పృశిస్తూ గొప్ప చిత్రాలుగా నిలుస్తాయి. అలాంటి చిత్రాల్లో గార్గి ఒకటని చెప్పొచ్చు. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఈవారం థియేటర్లో రిలీజయ్యే సినిమాలు ఇవే..
ఓటీటీలు వచ్చాక సినీ లవర్స్ పెరిగిపోయారు. మొన్నటి దాకా థియేటర్లలో ఆదరించిన సినిమాలను ఓటీటీలో కూడా రిపీటెడ్‌గా చూస్తూ ఆదరిస్తున్నారు. ఇందుకు ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్ 2, విక్రమ్ సినిమాలే ఉదాహరణ. అయితే విక్రమ్, మేజర్ తర్వాత అంత పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేయలేదు. ఈ వారం ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితోపాటు పలు సినిమాలు థియేటర్లో అలరించేందుకు సిద్ధమయ్యాయి. ది వారియర్ రామ్ పోతినేని హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో వస్తున్న సినిమా ది వారియర్. ఈ సినిమాలో మరో హీరో ఆది పినిశెట్టి విలన్‌గా నటించనుండగా, హీరోయిన్గా కృతిశెట్టి అలరించనుంది. అక్షరా గౌడ, నదియ తదితరులు మరో కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. గార్గి ఇటీవల 'విరాట పర్వం'తో సూపర్ హిట్ అందుకున్న సాయి పల్లవి మరోసారి తన నటనతో ఆకట్టుకునేందుకు 'గార్గి' చిత్రంతో రానుంది. యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ మూవీ తెరకెక్కినట్లు సమాచారం. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాళీ వెంకట్, ఐశ్వర్య లక్ష్మి తదితరులు నటించారు. జులై 15న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. అమ్మాయి: డ్రాగన్ గర్ల్ సంచలనాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'అమ్మాయి: డ్రాగన్ గర్ల్'. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ మార్షల్ ఆర్ట్స్, లవ్ నేపథ్యంలో రూపొందినట్లు తెలుస్తోంది. ఇందులో అభిమన్యు సింగ్, మియా ముఖి తదితరులు నటించగా, పాల్ ప్రవీణ్ కుమార్ సంగీతం అందించారు. జులై 15న విడుదల కానుంది. మై డియర్ భూతం ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్ర్ ప్రభుదేవా భూతంగా అలరించేందుకు సిద్ధంగా ఉన్న మూవీ 'మై డియర్ భూతం'. ప్రభుదేవా, రమ్య నంబీశన్, మాస్టర్ సాత్విక్ నటించిన ఈ చిత్రానికి ఎస్. రాఘవన్ దర్శకత్వం వహించారు. డి. ఇమ్మాన్ సంగీతం అందించగా, ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు జులై 15న రిలీజ్ కానుంది. హిట్: ది ఫస్ట్ కేస్ విశ్వక్ సేన్ పోలీస్ ఆఫీసర్‌గా నటించి హిట్టు కొట్టిన చిత్రం 'హిట్: ది ఫస్ట్ కేస్'. ఈ సినిమాను ఇదే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేశారు. తెలుగులో దర్శకత్వం వహించిన శైలేష్ కొలను హిందీలో కూడా డైరెక్ట్ చేశాడు. రాజ్ కుమార్ రావు, సాన్య మల్హోత్ర, దలిప్ తహిల్, శిల్ప శుక్ల నటించిన ఈ మూవీ ఈ నెల 15న విడుదలకు సిద్ధంగా ఉంది. హైవేపై మిస్ అయిన ఓ అమ్మాయి ఏమైంది ? అనే కథతో సినిమా రూపొందింది. ఇక ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం స్పీడు మీదున్న ఓటీటీలు, ఈ వారం కొత్త సినిమాలివే! క్లిక్ చేయండి. -
స్కూల్లో ఓ అబ్బాయికి లవ్ లేటర్ రాశా, అది ఇంట్లో తెలిసింది..: సాయి పల్లవి
హీరోయిన్ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అందం, అభినయంతో పాటు తన డాన్స్‌తో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల విరాట పర్వంతో హిట్ కొట్టిన సాయి పల్లవి గార్గి మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం జూలై 15న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న సాయి పల్లవి తాజాగా మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. విరాట పర్వం సినిమాలో హీరో భావాలు, అతని విప్లవాత్మక కవితలు నచ్చి లెటర్ రాశాను. ఈ సీన్ చేస్తున్నప్పుడు నా నిజ జీవితంలో నేను రాసిన ప్రేమలేఖ సంఘటన గుర్తొచ్చింది. నేను ఏడవ తరగతి చదువుతున్నప్పుడు ఒక అబ్బాయికి లవ్‌లెటర్ రాశాను. అయితే ఈ విషమం మా పేరెంట్స్‌కి తెలిసింది. అడ్డంగా దొరికపోడంతో ఇద్దరు కలిసి నన్ను బాగా కొట్టారు. ఆ రోజును ఇప్పటికి మరిచిపోలేను. లవ్ లేటర్ రాసేటప్పుడు ఈ విషయం మా పేరెంట్స్‌కి తెలుస్తుందని అనుకోలేదు. అది వారికి ఎలా తెలిసిందో కూడా తెలియదు’ అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ఇక గార్గి మూవీ గురించి మాట్లాడుతూ.. తన మనుసుని బాగా కదిలించిన కథ ఇది అని పేర్కొంది. ‘ఫిదా, లవ్‌స్టోరి, విరాటపర్వం’ సినిమాల్లో తండ్రీకూతుళ్ల కథలో నటించాను. ఆ చిత్రాల్లో తండ్రితో కలిసి ఉండే పాత్ర నాది. కానీ ‘గార్గి’ చిత్రంలో భావోద్వేగం వైవిధ్యంగా ఉంటుంది. యుముడితో పోరాటం చేసి, సావిత్రి తన భర్త ప్రాణాలు దక్కించు కొన్నట్టు.. ఈ సినిమాలో నాకు దూరమైన నా తండ్రి కోసం న్యాయపోరాటం చేస్తాను. ఈ పాత్ర కోసం ఏం చేయాలి? ఎంత చేయాలి? అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చేశాను’ అని చెప్పుకొచ్చింది. -
నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం బాధగా ఉంది: సాయి పల్లవి
ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. వైవిధ్యమైన కథలు, పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇటీవల విరాట పర్వం చిత్రంతో అలరించిన ఆమె తాజాగా ‘గార్గి’ అనే చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ జూలై 15న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా సాయి పల్లవి మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన మనుసుని బాగా కదిలించిన కథ ఇది అని పేర్కొంది. ‘‘తండ్రీ కూతుళ్ల అనుబంధం చుట్టూ సాగే కథ ‘గార్గి’. న్యాయ వ్యవస్థపై పోరాటం కనిపిస్తుంది. నిత్యం మనకు ఎదురయ్యే ఘటనలే సినిమాలో ఉంటాయి. నా మనసుని బాగా కదిలించిన కథ ఇది’’ అని చెప్పుకొచ్చింది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో సాయిపల్లవి లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రం ఇది. సినిమా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదలయ్యే ఈ సినిమాను తమిళంలో హీరో సూర్య, జ్యోతికలు సమర్పిస్తుండగా, తెలుగులో రానా సమర్పిస్తున్నాడు. చదవండి: వైరల్.. వరుసగా పెళ్లి ఫొటోలు వదిలిన విఘ్నేశ్, సందడిగా కోలీవుడ్ స్టార్స్ ‘‘ఫిదా, లవ్‌స్టోరి, విరాటపర్వం’ సినిమాల్లో తండ్రీకూతుళ్ల కథలో నటించాను. ఆ చిత్రాల్లో తండ్రితో కలిసి ఉండే పాత్ర నాది. కానీ ‘గార్గి’ చిత్రంలో భావోద్వేగం వైవిధ్యంగా ఉంటుంది. యుముడితో పోరాటం చేసి, సావిత్రి తన భర్త ప్రాణాలు దక్కించు కొన్నట్టు.. ఈ సినిమాలో నాకు దూరమైన నా తండ్రి కోసం న్యాయపోరాటం చేస్తాను. ఈ పాత్ర కోసం ఏం చేయాలి? ఎంత చేయాలి? అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చేశాను. ‘గార్గి’ కథ ముందు హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి వద్దకు వెళ్లింది. కథ ఆమెకు బాగా నచ్చడంతో తన సోదరుడు, దర్శకుడు గౌతమ్‌తో కలిసి నిర్మించింది. ఆమె ఒక హీరోయిన్ అయి ఉండి నాకు ఈ సినిమా ఇవ్వడంతో సంతోషపడ్డాను. ఈ సినిమాలో నేను టీచర్ పాత్ర చేశాను. తెలుగు, హిందీ, మరాఠీ భాషల్లో నా తర్వాతి చిత్రాలకు చర్చలు జరుగుతున్నాయి’’ అని చెప్పింది. చదవండి: ఈ దసరాకు బరిలో దిగే చిత్రాలివే.. తలపడనున్న చిరు-నాగ్ అది బాధగా అనిపించింది.. ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంలో చూపించిన హింస, గోరక్షక దళాలు చేస్తున్న దాడుల మధ్య తేడా ఏముంది? మానవత్వం గురించి ఆలోచించాలి’ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ.. ‘నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకోవడం బాధగా ఉంది. అయితే ఇప్పటికీ ఆ మాటలకు కట్టుబడి ఉన్నాను. నా మాటల తాలూకు స్వభావాన్ని ఆ తర్వాత ఇంగ్లీష్‌లో పోస్ట్ చేయడంతో వివాదం సద్దుమణిగింది’’ అన్నారు సాయిపల్లవి. -
గార్గి ట్రైలర్: మరోసారి అదరగొట్టిన సాయిపల్లవి
హీరోయిన్ అంటే కేవలం హీరో పక్కన రెండు స్టెప్పులేసే అందమైన అమ్మాయి మాత్రమే కాదు, తన పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటేనే సినిమాకు సంతకం చేస్తుంది సాయిపల్లవి. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం గార్గి. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాలి వెంకట్, శరవణన్ ముఖ్యపాత్రలు పోషించారు. గురువారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. గార్గి తండ్రి ఓ కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్తాడు. ఒక్క రోజులోనే తమ జీవితాలు తలకిందులైపోయాయని తల్లడిల్లిపోతుంది కథానాయిక. అతడిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది సాయిపల్లవి. ఇందుకోసం కోర్టు మెట్లు కూడా ఎక్కుతుంది. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక సమర్పిస్తుండగా తెలుగులో రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. రవిచంద్రన్ రామచంద్రన్, ఐశ్వర్యా లక్ష్మి, థామస్ జార్జి, గౌతమ్ రామచంద్రన్ నిర్మించారు. కోర్టు డ్రామాగా రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ నెల 15న విడుదల కాబోతోంది. చదవండి: నేను ఇంతకాలం నటించకపోవడానికి కారణం ఇదే.. ‘కాళీ’ పోస్టర్ వివాదం.. డైరెక్టర్ పోస్ట్ డిలిట్ చేసిన ట్విటర్ -
కోర్టు మెట్లు ఎక్కిన సాయిపల్లవి.. రియల్ లైఫ్‌లో కాదులెండి!
హీరోయిన్ సాయిపల్లవి కోర్టు మెట్లు ఎక్కారు. అయితే రియల్ లైఫ్‌లో కాదులెండి. రీల్ లైఫ్‌లో. ఇంతకీ ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి? ఏ విషయంలో న్యాయం కోసం కోర్టుకు వెళ్లారు? అనే విషయాలు తెలియాలంటే ‘గార్గి’ సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గార్గి’. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. కాలి వెంకట్, శరవణన్ కీలక పాత్రధారులు. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక సమర్పిస్తున్నారు. రవిచంద్రన్ రామచంద్రన్, ఐశ్వర్యా లక్ష్మి, థామస్ జార్జి, గౌతమ్ రామచంద్రన్ నిర్మించిన ఈ సినిమాని ఈ నెల 15న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘కోర్టు డ్రామాగా రూపొందిన చిత్రం ‘గార్గి’. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ నెల 15న విడుదల చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
సాయి పల్లవి గార్గి మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
సాయి పల్లవి తాజాగా నటించిన చిత్రం ‘గార్గి’. త్రిభాష(తెలుగు, తమిళం, కన్నడ) చిత్రంగా రూపొందిన ఈ చిత్రం నుంచి తాజాగా బిగ్ అప్డేట్ వచ్చింది. జులైన 15న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు స్వయంగా సాయి పల్లవి సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవల సాయి పల్లవి బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, మేకింగ్ వీడియోలకు మంచి స్పందన వచ్చింది. చదవండి: దయచేసి నాకు, నరేశ్‌కు సపోర్డు ఇవ్వండి.. ఇందులో సాయి పల్లవి లుక్ సినిమా హైప్ క్రియేట్ చేస్తోంది. కాగా ఈ చిత్రాన్ని తమిళంలో 2డీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై హీరో సూర్య, జ్యోతిక విడుదల చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ’96’ ఫేం గోవింద్ వసంత్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రవిచంద్రన్ రామచంద్రన్, ఐశ్వర్య లక్ష్మీ, థామస్ జార్జ్ సంయుక్తంగా నిర్మించారు. #Gargi will be Yours from the 15th of July! @prgautham83 @kaaliactor @SakthiFilmFctry @2D_ENTPVTLTD pic.twitter.com/Gg9w5JCgPl — Sai Pallavi (@Sai_Pallavi92) July 2, 2022 -
నన్ను నమ్మవు.. ఆడపిల్లను కదా.. సాయి పల్లవి డబ్బింగ్ వీడియో వైరల్
‘నువ్వు టైమ్, రాత, విధి... అన్నిటినీ నమ్ముతావమ్మా. కానీ, నన్ను మాత్రం నమ్మవు. ఎందుకంటే... నేను మగపిల్లాడిని కాదుగా.. ఆడపిల్లను’ అంటూ సాయిపల్లవి డబ్బింగ్ చెబుతున్న వీడియో సోమవారం విడుదలైంది. మే 9న ఈ బ్యూటీ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న త్రిభాషా (తెలుగు, కన్నడ, మలయాళం) చిత్రం ‘గార్గీ’ లుక్, మేకింగ్ వీడియోను విడుదల చేశారు. (చదవండి: సింగర్స్‌గా మారిన మంచు విష్ణు కుమార్తెలు) ఈ వీడియోలోనే తెలుగు, కన్నడ భాషల్లో సాయి పల్లవి డబ్బింగ్ చెబుతూ కనిపించారు. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు సాయిపల్లవి మరో సినిమా అప్డేట్ కూడా వచ్చింది. ప్రముఖ నటుడు కమల్‌హాసన్ బేనర్లో రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా రూపొందనున్న చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్గా నటించనున్నట్లు చిత్రనిర్మాణ సంస్థ ప్రకటించింది. వెన్నెల రెండుసార్లు జన్మించింది రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేశ్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ సినిమాలో సాయిపల్లవి చేసిన ‘వెన్నెల’ పాత్రను ఉద్దేశించి ‘సోల్ ఆఫ్ వెన్నెల’ పేరుతో ‘వెన్నెల రెండుసార్లు జన్మించింది. తొలిపొద్దులో ఇప్పపూలు పూసినట్టు. అడవి తల్లి ఒడిలో ఒకసారి ఆశయాన్ని ఆయుధం చేసినట్టు.. అతని ప్రేమలో మరొకసారి..’ అంటూ వీడియోను విడుదల చేశారు.